ఇల్లెందు, న్యూస్‌లైన్: ఇల్లెందు నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా రూ. 5వేల కోట్లతో బయ్యారం మండలంలో మైనింగ్ ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నామని కేంద్ర మంత్రి బలరాంనాయక్ అన్నా రు. శనివారం ఇల్లెందు ఏరియాలోని జేకే -5 ఓసీ నిర్వాసితులకు ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడారు. బయ్యారంలో మైనింగ్ ఏర్పాటు గురించి గతం లో అనేకసార్లు ముఖ్యమంత్రితో చర్చించామని, రెండు నెలల్లో మైనింగ్ మంత్రులను బయ్యారం మండలానికి తీసుకువచ్చి ఈ ప్రాంతాన్ని పరి శీలించనున్నామని అన్నారు. ఇల్లెందులో ఇళ్ల పట్టాల రెగ్యులరైజేషన్‌కు ప్రయత్నిస్తున్నామని, సింగరేణి పుట్టిల్లయిన బొగ్గుట్ట(ఇల్లెందు)లో మెడికల్ కళాశాల ఏర్పాటుకు కృషి చేస్తున్నామని, గిరిజన యూనివర్శిటీ ఏర్పాటుకు యోచిస్తున్నామని అన్నారు.
సింగరేణి యాజమాన్యంతో చర్చించి ఇల్లెందు అభివృద్ధికి షేప్ నిధులు మం జూరు చేసే విధంగా చర్యలు చేపట్టాలని కలెక్టర్, జేసీలకు సూచించారు. అనంతరం మంత్రి రాం రెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ ఓసీ నిర్వాసితులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయడమే కాకుండా త్వరలోనే ఇళ్ల నిర్మాణానికి కృషి చేస్తామని అన్నా రు. నిర్వాసితులకు ఇళ్ల స్థలాల పంపిణీతో పాటు సకాలంలో పరిహారం అందించడం పట్ల ఆయన సింగరేణి యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపా రు. ఎమ్మెల్యే ఊకె అబ్బయ్య మాట్లాడుతూ సింగరేణి జేకే -5ఓసీలో యాజమాన్యం జీఓ 97ను ఉల్లంఘిస్తోందని, నిర్వాసిత ప్రాంతంలోని నిరుద్యోగుల్లో 100 శాతం ఉపాధి కల్పించడం లేదని అన్నారు. నిర్వాసితులకు ఉచిత ఉపాధి శిక్షణ కార్యక్రమాలు చేపట్టి ఉపాధి కల్పించలేదని అన్నారు. కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేష్ మాట్లాడు తూ నిర్వాసితులకు పంపిణీ చేసిన స్థలాల్లో తక్షణం ఇళ్ల నిర్మాణం చేపట్టి మోడల్ కాలనీగా తీర్చిదిద్దాలని సింగరేణి యాజమాన్యానికి సూ చించారు. గుండాలలో బొగ్గు నిక్షేపాల అన్వేషణ జరుగుతోందని, జిల్లాలో మొదటిసారిగా మోడల్‌కాలనీగా ఇల్లెందును తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామన్నారు.
కుటుంబ సభ్యులకు ఒకే చోట ఇవ్వాలి...
నిర్వాసిత ప్రాంతంలోని కుటుంబ సభ్యులకు అందరికీ ఒకేచోట ఇళ్ల స్థలాలలు ఇవ్వాలని, లాట రీ పద్ధతిలో వేర్వేరు చోట్ల కేటాయించవద్దని నిర్వాసిత కమిటీ బాధ్యులు ఈ సందర్భంగా నిరసన వ్యక్తం చేశారు. అందుకు స్పందించిన జేసీ నిర్వాసితుల అభిప్రాయం మేరకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తామని, ప్రస్తుతం ఒకరిద్దరికి లాటరీ పద్ధతిలో మంత్రుల చేతుల మీదుగా ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తామని అన్నారు. అందుకు నిర్వాసితులు ఒప్పుకున్నారు. అలాగే టేకులపల్లిలోని రాయపాడు గ్రామానికి చెందిన 82 మంది భూ నిర్వాసితులకు కూడా పట్టాలు పంపిణీ చేశారు.
రైతులకు యంత్ర పరికరాల పంపిణీ...
అంతకు ముందు యంత్రలక్ష్మి పథకం కింద స్థానిక ఎంపీడీఓ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి బలరాంనాయక్, రాష్ట్ర మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డిలు రైతులకు వ్యవసాయ పరికరాలు పంపిణీ చేశారు. వ్యవసా య శాఖ ద్వారా 707 మంది రైతులకు రూ. 84 లక్షల విలువైన యంత్ర పరికరాలను, రూ. 50లక్షల విలువైన బీమా చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం రైతులకు అనేక సదుపాయాలు కల్పిస్తోందని వీటి ని సకాలంలో రైతులకు అందేలా అధికారులు పర్యవేక్షించాలని అన్నారు. దివంగత ముఖ్య మంత్రి రాజశేఖరరెడ్డి హాయంలో జిల్లాలో రెండు భారీ నీటి పారుదల ప్రాజెక్టులు దుమ్ముగూడెం, పోలవరం చేపట్టారని ఈ రెండు పూర్తయితే జిల్లాలో రైతులకు సాగునీటికి కొరత ఉండదని అన్నారు. అనంతరం ఇందిరానగర్‌లో రూ. 5లక్షలతో మంచినీటి బోర్, మోటార్‌కు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ శ్రీనివాసశ్రీనరేష్, ఐటీడీఏ పీఓ వీరపాండియన్, జేసీ సురేం ద్రమోహన్, జేడీఏ భాస్కర్‌రావు, ఏడీఏ లక్ష్మీకుమారి, ఇల్లెందు ఎమ్మెల్యే ఊకె అబ్బయ్య,కాం గ్రెస్ పట్టణ, మండల అధ్యక్షులు మడత వెంకట గౌడ్, దాస్యం ప్రమోద్‌కుమార్, తహశీల్దార్ నాగేశ్వరరావు, ఎంపీడీఓ నారాయణమ్మ తదితరులు పాల్గొన్నారు.
రూ.5వేల కోట్లతో బయ్యారంలో మైనింగ్: బలరాంనాయక్
Published Sun, Oct 6 2013 5:19 AM | Last Updated on Fri, Sep 1 2017 11:22 PM
Advertisement
Advertisement