శుక్రవారం జరిగే కేంద్ర మంత్రివర్గ సమావేశంలో తెలంగాణ అంశంపై చర్చించే అవకాశం లేదని కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే అన్నారు.
శుక్రవారం జరిగే కేంద్ర మంత్రివర్గ సమావేశంలో తెలంగాణ అంశంపై చర్చించే అవకాశం లేదని కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే అన్నారు. ఆయన పీటీఐ వార్తా సంస్థతో మాట్లాడుతూ ఈ విషయం తెలిపారు. తన మంత్రిత్వ శాఖ సిద్ధం చేసిన కేబినెట్ నోట్ ముసాయిదా పరిశీలనకు తనకు సమయం లేదని, కేబినెట్ నోట్ ముసాయిదా మాత్రం సిద్ధమైందని ఆయన చెప్పారు. రేపు నోట్ ముసాయిదాను చూస్తానని వెల్లడించారు. అలాగే, తెలంగాణ నోట్‌ను కేంద్ర న్యాయశాఖకు కూడా పంపిస్తానని చెప్పారు.
ఆంటోనీ కమిటీ నివేదికను కూడా కేబినెట్ సీరియస్గానే పరిగణనలోకి తీసుకునే అవకాశముంది. కేబినెట్ నోట్ను సోనియాగాంధీ, మన్మోహన్ సింగ్ల ఆమోదం కోసం షిండే వారివద్ద ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తోంది. దీనంతటికీ చాలా సమయం పడుతుంది కాబట్టి, శుక్రవారం నాటి సమావేశంలో తెలంగాణపై చర్చ ఉండకపోవచ్చని తెలుస్తోంది.