కాంగ్రెస్ పార్టీలో తమ పార్టీని విలీనం చేసేది లేదని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పష్టం చేయడంతో కాంగ్రెస్ పెద్దలు కొత్త ప్రయత్నాలు మొదలుపెట్టారు. విభజించి.. పాలించే తమ విధానాన్ని మరోసారి ప్రదర్శిస్తున్నారు. టీఆర్ఎస్ తమ ముగ్గులోకి వచ్చే అవకాశం ఎటూ లేకపోవడంతో.. ఇక తెలంగాణ జేఏసీ మీద కన్నేసింది. టీఆర్ఎస్ బలమంతా జేఏసీలోనే ఉందని.. అందుకే జేఏసీని బలహీనపరిస్తే సగం పని అయిపోయినట్లేనని భావించి, జేఏసీని విడదీసే ప్రయత్నాలు మొదలుపెట్టింది. అందులో భాగంగా తెలంగాణ జేఏసీలోని ఆరుగురు ప్రధాన నేతలకు టికెట్లు ఎరవేసింది.
ఇప్పటికే కాంగ్రెస్ అధిష్ఠానంతోను, తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ ప్రధాన నాయకులతోను ఇద్దరు జేఏసీ ముఖ్యనేతలు టచ్లో ఉన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ తెలంగాణ తెచ్చిందని, ఈ ప్రాంతాన్ని పూర్తిస్థాయిలోఅభివృద్ధి చేసేది కూడా తామేనని చెప్పుకోడానికి వీలుగా కొందరు జేఏసీ నేతలు తమవెంట ఉంటే బాగుంటుందని భావించడంతో పాటు, ఆ రకంగా టీఆర్ఎస్ను కూడా బలహీనపరిచినట్లు అవుతుందని యోచిస్తున్నట్లు సమాచారం. దీంతో రాబోయే రెండు రోజుల్లో కీలక పరిణామాలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
టీ-జేఏసీకి కాంగ్రెస్ పెద్దల ఎర!
Published Tue, Mar 4 2014 11:23 AM | Last Updated on Sun, Apr 7 2019 3:47 PM
Advertisement