సాక్షి, విజయవాడ: భోగాపురం ఎయిర్‌పోర్ట్‌తో 4600 కోట్ల పెట్టుబడి రాబోతుందని పరిశ్రమల శాఖ స్పెషల్ సీఎస్ కరికాల వలవన్ అన్నారు. మంగళవారం ఆయన ‘సాక్షి’ మాట్లాడుతూ విశాఖలో ఆర్థిక వృద్ధికి భోగాపురం ఎయిర్ పోర్ట్ దోహదపడుతుందన్నారు. నాలుగేళ్లుగా ఎన్నో సవాళ్లను ఎయిర్‌పోర్ట్ కోసం పరిష్కరించామని, భూ సేకరణ కేసులు, పర్యావరణ కేసులు పరిష్కరించామని ఆయన పేర్కొన్నారు.
‘‘కేంద్రం నుండి ఎయిర్‌పోర్ట్‌కి ఎన్‌వోసీ తెచ్చాం. రేపు భోగాపురం ఎయిర్‌పోర్ట్, ఆదాని డేటా సెంటర్‌కు సీఎం జగన్ శంకుస్థాపన చేస్తారు. ఆదాని డేటా సెంటర్‌తో రూ.20 వేల కోట్ల పెట్టుబడి రాబోతుంది. ఐటీ పార్క్ కూడా ఆదాని సంస్థ అభివృద్ధి చేస్తుంది. 45 వేల ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు రాబోతున్నాయి. సీఎం రాష్ట్రాన్ని పారిశ్రామికంగా వృద్ధి చెయ్యడానికి పోర్టులు, ఎయిర్ పోర్టులు, మౌలిక వసతులు కల్పిస్తున్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సీఎం జగన్ మౌలిక వసతులు పై దృష్టి పెట్టారని కరికాల వలవన్ పేర్కొన్నారు.
చదవండి: ‘రైతులను అడ్డంపెట్టుకుని రామోజీ గలీజు రాతలు’
Comments
Please login to add a commentAdd a comment