ఫిబ్రవరిలో పార్లమెంట్‌కు తెలంగాణ బిల్లు: షిండే | Telangana Bill to introduce in Parliament in February, Sushil Kumar Shinde | Sakshi
Sakshi News home page

ఫిబ్రవరిలో పార్లమెంట్‌కు తెలంగాణ బిల్లు: షిండే

Published Fri, Jan 10 2014 1:50 PM | Last Updated on Sat, Sep 2 2017 2:29 AM

ఫిబ్రవరిలో పార్లమెంట్‌కు తెలంగాణ బిల్లు: షిండే

ఫిబ్రవరిలో పార్లమెంట్‌కు తెలంగాణ బిల్లు: షిండే

న్యూఢిల్లీ: తెలంగాణ బిల్లును ఫిబ్రవరిలో పార్లమెంట్‌ సమావేశాల్లో ప్రవేశపెడతామని కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే సూచనప్రాయంగా వెల్లడించారు. రాష్ట్రపతి నుంచి బిల్లు తమకు చేరిన తర్వాత పార్లమెంట్‌లో ప్రవేశపెడతామని తెలిపారు. సమయం సరిపోతుందా అన్న ప్రశ్నకు చూద్దామంటూ ఆయన సమాధానం దాటవేశారు. మొదట బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెడతామన్నారు. తెలంగాణ బిల్లు పంపేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రాష్ట్రపతి జనవరి 23వరకు సమయం ఇచ్చారని గుర్తు చేశారు.

తమకున్న సమాచారం ప్రకారం మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం పాకిస్తాన్లోనే ఉన్నాడని షిండే తెలిపారు. విచారణ ఎదుర్కొకోకుండా కేసులు ఎదుర్కొంటున్న వారి విషయంతో రాష్ట్రాలు సమీక్ష కమిటీలు వేయాలని సూచించారు. తొంగిపోయిన మావోయిస్టులకు పునరావాసం కల్పిస్తామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement