సాక్షి, విజయనగరం: మంత్రి వర్గ పునర్ వ్యవస్థీకరణపై ఎమ్మెల్యే బొత్స సత్యనారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పునర్ వ్యవస్థీకరణపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిదే తుది నిర్ణయమని ఆయన అన్నారు. ప్రభుత్వం, పార్టీ రెండింటి కోసం మంత్రి వర్గ కూర్పు ఉంటుందని బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు.
ఇదిలా ఉంటే, ప్రమాణ స్వీకార కార్యక్రమం కోసం వెలగపూడి తాత్కాలిక సచివాలయం ఒకటో బ్లాక్ పక్కన ఉన్న ఖాళీ ప్రదేశంలో వేదికను సిద్ధం చేశారు. ఏప్రిల్ 11, సోమవారం ఉదయం 11.31 గంటలకు కొత్త మంత్రులతో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రమాణం చేయిస్తారు. కాగా 2019 జూన్ 8న కూడా మంత్రులు ఇదే ప్రదేశంలో ప్రమాణ స్వీకారం చేయటం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment