‘సోనియాకు ఏంకాలేదు.. అంత సీరియస్‌ కాదు’ | Priyanka Gandhi Won't Be Campaigning In UP Elections: ghulam nabi azad | Sakshi
Sakshi News home page

‘సోనియాకు ఏంకాలేదు.. అంత సీరియస్‌ కాదు’

Published Tue, Feb 28 2017 8:15 PM | Last Updated on Thu, Jul 11 2019 7:36 PM

‘సోనియాకు ఏంకాలేదు.. అంత సీరియస్‌ కాదు’ - Sakshi

‘సోనియాకు ఏంకాలేదు.. అంత సీరియస్‌ కాదు’

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో ఇక కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ కుమార్తె ప్రియాంకగాంధీ ప్రచారం ఉండబోదంట. ఈ విషయాన్ని ఆ పార్టీ సీనియర్‌ నేత గులాం నబీ ఆజాద్‌ స్పష్టం చేశారు. మంగళవారం బెనారస్‌లో మీడియాతో ఆజాద్‌.. పార్టీ తరుపున మొత్తం ఎన్నికల నిర్వహణ బాధ్యతలు ప్రియాంకనే చూసుకుంటున్నారని, అందువల్ల ఆమెకు ఇక ఎన్నికల ప్రచారంలో పాల్గొనే అవకాశం లేదని అన్నారు. సోనియా గాంధీ అనారోగ్యం కారణంగా ప్రచారం చేయబోరని చెప్పారు.

సోనియాకు ఏమైంది అని ప్రశ్నించగా అంతపెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తీవ్ర సమస్యేం కాదని సమాధానం దాట వేశారు. ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల్లో అఖిలేశ్‌, రాహుల్‌ ఇద్దరూ సమానమేనని, రాహుల్‌ రెండో నేత కాదని స్పష్టం చేశారు. వారు ఎక్కడికి వెళ్లినా ఉమ్మడిగానే వెళుతున్నారని, కలిసి పనిచేస్తూ తమ కూటమి గెలుపుకోసం కృషి చేస్తున్నారని అన్నారు. అన్ని స్థానాల్లో పోటీ చేయాలని తాము అనుకోలేదని, ప్లేయర్ల మాదిరిగానే ఉండాలని బరిలోకి దిగినట్లు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement