రేపు జగన్ రాక
Published Tue, Dec 3 2013 12:50 AM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM
చెన్నై, సాక్షి ప్రతినిధి: అన్నపూర్ణ వంటి ఆంధ్రప్రదేశ్‌ను రెండు ముక్కలు చేసే ప్రయత్నాలు తమిళనాడులోని తెలుగువారిని సైతం ఎంతగానో బాధిస్తున్నాయి. పెద్ద ఎత్తున నిరసనోద్యమాలను సైతం నిర్వహించారు. విడిపోకుండా తెలుగు రాష్ట్రాన్ని కాపాడుకోవాలని ముక్త కంఠంతో కోరుతున్నారు. ఈ దశలో తెలుగువారి మనోభావాలకు అనుగుణంగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమైక్యాంధ్ర ఉద్యమాన్ని భుజానికెత్తుకోవడం తమిళనాడులోని తెలుగువారందరినీ సంతోషంలో ముంచెత్తుతోంది. జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన సమైక్య శంఖారావానికి మద్దతు ప్రకటించేందుకు వారందరూ సిద్ధమవుతున్నారు సమైక్యాంధ్ర లక్ష్యసాధన కోసం దేశమంతా పర్యటిస్తూ జాతీయ నాయకుల మద్దతు కూడగడుతున్న ఆయన త్వరలో చెన్నైకి చేరుకుంటున్నట్లు సమాచారం అందడంతో వారి అనందానికి అవధులు లేకుండా పోయాయి. నేడో రేపో వస్తారని ప్రచారం జరగడంతోనే నగరమంతా ఫ్లెక్సీలు వెలిశాయి. విమానాశ్రయం నుంచి నగరంవైపు, మౌంట్‌రోడ్డు, టీనగర్, ఆశోక్ నగర్ తదితర ప్రాంతాల్లో తెలుగు, తమిళ భాషల్లో ఏర్పాటు చే సిన వందలాది ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నారుు. విమానాశ్రయంలోనే జగన్‌కు భారీ ఎత్తున స్వాగతం పలికేందుకు సన్నాహాలు ప్రారంభించారు. తమ అభిమాన నేతను కళ్లారా చూడాలన్న తాపత్రయంతో రాష్ట్రంలోని అభిమానులు వైఎస్ జగన్ రాకకోసం ఎదురుచూస్తున్నారు.నిర్వహించారు.
విడిపోకుండా తెలుగు రాష్ట్రాన్ని కాపాడుకోవాలని ముక్త కంఠంతో కోరుతున్నారు. ఈ దశలో తెలుగువారి మనోభావాలకు అనుగుణంగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమైక్యాంధ్ర ఉద్యమాన్ని భుజానికెత్తుకోవడం తమిళనాడులోని తెలుగువారందరినీ సంతోషంలో ముంచెత్తుతోంది. జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ఈ సమైక్య శంఖారావానికి మద్దతు ప్రకటించేందుకు తమిళనా డులోని తెలుగువారు సిద్ధమవుతున్నారు సమైక్యాంధ్ర లక్ష్యసాధన కోసం దేశమంతా పర్యటిస్తూ జాతీయ నాయకుల మద్దతు కూడగడుతున్న ఆయన బుధవారం చెన్నైకి చేరుకుంటున్నట్లు సమాచారం అందడంతో వారి అనందానికి అవధులు లేకుండా పోయాయి. బుధవారం ఉదయం 9.30 గంటలకు జగన్ మోహన్‌రెడ్డి చెన్నై విమానా శ్రయం చేరుకుని మధ్యాహ్నం 2 గంటలకు సచివాయంలో సీఎం జయలలితను కలుసుకుంటారు. ఈ నేపథ్యంలో ఆయనకు స్వాగతం తెలిపే ఫ్లెక్సీలు నగరమంతా వెలిశాయి. విమానాశ్రయం నుంచి నగరంవైపు, మౌంట్‌రోడ్డు, టీనగర్, ఆశోక్ నగర్ తదితర ప్రాంతాల్లో తెలుగు, తమిళ భాషల్లో ఏర్పాటు చేసిన వందలాది ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నారుు. విమానాశ్రయంలోనే జగన్‌కు భారీ ఎత్తున స్వాగతం పలికేందుకు సన్నాహాలు ప్రారంభించారు. రాష్ట్రంలోని వైఎస్ అభిమానులు వైఎస్ జగన్ రాకకోసం ఎదురుచూస్తున్నారు. వైఎస్సార్ సీపీ చెన్నై విభాగం నాయ కులు శరత్‌కుమార్, జాకీర్ హుస్సేన్, శరవణన్, మాజీ ఎమ్మెల్సీ, పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు బి.రాఘేవేంద్రరెడ్డి తదిత రులు స్వాగత ఏర్పాట్లు చేస్తున్నారు.
Advertisement