Yasin Bhatkal arrest
-
పాకిస్ధాన్ నుంచి ఈమెయిల్స్ ద్వారా యాసిన్‌కు సూచనలు
-
బీహార్ పోలీసుల అదుపులో భత్కల్: షిండే
ఉగ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిద్దీన్ సహ వ్యవస్థాపకుడు యాసిన్ భత్కల్ అరెస్టును కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే ధ్రువీకరించారు. ఉత్తర బీహార్‌లో బీహార్-నేపాల్ సరిహద్దు వద్ద అతడిని ఇంటెలిజెన్స్ బలగాలు గతరాత్రి అదుపులోకి తీసుకున్నాయని తెలిపారు. పార్లమెంట్ హౌస్ వెలుపల షిండే విలేకరులతో మాట్లాడారు. యాసిన్ భత్కల్ ప్రస్తుతం బీహార్ పోలీసుల అదుపులో ఉన్నాడని వెల్లడించారు. అతడిని ప్రశ్నిస్తున్నారని తెలిపారు. ఇటీవల పట్టుబడ్డ అబ్దుల్ కరీం టుండా ఇచ్చిన సమాచారం ఆధారంగా యాసీన్ భత్కల్ను అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంకు అత్యంత సన్నిహితుడయిన టుండాను ఈనెల 16 భారత్-నేపాల్ సరిహద్దు వద్ద ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ముంబై మారణహోమ సూత్రధారి హఫీజ్ సయీద్‌కు సన్నిహితుడైన టుండా.. బాంబుల తయారీలో దిట్ట. చాలాకాలంపాటు లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు బాంబులు తయారు చేసిపెట్టాడు. 30 ఏళ్ల యాసిన్ భత్కల్ దేశంలో జరిగిన పలు బాంబు పేలుళ్లకు సూత్రధారి. అహ్మదాబాద్, బెంగళూరు, పుణె, సూరత్, ఢిల్లీ, హైదరాబాద్ బాంబు పేలుళ్ల కేసులో అతడి కోసం భద్రతా దళాలు వెతుకుతున్నాయి. సోదరుడు రియాజ్‌తో కలిసి 2008లో ఇండియన్ ముజాహిద్దీన్ ఉగ్రవాద సంస్థను స్థాపించాడు. 2010లో ఈ సంస్థను ప్రభుత్వం నిషేధించింది. మరుసటి ఏడాదే అమెరికా కూడా విదేశీ తీవ్రవాద సంస్థల జాబితాలో దీన్ని చేర్చింది. -
ఉగ్రవాది యాసిన్ భత్కల్ అరెస్ట్
-
మోస్ట్ వాంటెడ్ తీవ్రవాది యాసిన్ భత్కల్ అరెస్ట్
ఉగ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిద్దీన్ సహ వ్యవస్థాపకుడు, మోస్ట్ వాంటెడ్ తీవ్రవాది యాసిన్ భత్కల్(30) ఎట్టకేలకు పట్టుబడ్డాడు. నేపాల్ సరిహద్దులో అతన్ని అరెస్ట్ చేసినట్ట్టు సమాచారం. ఢిల్లీ, కర్ణాటక పోలీసుల జాయింట్ ఆపరేషన్‌లో అతడు పట్టుబడ్డాడు. అతడిని ఎక్కడికి తరలించాలనే దానిపై ఇంటెలిజెన్స్ అండ్ లా ఎన్ఫోర్స్మెంట్ సంస్థలు నిర్ణయం తీసుకోనున్నాయి. మనదేశంలో జరిగిన పలు బాంబు పేలుళ్లలో భత్కల్ ప్రధాన నిందితుడు.మన రాష్ట్రంలో హైదరాబాద్ దిల్‌సుఖ్‌నగర్‌లో జరిగిన జంటపేలుళ్లలో భత్కల్ కీలక సూత్రధారి. గోకుల్ ఛాట్, లుంబినీపార్క్ బాంబు పేలుళ్ల వెనుక కూడా ఇతడి హస్తం ఉన్నట్టు అనుమానిస్తున్నారు. భత్కల్ తలపై ప్రభుత్వం పది లక్షల రూపాయల రివార్డు ప్రకటించింది. 2010లో పుణెలో జర్మన్ బేకరీ, బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరిగిన బాంబు పేలుళ్ల కేసులో భత్కల్ ప్రధాన నిందితుడు. కర్ణాటక చెందిన యాసిన్ భత్కల్ తన సోదరుడు రియాజ్, అబ్దుల్ సుబాన్ ఖురేషీతో కలిసి 2008లో ఇండియన్ ముజాహిద్దీన్ స్థాపించాడు. పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థ లష్కరే ఇ తోయిబా అండదండలతో పనిచేస్తున్నట్టు జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) భావిస్తోంది.