![హెచ్‌ఎంటీ వాచెస్ మూసివేతకు కేబినెట్ నోట్!](/styles/webp/s3/article_images/2017/09/5/41490727235_625x300.jpg.webp?itok=lt-Ufjk6)
హెచ్‌ఎంటీ వాచెస్ మూసివేతకు కేబినెట్ నోట్!
నీతి ఆయోగ్ కసరత్తు...
న్యూఢిల్లీ: డిజిన్వెస్ట్‌మెంట్‌లో భాగంగా ఖాయిలా పడిన మరో 7 ప్రభుత్వ రంగ సంస్థలను మూసేయాలని నీతి ఆయోగ్ తాజాగా కేబినెట్ నోట్‌ను సిద్ధం చేస్తోందని ఒక ప్రభుత్వ ఉన్నతాధికారి చెప్పారు. హెచ్‌ఎంటీ వాచెస్, హిందుస్తాన్ కేబుల్, టైర్ కార్పొరేషన్, బర్డ్స్ జ్యూట్ అండ్ ఎక్స్‌పోర్ట్ లిమిటెడ్, సెంట్రల్ ఇన్‌లాండ్ వాటర్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్‌లు ఈ జాబితాలో ఉన్నాయని పేర్కొన్నారు.
ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ(కేబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్)మూసేయాలని ఆమోదించిన సీపీఎస్‌ఈలకు ఈ జాబితా అదనమని ఆయన వివరించారు. కాగా డిజిన్వెస్ట్‌మెంట్‌లో భాగంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ వాటాల విక్రయం ద్వారా రూ.45,500 కోట్లు సమీకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కానీ ఇప్పటివరకూ రూ.30,000 కోట్లు మాత్రమే సాధించగలిగింది. ఇక వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.72,500 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది.