
ప్లాస్టిక్ బియ్యం.. ఇన్‌సెట్లో పద్మ
బయ్యారం (మహబూబాబాద్): ప్రభుత్వ చౌకదుకాణం నుంచి సరఫరా అయిన బియ్యంలో ప్లాస్టిక్‌బియ్యం ఉండడం పలువురిని ఆందోళనకు గురిచేస్తోంది. వివరాలు.. బయ్యారంలోని పీహెచ్‌సీ ఏరియాలో నివాసం ఉండే నాసరబోయిన పద్మ తన అత్త రామక్క పేరున వచ్చే బియ్యం పది కేజీలు మార్చి నెలలో తీసుకొని ఇంటికి వచ్చింది. ఆ బియ్యాన్ని మంగళవారం వండేందుకు నానబెట్టిన సమయంలో ప్లాస్టిక్‌తో కూడిన బియ్యం నీళ్లలో పైకి తేలాయి.
దీంతో ఆ బియ్యాన్ని పూర్తిగా గమనించగా ప్లాస్టిక్ బియ్యంగా కనపడటంతో పద్మ ఈ విషయాన్ని విలేకరులకు తెలిపింది. ప్రభుత్వం సరఫరా చేసిన బియ్యంలో ప్లాస్టిక్ బియ్యం ఎలా వచ్చాయి అనే ప్రశ్న పలువురిలో వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికైనా చౌకదుకాణాల ద్వారా సరఫరా అవుతున్న బియ్యం నాణ్యతపై అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.
(చదవండి: ఫోన్‌లో అతిగా మాట్లాడుతున్నావని మందలించినందుకు... )
Comments
Please login to add a commentAdd a comment