
సాక్షి, న్యూఢిల్లీ: మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శత జయంతి వేడుకలను కాంగ్రెస్ పార్టీ శుక్రవారం రోజున ఘనంగా ప్రారంభించింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ పీవీపై ప్రశంసల వర్షం కురిపించారు. పీవీ మాకు ఎల్లప్పుడూ గర్వకారణం. ఆయన శతజయంతి వేడుకలను కాంగ్రెస్ పార్టీ ఏడాదిపాటు నిర్వహిస్తోంది. పీవీ గురించి ఎవరు వేడుకలు చేసిన స్వాగతిస్తాం. 2023లో పీవీ స్పూర్తితో పనిచేస్తూ తెలంగాణలో అధికారంలోకి వస్తామని సోనియాగాంధీ పేర్కొన్నారు. (సంస్కరణల ఆద్యుడు పీవీ)
మరో సందేశంలో మాజీ ప్రధాని మన్మోహన్ పీవీ శతజయంతి వేడుకల నిర్ణయం మంచి ఆలోచన. క్యాబినెట్‌లో ఆయన ఆర్థిక మంత్రిగా తొలి బడ్జెట్ ప్రవేశపెట్టడం సంతోషంగా ఉంది. ఆదర్శవంతమైన వ్యక్తి పీవీ. ఆర్థిక సంస్కరణలు తెచ్చిన గొప్ప ప్రధాని. దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో ధైర్యంగా నిర్ణయాలు తీసుకున్నారు. పీవీ సంస్కరణల వల్లనే దేశం ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడింది అని మన్మోహన్ సింగ్ కొనియాడారు. (వార్తల కెక్కని పీవీ చాణక్యం)
హైదరాబాద్: ఇందిరాభవన్‌లో పీవీ జయంతి వేడుకలను తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. పీవీ వంగరలో ఓ సామాన్య కార్యకర్తగా పని చేసి ప్రధాని స్థాయికి ఎదిగారు. ఆయనతో వ్యక్తిగతంగా నాకు మంచి పరిచయం. భూసంస్కరణలు తెచ్చిన ఘనత పీవీది. పుట్టుక నుంచి చనిపోయే వరకు కాంగ్రెస్ వాది. ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా భూసంస్కరణలు తెచ్చిన గొప్ప నాయకుడు పీవీ. ఉమ్మడి రాష్ట్రంలో ఆయనకి భారతరత్న ఇవ్వాలని తీర్మానం చేశారు. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న దేశాన్ని అదుకున్నది పీవీ సంస్కరణలే.
జూలై 24, 1991 నాటి కేంద్ర బడ్జెట్ మన దేశ ఆర్థిక పరివర్తనకు మార్గం సుగమం చేసింది. ఆయన పదవీకాలం అనేక రాజకీయ, సామాజిక, విదేశాంగ విధాన విజయాలకు నాంది అని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, పీవీ సోదరులు మనోహర్ రావ్, పీవీ శత జయంతి కమిట్ చైర్మన్ గీతారెడ్డి, గౌరవ చైర్మన్ వీ హనుమంత రావు, వైస్ చైర్మెన్ శ్రీధర్ బాబు, కన్వీనర్ మహేష్ గౌడ్, ముఖ్య నాయకులు పొన్నాల లక్ష్మయ్య, షబ్బీర్ అలీ, చిన్నారెడ్డి, అంజన్ కుమార్ యాదవ్, దాసోజు శ్రవణ్, అనిల్ యాదవ్, మల్లు రవి, రుద్ర రాజు, వేణుగోపాల్, సీజే శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. (నిరాడంబరతకు నిలువెత్తు ప్రతీక..)
Comments
Please login to add a commentAdd a comment