రచ్చ రచ్చ!
Published Thu, Nov 21 2013 3:26 AM | Last Updated on Sat, Sep 2 2017 12:48 AM
బొబ్బిలి, న్యూస్‌లైన్: సమైక్యాంధ్ర ఉద్యమం నుంచి బయట పడి ప్రజల్లోకి దర్జాగా వెళదామనుకున్న అధికార పార్టీ నాయకులకు ఎక్కడికక్కడే పరాభ ం ఎదురవుతోంది. రెండు నెలలకు పైగా ప్రజలకు దూరంగా ఉన్న ఆ పార్టీ నాయకులు రచ్చబండ ద్వారా ప్రజల్లోకి వెళ్లేందుకు చేస్తున్న యత్నాలు బెడిసికొడుతున్నాయి. ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఇలా ప్రజాప్రతినిధులను నిలదీస్తుండడంతో వారికి పరాభవం తప్పడం లేదు.. సభలన్నింటిలోనూ అధికారులు, ప్రజాప్రతినిధుల నిలదీత, తోపులాట, ఘర్షణ, కొట్లాట వంటి సంఘటనలు చోటుచేసుకోవడడంతో జిల్లాలో ‘రచ్చబండ’లు రచ్చరచ్చగా మారుతున్నాయి. ఈ నెల 11 నుంచి రచ్చబండ సభలు ప్రారంభమయ్యా యి. అధికార పార్టీకి చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలతో పాటు అధికారంలో లేని నియోజకవర్గ స్థాయి నాయకులు కూడా సభలకు అధికారికంగా హాజరవుతున్నారు. జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు లేని నియోజకవర్గాల్లో మంత్రి బొత్స ఆ పార్టీకి చెందిన స్థానిక నాయకులకు కమిటీల్లో స్థానం కల్పించారు.
ఈ సమావేశాలు రాజకీయ రచ్చబండలుగా మారి పోవడంతో ప్రజల్లోంచి తిరుగుబాటు కూడా అదే విధంగా వస్తోంది. బుధవారం విజయనగరం, చీపురుపల్లి, గరివిడి తదితర ప్రాంతాల్లో జరిగిన ఈ సమావేశాల్లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. విజయనగరంలోని రాజీవ్ క్రీడా మైదానంలో జరిగిన మున్సిపల్ రచ్చబండలో ప్రజలు మూకుమ్మడిగా ఎంపీ, ఎమ్మెల్సీలను నిలదీశారు. సమస్యలు తీర్చలేని సభలు ఎందుకం టూ దరఖాస్తులను పైకి చూపిస్తూ నిరసన తెలిపారు. గత రచ్చబండ కార్యక్రమాల్లో ఇళ్లపట్టాలు, రేషన్‌కార్డులు, ఫించన్లకు దరఖాస్తులు చేసుకున్నా ఎందుకు మంజూరు చేయలేదని ప్రశ్నించారు. దీంతో ఎంపీ ఝాన్సీలక్ష్మి తీవ్ర అసహనం వ్యక్తంచేశారు. చీపురుపల్లి మండలంలో ఇటకర్లపల్లి గ్రామంలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు వాస్తవాలను ప్రశ్నించినందుకు ఆయనపై కాంగ్రెస్ వర్గీయలు దాడి చేశారు. గరివిడిలోనూ కొట్లాట జరిగింది. ఇలాగే దాదాపు అన్ని చోట్ల అధికారపార్టీ నేతలకు పరాభవాలు ఎదురవుతుండడంతో వారు దాడులకు దిగుతున్నారు.
అన్ని చోట్ల అదే తీరు...
మూడో విడతలో భాగంగా జిల్లాలో ఇప్పటి వరకూ జరిగిన రచ్చబండ సమావేశాలను పరిశీలిస్తే దాదాపుఇలాగే సాగాయి. పూసపాటిరేగ మండలం రెల్లివలస, చల్లవానితోట గ్రామాల్లోని రచ్చబండలో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. గుర్ల మండలంలోని చింతలపేట, ఆనందపురం, నడుపూరు, భూపాలపురం, కోటగండ్రేడు, కలవచర్ల గ్రామాల్లోని సమావేశాలు గందరగోళానికి దారి తీశాయి. బొబ్బిలి నియోజకవర్గం బాడంగి మండలం వాకాడ రచ్చబండ సభలో రెవెన్యూ అధికారులు రేషన్‌కార్డుల లబ్ధిదారుల జాబితా చదువుతుండగా ఆక్కడే ఉన్న వైఎస్‌ఆర్ సీపీకి చెందిన మాజీ ఎంపీటీసీ, సర్పంచ్‌లైన పూడి బ్రదర్స్ అధికారుల తీరును నిలదీశారు. ఏకపక్షంగా అధికార పార్టీకి చెందిన వారికే రేషన్‌కార్డులు మంజూరుచేసి అర్హులకు అన్యాయం చేశారని తహశీల్దార్ రమ ణమూర్తిపై మండిపడ్డారు.
దీంతో అక్కడే ఉన్న కాంగ్రెస్‌కు చెందిన గొట్టాపు రామారావు తదితరులు అధికారులను ప్రశ్నిస్తారా ఆంటూ వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా కొద్దిసేపు వారిమధ్య తోపులాట జరిగి కొట్టుకునే పరిస్థితి ఏర్పడింది. బాడంగిలో జరిగిన సభలో డీసీసీబీ డెరైక్టరు కిరణ్ , వైఎస్‌ఆర్ సీపీ నేతలు పరస్పరం విమర్శలు చేసుకున్నారు. రామభద్రపురం మండలంలోని మామిడివలస గ్రామం లో ఈ నెల 12న నిర్వహించిన రచ్చబండలో అధికారులను గ్రామస్తులు నిలదీశారు. మండ ల కేంద్రంలో ఈనెల 13న నిర్వహించిన రచ్చబండ రచ్చరచ్చగా సాగింది. ఒకానొక దశలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడడంతో పోలీసులు రంగ ప్రవేశం చేయవలసి వచ్చింది. ఎస్‌కోట నియోజకవర్గంలోని జామి మండలంలో కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది. గజపతినగరం నియెజకవర్గంలోని పెదమానాపురం గ్రామంలో నిర్వహించిన రచ్చబండ రసాభాసగా సాగింది.
Advertisement
Advertisement