13న జగన్ రాక | ys jagan mohan reddy 13th attend the wedding in Rajahmundry | Sakshi
Sakshi News home page

13న జగన్ రాక

Published Mon, Nov 11 2013 12:50 AM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM

ys jagan mohan reddy  13th attend the wedding in Rajahmundry

కాకినాడ, న్యూస్‌లైన్ :వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 13న  జిల్లాకు రానున్నారు. పార్టీ సీజీసీ సభ్యులు, మాజీ  మంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్ కుమారుడి వివాహవేడుకకు ఆయన హాజరు కానున్నారు. బెయిల్‌పై విడుదలైన అనంతరం, సమైక్యాంధ్ర ఉద్యమ నేపథ్యంలో తొలిసారిగా జిల్లాకు వస్తున్న ఆయన పర్యటనపై చర్చించేందుకు పార్టీ జిల్లాస్థాయి విస్తృత సమావేశాన్ని సోమవారం నిర్వహించనున్నారు. రాజమండ్రి ఉమారామలింగేశ్వర కల్యాణ మండపంలో మధ్యాహ్నం రెండు గంటలకు సమావేశం జరుగుతుందని జిల్లా కన్వీనర్ కుడుపూడి చిట్టబ్బాయి ‘న్యూస్‌లైన్’కు చెప్పారు. జగన్‌కు స్వాగతం పలకడంతోపాటు ఇతర కార్యక్రమాలపై చర్చిస్తామన్నారు. పార్టీకి చెందిన ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యేలు, సీజీసీ సభ్యులు, పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల కో-ఆర్డినేటర్లు, అనుబంధ సంఘాలు, మండల కన్వీనర్లు, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు, ఇతర ముఖ్యనేతలు సమావేశానికి విధిగా హాజరుకావాలని కోరారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement