Racchabanda
-
కోవిడ్ ప్రభావం తగ్గగానే రచ్చబండ
దేశానికి స్వాతంత్య్రం వచ్చిన రోజే రాష్ట్రంలో పేదలకూ స్వాతంత్య్రం వస్తుందని భావిస్తున్నాను. అందుకే ఆ రోజున (ఆగస్టు 15) రాష్ట్ర వ్యాప్తంగా నిరుపేద కుటుంబాలకు ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేస్తాం. ఆ మేరకు అధికారులు సిద్ధం కావాలి. రాష్ట్రంలో దాదాపు 1.50 కోట్ల కుటుంబాలు ఉండగా, ఇప్పుడు 30 లక్షల నిరుపేద కుటుంబాలకు ఇళ్ల స్థలాల పట్టాలు ఇస్తున్నాం. ఆ విధంగా 20 శాతం కుటుంబాలకు లబ్ధి చేకూరుస్తున్నాం. ఇప్పటికే 97.83 శాతం ప్లాట్ల విభజన పూర్తయ్యింది. మిగతా వాటిని కూడా వెంటనే పూర్తి చేయాలి. – సీఎం వైఎస్ జగన్ ‘కరోనా తగ్గుముఖం పట్టగానే రచ్చబండ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాను. ప్రజల సమస్యలు, పథకాలు అమలవుతున్న తీరును స్వయంగా పరిశీలించేందుకు గ్రామాల్లో పర్యటిస్తాను. ప్రజలు పెట్టుకునే అర్జీలు నిర్ణీత సమయంలో పరిష్కారం అవుతున్నాయా లేదా అన్న దానిపై కలెక్టర్లు ఎప్పటికప్పుడు సమీక్ష చేయాలి’ – ట్విట్టర్లో సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: కోవిడ్ ప్రభావం తగ్గగానే రచ్చబండ కార్యక్రమం నిర్వహిస్తానని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రకటించారు. గ్రామాల పర్యటన ద్వారా ప్రభుత్వ పథకాల అమలు, ప్రజల సమస్యల పరిష్కారం తీరును స్వయంగా తెలుసుకుంటానని స్పష్టం చేశారు. అప్పటికల్లా అర్హులైన ప్రతి కుటుంబానికి ఇంటి స్థలం అందేలా చూడాలని జిల్లా అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. స్పందన కార్యక్రమంలో భాగంగా కలెక్టర్లు, జేసీలు, ఎస్పీలతో మంగళవారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కోవిడ్, సీజనల్ వ్యాధులు, పేదలకు ఇళ్ల స్థలాల పట్టాలు, ఇసుక సరఫరా, వ్యవసాయం, ఉపాధి హామీ పనులు, పాఠశాలల్లో నాడు–నేడు పనులపై సమీక్షించి పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఇళ్ల స్థలాల కోసం రూ.22,355 కోట్లు ► రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా నిరుపేదల ఇళ్ల స్థలాల కోసం మొత్తం రూ.22,355 కోట్లు ఖర్చు చేస్తున్నాం. 30 లక్షల పేద కుటుంబాలకు ఇళ్ల పట్టాలు ఇవ్వబోతున్నాం. ఇందుకోసం 66,842 ఎకరాల భూముల్లో ఇళ్ల స్థలాలు లే అవుట్ వేశాం. ► ఇందులో రూ.7,700 కోట్ల విలువైన 25,462 ఎకరాల ప్రభుత్వ భూమి, రూ.9,200 కోట్ల విలువైన 23,262 ఎకరాల ప్రైవేటు భూమి, రూ.1350 కోట్ల విలువైన 4,457 ఎకరాల ల్యాండ్ పూలింగ్ భూములు, రూ.325 కోట్ల విలువైన 1,074 ఎకరాల సీఆర్డీయే భూములు, రూ.810 కోట్ల విలువైన 2,686 ఎకరాల టిడ్కో భూమి, పొజిషన్ సర్టిఫికెట్ల ద్వారా సేకరించిన రూ.2,970 కోట్ల విలువైన 9,900 ఎకరాల భూములు ఉన్నాయి. రాష్ట్రంలో ఏనాడూ ఈ స్థాయిలో ఇళ్ల స్థలాలు ఇవ్వలేదు. ఏ ప్రభుత్వం కూడా ఇంత ఖర్చు చేయలేదు. ఇళ్ల స్థలాల పంపిణీ నిరంతర ప్రక్రియ ► సచివాలయాల్లో ప్లాట్ల లబ్ధిదారుల జాబితాలు డిస్ప్లే అవుతున్నాయా? లేదా? అన్నది అధికారులు చెక్ చేయాలి. ఇంకా ఎవరైనా మిగిలిపోయిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. వారికి అర్హత ఉంటే, గతంలో చెప్పిన విధంగా 90 రోజుల్లో ఇళ్ల స్థలాల పట్టాలు ఇస్తాం. ఇది నిరంతర ప్రక్రియ. ► పెన్షన్లు, రేషన్ కార్డులు, ఇళ్ల స్థలాల పట్టాలపైనే అత్యధికంగా దరఖాస్తులు స్పందనలో వస్తున్నాయన్న విషయాన్ని అధికారులు గుర్తు పెట్టుకోవాలి. నిర్ణయించుకున్న సమయంలోగా ఆ దరఖాస్తులను పరిష్కరిస్తున్నామో లేదో చూడాలి. కోవిడ్ పరిస్థితులు తగ్గగానే రచ్చ బండ కార్యక్రమం ద్వారా గ్రామాల్లో పర్యటిస్తా. అప్పటికల్లా అర్హులైన ప్రతి కుటుంబానికి ఇంటి స్థలం అందేలా చూడాలి. ► పేదల ఇళ్ల స్థలాల పంపిణీ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 19 వేల లేఅవుట్లు అభివృద్ధి చేయగా, వాటిలో 13 వేల లేఅవుట్లు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి. వాటన్నింటిలో వన మహోత్సవం (జగనన్న పచ్చతోరణం)లో భాగంగా మొక్కలు నాటాలి. అన్ని లేఅవుట్లలో వన మహోత్సవం కార్యక్రమం చేపట్టాలి. ఇసుక నిల్వలు పెంచాలి ► ఆర్డర్ పెట్టిన 72 గంటల్లో ఇసుక డెలివరీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఉభయ గోదావరి, గుంటూరు జిల్లాలలో బ్యాక్లాగ్ ఉంది. స్పెషల్ డ్రైవ్ చేపట్టి రెండు మూడు రోజుల్లో మొత్తం క్లియర్ చేయాలి. ► వర్షాకాలంలో పనుల కోసం 52.5 లక్షల టన్నుల ఇసుక అందుబాటులో ఉంది. వర్షాల వల్ల రీచ్‌లు మునిగిపోయే పరిస్థితులు వస్తాయి కాబట్టి, ఎక్కడెక్కడ అవకాశం ఉందో అక్కడ రీచ్‌లు ప్రారంభించి ఇసుక నిల్వలు పెంచాలి. వైఎస్సార్ హెల్త్ క్లినిక్ పనులు ఊపందుకోవాలి ► గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్సార్ రూరల్ హెల్త్ క్లినిక్స్, వైఎస్సార్ అర్బన్ హెల్త్ క్లినిక్స్ పనులు ఊపందుకోవాలి. దీనిపై జాయింట్ కలెక్టర్లు రోజూ సమీక్షించాలి. కలెక్టర్లు రోజు విడిచి రోజు వాటి నిర్మాణాలపై దృష్టి పెట్టాలి. వాటి నిర్మాణం కోసం ఇంకా పలు చోట్ల స్థలాలు గుర్తించాల్సి ఉంది. కలెక్టర్లు వెంటనే ఆ పని పూర్తి చేయాలి. ► కోవిడ్ లాంటి విపత్తులను ఎదుర్కోవాలంటే వైఎస్సార్ రూరల్, అర్బన్ హెల్త్ క్లినిక్స్ చాలా అవసరం. అందువల్ల వాటిపై శ్రద్ధ చూపాలి. అదే విధంగా కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణం కోసం స్థలాల గుర్తింపును వెంటనే పూర్తి చేయాలి. మనబడి నాడు–నేడు పనులు పూర్తి చేయాలి ► ఈ ఏడాది సెప్టెంబరు 5న స్కూళ్లు ప్రారంభం కానున్న నేపథ్యంలో నాడు–నేడు కింద చేపట్టిన అన్ని సివిల్ పనులు ఆగస్టు 31 నాటికి పూర్తి కావాలి. వాటిపై ప్రతి రోజూ జేసీ రివ్యూ చేయాలి. కలెక్టర్ రెండు రోజులకు ఒకసారి సమీక్ష నిర్వహించాలి. ఎరువులు, పురుగు మందులు సకాలంలో అందాలి ► రాష్ట్రంలో ఈ ఏడాది 39 శాతం అధిక వర్షపాతం నమోదైంది. 10 జిల్లాలో అధికంగా, 3 జిల్లాల్లో సాధారణ వర్షం కురిసింది. ఇది చాలా మంచి పరిణామం. అందువల్ల క్వాలిటీ విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు రైతు భరోసా కేంద్రాల ద్వారా అందేలా జాయింట్ కలెక్టర్లు చర్యలు తీసుకోవాలి. ► క్వాలిటీ విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అందించే బాధ్యత ప్రభుత్వానిదని మాట ఇచ్చాం. ఆ మేరకు అవి సకాలంలో ఇస్తున్నారా? లేదా? అన్నది పరిశీలించాలి. ► ఇ–క్రాపింగ్ కోసం జాయింట్ అజమాయిషీ సరిగ్గా జరుగుతుందా? లేదా? అన్నది చూడాలి. సంబంధిత జేసీలు దీనిపై దృష్టి పెట్టాలి. గ్రామ సచివాలయాల్లోని అగ్రికల్చర్, రెవిన్యూ అసిస్టెంట్లు, సర్వేయర్లు ఆ ప్రక్రియ పూర్తి చేయాలి. ► కౌలు రైతుల కోసం తీసుకొచ్చిన సాగు ఒప్పందం అమలు చేయాలి. దాని వల్ల తమకు ఎలాంటి నష్టం జరగదని రైతులకు అవగాహన కల్పించాలి. తద్వారా కౌలు రైతులకు రుణాలు అందేలా చూడాలి. ఇళ్ల స్థలాలను మహిళల పేరుతో రిజిస్ట్రేషన్ చేస్తాం. అన్నింటికీ పక్కా డాక్యుమెంట్లు ఇస్తాం. వాటిలో స్పష్టంగా లబ్ధిదారు పేరు, ప్లాటు, సరిహద్దుల వివరాలు రాయాలి. ఈ ప్రక్రియ అంతా ఆగస్టు 10 నాటికి పూర్తి కావాలి. వ్యవసాయ సలహా కమిటీలు జిల్లా, మండల స్థాయి వ్యవసాయ సలహా కమిటీలు ఏర్పాటు చేశాం. ఆ కమిటీల సమావేశాలు నిర్వహించేలా చూడాలి. ఏ పంటలు వేయాలి? ఏవి వేయకూడదు? మార్కెటింగ్ అవకాశాలు ఏంటి? తదితర అంశాలపై చర్చించాలి. ఏ పంటలు సాగు చేస్తే మంచి ధరలు వస్తాయన్న దానిపై కమిటీలకు సమాచారం ఉంచాలి. ఆ కమిటీల ద్వారా ఆర్బీకేలు, అక్కడ నుంచి రైతులకు ఆ సమాచారం అందాలి. ఆ మేరకు తగిన చర్యలు తీసుకోవాలి. ఆర్బీకేల పరిధిలో రైతుల గ్రూపులు ఏర్పాటు కావాలి. దీని వల్ల వ్యవసాయ పనిముట్లు, యంత్రాలు ఆర్బీకేలకు అందించగలుగుతాం. వ్యవసాయ యాంత్రీకరణ కోసం దాదాపు రూ.1,700 కోట్లు ఖర్చు చేస్తున్నాం. పంటలకు వచ్చే వ్యాధులు, తెగుళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలి. టోల్‌ఫ్రీ నంబర్లు ► పంటల సాగులో వచ్చే కష్టనష్టాలపై తగిన సలహాలు ఇవ్వడానికి 155251 టోల్‌ఫ్రీ నంబర్ ఏర్పాటు చేశాం. ఈ నంబర్ ద్వారా శాస్త్రవేత్తల నుంచి రైతులకు సలహాలు, ఉత్తమ యాజమాన్య పద్ధతులపై సమాచారం ఇస్తున్నారు. ► 20 మంది సైంటిస్టులను కాల్ సెంటర్లో పెట్టాం. ఆర్బీకేల్లో ఎలాంటి సమస్య వచ్చినా 1902కు నివేదించవచ్చు. వెంటనే ఆ సమస్యలపై అధికారులు దృష్టి సారించాలి. కాల్ సెంటర్లు సరిగ్గా పని చేస్తున్నాయా? లేదా? అన్నది అధికారులు స్వయంగా ఫోన్ చేసి పరిశీలించాలి. ► ఈ సమీక్షలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆదిమూలపు సురేష్, సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్ సవాంగ్, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ వైఫల్యాలపై ‘రచ్చబండ’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రతిపక్షాలు పోరుబాట పట్టాయి. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టడానికి నడుం బిగించాయి. ప్రతిపక్షాల నిర్బంధం, కరోనా నియంత్రణ చర్యల్లో సర్కారు నిర్లక్ష్యం వంటి అంశాలపై అధికార టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రజల్లోకి వెళ్లాలని అఖిలపక్ష పార్టీలు నిర్ణయించాయి. ‘రచ్చబండ’పేరిట ప్రజల్లోకి వెళ్లి అన్ని విషయాలు వివరించాలని మంగళవారం టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ నివాసంలో జరిగిన భేటీలో నిర్ణయించాయి. సమావేశానికి టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, సీపీఐఎంఎల్ (న్యూడెమోక్రసీ) నేత గోవర్ధన్ హాజరయ్యారు. కరోనా నియంత్రణ, కార్మికులను ఆదుకునే విషయంలో ప్రభుత్వవైఖరి, ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకోవడం, ముఖ్యమంత్రి సహాయనిధికి వచ్చిన విరాళాలు, ప్రతిపక్షపార్టీలపై ప్రభుత్వ నిర్బంధం తదితర అంశాలపై చర్చించారు. అనంతరం సమావేశ నిర్ణయాలను మీడియాకు వెల్లడించారు. కోవిడ్ కోరల్లో పేదలు: కోదండరాం టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం మాట్లాడుతూ ప్రభుత్వ వైఫల్యాలపై బలమైన కార్యాచరణకు రూపకల్పన చేయాలని సమావేశంలో నిర్ణయించినట్టు చెప్పారు. సచివాలయం కూల్చివేతకు నిరసనగా గన్‌పార్కు వద్ద నిరసన తెలిపేందుకు వెళ్లిన ప్రతిపక్ష నేతలను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. పేదలు కోవిడ్ కారణంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారిని ఆదుకునే నాథుడేలేరని విచారం వ్యక్తం చేశారు. అసంఘటిత రంగ కార్మికులు, చేతివృత్తిదారులు, కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులను ప్రభుత్వం ఇప్పటికైనా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. లేనియెడల వారి పక్షాన ఉద్యమించాలని సమావేశంలో నిర్ణయించినట్టు తెలిపారు. ప్రభుత్వవైఫల్యాలపై ’రచ్చబండ’కార్యక్రమాన్ని నిర్వహిస్తామని, త్వరలోనే దీనిపై స్పష్టత వస్తుందని చెప్పారు. ఏఐసీసీ కార్యదర్శి సంపత్ మాట్లాడుతూ కరోనా కట్టడిలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ప్రభుత్వాసుపత్రులు, వివిధ జిల్లా ఆసుపత్రుల్లో సరైన వసతులు లేవని, తెలంగాణలో భవంతులు కాదు, బతుకులు కావాలన్న నినాదంతో పోరాటం చేస్తామని తెలిపారు. కొత్త భవనాలు అవసరంలేదు: రమణ ఎల్.రమణ మాట్లాడుతూ కరోనాతో ప్రజల్లో ఆత్మస్థైర్యం దెబ్బతిన్నదని, ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కొత్త భవనాలు అవసరం లేదని అన్నారు. ప్రగతిభవన్ ఉద్యోగులకు కరోనా వస్తే ముఖ్యమంత్రి కేసీఆర్ తన ఫామ్‌హౌస్‌కు వెళ్లారని, మరి ఇల్లు లేని పేదలు ఎక్కడికి వెళ్లాలని ప్రశ్నించారు. చాడ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో నిరసన తెలిపే పరిస్థితి కూడా లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఫల్యాలపై వర్చువల్ ర్యాలీలు , రచ్చబండ కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నామని, కలిసి వచ్చే అన్ని పార్టీలను కలుపుకుని ప్రభుత్వంపై ఉద్యమం చేస్తామని చెప్పారు. -
ఇక ప్రజాక్షేత్రంలోకి ముఖ్యమంత్రి జగన్
సాక్షి, అమరావతి : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే పలు సంక్షేమ పథకాలతో ప్రజానేతగా పేరు తెచ్చుకున్న సీఎం వైఎస్ జగన్.. వాటి అమలు, పనితీరును పరిశీలించేందుకు క్షేత్రస్థాయిలో పర్యటించనున్నారు. ఇందుకోసం రచ్చబండ తరహా కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టనున్నారు. ఫిబ్రవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో పర్యటించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయించినట్టు తెలిసింది. క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి వెళ్లి సంక్షేమ పథకాలపై ఫీడ్‌బ్యాక్ తీసుకోవాలన్నదే ఈ పర్యటన ప్రధాన ఉద్ధేశం. -
రచ్చ రచ్చ!
బొబ్బిలి, న్యూస్‌లైన్: సమైక్యాంధ్ర ఉద్యమం నుంచి బయట పడి ప్రజల్లోకి దర్జాగా వెళదామనుకున్న అధికార పార్టీ నాయకులకు ఎక్కడికక్కడే పరాభ ం ఎదురవుతోంది. రెండు నెలలకు పైగా ప్రజలకు దూరంగా ఉన్న ఆ పార్టీ నాయకులు రచ్చబండ ద్వారా ప్రజల్లోకి వెళ్లేందుకు చేస్తున్న యత్నాలు బెడిసికొడుతున్నాయి. ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఇలా ప్రజాప్రతినిధులను నిలదీస్తుండడంతో వారికి పరాభవం తప్పడం లేదు.. సభలన్నింటిలోనూ అధికారులు, ప్రజాప్రతినిధుల నిలదీత, తోపులాట, ఘర్షణ, కొట్లాట వంటి సంఘటనలు చోటుచేసుకోవడడంతో జిల్లాలో ‘రచ్చబండ’లు రచ్చరచ్చగా మారుతున్నాయి. ఈ నెల 11 నుంచి రచ్చబండ సభలు ప్రారంభమయ్యా యి. అధికార పార్టీకి చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలతో పాటు అధికారంలో లేని నియోజకవర్గ స్థాయి నాయకులు కూడా సభలకు అధికారికంగా హాజరవుతున్నారు. జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు లేని నియోజకవర్గాల్లో మంత్రి బొత్స ఆ పార్టీకి చెందిన స్థానిక నాయకులకు కమిటీల్లో స్థానం కల్పించారు. ఈ సమావేశాలు రాజకీయ రచ్చబండలుగా మారి పోవడంతో ప్రజల్లోంచి తిరుగుబాటు కూడా అదే విధంగా వస్తోంది. బుధవారం విజయనగరం, చీపురుపల్లి, గరివిడి తదితర ప్రాంతాల్లో జరిగిన ఈ సమావేశాల్లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. విజయనగరంలోని రాజీవ్ క్రీడా మైదానంలో జరిగిన మున్సిపల్ రచ్చబండలో ప్రజలు మూకుమ్మడిగా ఎంపీ, ఎమ్మెల్సీలను నిలదీశారు. సమస్యలు తీర్చలేని సభలు ఎందుకం టూ దరఖాస్తులను పైకి చూపిస్తూ నిరసన తెలిపారు. గత రచ్చబండ కార్యక్రమాల్లో ఇళ్లపట్టాలు, రేషన్‌కార్డులు, ఫించన్లకు దరఖాస్తులు చేసుకున్నా ఎందుకు మంజూరు చేయలేదని ప్రశ్నించారు. దీంతో ఎంపీ ఝాన్సీలక్ష్మి తీవ్ర అసహనం వ్యక్తంచేశారు. చీపురుపల్లి మండలంలో ఇటకర్లపల్లి గ్రామంలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు వాస్తవాలను ప్రశ్నించినందుకు ఆయనపై కాంగ్రెస్ వర్గీయలు దాడి చేశారు. గరివిడిలోనూ కొట్లాట జరిగింది. ఇలాగే దాదాపు అన్ని చోట్ల అధికారపార్టీ నేతలకు పరాభవాలు ఎదురవుతుండడంతో వారు దాడులకు దిగుతున్నారు. అన్ని చోట్ల అదే తీరు... మూడో విడతలో భాగంగా జిల్లాలో ఇప్పటి వరకూ జరిగిన రచ్చబండ సమావేశాలను పరిశీలిస్తే దాదాపుఇలాగే సాగాయి. పూసపాటిరేగ మండలం రెల్లివలస, చల్లవానితోట గ్రామాల్లోని రచ్చబండలో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. గుర్ల మండలంలోని చింతలపేట, ఆనందపురం, నడుపూరు, భూపాలపురం, కోటగండ్రేడు, కలవచర్ల గ్రామాల్లోని సమావేశాలు గందరగోళానికి దారి తీశాయి. బొబ్బిలి నియోజకవర్గం బాడంగి మండలం వాకాడ రచ్చబండ సభలో రెవెన్యూ అధికారులు రేషన్‌కార్డుల లబ్ధిదారుల జాబితా చదువుతుండగా ఆక్కడే ఉన్న వైఎస్ఆర్ సీపీకి చెందిన మాజీ ఎంపీటీసీ, సర్పంచ్‌లైన పూడి బ్రదర్స్ అధికారుల తీరును నిలదీశారు. ఏకపక్షంగా అధికార పార్టీకి చెందిన వారికే రేషన్‌కార్డులు మంజూరుచేసి అర్హులకు అన్యాయం చేశారని తహశీల్దార్ రమ ణమూర్తిపై మండిపడ్డారు. దీంతో అక్కడే ఉన్న కాంగ్రెస్‌కు చెందిన గొట్టాపు రామారావు తదితరులు అధికారులను ప్రశ్నిస్తారా ఆంటూ వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా కొద్దిసేపు వారిమధ్య తోపులాట జరిగి కొట్టుకునే పరిస్థితి ఏర్పడింది. బాడంగిలో జరిగిన సభలో డీసీసీబీ డెరైక్టరు కిరణ్ , వైఎస్ఆర్ సీపీ నేతలు పరస్పరం విమర్శలు చేసుకున్నారు. రామభద్రపురం మండలంలోని మామిడివలస గ్రామం లో ఈ నెల 12న నిర్వహించిన రచ్చబండలో అధికారులను గ్రామస్తులు నిలదీశారు. మండ ల కేంద్రంలో ఈనెల 13న నిర్వహించిన రచ్చబండ రచ్చరచ్చగా సాగింది. ఒకానొక దశలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడడంతో పోలీసులు రంగ ప్రవేశం చేయవలసి వచ్చింది. ఎస్‌కోట నియోజకవర్గంలోని జామి మండలంలో కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది. గజపతినగరం నియెజకవర్గంలోని పెదమానాపురం గ్రామంలో నిర్వహించిన రచ్చబండ రసాభాసగా సాగింది. -
సోనియా నివాసం వద్ద సీఎం 'రచ్చ' చేయాలి
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు వై. బాబు రాజేంద్రప్రసాద్ ఆరోపించారు. మంగళవారం ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో రాజేంద్రప్రసాద్ మాట్లాడారు. రచ్చబండలో చేసే రచ్చ యూపీఏ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఇంటి ముందు చేయాలని ఆయన సీఎం కిరణ్‌కు సూచించారు. ఢిల్లీలో ధర్నా చేయకుండా ప్రజల సమస్యల కోసం గల్లీలో ఏర్పాటు చేసిన రచ్చబండ కార్యక్రమాలలో సీఎం కిరణ్ రచ్చ చేయడం ఎంత వరకు సబబు అని ఆయన ప్రశ్నించారు. న్యూఢిల్లీలో ధర్నా చేస్తే ఏమైన ప్రయోజనం ఉండవచ్చని అయన అబిప్రాయపడ్డారు. సీఎం కిరణ్ మాటకు కాంగ్రెస్ అధిష్టానం వద్ద విలువ ఉందా అని బాబు రాజేంద్రప్రసాద్ వ్యంగ్యంగా ప్రశ్నించారు. సీఎం మాటకు విలువ లేనప్పుడు ఆయన తన పదవికి రాజీనామా చేస్తే ఉత్తమం అని బాబు రాజేంద్రప్రసాద్ సూచించారు. -
అర్హులందరికీ పథకాలు
సతివాడ (నెల్లిమర్ల), న్యూస్‌లైన్ : జిల్లాలో అర్హులైన ప్రతి ఒక్కరికీ సం క్షేమ పథకాలు అందిస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ హామీ ఇచ్చారు. గురువారం సతివాడలో జరిగిన రచ్చబండ సభలో ఆయన మాట్లాడారు. మూడో విడత రచ్చబండలో జిల్లావ్యాప్తంగా సుమారు 57 వేల రేషన్‌కార్డులు, 28 వేల పింఛన్లు, 55 వేల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసినట్టు తెలిపారు. వచ్చేనెల నుంచి ఎప్పటికప్పుడే అర్హల ను గుర్తించి సంక్షేమ పథకాలు వర్తింపజేస్తామని తెలిపారు. జిల్లాలో సుమారు 10 వేలమందికి ఇంకా ఆధార్‌కార్డులు అందాల్సి ఉందని, త్వరలోనే మరో 340 కేంద్రాలు ఏర్పాటు చేసి, అందరికీ ఆధార్‌కార్డులు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. కాగా మంత్రి లబ్ధిదారులకు హామీల వర్షం కురిపించారు. సభ జరుగుతున్న సేపూ ఆయన ప్రజలను ఆకట్టుకునేందుకు ప్రయత్నించారు. గ్రామస్తు లు అడిగినవన్నీ ఇస్తానని ప్రకటించారు. సభలో ఎవరెవరికి ఏమేం కావాలో చేతులెత్తాలని గ్రామస్తులు అడిగారు. గ్రామానికి గ్రంథాలయం, రచ్చబండ వేదిక మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. అంతకముందు ఎస్సీ కాలనీలో రూ. 7. 50 లక్షలతో నిర్మించనున్న కమ్యూనిటీ భవనానికి మంత్రి శంకుస్థాపన చేశారు. అలాగే గతేడాది రచ్చబండలో దరఖాస్తు చేసుకున్న వారికి రేషన్‌కార్డులు, పింఛన్ల పత్రాలు అందజేశారు. కాగా మంత్రి కాన్వాయ్ వద్ద కొందరు సమైక్యవాదు లు రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా నినా దాలు చేశారు. దీంతో పోలీసులు వారిని వారించడంతో మంత్రి సర్ధి చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు, ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి, డీసీసీబీ ఉపాధ్యక్షుడు చెనమల్లు వెంకటరమణ, ఏఎం సీ చైర్మ న్అంబళ్ళ శ్రీరాములనాయుడు, కలెక్టర్ కాంతిలాల్ దండే, జేసి శోభ, డీఆర్డీఏ పిడి జ్యోతి, పాల్గొన్నారు. -
నేటి నుంచి ‘రచ్చబండ’
శ్రీకాకుళం కలెక్టరేట్, న్యూస్‌లైన్:సుమారు రెండేళ్ల తరువాత రచ్చబండ కార్యక్రమానికి జిల్లా యంత్రాంగం సిద్ధమైంది. ఈ నెల 11వ తేదీ నుంచి 26వ తేదీ వరకూ నిర్వహించే ఈ కార్యక్రమం ఈసారి కేవలం మండల కేంద్రాలకే పరిమితం కానుంది. ఒకనాడు సమస్యలు తెలుసుకునేందుకు ఏర్పడిన రచ్చబండ, నేడు కేవలం కొన్ని రకాల పథకాలను అందజేయడానికే పరిమితమైంది. గతంలో గ్రామాల్లో సైతం రచ్చబండ సభలు నిర్వహించి సమస్యలు తెలుసుకునే వారు. ఈసారి ఆ పరిస్థితి లేదు. కాగా పలు పథకాలను లబ్ధిదారులకు పంపిణీ చేసేలా జిల్లా అధికారులు చర్యలు తీసుకున్నారు. 19,454 పింఛన్లు పంపిణీ జిల్లాలోని 10 నియోజకవర్గాల పరిధిలోని 38 మండలాలు, ఐదు మున్సిపాలిటీలో వివిధ పింఛన్లు 19,454 పంపిణీ చేయనున్నారు. వీటిలో వృద్ధాప్య పింఛన్లు 8,138, వితంతు 9,798, వికలాంగు 1,281, చేనేత కార్మికులు, తొడీ టాపర్స్ 33 పింఛన్లు ఉన్నాయి. గృహాల మంజూరు ఇలా.. జిల్లాకు 31,638 ఇళ్లు మంజూరయ్యాయి. వీటిలో ఆమదాలవలస నియోజకవర్గానికి 2,669, ఎచ్చెర్లకు 3,832, శ్రీకాకుళం 1,951, రాజాం 5,475, నరసన్నపేట 2,740, పాలకొండ 3,250, పాతపట్నం 4,256, పలాస 2,635, టెక్కలి 2,192, ఇచ్ఛాపురం నియోజకవర్గానికి 1558 ఇళ్లు చొప్పున మంజూరయ్యాయి. కొత్త రేషన్‌కార్డులు జిల్లాకు కొత్త రేషన్ కార్డులను కూడా మంజూరు చేసినట్టు అధికారులు చెబుతున్నారు. వీటిలో ఇచ్ఛాపురం నియోజకవర్గానికి 2,213, టెక్కలి 4007, పలాస 2,438, పాతపట్నం 3,035, పాలకొండ 5,745, ఆమదాలవలస 4,351, ఎచ్చెర్ల 5,097, శ్రీకాకుళం 4,375, రాజాం 7,584, నరసన్నపేట నియోజకవర్గానికి 1960 రేషన్‌కార్డులు మంజూరయ్యాయి. ఇవి కాకుండా కార్డుదారులకు కొత్త సభ్యులుగా 5,689 మందిని చేర్చినట్టు అధికారుల తెలిపారు. -
నేటి నుంచి రచ్చబండ
విజయనగరం కలెక్టరేట్, న్యూస్‌లైన్: రెండేళ్లుగా ప్రజాసమస్యలు పట్టని పాలకులు తమ ఉనికి కోసం రచ్చబండ పేరుతో సోమవారం నుంచి ప్రజల్లోకి వస్తున్నారు. వాస్తవానికి ఈ కార్యక్రమ నిర్వహణలో జిల్లా ఇన్చార్జ్ మంత్రికి విశిష్ట అధికారాలు కట్టబెట్టారు. మండల స్థాయి కమిటీల నియామకం కూడా ఇన్చార్జ్ మంత్రి సూచనల మేరకే జరగాలని ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. అయితే జిల్లా ఇన్చార్జ్ మంత్రి పినిపే విశ్వరూప్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇటీవల చేరారు. అప్పటి నుంచి ఇన్చార్జి మంత్రి పోస్టు ఖాళీ అయ్యింది. దీంతో జిల్లా స్థాయిలో రచ్చబండ కార్యక్రమం చప్పగా సాగనుంది. సోమవారం నుంచి రచ్చబండ ప్రారంభం అవుతున్నప్పటికీ ఇంకా షెడ్యూల్ ఖరారు చేయలేదు. విజయనగరంలో ఖరారు కాని షెడ్యూల్... వాస్తవానికి రచ్చబండ కార్యక్రమం ప్రారంభానికి ముందే సంబంధిత ఎమ్మెల్యేల నుంచి తేదీ లు నిర్ణయించాలని ప్రభుత్వం సూచించింది. ఇంతవరకూ కొంతమంది అధికారులు ఎమ్యెల్యేల వద్దకే వెళ్లలేదు. ఒక వేళ ముందు తేదీలు ఖరారు చేసినప్పటికీ పరిస్థితిని బట్టి తేదీలు మార్పు చేసుకోవచ్చు. విజయనగరానికి పూసపాటి అశోక్‌గజపతిరాజు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయనను ఇంతవరకూ మండలస్థాయి అధికారులు కలవలేదు. ప్రభుత్వం నుంచి వచ్చిన మార్గదర్శకాలు అందజేశారే తప్ప కార్యక్రమానికి సంబంధించి షెడ్యూల్ కోసం ఇంతవరకూ చర్చించలేదు. సోమవారం కలుస్తామని అధికారులు చెప్పడం విశేషం. పెండింగ్‌లో గత దరఖాస్తులు..... గత రెండు విడతల్లో జరిగిన రచ్చబండ కార్యక్రమంలో రేషన్‌కార్డుల కోసం 75వేల దరఖాస్తులు అందాయి. వీటిలో అర్హమైనవి 65వేలుగా గుర్తించారు.అయితే ప్రస్తుతం జరుగుతున్న రచ్చబండ కార్యక్రమంలో కేవలం 29వేల కొత్తకార్డులు,పేర్లు చేర్పులకు సంబంధించి 15,536 మాత్రమే అందజేయనున్నారు. అలాగే వివిధ రకాల పింఛన్ల కోసం జిల్లావ్యాప్తంగా 50,860 దరఖాస్తులు అందాయి. వీటిలో ప్రస్తుతం 28,194 పింఛన్ల పంపిణీకి మాత్రమే ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే ఇందిర మ్మ ఇళ్లకు సంబంధించి లక్షా 10వేల దరఖాస్తులు అందాయి. వాటిలో అధికారులు సర్వే చేసి 87వేలకు పైగా అర్హమైనవిగా గుర్తించారు. వీటిలో ప్రస్తుతం 55,335 మందికి మాత్రమే మంజూరు పత్రాలు అందజేయనున్నారు. జిల్లాలో రచ్చబండ జరుగుతుందిలా... జిల్లాలో 34 మండలాలు, నాలుగు మున్సిపాల్టీలతో పాటు ఒక నగర పంచాయతీ ఉంది. వీటిలో మున్సిపాల్టీలు, నగర పంచాయతీ సహా 13 రచ్చబండలు కేవలం మండల కేంద్రాల్లోనే జరుగుతాయి. మిగిలిన 21 మండలాల్లో పంచాయతీల వారీగా రచ్చబండ కార్యక్రమాలు జరగనున్నాయి.తొలిరోజు రామభద్రపురం, దత్తిరాజేరు, చీపురుపల్లి, డెంకాడ మండలాల్లో రచ్చబండ కార్యక్రమాలు జరగనున్నాయి. మండల కేంద్రాల్లో మాత్రమే రచ్చబండలు జరగనున్న మండలాలివే. కొమరాడ,గుమ్మలక్ష్మీపురం, జియ్యమ్మవలస, గరుగుబిల్లి, పార్వతీపురం, కురుపాం, ఎస్‌కోట, వేపాడ, ఎల్కోట, కొత్తవలస, సీతానగరం, బలిజిపేట,విజయనగరం. ప్రభుత్వ పథకాల పట్ల అవగాహన కల్పించడానికి నియోజకవర్గానికో ప్రచార రథంతో పాటు, కళాజాతాలు ఏర్పాటు చేస్తున్నారు. -
రచ్చబండకు రె‘ఢీ’
అరండల్‌పేట (గుంటూరు), న్యూస్‌లైన్: జిల్లాలో ‘రచ్చబండ’మూడో విడత సోమవారం నుంచి ఈనెల 26 తేదీ వరకు నిర్వహించనున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యే ఈ కార్యక్రమం సజావుగా నిర్వహించేందుకు అధికారులు ప్రయత్నాలు ప్రారంభించారు. రేషన్‌కార్డులు, పింఛన్లు, ఇళ్ల మంజూరు, ఎస్సి,ఎస్టి ఇళ్లకు విద్యుత్ బకాయిలు తదితర అంశాలపై రచ్చబండ నిర్వహించనున్నారు. వివిధ సమస్యలపై ప్రభుత్వ నిర్లిప్తతపై రచ్చబండ వేదికగా నిలదీసేందుకు ప్రజలు ఎదురుచూస్తున్నారు. అధికారుల్లో కలవరం.. రచ్చబండకు హాజరయ్యేం దుకు ప్రజాప్రతినిధులు, అధికారుల్లో కలవరపడుతున్నారు. రెండో విడతలో ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులను పరిష్కరించేందుకు సుమారు రెండేళ్లు తీసుకోవడం, వచ్చిన దరఖాస్తుల్లో కొన్ని మాత్రమే పరిష్కరించడంతో మిగిలిన వారికి ఏం సమాధానం చెప్పాలో అర్ధం కాక అధికారులు తలలుపట్టుకుంటున్నారు. జిల్లాలో తుఫానుకు పంట కోల్పోయిన రైతులు సైతం అధికారులను పరిహారం కోసం నిలదీసే అవకాశం ఉంది. జిల్లాలో 56, 838 కొత్త రేషన్‌కార్డులు పంపిణీ చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. రెండోవిడతలో వచ్చిన పింఛన్లు, ఇళ్ల మంజూరు లబ్ధిదారులకు అందజేయనున్నారు. జిల్లాలో 56,838 రేషన్‌కార్డులు పంపిణీ.. జిల్లాలో 56, 838 కొత్త రేషన్‌కార్డులు పంపిణీ చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. రెండోవిడత రచ్చబండలో వచ్చిన పింఛన్లు ఇళ్ల మంజూరు పత్రాలు లబ్ధిదారులకు అందజేయనున్నారు. నగరంలో తూర్పు, పశ్చిమ నియోజకవర్గంలో రచ్చబండ నిర్వహించేందుకు కార్పొరేషన్ అధికారులు సిద్ధమయ్యారు. మొదటి, రెండో విడత వచ్చిన 37,744 రేషన్‌కార్డుల దరఖాస్తులను పరిశీలించిన అధికారులు తూర్పు నియోజకవర్గం పరిధిలో 7,641 , పశ్చిమ నియోజకవర్గం పరిధిలో 2,997 కొత్త రేషన్‌కార్డులు పంపిణీ చేయనున్నారు. ఇళ్ల నిర్మాణాల కోసం 1431 దరఖాస్తులు రాగా, వాటిలో 1037 మంజూరు చేశారు. తూర్పులో 1885, పశ్చిమలో 800 మందికి పింఛన్లు మంజూరు చేశారు. ఎస్సి గృహాలకు విద్యుత్ బకాయిల కింద రూ.4.98 లక్షలు, ఎస్టి ఇళ్లకు విద్యుత్‌బకాయిల కింద రూ.5.15 లక్షలు మంజూరు చేశారు. కళాజాత ప్రచారం.. కొరిటెపాడు (గుంటూరు): రచ్చబండ సభలకు కళాజాత కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ఎస్.సురేశ్‌కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. కళాజాత బృందాలు మండల కేంద్రాలతోపాటు పురపాలక సంఘం, నగర కార్పొరేషన్ పరిధిలో వార్డు సభలకు రచ్చబండ కార్యక్రమంలో వివిధ ప్రభుత్వ పథకాల మంజూరు గురించి తెలియజేస్తారని పేర్కొన్నారు. 14 వీధి నాటకాలు, ఐదు బుర్రకథలు, మూడు హరికథ బృందాలను ఎంపిక చేసినట్లు తెలిపారు. ఒక్కో నియోజకవర్గానికి ఒక్కో బృందాన్ని కేటాయించినట్లు పేర్కొన్నారు. కళాకారుల బృందం ఎంపీడీవో లేదా మున్సిపల్ కమిషనర్‌కు ఒక రోజు ముందుగా రిపోర్టు చేయాల్సి ఉంటుందని తెలిపారు. -
రచ్చబండ టెన్షన్!
ఏలూరు, న్యూస్‌లైన్ : ఎన్నికల సీజన్ తరుముకొస్తుండటంతో ప్రజలను ఆకట్టుకునేందుకు ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. ఈ దిశగా 11వ తేదీ నుంచి నెలాఖరు వరకు మూడవ విడత రచ్చబండ నిర్వహించాలని నిర్ణయించింది. ఇటీవల సమైక్యాంధ్ర పరిరక్షణ ఉద్యమంతో రెండు నెలలుపాటు పాలన స్తంభించింది. దీనికితోడు భారీ వర్షాలు, వరదలతో జిల్లా అతలాకుతలమైంది. భారీగా పంట నష్టపోయిన రైతులను సత్వరం ఆదుకునే చర్యలు ఏమాత్రం కానరాలేదు. ఇంకా నష్టం అంచనాలు తయారీకి యంత్రాంగం సన్నద్ధం కాలేదు. ఈ తరుణంలో రచ్చబండ ప్రకటన అధికారులకు నిద్రలేకుండా చేస్తోంది. ప్రజల నుంచి నిలదీతలపర్వం తప్పదన్న భయాందోళన వారిలో వ్యక్తమవుతోంది. రేషన్‌కార్డుల పంపిణీ, కొత్త పెన్షన్లు, ఇళ్లస్థలాలు అందజేత తదితర అంశాల అజెండాగా రచ్చబండ సాగుతుందని ప్రభుత్వం సూత్రప్రాయంగా ప్రకటించింది తప్ప పూర్తిస్థాయిలో మార్గదర్శకాలు విడుదల కాలేదు. కలెక్టర్లతో ఈనెల 6న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి, మంత్రుల ఉపసంఘం వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించనున్నారు. అప్పుడు రచ్చబండ షెడ్యూల్‌ను ప్రకటించే అవకాశాలున్నాయి. అక్కరకురాని కిరణ్ పథకాలు మహానేత వైఎస్సార్ ప్రవేశపెట్టిన అమలుచేసి పలు పథకాలను పూర్తిస్థాయిలో కొనసాగించలేని కిరణ్ సర్కార్ ఇందిరమ్మ కలలు (ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్), బంగారు తల్లి వంటి పథకాలను అట్టహాసంగా ప్రారంభించింది. ప్రచార ఆర్భాటం తప్ప ఇవి ప్రజలకు ఏ మాత్రం చేరువకాలేదు. ఎస్సీ ఎస్టీ సబ్‌ప్లాన్‌లో భాగంగా 50 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ లబ్ధిదారులకు అందటం లేదు. మరోవైపు ఈ వర్గాల ఇళ్ల నిర్మాణాలకు పెంచిన రూ.1.05 లక్షల రుణ పరిమితి జీవోలు విడుదలైనా అమలైన దాఖలాలు లేవు. జిల్లాలో బంగారు తల్లి పథకంలో 4 వేల మందిని అర్హులుగా గుర్తించినా ఇప్పటికీ 2 వేల మందికి మాత్రమే మంజూరు పత్రాలు ఇచ్చారు. వీరిలో ఇటీవల 9 మందికి కలెక్టర్ ఆర్థికసాయం అందజేశారు. ఈ నేపథ్యంలో ఆయా పథకాల అమలుపై ప్రజల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ప్రజాప్రతినిధుల అంతర్మథనం రచ్చబండలో తమకు సమైక్య సెగ తప్పదన్న ఆందోళన ప్రజాప్రతినిధులను వెంటాడుతోంది. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులను సమైక్యవాదులు నిలదీశారు. కొందరు పాలకులు ప్రజలకు అందుబాటులో లేకుండా తప్పించుకుని తిరుగుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో రచ్చబండ పేరుతో గ్రామగ్రామానా నిర్వహించే సభల్లో ఎలా పాల్గొనాలని ప్రజాప్రతినిధులు అంతర్మథనం చెందుతున్నారు. -
కొత్తకార్డులకు లైన్ క్లియర్
విజయనగరం కలెక్టరేట్, న్యూస్‌లైన్: సామాన్యుల నిరీక్షణ ఫలించనుంది. రేషన్ కార్డులు లేక అనేక సంక్షేమ పథకాలకు దూరమవుతున్న పేదల కోరిక నెరవేరే సమయం దగ్గర్లోనే ఉంది. రేషన్‌కార్డుల కోసం దరఖాస్తు చేసుకొని ప్రజలు ఏడాదిన్నర కాలంగా నిరీక్షిస్తున్నారు. పదవుల పందారంలో పడిన పాలకులు మరోసారి రచ్చబండకు సిద్ధం కావడంతో ఎట్టకేలకు హామీలపై దృష్టి సారించారు. గతంలో రేషన్‌కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులను గుర్తించాల ని ఆదేశాలు వచ్చాయి. అయితే అధికారులు కొన్ని నెలల క్రితమే అర్హులను గుర్తించి జాబితా సిద్ధం చేశారు. అర్హులైన వారి వివరాలను ఆన్లైన్లో పొందుపరిచారు. పౌరసరఫరాల ఉన్నతాధికారులు కొత్త కార్డుల మంజూరుకు లైన్ క్లియర్ చేయడంతో కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారి నిరీక్షణ ఫలించనుంది. గతంలో జరిగిన రచ్చబండ కార్యక్రమంలో కొత్తకార్డు లు, కుటుంబ సభ్యుల పేర్ల నమోదు, కార్డుల విభజన, గులాబీ కార్డుల నుంచి తెలుపు కార్డులుగా మార్చాలని కోరుతూ జిల్లావ్యాప్తంగా 71,432 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో 64,690 దరఖాస్తులు అర్హత గలవిగా అధికారు లు తేల్చారు. అర్హులకు అందజేయడానికి ఇప్పటికే 24,726 కార్డులు సిద్ధం చేశారు. కొత్తకార్డుల కోసం 27,017, కుటుంబ సభ్యుల పేర్లను చేర్చటానికి 16,740, కార్డుల విభజన కోసం 18076, గులాబీ నుంచి తెలుపు, తెలుపుకార్డుల నుంచి అంత్యోదయ కార్డుల కోసం వచ్చిన 48 దరఖాస్తులు అర్హమైనవిగా గుర్తించారు. 729 దరఖాస్తులు మినహాయించి మిగిలిన వివరా లు ఆన్లైన్లో పొందుపర్చారు. ప్రభుత్వం ఆమోదం తెలిపిన వెంటనే వీరందరికీ ప్రయోజనం కలగనుంది.