రాష్ట్ర విభజన విషయంలో అక్టోబర్లోగా కేబినెట్ నోట్ తయారీ అనుమానమేనని రాజకీయ విశ్లేషకులు వాసుదేవ దీక్షితులు అన్నారు.
హైదరాబాద్ : రాష్ట్ర విభజన విషయంలో అక్టోబర్లోగా కేబినెట్ నోట్ తయారీ అనుమానమేనని రాజకీయ విశ్లేషకులు వాసుదేవ దీక్షితులు అన్నారు. ఆయన శనివారం ఓ చానల్ కార్యక్రమంలో మాట్లాడుతు విభజన విషయంలో కాంగ్రెస్కు స్పష్టత లేదన్నారు. రాష్ట్రాన్ని నాశనం చేసిన కాంగ్రెస్ ఇప్పటికైనా సరైన చర్యలు చేపట్టాలన్నారు. నిర్బయ కేసులో దోషులకు శిక్ష సరైనదేనని ఆయన అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోటానికి నరేంద్ర మోడీ వద్ద ఎటువంటి పథకాలు ఉన్నాయో తెలియాలని వాసుదేవ దీక్షితులు అన్నారు.
ఇదే కార్యక్రమంలో టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి మాట్లాడుతూ నరేంద్ర మోడీపై దేశంలో యువతకు మోజు ఉందన్నారు. వచ్చే ఎన్నికలకు సంబంధించి టీడీపీ ఇంకా కార్యచరణపై నిర్ణయం తీసుకోలేదన్నారు.