రెండు రాష్ట్రాలకూ న్యాయం జరిగింది: షిండే
-
రాష్ట్ర ఏర్పాటు.. తెలంగాణ ప్రజలకు పెద్ద కానుక
-
సీమాంధ్రకు ప్యాకేజీ, పోలవరం, ఇతర ప్రాజెక్టులు దక్కాయి
‘‘తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు.. తెలంగాణ ప్రజల చిరకాల డిమాండ్. వారికి ఈ రోజు పెద్ద కానుక లభించింది. తెలంగాణ సాకారం కాగా.. సీమాంధ్రకు ప్యాకేజీ, పోలవరం, ఇతర ప్రాజెక్టులు లభించాయి. రెండు రాష్ట్రాలకూ న్యాయం జరిగిందని నేను భావిస్తున్నా. లోక్‌సభలో బిల్లు ఆమోదం పొందినప్పుడు బీజేపీ, ఇతర పార్టీలు దానికి మద్దతు ఇచ్చాయి.
లోక్‌సభలో బిల్లు ఆమోదం పొందుతున్నపుడు యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ సభలో ఉన్నారు. తెలంగాణ ఏర్పడాలని, సీమాంధ్రకు న్యాయం జరగాలని, తగిన ప్యాకేజీ లభించాలని ఆమె, కాంగ్రెస్ పార్టీ అభిలషించారు. ఈ రోజు (గురువారం) రాజ్యసభలో ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ కూడా జోక్యం చేసుకుని.. సీమాంధ్రకు ప్యాకేజీ ఇచ్చారు.
హైదరాబాద్ తెలంగాణకు వెళ్లిందని భావించవద్దు. కొన్ని పార్టీలు చిన్న రాష్ట్రాలకు వ్యతిరేకం కావటంతో ఆయా పార్టీల సభ్యులు కొందరు బిల్లును వ్యతిరేకించినప్పటికీ.. బీజేపీ, బీఎస్‌పీ, ఎల్‌జేపీ తదితర పార్టీలు సహా చాలా పార్టీలు దానికి మద్దతిచ్చాయి.’’