విభజనపై కాంగ్రెస్ కోర్ కమిటి అత్యవసర భేటి
రాష్ట్ర విభజన ప్రధాన ఎజెండాగా ప్రధాని నివాసంలో కాంగ్రెస్ కోర్ కమిటి సమావేశమైంది. ఈ సమాశవంలో చిదంబరం, ఆంటోని, షిండే, ఆహ్మద్ పటేల్, సోనియా గాంధీలు హాజరయ్యారు. ఈ సమావేశంలో రెండు గంటలపాటు సాగింది.
371డి సవరణ, అఖిల పక్ష భేటి, రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితి, సీఎం కిరణ్ కుమార్ రెడ్డి లేఖ, దేశవ్యాప్తంగా ఉన్న ఇతర సమస్యలపై ప్రధానంగా చర్చించినట్టు తెలిసింది. కాంగ్రెస్ కోర్ కమిటి భేటి సమావేశానికి ముందు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే కలువడం కూడా ప్రాధాన్యత సంతరించుకుంది.