సభలోకి వచ్చేందుకు సస్పెండైన ఎంపీల యత్నం | Suspended Seemandhra MPs try to enter Lok Sabha | Sakshi
Sakshi News home page

సభలోకి వచ్చేందుకు సస్పెండైన ఎంపీల యత్నం

Published Tue, Feb 18 2014 3:57 PM | Last Updated on Sat, Aug 18 2018 4:13 PM

సభలోకి వచ్చేందుకు సస్పెండైన ఎంపీల యత్నం - Sakshi

సభలోకి వచ్చేందుకు సస్పెండైన ఎంపీల యత్నం

న్యూఢిల్లీ: లోక్సభ నుంచి సస్పెండైన ఎంపీలు సభలోకి వచ్చేందుకు ప్రయత్నించడంతో ప్రవేశ ద్వారం వద్ద కలకలం రేగింది. వీరిని మార్షల్స్ అడ్డుకోవడంతో ఉద్రికత్త పరిస్థితి నెలకొంది. తెలంగాణ బిల్లుపై ఓటింగ్ జరుగుతుందన్న సమాచారంతో సభలోకి అడుగు పెట్టేందుకు ప్రయత్నించారు. లోపలకు వచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నించిన ఎంపీలను మార్షల్స్‌ అడ్డుకున్నారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా  ఎంపీలు నినాదాలు చేశారు. మరోవైపు స్పీకర్ ఆదేశాలతో గ్యాలరీ, ద్వారాలను మూసివేశారు. లోక్ సభ టీవీ ప్రత్యక్ష ప్రసారాలు నిలిపివేశారు.

ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లు లోక్సభలో ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకిస్తూ తీవ్రస్థాయిలో సభలో ఆందోళనకు దిగడంతో ఆంధ్రప్రదేశ్కు చెందిన 16 మంది ఎంపీలను సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement