కొత్త సీఎం ఎవరన్నది హైకమాండ్ నిర్ణయిస్తుంది: షిండే
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలా అనే అంశంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే అన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నామని అన్నారు. అయితే కొత్త సీఎం ఎవరు అనే అంశాన్ని కేంద్ర కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుంది అని షిండే తెలిపారు.
ఉమ్మడి రాష్ట్రంలోనే ఎన్నికలు జరుగుతాయని, తుది నిర్ణయం మాత్రం ఎన్నికల కమిషన్‌దే అని షిండే ఓప్రశ్నకు సమాధానమిచ్చారు. విభజన ప్రక్రియ పూర్తి కావడానికి మరో 3 నెలల సమయముంది షిండే తెలిపారు.