జడ్చర్ల, న్యూస్‌లైన్: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటకు సంబంధించిన పార్లమెంట్‌లో వెంటనే బిల్లు పెట్టాలని పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన జడ్చర్లలో ఎమ్మార్సీ కేంద్రం ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సమైక్యాంధ్ర కోసం పెద్దఎత్తున ఉద్యమం చేస్తున్నారన్న సాకుతో తెలంగాణ బిల్లులో జాప్యం చేయవద్దని కోరారు. బిల్లు ఆమోదంలో ఆలస్యం జరిగితే నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసిన వారవుతారని పేర్కొన్నారు. ఎమ్మెల్సీలు జనార్దన్‌రెడ్డి, పూల రవీందర్, మాజీ ఎమ్మెల్సీ మోహన్‌రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సర్వోత్తమ్‌రెడ్డిలతో కూడిన పీఆర్‌టీయూ బృందం సోమవారం ఢిల్లీ వెళ్లనున్నట్లు తెలిపారు. తెలంగాణ బిల్లును ఆలస్యం చేయకుండా పార్లమెంట్‌లో త్వరగా ప్రవేశపెట్టే విధంగా ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్, ఆంటోని, దిగ్విజయ్‌సింగ్, ప్రతి పక్ష నేత సుష్మాస్వరాజ్‌లను కలిసి విన్నవించనున్నట్లు తెలిపారు. తెలంగాణ కోసం ఇదివరకే 32రోజలు సమ్మె చేశామని, బిల్లును ఆలస్యం చేస్తే వంద రోజుల సమ్మె చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నా రు.
ప్రత్యేక రాష్ట్రం వల్ల 1.50 లక్షల మంది ఉపాధ్యాయులకు సర్వీస్ రూల్స్‌లో మార్పు జరుగుతుందని, విద్యావ్యవస్థ అంతా ఒకే గొడుగు కిందకు వచ్చే అవకాశం ఉందన్నారు. ఉపాధ్యాయులకు పదో పీఆర్సీ ని ఆలస్యం చేయకుండా వెంటనే అమలు చేయాలని, హెల్త్ కార్డులు జారీ చేయాలని, జీపీఎఫ్‌కు సంబంధించి 40 జీఓను అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సమావేశంలో జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ, రాష్ట్ర కార్యదర్శి చంద్రశేఖర్‌రెడ్డి, జిల్లా అసోసియేట్ అధ్యక్షులు రాంమ్మోహన్,తదితరులు పాల్గొన్నారు.
పార్లమెంట్‌లో వెంటనే బిల్లు పెట్టాలి
Published Mon, Sep 2 2013 5:12 AM | Last Updated on Fri, Sep 1 2017 10:21 PM
Advertisement
Advertisement