Balaram nayak
-
2 లక్షల రుణమాఫీ ఎక్కడ ? సీఎం రేవంత్ పై కాంగ్రెస్ ఎంపీ ఫైర్
-
టీపీసీసీ అధ్యక్ష పదవి రేసులో నేను ఉన్న: ఎంపీ బలరాం నాయక్
-
బీఆర్ఎస్ నేతలు చిల్లర రాజకీయాలు మానుకోవాలి: బలరాం నాయక్
-
అక్టోబర్ 24 నుంచి రాష్ట్రంలో రాహుల్ పాదయాత్ర
సాక్షి, హైదరాబాద్: ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ భారత్ జోడో పాదయాత్ర విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మాజీ కేంద్రమంత్రి బలరాం నాయక్ కోరారు. తెలంగాణలో అక్టోబర్ 24న మక్తల్ నియోజకవర్గంలో ఈ పాదయాత్ర ప్రారంభమవుతుందని శుక్రవారం ఒక ప్రకట నలో తెలిపారు. 13 నుంచి 15 రోజుల వరకు పాదయాత్ర సాగుతుందని, దీనిపై ఇప్పటికే రూట్ పరిశీలన జరిగిందన్నారు. 330 నుంచి 370 కి.మీ. యాత్ర తెలంగాణలో ఉండే అవకాశముందని వెల్లడించారు. దేశంలో ఐక్యత పెంచేందుకు కేంద్ర ప్రభుత్వ కుట్రలను ప్రజలకు వివరించి ప్రజలను ఒక్కతాటిపైకి తెచ్చేందుకు రాహుల్ భారత్ జోడో పాదయా త్రను ప్రారంభిస్తున్నారన్నారు. సెప్టెంబర్ 7న కన్యాకుమారి నుంచి యాద్ర ప్రారంభం కానుందని బలరాం నాయక్ వివరించారు. చదవండి:ఏడాది పొడవునా తెలంగాణ విలీన వజ్రోత్సవాలు! -
పోడుభూములకు పట్టాలిచ్చిన ఘనత వైఎస్సార్‌దే..
మహబూబాబాద్: పోడు భూములకు పట్టాలు ఇచ్చి ఆదుకున్న ఘనత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డిదేనని కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి పోరిక బలరాంనాయక్ అన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ హయాం లోనే పేదలకు న్యాయం జరిగిందన్నారు. తెలంగాణ ఇచ్చిన దేవత సోనియాగాంధీ అని లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటు వేసి రు ణం తీర్చుకోవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. కేంద్ర మంత్రిగా చేసిన సమయంలో రైళ్ల హాల్టింగ్‌లు, విద్య పరంగా మోడల్ స్కూ ల్స్, కురవి మండల ఏకలవ్య పాఠశాల మం జూరీ మానుకోట మునిసిపాలిటీగా చేయడంతో పాటు రోడ్ల పరంగా కోట్లాది రూపాయలతో ఎంతో అభవృద్ధి చేశామన్నారు. తన గెలుపు కోసం పార్టీ జిల్లా అధ్యక్షుడు భరత్‌చందర్‌రెడ్డి, ములుగు ఎమ్మెల్యే సీతక్క పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి మాజీ ఎమ్మెల్యే దొంతి మాదవరెడ్డి, డోర్నకల్ ఇన్చార్జి రాంచంద్రునాయక్, భద్రాచలం ఎమ్మెల్యే పోడెం వీరయ్య ఎంతో కృషి చేస్తున్నారన్నారు. నాయకులు అయ్యప్పరెడ్డి, కత్తి స్వామి, బానోత్ ప్రసాద్, నూనావత్ రమేష్, హెచ్.వెంకటేశ్వర్లు, పెండ్యా శ్రీను, తదితరులు పాల్గొన్నారు. -
ములుగు నుంచి ముగ్గురు ఎంపీలు
ములుగు: ములుగు నియోజకవర్గం నుంచి ముగ్గురు అభ్యర్థులు నాలుగుసార్లు లోక్‌సభ కు ప్రాతినిధ్యం వహించారు. వరంగల్ పార్లమెంట్ సెగ్మెంట్లో ములుగు నియోజకవర్గం ఉన్నప్పుడు రెండుసార్లు అజ్మీరా చందూలాల్, మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలో పోరిక బలరాంనాయక్, అజ్మీరా సీతారాంనాయక్ ఒక్కో సారి ఎంపీలుగా గెలుపొందారు. ముగ్గురూ తొలి ప్రయత్నంలోనే.. ములుగు నియోజకవర్గం నుంచి తొలిసారి లోక్‌సభకు పోటీసిన అజ్మీరా చందూలాల్, పోరిక బలరాంనాయక్, అజ్మీరా సీతారాంనాయక్‌లు గెలుపొందడం విశేషం. అజ్మీరా చందూలాల్.. ములుగు మండలం జగ్గన్నపేట గ్రామ పంచాయతీ పరిధిలోని సారంగపల్లికి చెందిన అజ్మీరా చందూలాల్ తొలిసారిగా 1996లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి సురేందర్‌రెడ్డిపై గెలుపొందారు. తదనంతరం రెండోసారి టీడీపీ తరుఫున 1998లో కాంగ్రెస్ అభ్యర్థి కల్పనాదేవిపై పోటీ చేసి విజయం సాధించారు. అనంతరం 1999లో ములుగు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. అయితే చందూలాల్ రెండు పర్యాయాల్లో కేవలం మూడు సంవత్సరాలు మాత్రమే ఎంపీగా కొనసాగడం గమనార్హం. అజ్మీరా సీతారాంనాయక్ వెంకటాపురం(ఎం) మండలం మల్లయ్యపల్లికి చెందిన ప్రొఫెసర్ అజ్మీరా సీతారాంనాయక్ తెలంగాణ స్వరాష్ట్రం ఏర్పడ్డాక తొలిసారిగా 2014వ సంవత్సరంలో మహబూబాబాద్ పార్లమెంట్‌కి పోటీ చేశారు. తొలి ప్రయత్నంలోనే కాంగ్రెస్ అభ్యర్థి పోరిక బలరాంపై భారీ మెజార్టీతో విజయం సాధించారు. పోరిక బలరాం నాయక్ 2009లో పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ములుగు నియోజకవర్గం మహబూబాబాద్(ఎస్టీ) పార్లమెంట్ స్థానానికి కేటాయించబడింది. ఈ ఎన్నికల్లో ములుగు మండలం మదనపల్లికి చెందిన పోరిక బలరాంనాయక్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి సీపీఐ అభ్యర్థి కుంజా శ్రీనివాస్‌పై గెలుపొందారు. కేంద్రంలో యూపీఓ ప్రభుత్వం అధికారంలోకి రావడంలో ఎస్టీ కోటాలో కేంద్ర సహాయ మంత్రిగా పనిచేశారు. 2014లో టీఆర్ఎస్ అభ్యర్థి అజ్మీరా సీతారాంనాయక్ చేతిలో ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం మూడోసారి కాంగ్రెస్ పార్టీ తరుఫున 2019 పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. -
బండా ప్రకాష్ @ఎంపీ
హన్మకొండ : సీనియర్ రాజకీయ నాయకుడు, టీఆర్ఎస్ నేత బండా ప్రకాష్ రాజస్యభకు ఎన్నికయ్యారు. శుక్రవారం జరిగిన ఎన్నికల్లో 33 ఓట్లు పొంది సునాయాసంగా విజయం సాధించారు. బండా ప్రకాశ్ విజయంతో జిల్లా నుంచి పార్లమెంట్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీల సంఖ్య ఐదుకు చేరుకుంది. ఇందులో కెప్టెన్ లక్ష్మీకాంతారావు, గరికపాటి మోహన్‌రావు, బండా ప్రకాష్ రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తుండగా, పసునూరి దయాకర్ (వరంగల్), ఆజ్మీరా సీతారాం (మహబూబాబాద్) లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. శాసనసభలో కమిటీ హాల్ నంబర్ 1లో ఏర్పాటు చేసిన కేంద్రంలో ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరిగింది. మొత్తం 117 మంది ఓటర్లు ఉండగా.. 108 మంది ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఇందులో బండా ప్రకాశ్‌కు 33 ఓట్లు పోలయ్యాయి. రాజ్యసభకు టీఆర్ఎస్ తరఫున పోటీ చేసిన అభ్యర్థుల్లో బండా ప్రకాశ్‌కు అత్యధిక ఓట్లు రావడం విశేషం. కాంగ్రెస్ పార్టీ తరఫున రాజ్యసభకు పోటీ చేసిన కేంద్ర మాజీ మంత్రి బలరాంనాయక్‌కు 10 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అనుబంధ సభ్యుడిగా ఉన్న దొంతి మాధవరెడ్డి ఓటుపై టీఆర్ఎస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసింది. దీన్ని పరిగణనలోకి తీసుకున్న ఎన్నికల అధికారులు దొంతి ఓటు చెల్లదని ప్రకటించారు. బండా ప్రకాశ్ రాజ్యసభకు ఎన్నికవడంతో జిల్లాలో టీఆర్ఎస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ముదిరాజ్‌ల హర్షం సుదీర్ఘ కాలంగా ముదిరాజ్‌ల హక్కుల కోసం పోరాడుతున్న ముదిరాజ్ మహా సభ రాష్ట్ర అధ్యక్షుడు బండా ప్రకాశ్‌కు రాజ్యసభలో సభ్యత్వం అవకాశం రావడంతో ఆ కులస్తులు సంబరాలు జరుపుకుంటున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ముదిరాజ్ సంఘాల ఆధ్వర్యంలో టపాసులు పేల్చి స్వీట్లు పంపిణీ చేశారు. మేయర్ అభినందనలు వరంగల్ అర్బన్ : రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైన జోగినిపల్లి సంతోష్ కుమార్, బండా ప్రకాష్, లింగయ్య యాదవ్‌ను గ్రేటర్ వరంగల్ నగర మేయర్ నన్నపునేని నరేందర్ శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌లో కలిశారు. పుష్పగుచ్ఛాలను అందజేసి అభినందనలు తెలిపారు. కేసీఆర్‌కు రుణపడి ఉంటా.. రాష్ట్రంలో బీసీ కులాల్లో అత్యధికంగా జనాభా ఉన్న ముదిరాజ్ కులస్తుల ప్రతినిధిగా గుర్తించి రాజ్యసభలో అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటానని బండా ప్రకాష్ అన్నారు. రాజ్యసభ సభ్యుడిగా గెలుపొందిన అనంతరం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. – బండా ప్రకాష్ -
తిట్టుకున్నారు.. కొట్టుకున్నారు...
భద్రాచలం, న్యూస్‌లైన్: ఇంతకాలం ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటూ వర్గపోరుసాగిస్తున్న భద్రాచలం నియోజకవర్గ కాంగ్రెస్ నేతలు ఇప్పుడు ప్రత్యక్ష యుద్ధానికి దిగారు. తిట్లపురాణం సాగిస్తూ ఒకరిపై ఒకరు దాడులకు దిగి ఎన్నికల తరుణంలో పార్టీపరువును రచ్చకీడ్చారు. కేంద్రమంత్రి, మహబూబాబాద్ పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పోరిక బలరామ్‌నాయక్ సమక్షంలో సాగిన ఈ యుద్ధకాండను చూసి పార్టీ శ్రేణులు నివ్వెరపోయాయి. పార్లమెంటు, అసెంబ్లీ స్థానాల్లో గెలుపుకోసం ఏ రీతిన ముందుకెళ్లాలనే దానిపై కేంద్రమంత్రి బలరామ్‌నాయక్ భద్రాచలం నియోజకవర్గం నాయకులతో ఐటీసీ గెస్ట్‌హౌస్‌లో శనివారం నిర్వహించిన సమావేశం కాంగ్రెస్ వర్గపోరుకు వేదిక అయింది. ఎమ్మెల్యే కుంజా సత్యవతి వర్గీయులు, ఆమె వ్యతిరేక వర్గీయులు రెచ్చిపోయారు....ముష్టియుద్ధానికి దిగారు. భద్రాచలం జడ్పీటీసీ టిక్కెట్టు విషయమై చింతిర్యాల రవికుమార్ ప్రస్తావించి, తనకు రాకుండా చేశారని వ్యాఖ్యానించడంతో వివాదం మొదలైంది. ఎమ్మెల్యే సత్యవతి తన వ్యతిరేక వర్గీయులపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. కొంతమంది నాయకులు మహిళా ఎమ్మెల్యేనని కూడా చూడకుండా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని అసభ్య పదజాలంతో తిట్ల పురాణం అందుకున్నారు. దీనికి పార్టీ పట్టణ మాజీ అధ్యక్షులు నక్కా ప్రసాద్ అభ్యంతరం తెలపడంతో ఆయనపై సత్యవతి ఆగ్రహించారు. తన కాలికున్న చెప్పును తీసి నక్కా ప్రసాద్‌పై లేపారు. అంతే ఇరువర్గాల మధ్య తీవ్రపెనుగులాట జరిగి పిడిగుద్దులు గుద్దుకున్నారు. ఈఘటనలో నక్కా ప్రసాద్ చొక్కాచిరిగిపోయి... ముక్కు నుంచి తీవ్ర రక్తస్రావమైంది. ఎమ్మెల్యే అనుచరుడికి కూడా మెడపై గాయాలయ్యాయి. ఇరువర్గాల వారిని సముదాయించే క్రమంలో కేంద్రమంత్రి బలరామ్‌నాయక్ కింద పడిపోయారు. ఈ గొడవ అంతా పార్టీ ముఖ్య నాయకులు ఎడమకంటి రోశిరెడ్డి, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ కురిచేటి రామచంద్రమూర్తి, ఎమ్మెల్యే భర్త కుంజా ధర్మా, డివిజన్ నాయకులు నల్లపు దుర్గాప్రసాద్, రమేష్‌గౌడ్, దొంతుమంగేశ్వరరావు, కొండిశెట్టి కృష్ణమూర్తి దాదాపు డివిజన్ నాయకత్వ మంతా చూస్తుండగానే జరిగింది. ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్న తరుణంలో తమతో పనిచేయించుకోవాల్సిన ఎమ్మెల్యే కుంజా సత్యవతి ఇలా అసభ్య పదజాలాన్ని ఉపయోగిస్తూ బలప్రయోగం చేయడమేంటని వ్యతిరేకవర్గం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ ఎన్నికల్లో ఆమె తరఫున పనిచేసేది లేదంటూ తెగేసి చెబుతున్నారు. నక్కా ప్రసాద్‌ను అరెస్ట్చేయకపోతే ఆందోళన చేస్తా : సత్యవతి అనేకసార్లు తనను తీవ్రంగా అవమానించిన నక్కా ప్రసాద్‌ను వెంటనే అరెస్ట్ చేయకపోతే ఆందోళన చేస్తానని ఎమ్మెల్యే కుంజా సత్యవతి అన్నారు. సంఘటన అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ దొంగనోట్ల చెలామణి, దందాలు చేస్తున్న నక్కా ప్రసాద్‌ను భద్రాచలంలో లేకుండా చేస్తానన్నారు. అతనిపై ఇక సహించేదే లేదని, కఠిన చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేస్తానన్నారు. ఇడ్లీ అమ్ముకునే వ్యక్తికి లక్షలు ఎలా వచ్చాయని, అతని ఆస్తులపై విచారణ చేయాలన్నారు. అటువంటి వ్యక్తిని ఇక ఉపేక్షించేదే లేదని తీవ్రమైన పదజాలాన్నే ఉపయోగించారు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన భద్రాచలం ఎస్సై మురళికి ఆమె జరిగిన సంఘటనపై వివరించారు. వెంటనే నక్కా ప్రసాద్‌పై రౌడీ షీటు ఓపెన్ చేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే దంపతులు భూ కబ్జాదారులు : ఎమ్మెల్యే పదవిని అడ్డుపెట్టుకొని కుంజా సత్యవతి, ఆమె భర్త ధర్మా భద్రాచలంలో భూ దందాలు చేశారని నక్కా ప్రసాద్ ఆరోపించారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ రెండు సెంట్ల భూమి కనిపిస్తే దాన్ని కబ్జా చేయటమే ధర్మా పని అన్నారు. పదవిని అడ్డుపెట్టుకొని ఖాళీ స్థలాలను ఆక్రమించటం, ఆనక ఇరువర్గాల మధ్య సెటిల్ మెంట్లు చేసి డబ్బులు గుంజుతారని, తమ దుకాణ సముదాయ వివాదాన్ని పరిష్కరిస్తామంటూ రూ.11 లక్షలు తీసుకున్నారని ఆరోపించారు. ఇటువంటి వారిని ఎమ్మెల్యేగా గెలిపించినందుకు ఫలితం అనుభవించాల్సివస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. పక్కగదిలోనే ఎన్నికల అబ్జర్వర్ : కాంగ్రెస్ నాయకుల కుమ్ములాటలు జరిగిన పక్కగదిలోనే ఎన్నికల అబ్జర్వర్ యశ్వీర్ మహాజన్ బసచేసి ఉన్నారు. వీరి ఘర్షణపై సదరు అధికారి ఎప్పటికప్పుడు వాకబు చేసినట్లుగా తెలిసింది. అయితే దీనిపై ఎవ్వరైనా ఫిర్యాదు చేస్తే చర్యలు కఠినంగానే ఉండే అవకాశం ఉందని ఓ పోలీస్ అధికారి ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. ఇదిలా ఉండగా సంఘటన ప్రదేశం బూర్గంపాడు స్టేషన్ పరిధిలోకి వస్తుందని, అక్కడ కేసు నమోదైనట్లైతే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఇక్కడికి బదలాయించి తగిన చర్యలు తీసుకుంటామని పట్టణ ఎస్సై మురళి తెలిపారు. -
వికలాంగులకు రూ.1200 పింఛన్ ఇస్తాం
బయ్యారం, న్యూస్‌లైన్: యూపీఏ ప్రభుత్వ ఆధ్వర్యంలో వికలాంగులను పలు రకాలుగా ఆదుకున్నామని, వారికి అందించే పింఛన్‌ను రాబోయే రోజులలో రూ.1200కు పెంచుతామని కేంద్ర సామాజిక న్యాయ, సాధికారితశాఖ మంత్రి పోరిక బలరాం నాయక్ అన్నారు. మంగళవారం బయ్యారంలో అలెంకో(ఆర్టిఫిషియల్ లింక్స్ మ్యాన్‌ఫాక్చరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) సంస్థ సౌజన్యంతో జిల్లాలోని వివిధ మండలాలకు చెందిన 217 మంది వికలాంగులకు పలు పరికరాలను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మాట్లాడుతూ.. వికలాంగుల గురించి ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. మండలంలో ప్రధాన నీటివనరులైన బయ్యారం పెద్ద చెరువు కాల్వల మరమ్మతులకు రూ 30 లక్షలు, తులారాం ప్రాజెక్టు కాల్వలకు రూ. 3.20 కోట్ల నిధులు విడుదలయ్యాయని చెప్పారు. వచ్చే వేసవిలో పనులు ప్రారంభమవుతాయన్నారు. ఇనుపరాయి గనులున్న బయ్యారంలో స్టీల్ పరిశ్రమ ఏర్పాటుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని, ముఖ్యమంత్రి ఎన్ఓసీ ఇవ్వటంలోనే జాప్యం జరుగుతోందని తెలిపారు. ఈ పరిశ్రమ స్థాపనకు ఎన్ఓసీ ఇవ్వాలని ఆయన సీఎంను కోరారు. ఇల్లెందు- గుండాల మధ్య రూ.100 కోట్లతో రహదారిని నిర్మిస్తున్నామన్నారు. జిల్లాలోని ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ గృహాలు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. సింగరేణి ఆధ్వర్యంలో వైద్య కళాశాల ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఎంపీడీఓ చంద్రశేఖర్ అధ్యక్షతన జరిగిన ఈ సభలో అలెంకో సంస్థ సీఎండీ నారాయణరావు, కొత్తగూడెం ఆర్డీఓ అమయ్‌కుమార్, వికలాంగుల శాఖ ఏడీ మున్నయ్య, మండల ప్రత్యేకాధికారి శోభన్‌బాబు, తహశీల్దార్ పుల్లయ్య, సొసైటీ అధ్యక్షుడు బిక్షం తదితరులు పాల్గొన్నారు. -
మహిళల పేరుతోనే పట్టాలు..
భద్రాచలంటౌన్, న్యూస్‌లైన్: మహిళా సాధికారతే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందని, అందుకే వారి పేరుతోనే పట్టాలు పంపిణీ చేస్తోందని కేంద్ర మంత్రి పోరిక బలరాంనాయక్ అన్నారు. ఆదివారం భద్రాచలంలోని టుబాకో బోర్డు ప్రాంగణంలో 7వ విడత భూపంపిణీ కార్యక్రమం జరిగింది. వెంకటాపురం, చర్ల, వాజేడు, దుమ్ముగూడెం, చింతూరు, కూనవరం, వీఆర్‌పురం, భద్రాచలం మండలాలకు చెందిన గిరిజనులకు కేంద్ర మంత్రి పట్టాలు పంపిణీ చేశారు. అనంతరం కేంద్ర మంత్రి మాట్లాడుతూ ఈ భూములను సద్వినియోగం చేసుకుని గిరిజనులు అభివృద్ధి చెందాలని సూచించారు. పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తోందని అన్నారు. ఉపాధ్యాయులపై విరుచుకుపడ్డ కేంద్ర మంత్రి ఏజెన్సీ ప్రాంతంలోని ఉపాధ్యాయులు సమయపాలన పాటించడం లేదని కేంద్ర మంది ఆగ్రహం వ్యక్తం చేశారు. మారుమూల గ్రామాల్లో ఉపాధ్యాయుల పనితీరు బాగోలేదని, పద్ధతి మార్చుకోవాలని హితవు పలికారు. అదేవిధంగా అధికారులు, ఉపాధ్యాయులు సమయపాలన పాటిస్తున్నారా..? లేదా..? అనే విషయాన్ని ప్రజలే తెలుసుకోవాలని సూచించారు. ఎమ్మెల్యే కుంజా సత్యవతి మాట్లాడుతూ ఏజెన్సీలోని గిరిజనుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. అనంతరం ఐటీడీఏ పీవో జి వీరపాండియన్ మాట్లాడుతూ నిరుపేదలకు భూమి, జీవనోపాధికి హక్కు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఐటీడీఏ ద్వారా గిరిజనులకు పట్టాలు అందించిన భూవివరాలను తెలియచేశారు. గిరిజనులకు మరిన్ని భూ పట్టాలు అందించే క్రమంలో ఫారెస్టు అధికారుల నుంచి కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయని, వాటిపై అటవీశాఖ అధికారులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు. అనంతరం 461 మంది లబ్ధిదారులకు 883.15 ఎకరాల భూమికి సంబంధించి పట్టాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం ఎంపీడీఓ రమాదేవి, వివిధ మండలాల తహశీల్దార్లు, డివిజన్ స్థాయి భూ అసైన్మెంట్ కమిటీ సభ్యు లు, సర్పంచ్‌లు, లబ్ధిదారులు పాల్గొన్నారు. వైఎస్ దయే అన్న లబ్ధిదారులు... దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి దయ వల్లే తమకు పోడు భూములకు పట్టాలు అందుతున్యాని ఓ మహిళ వెల్లడించింది. పట్టాలు పంపిణీ చేస్తున్న సందర్భంగా కేంద్ర మంత్రి పోరిక బలరాంనాయక్, ఎమ్మెల్యే కుంజా సత్యవతిలు లబ్ధిదారులతో మాట్లాడారు. ఈ పట్టాలు మీకు ఎవరిస్తున్నారు.. అని ప్రశ్నించగా వైఎస్ రాజశేఖరరెడ్డి దయ వల్లే వస్తున్నాయని దుమ్ముగూడెం మండలం గౌరారం గ్రామానికి చెందిన పద్మ అనే మహిళ సమాధానం ఇచ్చింది. దీంతో అధికార వారిద్దరు ఖంగుతిన్నారు. అలాగే నేనెవరో తెలుసా..? అని కేంద్ర మంత్రి లబ్ధిదారులను ప్రశ్నించగా ఎక్కువ మంది గిరిజనులు తమకు తెలియదని సమాధానం ఇచ్చారు. దీంతో కేంద్రమంత్రి ఇవేవీ ప్రశ్నించకుండా మౌనంగా పట్టాలు పంపిణీ చేసి తిరుగుముఖం పట్టారు. -
నిధులున్నా కన్నీరే..!
భద్రాచలం, న్యూస్‌లైన్: ప్రజలకు పరిశుభ్రమైన తాగునీరందించేందుకు కేంద్రమంత్రి పోరిక బలరామ్‌నాయక్ మంజూరు చేసిన ఎంపీ ల్యాడ్స్ నిధులు వృథాగా మారాయి. ఆయన గెలిచిన తరువాత మొదటిసారిగా భద్రాచలం, ఇల్లెందు నియోజకవర్గాల్లో ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్ల ఏర్పాటుకు రూ.30 లక్షలు కేటాయించారు. విద్యార్థులకు తాగునీరు అందించాలనే లక్ష్యంతో వీటిని గిరిజన విద్యాసంస్థల్లో కూడా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. భద్రాచలం నియోజకవర్గంలోని కొత్తూరునారాయణపురం ఆశ్రమ పాఠశాల, పట్టణంలోని గురుకుల బాలికల పాఠశాలతో పాటు ఏరియా ఆస్పత్రిలో ఈ ప్లాంట్లు నిర్మించారు. అలాగే పురుషోత్తపట్నం, ఇల్లెందు నియోజకవర్గం బయ్యారంలో కూడా ఏర్పాటు చేశారు. ఒక్కోచోట రూ. 6 లక్షల వ్యయంతో వీటిని చేపట్టి విద్యార్థులకు, ఆయా గ్రామాల ప్రజలకు పరిశుభ్రమైన తాగునీటిని అందించేందుకు తగు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. వీటి పర్యవేక్షణ బాధ్యతలను ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు అప్పగించారు. అయితే పర్యవేక్షణ లోపం, నిధుల ఖర్చుపై ఎంపీ అనుచరుల అజమాయిషీ కారణంగా వాటర్ ప్లాంట్ల ఏర్పాటు పనులు సవ్యంగా ముందుకు సాగలేదనే విమర్శలు అప్పట్లోనే వెల్లువెత్తాయి. కాగా, మూడేళ్ల క్రితం నిర్మించిన వాటర్ ప్లాంట్లు మూణ్నాళ్లకే మూలన పడ్డాయి. పురుషోత్తపట్నం, భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన ప్లాంట్ల నుంచి ఇప్పటి వరకూ చుక్క నీరు రాలేదు. పురుషోత్తపట్నం గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్లాంటు పనులు అస్తవ్యస్తంగా సాగడంతో అది అలంకార ప్రాయంగానే మిగిలింది. ఏరియా ఆస్పత్రిలోని ఐడీహెచ్ వార్డుకు ఓ మూలన ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్ నిర్వహణ గురించి పట్టించుకోక పోవటంతో రోగులకు ఏ మాత్రం ఉపయోగపడలేదు. మిగతా చోట్ల కూడా తరచూ మరమ్మతులకు గురవుతున్నాయి. నిధులు కాజేసే ప్రయత్నం... పరిశుభ్రమైన తాగునీటిని అందించాలనే లక్ష్యంతో ఎంపీ నిధులు విడుదల చేసినప్పటికీ ఆయన అనుచరులుగా పెత్తనం చెలాయించే కొందరు నాయకులు వీటి ఖర్చుపై అజమాయిషీ చేయటంతోనే సమస్య ఉత్పన్నమయిందనే విమర్శలు ఉన్నాయి. ఒక్కో ప్లాంట్ ఏర్పాటుకు రూ.6 లక్షలు వెచ్చించాల్సి ఉంది. కానీ దీనిలో కొంత మొత్తంలోనే డబ్బు వెచ్చించారని, పనులు పూర్తి చేయకుండానే నిధులు కాజేసే ప్రయత్నం చేశారని, దీనికి సదరు పర్యవేక్షణాధికారులు అడ్డుపడటంతో పనులు అసంపూర్తిగా మిగిలిపోయాయని సమాచారం. రూ. 6 లక్షలు విడుద లైన పనులకు ఒక్కో చోట రూ.3 లక్షల వరకే వెచ్చించిగా, మిగతా నిధులు ఖర్చు కాకుండానే మిగిలిపోయాయి. వాస్తవంగా వాటర్ ప్లాంట్ల ఏర్పాటుకు కొత్తగా బోరు నిర్మించి, దాని ద్వారా పైపులైన్ కనె క్షన్ ఏర్పాటు చేసి ఫిల్టర్ చేయాల్సి ఉంటుంది. ఇందుకు అనువుగా ఉన్న చోట షెడ్డు నిర్మించి కొంతకాలం దాని పర్యవేక్షణ బాధ్యతను చూడాలి. ఆ తర్వాత ఆయా గ్రామ పంచాయితీ లేదా ఆశ్రమ పాఠశాలల నిర్వాహకులకు అప్పగించాలి. పురుషోత్తపట్నం వంటి చోట్ల గతంలోనే తీసిన బోరుకు మోటార్ అమర్చి, షెడ్డు నిర్మించకుండానే తూతూ మంత్రంగా పనులు చేపట్టారనే ఆరోపణలు ఉన్నాయి. షెడ్డుకు బదులుగా గ్రామ పంచాయతీ కార్యాలయంలో దీన్ని అమర్చి, పర్యవేక్షణపై దృష్టి సారించకపోవటంతో వాటర్ ప్లాంటు నిరుపయోగంగా మారింది. పథకాల పునరుద్ధరణపై శ్రద్ధ ఏదీ..? ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్ల పనులు అసంపూర్తిగా వదిలేసిన ఆర్డబ్ల్యూఎస్ అధికారులు వాటిని వినియోగంలోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేయలేదు. పనులు జరిగి రెండేళ్లు కావస్తున్నప్పటికీ మిగిలిన నిధులను వెచ్చించి ప్రజలకు పరిశుభ్రమైన తాగునీటిని అందించకపోవ టంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మినరల్ వాటర్ ప్లాంట్లు పనిచేయలేదని తెలుసుకున్న మంత్రి బలరామ్‌నాయక్ వీటి పర్యవేక్షణ అధికారులను తీవ్రంగానే మందలించినట్లు తెలిసింది. అయినప్పటికీ వారిలో చలనం లేకపోవటంతో ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తప్పటం లేదు. మంచి ఆశయంతో చేపట్టిన ఈ పథ కం లక్ష్యం నెరవేరకపోగా, నిధుల ఖర్చుకు ప్రతిరూపాలుగా ఆయా చోట్ల పరికరాలు దర్శనమిస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు దృష్టి సారించి మినరల్ వాటర్ ప్లాంట్ల పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని గిరిజనులు కోరుతున్నారు. -
‘పోడు’ పట్టాల ఘనత వైఎస్‌దే
బయ్యారం, న్యూస్‌లైన్: సంవత్సరాల తరబడి గిరిజనులు సాగు చేసుకుంటున్న పోడు భూములకు పట్టాలిచ్చి, ఆ భూములపై భరోసా కల్పించిన ఘనత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డిదేనని కేంద్ర మంత్రి బలరాం నాయక్, రాష్ట్ర ఉద్యానవన శాఖా మంత్రి రాంరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. ఆదివారం బయ్యారంలోని కోదండ రామచంద్రస్వామి ఫంక్షన్హల్లో ఏడో విడత భూపంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జిల్లాలో ఇప్పటి వరకు ఆరు విడతలలో 21,462 మంది రైతులకు 31,330 ఎకరాల భూమి పంపిణీ చేశామని, ప్రస్తుతం ఏడో విడుతలో 6741 మంది రైతులకు 14,352 ఎకరాల భూమి పంపిణీ చేస్తామని వివరించారు. ఇంత కాలం అనుభవిస్తున్న భూమిపై హక్కులు లేని నిరుపేదలు ఇక నుంచి ప్రభుత్వ పరంగా వచ్చే అన్ని రాయితీలు పొందవచ్చన్నారు. 2004లో అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ తన పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకే ఇప్పటికీ వ్యవసాయానికి ఉచిత విద్యుత్ అమలవుతోందని చెప్పారు. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా తెల్ల రేషన్‌కార్డు ఉన్న పేదలకు కార్పొరేట్ ఆస్పత్రులలో ఉచిత వైద్యం అందిస్తున్నామని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీల అబివృద్ధికి దేశంలోనే తొలిసారి ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ అమలులోకి తెచ్చిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. రూ. 5 వేల కోట్లతో బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. దీనిద్వారా స్థానికులు ఐదువేల మందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయన్నారు. జిల్లాలో అత్యధికంగా గిరిజన రైతులకు భూపంపిణీ చేస్తున్నామన్నారు. బయ్యారం చెరువు అబివృద్ధికి రూ.35 లక్షలు మంజూరయ్యాయని తెలిపారు. జాయింట్ కలెక్టర్ సురేంద్రమోహన్ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఇల్లెందు ఎమ్మెల్యే ఊకె అబ్బయ్య, కొత్తగూడెం ఆర్డీఓ అమయ్‌కుమార్, ల్యాండ్ సర్వే ఏఓ ప్రభాకర్, తహశీల్దార్ పుల్లయ్య, ఎంపీడీఓ చంద్రశేఖర్, ఏఓ కిశోర్‌బాబు, సొసైటీ అధ్యక్షుడు బిక్షం, ఆయా గ్రామాల సర్పంచులు కవిత, విజయకుమారి, శ్రీనివాస్, కైక, రంగీలాల్, కోటమ్మ, అనసూర్య తదితరులు పాల్గొన్నారు. సమస్యలపై పలువురి వినతులు... మండలంలోని పలు గ్రామాలలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని మంత్రులకు వైఎస్ఆర్ కాంగ్రెస్, కాంగ్రెస్, సీపీఐ(ఎంఎల్)న్యూడెమోక్రసీ, బీజేపీ నాయకులు వినతిపత్రాలు సమర్పించారు. కాగా, మంత్రుల పర్యటనను పురస్కరించుకుని ఇల్లెందు డీఎస్పీ క్రిష్ణ ఆద్వర్యంలో గార్ల-బయ్యారం సీఐ జైపాల్ పర్యవేక్షణలో భారీగా పోలీసు బందోబస్త్ నిర్వహించారు. -
సీతమ్మ తల్లికి ఉన్న శక్తి సోనియాకు ఉంది: బలరాంనాయక్
కేసముద్రం, న్యూస్‌లైన్: సీతమ్మ తల్లికి ఉన్నంత శక్తి సోనియాగాంధీకి ఉందని, ఆమె ఏది చేసినా న్యాయబద్ధంగానే చేస్తారని కేంద్రమంత్రి బలరాంనాయక్ అన్నారు. వరంగల్ జిల్లా కేసముద్రంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. పరిపూర్ణమైన తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడానికే సోనియా సమ్మతించారని, ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా రాష్ట్ర ఏర్పాటు ఆగదన్నారు. తెలంగాణలో మరో 34 నియోజకవర్గాలు పెరగనున్నట్లు చెప్పారు. బయ్యారంలో ఉక్కుపరిశ్రమ, మానుకోటలో డీఆర్డీఎల్ ప్రాజెక్టుతోపాటు, కేంద్రీయ విశ్వవిద్యాలయం నెలకొల్పుతామని పేర్కొన్నారు. -
ఆరని చిచ్చు... కాంగ్రెస్‌లో ముదిరిన వర్గపోరు
రాజీనామా యోచనలో వనమా..? పీసీసీ షోకాజ్ నోటీస్‌పై గరం గరం రాంరెడ్డి, సత్యవతిపై ఫిర్యాదుకు రెడీ.. సాక్షి, కొత్తగూడెం: నాయకుల అంతర్గత కలహాలు, ఆధిపత్య పోరుతో జిల్లా కాంగ్రెస్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. తాజాగా చెలరేగిన ‘భద్రాచలం’ చిచ్చు ఇంకా ఆరకపోగా మరింత రాజుకుంటోంది. ఈవిషయంలో అధిష్టానం షోకాజ్ నోటీసు జారీచేయడంతో డీసీసీ అధ్యక్షపదవికి వనమా వెంకటేశ్వరరావు రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం. భద్రాచలం పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడి నియామకంపై ఎమ్మెల్యే సత్యవతి ఫైర్ కావడంతో వనమా, ఎమ్మెల్యే మధ్య ఉన్న విభేదాలు బయటపడ్డాయి. ఈ విషయంలో వనమా ఏకపక్షంగా వ్యవహరించారని ఎమ్మెల్యే.. ఆమె ఏకపక్షంగా వ్యవహరించారని వనమా వర్గీయులు ఒకరికొకరు మాటల యుద్ధం కొనసాగించారు. అయితే వనమాపై ఫిర్యాదు చేసేందుకు ఎమ్మెల్యే సత్యవతికి మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి మద్దతు ఇవ్వడంతో పంచాయతీ రచ్చకెక్కిందని ఆపార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నాయి. ఇటీవల ఎంపీ రేణుకాచౌదరి, మంత్రి వెంకటరెడ్డి మధ్య వివాదం చెలరేగడం, ఈ సందర్భంలో మంత్రి తీరును వనమా ఖండించడం తెలిసిందే. దీంతో సమైక్యవాది అయిన రేణుకకు జిల్లాలో వనమా కొమ్ముకాస్తున్నాడని మంత్రి వర్గీయులు ఆయనపై ఆగ్రహంతో ఉన్నారు. ఈ తరుణంలో భద్రాచలం ‘పంచాయతీ’ తెరపైకి రావడంతో ఎమ్మెల్యేకు అండగా ఉండి వనమాపై పీసీసీకి ఫిర్యాదు చేయించారని పార్టీలో చర్చ జరుగుతోంది. ఇటు మంత్రి, అటు ఎమ్మెల్యే సత్యవతి ఒత్తిడితోనే పీసీసీ క్రమశిక్షణ సంఘం వనమాకు షోకాజ్ నోటీస్ జారీ చేసిందనే ఆక్రోశంలో వనమా వర్గీయులు ఉన్నారు. మంత్రి బలరాంనాయక్ మద్దతుతో భద్రాచలం పట్టణ అధ్యక్షుడి విషయంలో వనమా జోక్యం చేసుకోవడమే ఎమ్మెల్యేకు ఆగ్రహం తెప్పించింది. అయితే తన పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న భద్రాచలంలో తనకంటూ ఒకవర్గం ఉండేలా బలరాంనాయక్ ఈవ్యవహారంలో చక్రం తిప్పినా.. చివరకు అది వనమా మెడకు చుట్టుకుంది. రాజీనామా యోచనలో వనమా..? పీసీసీ తనను సంప్రదించకుండా షోకాజ్ నోటీస్ జారీ చేయడంపై వనమా ఆగ్రహంగా ఉన్నట్లు సమాచారం. పార్టీలో సుదీర్ఘ అనుభవం ఉన్న తనపై.. కొన్ని సంవత్సరాల క్రితం పార్టీలోకి వచ్చిన ఎమ్మెల్యే ఫిర్యాదు చేస్తే షోకాజ్ నోటీస్ జారీచేస్తారా..? అని ఆయన ఈ విషయం తెలంగాణ మంత్రుల దృష్టికి తెసుకెళ్లినట్లు తెలిసింది. ఆయన డీసీసీ పదవికి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే తనకు ఇప్పటి వరకు జిల్లా రాజకీయంలో గాడ్‌ఫాదర్‌గా ఉన్న రేణుకాచౌదరితో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటారని సమాచారం. ఈ విషయమై తన అనుంగు నేతలో ఇప్పటికే పలుమార్లు చర్చించారని, కొంతమంది వద్దని వారిస్తుండగా.. మరికొంతమంది పదవికి రాజీనామా చేస్తే మన సత్తా ఏంటో తెలుస్తుందని ఆయనకు సూచించినట్లు తెలిసింది. మంత్రి, సత్యవతిపై ఫిర్యాదుకు సన్నద్దం..? జిల్లాలో రేణుకాచౌదరికి మద్దతుగా ఉంటున్నందునే భద్రాచలం వ్యవహారాన్ని పీసీసీ స్థాయిలో మంత్రి వెంకటరెడ్డి, ఎమ్మెల్యే సత్యవతి రాద్దాంతం చేశారని, దీనిపై తాడోపేడో తేల్చుకోవలసిందేనని వనమా సిద్ధమైనట్లు సమాచారం. ఇరువురిపై పీసీసీ, తెలంగాణ మంత్రులు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్‌కు ఫిర్యాదు చేసేందుకు పూనుకున్నారని, రేణుక సూచనల మేరకే ఆయన అడుగులు వేస్తున్నారని పార్టీ క్యాడర్ చర్చించుకుంటున్నారు. మొత్తంగా కాంగ్రెస్ పార్టీలో పొడచూపిన విభేదాలు ఆరని కుంపటిలా ఉండడంతో పార్టీ ప్రతిష్ఠ నానాటికి దిగజారుతోందని ఆపార్టీలోని ద్విత్రీయ శ్రేణి నేతలు అసహనంతో ఉన్నారు. -
ఎన్డీ అజ్ఞాత దళం నుంచి ముగ్గురు పరార్
ఇల్లెందు, న్యూస్‌లైన్: న్యూడెమోక్రసీ(ఎన్డీ)కి గట్టి దెబ్బ తగిలింది. ఆ పార్టీ అజ్ఞాత నేత మధు ఆధ్వర్యంలో గుండాల ఏరియాలో పనిచేస్తున్న దళంలోని ప్రసాద్ (కమాండర్), మరో ఇద్దరు సభ్యులు ఆయుధాలతో శుక్రవారం రాత్రి పరారయ్యారు. వీరు మూడు నెలల కిందటే దళంలో చేరారు. వీరు పరారైనట్టుగా గుర్తించిన మిగతా సభ్యులు శనివారం ఉదయం పరిసర ప్రాంతాల్లో గాలిస్తుండగా... ఒకచోట (ఆ ముగ్గురికి చెందిన) ఆయుధాలు, యూనిఫాం కనిపించాయి. గుండాల మండలంలో శనివారం కేంద్ర మంత్రి బలరాం నాయక్ పర్యటన ఉండడంతో పోలీసులు అడవుల్లో గాలింపు చేపట్టారు. ఈ పరిస్థితుల్లో, అడవి నుంచి తేలిగ్గా తప్పించుకునేందుకే ఆ ముగ్గురు దళ సభ్యులు తమ ఆయుధాలను, యూనిఫామ్‌ను వదిలేసి ఉంటారని ఎన్డీ వర్గాలు భావిస్తున్నాయి. ఎక్కడి నుంచి వచ్చారు.. ఎందుకు పరారయ్యారు...?! వరంగల్ జిల్లాకు చెందిన ఎనిమిదిమంది కలిసి మూడు నెలల క్రితం ఎన్డీ దళాలలో చేరారు. కొద్ది రోజులకే వీరిలో ముగ్గురు ఇంటిబాట పట్టారు. ఆ తరువాత కొన్ని రోజులకు మరో సభ్యుడు కూడా మళ్లీ వస్తానంటూ ఇంటికి వెళ్లిపోయాడు. వరంగల్ నుంచి వచ్చిన ఎనిమిది మందిలో నలుగురు మాత్రమే మిగిలారు. వీరిలో ప్రసాద్ దళంలో ఆయనతోపాటు మరో ఇద్దరు, ఆజాద్ దళంలో ఒక్కరు ఉన్నారు. వరంగల్ నుంచి వచ్చిన ఎనిమిదిమందిలో మిగిలిన ఒకే ఒక వ్యక్తి ప్రస్తుతం ఆజాద్ దళంలో ఉన్నాడు. ప్రసాద్ సహా ఇద్దరు సభ్యుల పరారీపై అతడిని పార్టీ నాయకత్వం ప్రశ్నించినట్టు తెలిసింది. ‘మేమంతా కలిసి కొత్త పార్టీ ఏర్పాటు చేయాలనుకున్నాం. అందుకే ఆయుధాల కోసం దళంలో చేరాం. కొద్ది రోజుల తరువాత అందరం కలిసి ఆయుధాలతో పారిపోవాలని నిర్ణయించుకున్నాం’ అని ఆ సభ్యుడు వెల్లడించినట్టు తెలిసింది. వీరంతా గతంలో వరంగల్ జిల్లాలో జనశక్తి, సీపీయూఎస్ఐ దళాల్లో పనిచేసినట్టు సమాచారం. గతంలో సీపీయూఎస్ఐలో పనిచేసి ఎన్డీలోకి వచ్చిన దళ నేత గణేష్ ద్వారానే వీరంతా ఎన్డీ దళాల్లోకి వచ్చినట్టు తెలిసింది. -
జోరువానలో కేంద్ర మంత్రి సుడిగాలి పర్యటన
గుండాల, న్యూస్‌లైన్: జోరువానలో మారుమూల ఏజెన్సీ మండలమైన గుండాలలో కేంద్ర సహాయ మంత్రి పోరిక బలరాంనాయక్ శుక్రవారం సుడిగాలి పర్యటన చేశారు. పినపాక మండలం నుంచి ద్విచక్ర వాహనంపై గుండాల మండలంలో గ్రామాలను సందర్శించారు. దామరతోగు, చినవెంకటాపురం, సాయనపల్లి, ఘనాపురం, ఎలగలగడ్డ, లింగగూడెం, చీమలగూడెం, నర్సాపురం తండా గ్రామాల్లో వర్షాన్ని సైతం లెక్కచేయక పర్యటించారు. ప్రజలతో మాట్లాడారు. సంక్షేమ పథకాలు అందుతున్నాయో లేదో అడిగి తెలుసుకున్నారు. రోడ్లు సరిగా లేని చోట్ల కాలినడకన వెళ్లారు. అంతేకాకుండా సాయనపల్లి-గుండాల మధ్య మల్లన్న వాగు, వెంకటాపురం కిన్నెరసాని వాగులను కాలినడక దాటి వెళ్లారు. నక్సల్స్ ప్రభావిత ప్రాంతంలో ఆయన పర్యటన పోలీసులకు సవాల్‌గా మారింది. ఇల్లెందు, మణుగూరు డీఎస్పీలు క్రిష్ణ, రవీందర్, గుండాల, టేకులపల్లి సీఐ రాజిరెడ్డి, గుండాల, బోడు, కరకగూడెం ఎస్సైలు కరుణాకర్, ఆరీఫ్, అరుణ్ కుమార్ల ఆధ్వర్యంలో స్పెషల్ పార్టీ బలగాలతో భారీ బందోబస్తు నిర్వహించారు. కార్యకర్తల చురుగ్గా పనిచేయాలి మండలంలో పార్టీ బలోపేతానికి కార్యకర్తలు చురుగ్గా పని చేయాలని బలరామ్‌నాయక్ పిలుపునిచ్చారు. మండల పర్యటనలో భాగంగా స్థానిక తండాలో పార్టీ జెండాను ఆయన ఎగుర వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కాంగ్రెస్ పాలనలో జరిగిన అభివృద్ధి ఎప్పుడూ జరగలేదని అన్నారు. మండలంలో అనేక సమస్యలు ఉన్నప్పటికీ త్వరలోనే అన్ని పరిష్కారం అవుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు, పార్టీ నాయకులు నర్సింహరావు, వెంకన్న, పాపారావు, దుర్గ, లక్ష్మయ్య, బుచ్చిరాములు, వీరస్వామి,రావుల సోమయ్య పాల్గొన్నారు. -
రూ.5వేల కోట్లతో బయ్యారంలో మైనింగ్: బలరాంనాయక్
ఇల్లెందు, న్యూస్‌లైన్: ఇల్లెందు నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా రూ. 5వేల కోట్లతో బయ్యారం మండలంలో మైనింగ్ ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నామని కేంద్ర మంత్రి బలరాంనాయక్ అన్నా రు. శనివారం ఇల్లెందు ఏరియాలోని జేకే -5 ఓసీ నిర్వాసితులకు ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడారు. బయ్యారంలో మైనింగ్ ఏర్పాటు గురించి గతం లో అనేకసార్లు ముఖ్యమంత్రితో చర్చించామని, రెండు నెలల్లో మైనింగ్ మంత్రులను బయ్యారం మండలానికి తీసుకువచ్చి ఈ ప్రాంతాన్ని పరి శీలించనున్నామని అన్నారు. ఇల్లెందులో ఇళ్ల పట్టాల రెగ్యులరైజేషన్‌కు ప్రయత్నిస్తున్నామని, సింగరేణి పుట్టిల్లయిన బొగ్గుట్ట(ఇల్లెందు)లో మెడికల్ కళాశాల ఏర్పాటుకు కృషి చేస్తున్నామని, గిరిజన యూనివర్శిటీ ఏర్పాటుకు యోచిస్తున్నామని అన్నారు. సింగరేణి యాజమాన్యంతో చర్చించి ఇల్లెందు అభివృద్ధికి షేప్ నిధులు మం జూరు చేసే విధంగా చర్యలు చేపట్టాలని కలెక్టర్, జేసీలకు సూచించారు. అనంతరం మంత్రి రాం రెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ ఓసీ నిర్వాసితులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయడమే కాకుండా త్వరలోనే ఇళ్ల నిర్మాణానికి కృషి చేస్తామని అన్నా రు. నిర్వాసితులకు ఇళ్ల స్థలాల పంపిణీతో పాటు సకాలంలో పరిహారం అందించడం పట్ల ఆయన సింగరేణి యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపా రు. ఎమ్మెల్యే ఊకె అబ్బయ్య మాట్లాడుతూ సింగరేణి జేకే -5ఓసీలో యాజమాన్యం జీఓ 97ను ఉల్లంఘిస్తోందని, నిర్వాసిత ప్రాంతంలోని నిరుద్యోగుల్లో 100 శాతం ఉపాధి కల్పించడం లేదని అన్నారు. నిర్వాసితులకు ఉచిత ఉపాధి శిక్షణ కార్యక్రమాలు చేపట్టి ఉపాధి కల్పించలేదని అన్నారు. కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేష్ మాట్లాడు తూ నిర్వాసితులకు పంపిణీ చేసిన స్థలాల్లో తక్షణం ఇళ్ల నిర్మాణం చేపట్టి మోడల్ కాలనీగా తీర్చిదిద్దాలని సింగరేణి యాజమాన్యానికి సూ చించారు. గుండాలలో బొగ్గు నిక్షేపాల అన్వేషణ జరుగుతోందని, జిల్లాలో మొదటిసారిగా మోడల్‌కాలనీగా ఇల్లెందును తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామన్నారు. కుటుంబ సభ్యులకు ఒకే చోట ఇవ్వాలి... నిర్వాసిత ప్రాంతంలోని కుటుంబ సభ్యులకు అందరికీ ఒకేచోట ఇళ్ల స్థలాలలు ఇవ్వాలని, లాట రీ పద్ధతిలో వేర్వేరు చోట్ల కేటాయించవద్దని నిర్వాసిత కమిటీ బాధ్యులు ఈ సందర్భంగా నిరసన వ్యక్తం చేశారు. అందుకు స్పందించిన జేసీ నిర్వాసితుల అభిప్రాయం మేరకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తామని, ప్రస్తుతం ఒకరిద్దరికి లాటరీ పద్ధతిలో మంత్రుల చేతుల మీదుగా ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తామని అన్నారు. అందుకు నిర్వాసితులు ఒప్పుకున్నారు. అలాగే టేకులపల్లిలోని రాయపాడు గ్రామానికి చెందిన 82 మంది భూ నిర్వాసితులకు కూడా పట్టాలు పంపిణీ చేశారు. రైతులకు యంత్ర పరికరాల పంపిణీ... అంతకు ముందు యంత్రలక్ష్మి పథకం కింద స్థానిక ఎంపీడీఓ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి బలరాంనాయక్, రాష్ట్ర మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డిలు రైతులకు వ్యవసాయ పరికరాలు పంపిణీ చేశారు. వ్యవసా య శాఖ ద్వారా 707 మంది రైతులకు రూ. 84 లక్షల విలువైన యంత్ర పరికరాలను, రూ. 50లక్షల విలువైన బీమా చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం రైతులకు అనేక సదుపాయాలు కల్పిస్తోందని వీటి ని సకాలంలో రైతులకు అందేలా అధికారులు పర్యవేక్షించాలని అన్నారు. దివంగత ముఖ్య మంత్రి రాజశేఖరరెడ్డి హాయంలో జిల్లాలో రెండు భారీ నీటి పారుదల ప్రాజెక్టులు దుమ్ముగూడెం, పోలవరం చేపట్టారని ఈ రెండు పూర్తయితే జిల్లాలో రైతులకు సాగునీటికి కొరత ఉండదని అన్నారు. అనంతరం ఇందిరానగర్‌లో రూ. 5లక్షలతో మంచినీటి బోర్, మోటార్‌కు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ శ్రీనివాసశ్రీనరేష్, ఐటీడీఏ పీఓ వీరపాండియన్, జేసీ సురేం ద్రమోహన్, జేడీఏ భాస్కర్‌రావు, ఏడీఏ లక్ష్మీకుమారి, ఇల్లెందు ఎమ్మెల్యే ఊకె అబ్బయ్య,కాం గ్రెస్ పట్టణ, మండల అధ్యక్షులు మడత వెంకట గౌడ్, దాస్యం ప్రమోద్‌కుమార్, తహశీల్దార్ నాగేశ్వరరావు, ఎంపీడీఓ నారాయణమ్మ తదితరులు పాల్గొన్నారు. -
నవంబరు13న పార్లమెంట్‌కు తెలంగాణ బిల్లు : బలరాంనాయక్
దుగ్గొండి, న్యూస్‌లైన్ : తెలంగాణ రాష్ర్ట ఏర్పాటు బిల్లు నవంబర్ 13న పార్లమెంట్‌కు వస్తుందని కేంద్ర సామాజిక న్యాయశాఖ సహాయ మంత్రి పోరిక బలరాంనాయక్ తెలిపారు. వరంగల్ జిల్లా దుగ్గొండి మండలంలోని తిమ్మంపేట గ్రామంలో ఆదివారం ‘ఇంటింటికీ కాంగ్రెస్ జెండా-సోనియా అండ’ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణ ప్రకటన చేశాం. కేబినేట్ నోట్ రెడీ అయింది. ఇక రాష్ట్ర ఏర్పాటే తరువాయి అని ఆయన అన్నారు. తెలంగాణలో జరిగిన సుదీర్ఘ నిర్విరామ పోరాటాలకు యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ తగిన ప్రతిఫలాన్ని ఇచ్చారన్నారు. -
చైనా చొరబాట్లపై నిర్లక్ష్యమెందుకు?
న్యూఢిల్లీ: మన భూభాగంలోకి చైనా చొరబడుతున్నా.. కేంద్రం ఆ సమస్యను తగ్గించి చూపేందుకు యత్నిస్తోందని లోక్‌సభలో ఎంపీలు మండిపడ్డారు. ఈ అంశంపై పార్టీలకు అతీతంగా 29 మంది ఎంపీలు సంధించిన ప్రశ్నలకు.. రక్షణమంత్రి ఆంటోనీ సోమవారం లోక్‌సభలో సమాధానమిచ్చారు. 2010 నుంచి వివిధ దేశాలు భారత గగనతలాన్ని 28 సార్లు ఉల్లంఘించాయని వెల్లడిం చారు. కానీ భారత భూభాగంలోకి చైనా చొరబాట్ల అంశంపై సరైన వివరణ ఇవ్వలేదు. చైనా, భారత్ మధ్య వాస్తవాధీన రేఖపై ఇరుదేశాల మధ్య పలు విభేదాలున్నాయని.. అందువల్ల పలుమార్లు సరిహద్దుల ఉల్లంఘనలు చోటుచేసుకున్నాయన్నారు. దీనిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నామని, తగు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. వికలాంగుల రిజర్వేషన్ పెంపు: వికలాంగులకు ప్రస్తుతం ఉన్న 3 శాతం రిజర్వేషన్ 5 శాతానికి పెరగనుంది. ఈ మేరకు ఉద్దేశించిన బిల్లుకు కేంద్రం ఓకే చెప్పింది. పర్సన్ విత్ డిసెబిలిటీస్ యాక్ట్-1995 చట్టం ప్రకారం ఇప్పుడు 3 శాతం రిజర్వేషన్ మాత్రమే ఉందని, అయితే వారికి మరింత తోడ్పాటును అందించే ఉద్దేశంతో రిజర్వేషన్‌ను 5 శాతానికి పెంచుతున్నట్లు సాధికార త, సామాజిక న్యాయశాఖ సహాయ మంత్రి బలరాం నాయక్ రాజ్యసభలో చెప్పారు. తగ్గిపోతున్న ప్రభుత్వ ఉద్యోగాలు: దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగాలు తగ్గిపోతున్నాయి. 2008లో ప్రభుత్వ ఉద్యోగాలు 1,76,74,000గా ఉండగా... 2011 నాటికి 1,75,48,000కు తగ్గిపోయాయని, ప్రైవే టు ఉద్యోగాలు మాత్రం 98,75,000 నుంచి 1,14,52,000కు పెరిగాయని కార్మిక, ఉపాధి కల్పన శాఖ సహాయ మంత్రి సురేష్ లోక్‌సభలో చెప్పారు.