వైసీపీ ఆధ్వర్యంలో రెండో రోజూ బంద్ సంపూర్ణం
Published Sun, Oct 6 2013 3:11 AM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM
‘పశ్చిమ’ వాసులు నిప్పు కణికలయ్యారు. విభజన నిర్ణయంపై నిరసన సెగలు రగిలిస్తున్నారు. ప్రతి ఒక్కరిలో ఆగ్రహావేశాలు కట్టలు తెంచుకుంటున్నాయి. తెలుగుజాతిని ముక్కలు చేసి తీరుతాం అంటున్న కేంద్ర ప్రభుత్వంపై జనం నిప్పులు చెరుగుతున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన 72 గంటల బంద్ పిలుపును అందుకుని పోరుబాటలో కదం తొక్కుతున్నారు. తెలుగునేలను పరిరక్షించుకుంటామని నినదిస్తున్నారు. సమైక్యాంధ్ర పరిరక్షణ పోరాటం శనివారం వీధివీధినా ఉవ్వెత్తున సాగింది. బంద్ కారణంగా సకలం మూతపడటంతో జనజీవనం స్తంభించింది.
కన్వీనర్, పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు పోలవరంలో సోనియా గాంధీ దిష్టిబొమ్మను దహనం చేశారు. మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా బంద్ సంపూర్ణంగా జరిగింది. వైసీపీ రిలే నిరాహార దీక్షలు నాలుగో రోజు కొనసాగుతున్నాయి. కొయ్యల గూడెంలో వైసీపీ నేతలు ర్యాలీ చేసి రోడ్‌పై బైటాయిం చారు. బయ్యనగూడెంలో వైసీపీ ఆధ్వర్యంలో బంద్ పాటించడంతో పాటు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆమర ణ నిరాహారదీక్షకు సంఘీభావంగా, రాష్ట్రాన్ని సమైక్యం గానే ఉంచాలని కోరుతూ వైసీపీ నాయకులు పోతన శేషు చండిహోమం ప్రారంభించారు. తొమ్మిది రోజులు హోమం కొనసాగుతుంది. ఉండి మండలంలో బంద్ నిర్వహించారు. దుకాణాలు, వాణిజ్య సంస్థలు, ప్రభు త్వ కార్యాలయాలు మూతపడ్డాయి. కలిసిపూడి నుంచి ఉండి వరకు సుమారు నాలుగు కిలోమీటర్లు మాజీ ఎమ్మెల్యే పాతపాటి సర్రాజు పాదయాత్ర నిర్వహించి పలు నిరసన కార్యక్రమాల్లో పాల్గొని మాట్లాడారు.
చింతలపూడిలో రెండవ రోజు బంద్ సంపూర్ణంగా జరిగింది. నియోజకవర్గ సమన్వకర్త కర్రా రాజారావు పాల్గొన్నారు. లింగపాలెంలో బంద్ కొనసాగింది. ధర్మాజీగూడెం, రంగాపురంలో వైసీపీ ఆధ్వర్యంలో రాస్తారోకో, రోడ్ల దిగ్బంధనం, ములగలంపాడులో రాస్తారోకో చేశారు. కామవరపుకోటలో వైసీపీ నాయకు లు, కార్యకర్తలు రాస్తారోకో నిర్వహించారు. జీలుగుమిల్లిలో రాష్ట్ర రహదారిపై టెంట్‌లు వేసి కోలాట ప్రదర్శన, వివిధ రకాల ఆటలతో, వంటావార్పు చేశారు. టి. నరసాపురం, మక్కినవారిగూడెం, బొర్రంపాలెంలో బంద్ చేశారు. టి.నరసాపురంలో రాస్తారోకో, మానవహారం నిర్వహించారు. తణుకు నియోజకవర్గ సమన్వయకర్త చీర్ల రాధ య్య ఆధ్వర్యంలో రెండోరోజు బంద్ విజయవంతమైం ది. అత్తిలి, ఇరగవరం, మండలాల్లో బంద్ కొనసాగిం ది. తాడేపల్లిగూడెంలో మహిళలు సమైక్యాంధ్రకు మద్దతుగా సంతకాల సేకరణ కార్యక్రమాన్ని కొనసాగించారు.
ఉంగుటూరు, నిడమర్రు, భీమడోలు, గణపవరం మండలాల్లో రాస్తారోకో, బంద్ నిర్వహించారు. నారాయణపురం, గొల్లగూడెంలో వంటవార్పు చేశారు. దేవరపల్లిలో ర్యాలీ, వంటావార్పు, ధర్నా చేశారు. రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గ వైసీపీ నేత బొడ్డు అనంత వెంకటరమణ చౌదరి, మాజీ ఎమ్మెల్యే తానేటి వనిత, సమన్వయకర్తలు తలారి వెంకట్రావ్, బి.సువర్ణరాజు పాల్గొన్నారు.కొనసాగుతున్న దీక్షలు : ఏలూరులో వైసీపీ ఆధ్వర్యంలో రిలే నిరాహారదీక్షలు కొనసాగుతున్నాయి. శనివారపుపేటకు చెందిన నాయకులు, కార్యకర్తలు దాదాపు 30 మంది మండల కన్వీనర్ మంచెం మైబాబు ఆధ్వర్యంలో రిలేదీక్ష చేశారు. పాలకొల్లులో రిలే నిరాహార దీక్షలు నాల్గోరోజు శనివారం కొనసాగాయి. దీక్షల్లో యలమంచిలి మండలానికి చెందిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వీరికి పార్టీ నాయకులు ఎమ్మెల్సీ మేకా శేషుబాబు,
మాజీ ఎమ్మెల్యే అల్లు వెంకటసత్యనారాయణ, గుణ్ణం నాగబాబు, ముచ్చర్ల శ్రీరామ్ సంఘీభావం ప్రకటించారు. ఉంగుటూరు నియోజకవర్గ స్థాయిలో చేబ్రోలులో వైసీ పీ జిల్లా కార్యవర్గ సభ్యులు నౌడు వెంకట రమణ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. నరసాపురంలో రిలే నిరాహార దీక్షల్లో మొగల్తూరు మం డ లం పాతపాడు సర్పంచ్ కామాని ఉమామహేశ్వరావు తో పాటు 40 మంది దీక్షలు చేశారు. దెందులూలూరు నియోజకవర్గం గోపన్నపాలెంలో రామారావుగూడెం, శ్రీరామవరం, చల్లచింతలపూడి, గాలాయిగూడెం గ్రామాలకు చెందిన 50 మంది నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నియోజకవర్గ సమన్వయకర్తలు అశోక్‌గౌడ్, పీవీ రావు, కొఠారు రామచంద్రరావు సంఘీభావం తెలిపారు.
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి మద్దతుగా తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఆటో యూనియన్ నాయకులు వైసీ పీ సమన్వయకర్త తోట గోపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే దీక్షల్లో పాల్గొన్నారు. కొవ్వూరులో రిలే దీక్షలు నాలుగోరోజు కొనసాగాయి. శనివారం సుమారు 30 మంది వైసీపీ నాయకులు, కార్యకర్తలు దీక్షలో పాల్గొన్నా రు. మాజీ ఎమ్మెల్సీ కోడూరి శివరామకృష్ణ, మండల పార్టీ సమన్వయకర్త ముళ్లపూడి కాశీవిశ్వనాథ్, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు పరిమి హరిచరణ్ పాల్గొన్నా రు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ఆమరణ దీక్షకు మద్దతుగా పెనుమంట్ర మండలం మార్టేరు సెంటరులో ఆపార్టీ నాయకులు దీక్షా శిబిరం ఏర్పాటు చేశారు. దీక్షలో నియోజకవర్గ సమన్వకర్త కండిబోయిన శ్రీనివాసు, ఆచంట మండల సమన్వయకర్త గుడాల విజయబాబుతో సహా 12 మంది పాల్గొన్నారు. శిబిరాన్ని సమన్వయకర్త మల్లుల లక్ష్మీనారాయణ సందర్శించి సంఘీభావం తెలిపారు. వీరవాసరంలో వైసీపీ ఆధ్వర్యంలో దీక్షలు కొనసాగుతున్నాయి. భీమవరంలో వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రకాశంచౌక్‌లో రిలే దీక్షలు చేశారు. ఉండి సెంటర్లో వైసీపీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేశారు.
Advertisement