హైదరాబాద్:ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి పై టీఆర్ఎస్ మరోసారి మండిపడింది. గత సకల జనభేరీ సభలో కిరణ్ పై విమర్శలకు దిగిన టీఆర్ఎస్ మరోసారి ఎదురుదాడికి దిగింది. అక్టోబర్ 7వ తేదీలోగా కిరణ్ కు సీఎం పదవి పోవడం ఖాయమని టీఆర్ఎస్ వర్గాలు జోస్యం చెబుతున్నాయి. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్న సగం మంది మంత్రులు వైఎస్సార్ సీపీలోకి వెళ్లడం ఖాయమని తెలిపాయి. ‘‘ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఆరిపోయే దీపం. ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ. అక్టోబరు 6 దాటడు. స్విచ్ఛాఫ్ అయితది. కిరణం బొగ్గు అయితది. డీజీపీ దినేశ్‌రెడ్డికి కోర్టు కట్ చేసింది. కిరణ్‌కు కూడా ప్లగ్‌ను పీకేస్తరు’’ అని కేసీఆర్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
నవంబర్ రెండో వారంలో కేంద్రం తెలంగాణపై రూపొందించిన కేబినెట్ నోట్ కు రూపకల్పన జరుగుతుందని పేర్కొన్నాయి. అనంతరం తెలంగాణ ఏర్పాటు పక్కాగా జరుగుతుందని ధీమాను వ్యక్తం చేశాయి. త్వరలో రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించే అవకాశం ఉన్నట్లు టీఆర్ఎస్ వర్గాలు పేర్కొన్నాయి.