టి.బిల్లుపై చర్చను ప్రారంభించిన షిండే
న్యూఢిల్లీ: తెలంగాణ బిల్లుపై లోక్సభలో చర్చను కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే ప్రారంభించారు. సీమాంధ్ర సభ్యుల నిరసనల మధ్య 45 సెకన్లపాటు షిండే మాట్లాడారు. తెలంగాణ ఉద్యమానికి సుదీర్ఘ చరిత్ర ఉందన్నారు. 1960 దశకంలో రెండు ప్రాంతాల్లోనూ ఉద్ధృతంగా ఉద్యమాలు జరిగాయన్నారు. చర్చలు, సంప్రదింపులతో తాత్కాలికంగా సమస్యలను పరిష్కరించుకున్నారని గుర్తు చేశారు.
గడచిన కొన్నేళ్లుగా సామాజిక, ఆర్థిక, రాజకీయ ఆకాంక్షల కోసం ప్రజలు ఉద్యమించారని తెలిపారు. పునర్విభజన ద్వారా తెలంగాణ ప్రజల ఆకాంక్షను ఈ బిల్లు తీరుస్తుందని షిండే చెప్పారు. సీమాంధ్ర సభ్యుల ఆందోళన కొనసాగడంతో లోక్సభను స్పీకర్ 3 గంటల వరకు వాయిదా వేశారు.