విభజన నేపధ్యంలో మరో అఖిలపక్ష భేటీ | Government decides to call all party meeting on telangana sushilkumar shinde | Sakshi
Sakshi News home page

Published Wed, Oct 30 2013 5:50 PM | Last Updated on Thu, Mar 21 2024 6:35 PM

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై త్వరలో అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అని సుశీల్ కుమార్ షిండే వెల్లడించారు. మంత్రుల బృందం సమావేశాని కంటే ముందే.. నవంబర్ 7 తేది లోపే అఖిలపక్ష సమావేశం ఉంటుంది ఆయన స్పష్టం చేశారు. పార్లమెంట్ సమావేశాలకు ముందే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నట్టు ఆయన తెలిపారు. అఖిలపక్ష భేటిలో మంత్రుల బృందం(జీఓఎం) విధివిధానాలపై చర్చ జరుగుతుందని ఆయన తెలిపారు. రాష్ట్రంలోని అన్ని పార్టీలకు అఖిలపక్ష సమావేశానికి రావాలని లేఖలు రాస్తామని షిండే తెలిపారు. రాష్ట్ర విభజనపై చర్చించేందుకు కాంగ్రెస్ కోర్ కమిటీ అత్యవసరంగా బుధవారం మధ్నాహ్నం సమావేశమైంది. ఈ సమావేశానికి షిండే, సోనియా, చిదంబరం, ఆంటోనిలు హాజరయ్యారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement