తెలంగాణ రాష్ర్ట ఏర్పాటు బిల్లు నవంబర్ 13న పార్లమెంట్‌కు వస్తుందని కేంద్ర సామాజిక న్యాయశాఖ సహాయ మంత్రి పోరిక బలరాంనాయక్ తెలిపారు.
దుగ్గొండి, న్యూస్‌లైన్ : తెలంగాణ రాష్ర్ట ఏర్పాటు బిల్లు నవంబర్ 13న పార్లమెంట్‌కు వస్తుందని కేంద్ర సామాజిక న్యాయశాఖ సహాయ మంత్రి పోరిక బలరాంనాయక్ తెలిపారు. వరంగల్ జిల్లా దుగ్గొండి మండలంలోని తిమ్మంపేట గ్రామంలో ఆదివారం ‘ఇంటింటికీ కాంగ్రెస్ జెండా-సోనియా అండ’ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణ ప్రకటన చేశాం. కేబినేట్ నోట్ రెడీ అయింది. ఇక రాష్ట్ర ఏర్పాటే తరువాయి అని ఆయన అన్నారు. తెలంగాణలో జరిగిన సుదీర్ఘ నిర్విరామ పోరాటాలకు యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ తగిన ప్రతిఫలాన్ని ఇచ్చారన్నారు.