రాష్ట్ర విభజనపై హైకోర్టులో వాదనలు పూర్తి | verdict on PIL against bifurcation of Andhra Pradesh soon | Sakshi
Sakshi News home page

రాష్ట్ర విభజనపై హైకోర్టులో వాదనలు పూర్తి

Published Tue, Oct 8 2013 1:44 PM | Last Updated on Thu, Sep 27 2018 5:59 PM

రాష్ట్ర విభజనపై హైకోర్టులో వాదనలు పూర్తి - Sakshi

రాష్ట్ర విభజనపై హైకోర్టులో వాదనలు పూర్తి

హైదరాబాద్ : రాష్ట్ర విభజనపై కేంద్ర కేబినెట్ నిర్ణయానికి అనుగుణంగా తదుపరి చర్యలేవీ చేపట్టకుండా కేంద్ర కేబినెట్, కేంద్ర హోంశాఖ కార్యదర్శులను ఆదేశించాలని అభ్యర్థిస్తూ దాఖలైన పిటిషన్పై హైకోర్టులో వాదనలు పూర్తయ్యాయి. తీర్పును న్యాయస్థానం మధ్యాహ్నానికి వాయిదా వేసింది. విభజనకు ఉద్దేశించి రాజ్యాంగంలోని 3వ అధికరణ రాజ్యాంగ మౌలిక సూత్రాలకు, ప్రవేశికకు విరుద్ధంగా ఉందని, ఈ కారణంతో దాన్ని కొట్టివేయాలని పిటిషినర్‌ పీవీ కృష్ణయ్య హైకోర్టు ముందు వాదనలు వినిపించిన విషయం తెలిసిందే.

రాష్ట్రంలో 371(డి) అధికరణ అమల్లో ఉండగా 3వ అధికరణకు అనుగుణంగా రాష్ట్ర విభజన చేసే అధికారం కేంద్ర ప్రభుత్వానికి లేదని వాదించారు. వాదనలు విన్న  ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్ జ్యోతిసేన్ గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ ఖండవల్లి చంద్రభానులతో కూడిన ధర్మాసనం తీర్పును ఇవ్వనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement