రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రసన్నకుమార్ మహంతి బుధవారం ఉదయం ఢిల్లీ బయల్దేరి వెళ్లారు.
హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రసన్నకుమార్ మహంతి బుధవారం ఉదయం ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. తెలంగాణ రాష్ట్ర అపాయింటెడ్ డేతో పాటు అందుకు అనుగుణంగా రాష్ట్రంలో చేపట్టాల్సిన చర్యలపై ఆయన కేంద్ర హోంశాఖతో కీలక సమావేశంలో పాల్గొననున్నారు. కేంద్ర సూచనలు,ఆదేశాలకనుగుణంగా ఢిల్లీ నుంచి వచ్చాక సీఎస్ మళ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది.
ఇక సీఎస్ పర్యవేక్షణలోనే రాష్ట్ర విభజన కార్యక్రమం కొనసాగుతోంది. ఆయన నిన్న వివిధ శాఖల కార్యదర్శులతో సమావేశం అయ్యారు. పాలనాపరమైన విభజనను వారం రోజుల్లో పూర్తి చేయాలని అన్ని శాఖల ఉన్నతాధికారులకు ఈ సందర్భంగా మహంతి ఆదేశించారు. రాష్ట్రపతి గెజిట్ నోటిఫికేషన్ రాకముందే విభజన వేగం పెరగటంతోరెండు రాష్ట్రాలు.. ఇద్దరు ముఖ్యమంత్రులను త్వరలోనే ఏర్పాటు చేస్తారనే చర్చ జరుగుతోంది.