
భోగాపురం ఎయిర్‌పోర్ట్ పనులతో పాటు చింతపల్లి వద్ద ఫ్లోటింగ్ జెట్టి కూడా సీఎం జగన్ శంకుస్థాపన..
సాక్షి, విజయనగరం: వచ్చే నెల(మే) 3వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి భోగాపురం ఎయిర్‌పోర్ట్ శంకుస్థాపన చేయనున్నారని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. ఈ మేరకు శంకుస్థాపన కార్యక్రమ ఏర్పాట్లపై బుధవారం మంత్రి బొత్స.. విజయనగరం కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్ష నిర్వహించారు.
భోగాపురం ఎయిర్‌పోర్ట్ పనులతో పాటు చింతపల్లి వద్ద ఫ్లోటింగ్ జెట్టి కూడా శంకుస్థాపన చేయనున్నారు. ఇప్పటికే 2,203 ఎకరాల్లో విమానాశ్రయం నిర్మాణానికి భూ సేకరణ జరిగింది. ఈ సమీక్షలో మంత్రి బొత్సతో పాటు ఎంపీ బెల్లాన చంద్ర శేఖర్, జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, కలెక్టర్ నాగలక్ష్మి పాల్గొన్నారు.