
రాయ్‌బరేలీ, అమేథీలకే ప్రియాంక పరిమితం
పణజీ: ప్రియాంకా గాంధీ తన రాజకీయ జీవితాన్ని ప్రస్తుతానికి అమేథీ, రాయ్‌బరేలీల వరకే పరిమితం చేసుకున్నారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా చెప్పారు. రాయ్‌బరేలీ, అమేథీ లోక్‌సభ స్థానాలకు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు ప్రాతినిధ్యం వహిస్తుండటం తెలిసిందే. ఈసారి ఎన్నికల్లో ఆమె ఎలాంటి పాత్ర పోషిస్తారనే దానిపై కొన్ని రోజులుగా ఊహాగానాలు నెలకొన్నాయి.