అర్హులందరికీ పథకాలు | Some schemes to ensure the well-being of everyone eligible botsa Satyanarayana | Sakshi
Sakshi News home page

అర్హులందరికీ పథకాలు

Published Fri, Nov 15 2013 2:23 AM | Last Updated on Sat, Sep 2 2017 12:36 AM

Some schemes to ensure the well-being of everyone eligible botsa Satyanarayana

 సతివాడ (నెల్లిమర్ల), న్యూస్‌లైన్ :   జిల్లాలో అర్హులైన ప్రతి ఒక్కరికీ సం క్షేమ పథకాలు అందిస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ హామీ ఇచ్చారు. గురువారం  సతివాడలో జరిగిన రచ్చబండ సభలో ఆయన మాట్లాడారు. మూడో విడత రచ్చబండలో జిల్లావ్యాప్తంగా సుమారు 57 వేల రేషన్‌కార్డులు, 28 వేల పింఛన్లు, 55 వేల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసినట్టు తెలిపారు. వచ్చేనెల నుంచి ఎప్పటికప్పుడే అర్హల ను గుర్తించి సంక్షేమ పథకాలు వర్తింపజేస్తామని తెలిపారు. జిల్లాలో సుమారు 10 వేలమందికి ఇంకా ఆధార్‌కార్డులు అందాల్సి ఉందని, త్వరలోనే మరో 340 కేంద్రాలు ఏర్పాటు చేసి, అందరికీ ఆధార్‌కార్డులు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. కాగా మంత్రి లబ్ధిదారులకు హామీల వర్షం కురిపించారు.
 
 సభ జరుగుతున్న సేపూ ఆయన ప్రజలను ఆకట్టుకునేందుకు ప్రయత్నించారు. గ్రామస్తు లు అడిగినవన్నీ ఇస్తానని ప్రకటించారు.  సభలో ఎవరెవరికి ఏమేం కావాలో చేతులెత్తాలని గ్రామస్తులు అడిగారు. గ్రామానికి గ్రంథాలయం, రచ్చబండ వేదిక మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. అంతకముందు ఎస్సీ కాలనీలో రూ. 7. 50 లక్షలతో నిర్మించనున్న కమ్యూనిటీ భవనానికి మంత్రి శంకుస్థాపన చేశారు. అలాగే గతేడాది రచ్చబండలో దరఖాస్తు చేసుకున్న వారికి రేషన్‌కార్డులు, పింఛన్ల పత్రాలు అందజేశారు.    కాగా మంత్రి కాన్వాయ్ వద్ద కొందరు సమైక్యవాదు లు రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా నినా దాలు చేశారు. దీంతో పోలీసులు వారిని వారించడంతో మంత్రి సర్ధి చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు, ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి, డీసీసీబీ ఉపాధ్యక్షుడు చెనమల్లు వెంకటరమణ, ఏఎం సీ చైర్మ న్‌అంబళ్ళ శ్రీరాములనాయుడు, కలెక్టర్ కాంతిలాల్ దండే, జేసి శోభ, డీఆర్‌డీఏ పిడి జ్యోతి, పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement