బీహార్ పోలీసుల అదుపులో భత్కల్: షిండే | Yasin Bhatkal under bihar Police Custody: Sushilkumar Shinde | Sakshi
Sakshi News home page

బీహార్ పోలీసుల అదుపులో భత్కల్: షిండే

Published Thu, Aug 29 2013 2:24 PM | Last Updated on Fri, Sep 1 2017 10:14 PM

బీహార్ పోలీసుల అదుపులో భత్కల్: షిండే

బీహార్ పోలీసుల అదుపులో భత్కల్: షిండే

ఉగ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిద్దీన్ సహ వ్యవస్థాపకుడు యాసిన్ భత్కల్ అరెస్టును కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే ధ్రువీకరించారు. ఉత్తర బీహార్లో బీహార్-నేపాల్ సరిహద్దు వద్ద అతడిని ఇంటెలిజెన్స్ బలగాలు గతరాత్రి అదుపులోకి  తీసుకున్నాయని తెలిపారు. పార్లమెంట్ హౌస్ వెలుపల షిండే విలేకరులతో మాట్లాడారు.  యాసిన్ భత్కల్ ప్రస్తుతం బీహార్ పోలీసుల అదుపులో ఉన్నాడని వెల్లడించారు. అతడిని ప్రశ్నిస్తున్నారని తెలిపారు.

ఇటీవల పట్టుబడ్డ అబ్దుల్ కరీం టుండా ఇచ్చిన సమాచారం ఆధారంగా యాసీన్ భత్కల్ను అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంకు అత్యంత సన్నిహితుడయిన టుండాను ఈనెల 16 భారత్-నేపాల్ సరిహద్దు వద్ద ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ముంబై మారణహోమ సూత్రధారి హఫీజ్ సయీద్‌కు సన్నిహితుడైన టుండా.. బాంబుల తయారీలో దిట్ట. చాలాకాలంపాటు లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు బాంబులు తయారు చేసిపెట్టాడు.

30 ఏళ్ల యాసిన్ భత్కల్ దేశంలో జరిగిన పలు బాంబు పేలుళ్లకు సూత్రధారి. అహ్మదాబాద్, బెంగళూరు, పుణె, సూరత్, ఢిల్లీ, హైదరాబాద్ బాంబు పేలుళ్ల కేసులో అతడి కోసం భద్రతా దళాలు వెతుకుతున్నాయి. సోదరుడు రియాజ్తో కలిసి 2008లో ఇండియన్ ముజాహిద్దీన్ ఉగ్రవాద సంస్థను స్థాపించాడు. 2010లో ఈ సంస్థను ప్రభుత్వం నిషేధించింది. మరుసటి ఏడాదే  అమెరికా కూడా విదేశీ తీవ్రవాద సంస్థల జాబితాలో దీన్ని చేర్చింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement