ఒక్క కుటుంబమే బాగుపడుతోంది
తెలంగాణలో అభివృద్ధి లేదు: గులాంనబీ ఆజాద్
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో అభివృద్ధి జర గట్లేదని, ఒక్క కుటుంబమే బాగుపడుతోం దని కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ విమర్శించారు. శుక్రవారం ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో తెలంగాణ సారథ్య సంఘం ఆధ్వర్యంలో సోనియాగాంధీ జన్మది న వేడుకలు జరిగారుు. ఈ సందర్భంగా పేద లు, రైతులు, మహిళలు, కార్మికుల అభివృద్ధి జరగట్లేదని ఆజాద్ పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పాటులో కేసీఆర్ పాత్ర లేదన్నారు. ‘కాం గ్రెసే తెలంగాణను ఏర్పాటు చేసింది. అరుు నా ప్రజలు కాంగ్రెస్‌ను గెలిపించకపోవడం దురదృష్టకరం. తెలంగాణ ప్రజల చిరకాల స్వప్నాన్ని మేం నెరవేర్చాం.
రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఆదరిస్తారని ఆశిస్తున్నాం’ అని ఆజాద్ అన్నారు. ‘సోనియా పుట్టినరోజు తెలంగాణలో కాంగ్రెస్ శ్రేణులకు విశేష పండు గ. తెలంగాణ తల్లిగా ఆమె గౌరవాన్ని వ్యాప్తి చేసేందుకు కాంగ్రెస్ సన్నద్ధం కావాలని కోరుకుంటున్నాం’ అని ఎంపీ రాపోలు ఆనందభాస్కర్ అన్నారు. పార్టీ సీనియర్ నేతలు దిగ్విజయ్‌సింగ్, మోతీలాల్ వోరాతో పాటు వంద మంది తెలంగాణ మానిటరింగ్ గ్రూప్ ప్రతినిధులు పాల్గొన్నారు. అంతకుముందు సోనియా ని వాసానికి వెళ్లి తెలంగాణ, ఏపీ కాంగ్రెస్ నేత లు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. రాజీవ్‌జ్యోతి సద్భావన కమిటీ చైర్మన్ పొంగులేటి సుధాకర్‌రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందం సోనియాగాంధీని కలసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపింది.