karikal valavan
-
భోగాపురం ఎయిర్‌పోర్ట్‌తో 4600 కోట్ల పెట్టుబడి: కరికాల వలవన్
సాక్షి, విజయవాడ: భోగాపురం ఎయిర్‌పోర్ట్‌తో 4600 కోట్ల పెట్టుబడి రాబోతుందని పరిశ్రమల శాఖ స్పెషల్ సీఎస్ కరికాల వలవన్ అన్నారు. మంగళవారం ఆయన ‘సాక్షి’ మాట్లాడుతూ విశాఖలో ఆర్థిక వృద్ధికి భోగాపురం ఎయిర్ పోర్ట్ దోహదపడుతుందన్నారు. నాలుగేళ్లుగా ఎన్నో సవాళ్లను ఎయిర్పోర్ట్ కోసం పరిష్కరించామని, భూ సేకరణ కేసులు, పర్యావరణ కేసులు పరిష్కరించామని ఆయన పేర్కొన్నారు. ‘‘కేంద్రం నుండి ఎయిర్‌పోర్ట్‌కి ఎన్వోసీ తెచ్చాం. రేపు భోగాపురం ఎయిర్పోర్ట్, ఆదాని డేటా సెంటర్‌కు సీఎం జగన్ శంకుస్థాపన చేస్తారు. ఆదాని డేటా సెంటర్‌తో రూ.20 వేల కోట్ల పెట్టుబడి రాబోతుంది. ఐటీ పార్క్ కూడా ఆదాని సంస్థ అభివృద్ధి చేస్తుంది. 45 వేల ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు రాబోతున్నాయి. సీఎం రాష్ట్రాన్ని పారిశ్రామికంగా వృద్ధి చెయ్యడానికి పోర్టులు, ఎయిర్ పోర్టులు, మౌలిక వసతులు కల్పిస్తున్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సీఎం జగన్ మౌలిక వసతులు పై దృష్టి పెట్టారని కరికాల వలవన్ పేర్కొన్నారు. చదవండి: ‘రైతులను అడ్డంపెట్టుకుని రామోజీ గలీజు రాతలు’ -
అన్ని ప్రాంతాల సుస్థిరాభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో అన్ని ప్రాంతాలు పారిశ్రామికంగా సుస్థిరమైన వృద్ధిని సాధించే విధంగా ప్రాంతాల వారీగా, రంగాల వారీగా ప్రోత్సాహకాలను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోందని పరిశ్రమలు, మౌలిక వసతుల కల్పన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్.కరికాల వలవన్ పేర్కొన్నారు. ఇందులో భాగంగానే వెనుకబడిన ప్రాంతమైన వైఎస్సార్ జిల్లా కొప్పర్తిలో ఏర్పాటు చేసే పరిశ్రమలకు ప్రత్యేక రాయితీలు అందిస్తున్నట్టు తెలిపారు. విజయవాడలో రెండు రోజులపాటు నిర్వహించిన వాణిజ్య ఉత్సవ్ మంగళవారం ఘనంగా ముగిసింది. అంతకుముందు రాష్ట్రంలో ఎగుమతులు అవకాశాలు, విధానాలు అనే అంశంపై కరికాల వలవన్ మాట్లాడుతూ.. రాష్ట్రమంతా సుస్థిరమైన సమ్మిళిత వృద్ధి సాధించాలన్నది సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి లక్ష్యమని చెప్పారు. రాష్ట్రంలో ఏర్పాటయ్యే పరిశ్రమలకు ప్రభుత్వం జీవిత కాలం చేయూత అందిస్తుందన్నారు. ఇందుకోసం సింగపూర్ తరహాలో వైఎస్సార్ ఏపీ వన్ పేరుతో సేవలు అందించనున్నామని, ఇది డిసెంబర్ నాటికి అందుబాటులోకి వస్తుందని చెప్పారు. కేవలం సులభతర వాణిజ్య అవకాశాలే కాకుండా ఇక్కడ ఏర్పాటయ్యే పరిశ్రమలకు నిర్వహణ వ్యయం భారీగా తగ్గించే విధంగా ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో వస్తువుల ఉత్పత్తి ధరలో సరుకు రవాణా వ్యయం 13 శాతంగా ఉందని, దీన్ని 8 శాతానికి తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుని ఆ దిశగా పటిష్ట ప్రణాళికలను అమలు చేస్తున్నట్టు తెలిపారు. ఇందులో భాగంగా పోర్టులు, ఎయిర్‌పోర్టుల అభివృద్ధితోపాటు గోడౌన్లు, లాజిస్టిక్ సౌకర్యాలను అభివృద్ధి చేస్తున్నట్టు వివరించారు. తిరుపతి ఎయిర్ పోర్టులో కార్గో సేవలను అందుబాటులోకి తీసుకురావడంతోపాటు దగదర్తిలో కార్గో కోసం ప్రత్యేకంగా విమానాశ్రయం అభివృద్ధి చేస్తున్నట్టు తెలిపారు. రాష్ట్రం నుంచి వెళ్తున్న మూడ కారిడార్లలో అన్ని మౌలిక వసతులతో నోడ్లను అభివృద్ధి చేస్తున్నట్టు చెప్పారు. విశాఖ సెజ్ జోనల్ కమిషనర్ ఎ.రామ్మోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. క్లిష్ట సమయంలో కూడా వీసెజ్ అద్భుతమైన పనితీరు కనబరుస్తోందన్నారు. ఈ ఆర్థిక ఏడాదిలో సెప్టెంబర్ 20 నాటికి గతేడాదితో పోలిస్తే ఎగుమతులు 26 శాతం పెరిగి రూ.53,410 కోట్లకు చేరినట్టు తెలిపారు. ప్రభుత్వ సలహాదారు కృష్ణ జీవీ గిరి మాట్లాడుతూ.. ఎగుమతుల్లో 90 శాతం పోర్టుల ద్వారానే జరుగుతున్నాయని, అందుకోసమే కొత్త పోర్టుల నిర్మాణంతో పాటు, పోర్టు ఆథారిత పరిశ్రమలపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నట్టు తెలిపారు. ఏపీ మారిటైమ్ బోర్డు డిప్యూటీ సీఈవో రవీంద్రనాథ్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో కొత్తగా మూడు పోర్టులు అభివృద్ధి చేస్తున్నట్టు తెలిపారు. మెడ్‌టెక్ జోన్ సీఈవో, ఎండీ జితేంద్రశర్మ మాట్లాడుతూ మెడికల్ టెక్నాలజీ రంగంలో ఎగుమతులకు అపార అవకశాలున్నాయన్నారు. సదస్సు విజయవంతం రెండు రోజుల పాటు నిర్వహించిన వాణిజ్య ఉత్సవ్ విజయవంతమైందని పరిశ్రమల శాఖ డైరెక్టర్ జవ్వాది సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. సదస్సులలో 650 మందికిపైగా ఎగుమతి దారులు పాల్గొన్నారని, 29కి పైగా సంస్థలు ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేశాయని, 15కు పైగా ఎగుమతిదారుల సంఘాలు, వివిధ దేశాల రాయబారులు పత్యక్షంగాను, పరోక్షంగాను పాల్గొన్నారని వివరించారు. ఈ సందర్భంగా ఎగ్జిబిషన్ స్టాల్స్‌కు అవార్డుల్లు ప్రకటించారు. అత్యధిక మందిని ఆకట్టుకున్న ఎంపెడా స్టాల్ మొదటి స్థానంలో నిలవగా, ఆ తర్వాతి స్థానాల్లో ఆర్కే హెయిర్ ప్రొడక్ట్స్, ఎంఐజే పార్క్, టెక్సోప్రోసిల్ నిలిచాయి. ఎగ్జిబిషన్లో స్టాల్స్ ఏర్పాటు చేసిన వారిని జ్ఞాపికలతో సత్కరించారు. -
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను పునఃసమీక్షిస్తేనే మేలు
సాక్షి, అమరావతి: విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పునఃసమీక్షించాల్సిన అవసరం ఉందని హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం నివేదించింది. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని లాభాల బాట పట్టించేందుకు ఆచరణ సాధ్యమైన ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని తెలిపింది. ప్రత్యామ్నాయ మార్గాల అన్వేషణను నొక్కి చెబుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇప్పటికే ప్రధాన మంత్రికి లేఖ రాశారని వివరించింది. ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ రాష్ట్ర శాసనసభలో తీర్మానం సైతం చేశారని తెలిపింది. ముఖ్యమంత్రి చెప్పిన విధంగా ప్రత్యామ్నాయాలు చూడాలని కేంద్ర ప్రభుత్వాన్ని శాసనసభ కోరిందని వివరించింది. ఇప్పటికే ఈ వ్యవహారంలో కౌంటర్ దాఖలు చేసిన కేంద్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి లేవనెత్తిన అంశాలను పరిగణనలోకి తీసుకుంటున్నట్టు తన కౌంటర్లో ఎక్కడా పేర్కొనలేదంది. ఎంతోమంది ప్రాణ త్యాగాల ఫలితంగానే విశాఖ ఉక్కు కర్మాగారం ఏర్పడిందని, వేలాది మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఈ పరిశ్రమ వల్ల ఉపాధి పొందుతున్నారని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ మాజీ ఐపీఎస్ అధికారి జేడీ లక్ష్మీనారాయణ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి (సీజే) ధర్మాసనం ఈ వ్యవహారంలో కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పరిశ్రమలు, వాణిజ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కరికాల వలవన్ కౌంటర్ దాఖలు చేశారు. క్యాప్టివ్ మైన్స్ లేకపోవడం వల్లే నష్టాలు... ‘విశాఖ ఉక్కు కర్మాగారం వల్ల 20వేల మందికి పైగా ప్రత్యక్షంగా, అనేక వేల మంది పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు. ఈ కర్మాగార ప్రస్తుత ఉత్పత్తి సామర్థ్యం 7.30 మిలియన్ టన్నులు. ఆధునికీకరణ, విస్తరణ నిమిత్తం కర్మాగారం బ్యాంకుల నుంచి రుణాలు కూడా తీసుకుంది. 2014–15 నుంచి ఈ కర్మాగారం నష్టాలు ఎదుర్కొంటోంది. క్యాప్టివ్ మైనింగ్ లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. ఈ కర్మాగారం పునరుద్ధరణ నిమిత్తం ప్రధానమంత్రికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లేఖ రాస్తూ పలు సూచనలు చేశారు. లాభాల బాట పట్టించేందుకు వీలుగా విశాఖ ఉక్కు కార్యకలాపాలను కొనసాగించాలని కోరారు. క్యాప్టివ్ మైన్స్ కేటాయించాలని, ఆర్థిక పునర్నిర్మాణం చేపట్టాలని కోరారు. ఇదే అంశంపై కేంద్ర ఉక్కు శాఖ మంత్రికి కూడా ముఖ్యమంత్రి లేఖ రాశారు. క్యాప్టివ్ మైన్స్ కేటాయిస్తే నిర్వహణ వ్యయాలు గణనీయంగా తగ్గుతాయి. నెలకు రూ.200 కోట్ల వరకు లాభాలు ఆర్జించే అవకాశం ఉంటుంది. పెట్టుబడుల ఉపసంహరణ అన్నది ప్రభుత్వ విధానపరమైన నిర్ణయమే అయినప్పటికీ, విశాఖ ఉక్కు విషయంలో ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తే ప్రయోజనం ఉంటుంది’ అని కరికాల వలవన్ ప్రభుత్వం తరఫున దాఖలు చేసిన కౌంటర్లో పేర్కొన్నారు. ఈ వివరాలను పరిగణనలోకి తీసుకుని ఈ వ్యాజ్యంలో తగిన ఉత్తర్వులు జారీ చేయాలని ఆయన కోర్టును కోరారు. -
రూ.4,361.91 కోట్లతో భావనపాడు తొలిదశ పనులు
సాక్షి, అమరావతి: శ్రీకాకుళం జిల్లాలో భావనపాడు ఓడరేవును తొలి దశలో రూ.4,361.91 కోట్లతో నిర్మాణం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. మొత్తం 6,410 ఎకరాల విస్తీర్ణంలో ల్యాండ్ లార్డ్ విధానం (తొలుత ప్రభుత్వం అభివృద్ధి చేసి తర్వాత లీజు లేదా విక్రయిస్తారు)లో అభివృద్ధి చేయనున్నారు. భూ సేకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.527.22 కోట్లు సమకూర్చనున్నట్లు పెట్టుబడులు పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్.కరికాల వలవన్ ఉత్తర్వులో పేర్కొన్నారు. రైట్స్ సంస్థ సవరించిన ప్రాజెక్టు నివేదికకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలపడంతో ఆ మేరకు ప్రభుత్వం భావనపాడు పోర్టు నిర్మాణానికి అనుమతులిచ్చింది. భావనపాడు పోర్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఈ పోర్టును అభివృద్ధి చేయనుండగా, ఏపీ మారిటైమ్ బోర్డు పర్యవేక్షిస్తుంది. ఈ పోర్టు అభివృద్ధి కోసం ఏపీ మారిటైమ్ బోర్డు రూ.3,053.34 కోట్ల రుణం తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. -
సులభతర వాణిజ్యంలో అగ్రస్థానాన్ని నిలబెట్టుకోవాలి: సీఎస్ ఆదిత్యనాథ్
సాక్షి, అమరావతి: సులభతర వాణిజ్యం (ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్) విషయంలో దేశంలోనే అగ్రస్థానంలో కొనసాగుతున్న ఆంధ్రప్రదేశ్ అదే స్థాయిలో కొనసాగించేందుకు కృషి చేయాల్సిన ఆవశ్యకత ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్ స్పష్టం చేశారు. రాష్ట్ర సచివాలయంలో పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో సులభతర వాణిజ్యం, మినిమైజేషన్ ఆఫ్ రెగ్యులేటరీ కాంప్లయన్స్ బర్డెన్ (ఎంఆర్‌సీబీ) అంశాలపై వివిధ శాఖల కార్యదర్శులతో సీఎస్ అధ్యక్షతన సోమవారం సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఆత్మనిర్భర్ భారత్‌ను వాస్తవికంగా ఆచరణలో పెట్టే ప్రక్రియలో భాగంగా రాబోయే తరాలకు తగ్గట్టుగా సేవలందించే విషయంలో తలెత్తే సమస్యల్ని తగ్గించేందుకు చర్యలు తీసుకుంటోందని చెప్పారు. ఇందులో భాగంగా వివిధ సేవల్ని ఆన్లైన్లో పారదర్శకంగా నిర్ధిష్ట కాలవ్యవధిలో అందేలా చర్యలు తీసుకోనుందన్నారు. అందుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం వివిధ శాఖల వారీగా అందించే వ్యాపార, వాణిజ్య సేవలను వినియోగదారులకు సకాలంలో ఒక నిరి్ధష్ట సమయం ప్రకారం అందే విధమైన కార్యాచరణ ప్రణాళికలను రూపొందిస్తున్నట్టు చెప్పారు. ఇందుకు సంబంధించి క్షేత్ర స్థాయిలో మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాల్సి ఉందని, శాఖల వారీగా ఏయే కార్యక్రమాలు చేపడుతున్నామనే విషయాలు వినియోగదారులకు పూర్తిగా తెలియాల్సి ఉందన్నారు. జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్లు నోడల్ అధికారుల వివరాలను అందుబాటులో ఉంచుకుని ఎప్పటికప్పుడు సంబంధిత అసోసియేషన్లతో మాట్లాడి వారి సందేహాలను నివృత్తి చేయాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్లు కనీసం 1 శాతం వినియోగదారులతో స్వయంగా మాట్లాడి వారు అడిగే సమస్యలు, సందేహాలను నివృత్తి చేయాలన్నారు. సంబంధిత శాఖల కార్యదర్శులు, శాఖాధిపతులు కలెక్టర్లతో మాట్లాడి క్షేత్ర స్థాయిలో మెరుగైన ఫలితాలు ఉండేలా చూడాలని సూచించారు. రాష్ట్ర పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో రెండు దశల్లో 390 సమస్యలను గుర్తించి వాటిని 285కు తగ్గించామని తెలిపారు. పరిశ్రమల శాఖ సంచాలకులు సుబ్రహ్మణ్యం అజెండా అంశాలపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. చదవండి: ‘‘జై జగన్ మామయ్య.. జై జై జగన్ మామయ్య’’ -
కొప్పర్తిలో కంపెనీలకు ప్రత్యేక రాయితీలు
సాక్షి, అమరావతి: వైఎస్సార్ జిల్లా కొప్పర్తిలో అభివృద్ధి చేస్తున్న వైఎస్సార్ జగనన్న మెగా ఇండస్ట్రియల్ హబ్‌లో ఇన్వెస్ట్ చేసే తొలి ఐదు కంపెనీలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక రాయితీలను అందిస్తోంది. 2021–22 ఆర్థిక సంవత్సరంలోగా వైఎస్సార్ జగనన్న మెగా ఇండస్ట్రియల్ హబ్‌లో ఇన్వెస్ట్ చేసే తొలి ఐదు కంపెనీలు లేదా యాంకర్ యూనిట్లకు తక్కువ ధరకే భూమి కేటాయింపు, స్టాంపు డ్యూటీ, ఎస్జీఎస్టీ పూర్తి మినహాయింపుతోపాటు వడ్డీ, విద్యుత్ సబ్సిడీ లాంటి పలు రాయితీలు అందచేస్తోంది. ఇక్కడి మెగా ఇండస్ట్రియల్ హబ్‌లో రూ.401 కోట్ల పెట్టుబడితో 2,000 మందికి ఉపాధి కల్పించే తొలి కంపెనీగా ‘పిట్టి రైల్ అండ్ ఇంజనీరింగ్ లిమిటెడ్’ ముందుకొచ్చింది. రెండో కంపెనీగా నీల్కమల్ లిమిటెడ్ రూ.486 కోట్ల పెట్టుబడితో 2,030 మందికి ఉపాధి కల్పించనుంది. దీనికి సంబంధించి జూన్ 29న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన సమావేశమైన పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్ఐపీబీ) పిట్టి రైల్ అండ్ ఇంజనీరింగ్ లిమిటెడ్, నీల్కమల్ ఇండియాకు ప్రత్యేక రాయితీలు ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది. ఈ మేరకు ప్రత్యేక రాయితీలు కల్పిస్తూ పరిశ్రమలు, వాణిజ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ కరికల్ వలవన్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎకరం రూ.పది లక్షల చొప్పున 117.85 ఎరాల కేటాయింపు వైఎస్సార్ జగనన్న మెగా ఇండస్ట్రియల్ హబ్‌లో ఎకరం ధరను ఏపీఐఐసీ రూ.25 లక్షలుగా నిర్ణయించగా తొలి కంపెనీ కావడంతో పిట్టి రైల్ అండ్ ఇంజనీరింగ్ సంస్థకు ప్రత్యేక రాయితీ కింద ఎకరం రూ.10 లక్షల చొప్పున మొత్తం 117.85 ఎకరాలను కేటాయించారు. నీల్‌కమల్‌కు 105 ఎకరాలు కేటాయించారు. స్టాంపు డ్యూటీ నుంచి 100 శాతం మినహాయింపు ఇచ్చారు. ► తొలి 8 సంవత్సరాలు లేదా ఎఫ్‌సీఐ పరిమితి 100 శాతం ఇందులో ఏది ముందు అయితే అప్పటివరకు 100 శాతం ఎస్జీఎస్టీ నుంచి మినహాయింపు. ► స్థిర మూలధన పెట్టుబడిలో 20 శాతం ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ. గరిష్టంగా రూ.10 కోట్లు ► ఏడాదికి 5 శాతం వడ్డీ రాయితీ గరిష్టంగా రూ.1.50 కోట్లు ► తొలి ఐదేళ్లు విద్యుత్ చార్జీ యూనిట్‌కు రూపాయి చొప్పున తిరిగి చెల్లిస్తారు. ► తొలి ఐదేళ్లు లాజిస్టిక్ సబ్సిడీ అందిస్తారు. ఏటా గరిష్టంగా రూ.50 లక్షలు చొప్పున దేశీయ రవాణాలో 25 శాతం సబ్సిడీ కల్పిస్తారు. -
రానున్న రోజుల్లో మరిన్ని సంస్కరణలు
సాక్షి, విజయవాడ: రాష్ట్రంలో చేపట్టిన సంస్కరణల వలన ‘ఈజ్ ఆఫ్ డూయింగ్’లో మొదటి స్థానంలో నిలిచామని పరిశ్రమల శాఖ స్పెషల్ సీఎస్ కరికాల వలవన్ అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గతంలో చేసిన సర్వేల కంటే ఈ సారి సర్వే పూర్తిస్థాయిలో చేశారన్నారు. 100 శాతం స్టేక్ హోల్డర్ల తో సర్వే చేశారని, గతంలో ఎప్పుడు ఇలా సర్వే చెయ్యలేదని ఆయన పేర్కొన్నారు. (చదవండి: ఆంధ్రప్రదేశ్ నంబర్ 1) ‘‘గత ఏడాది చివరిలో కేంద్రానికి సమాచారాన్ని పంపాం. ఈ ఏడాది మార్చిలో స్టేక్ హోల్డర్ల సర్వే చేశారు. ఇన్వెస్టర్లు, ఆడిటర్లు, లాయర్లు సహా అందరిని సర్వే చేశారు. సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వ విధానాలపై సర్వే లో వంద శాతం సంతృప్తి వ్యక్తం చేశారు. గతంలో ఎప్పుడు ఇలా సర్వే చేసి ఈజ్ ఆఫ్ డూయింగ్ ర్యాంకులు ఇవ్వలేదు. ఈ ప్రభుత్వం వచ్చాక 10 రోజుల్లోనే భూములను కేటాయించడంతో పాటు పరిశ్రమలకు అవసరమైన అన్ని మౌలిక వసతులు కల్పిస్తున్నాం. భూమి, నీరు, పవర్ ఇస్తున్నాం. ఆంధ్రప్రదేశ్‌లో రానున్న రోజుల్లో మరిన్ని పారిశ్రామిక సంస్కరణలు చేపడతామని ఆయన వెల్లడించారు. (చదవండి: సీఎం జగన్ సంకల్పం.. ఏపీ నెంబర్ వన్) -
'ఐఎస్బీ ఒప్పందం దేశంలోనే తొలిసారి'
సాక్షి, అమరావతి: దేశంలోనే తొలిసారిగా ఏపీ ప్రభుత్వంతో ఐఎస్బీ ఒప్పందం కుదుర్చుకుంటున్నట్లు పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి శనివారం పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం - ఐఎస్ బీ ఎంవోయూపై శనివారం అధికారులతో మంత్రి గౌతమ్‌రెడ్డి సమావేశం నిర్వహించారు. పరిశ్రమల శాఖ ప్రత్యేక కార్యదర్శి కరికాల వలవన్, పరిశ్రమల శాఖ కమిషనర్ సుబ్రహ్మణ్యం జవ్వాది, ఐ.టీ శాఖ కార్యదర్శి యేటూరి భాను ప్రకాశ్, ఐటీ సలహాదారులు విద్యాసాగర్ రెడ్డి, శ్రీనాథ్ రెడ్డి, లోకేశ్వర్ రెడ్డి తదితరులు ఈ భేటిలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ.. ఆగస్ట్ 5న ఐఎస్బీ ,ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మధ్య ఎంవోయూ జరగనుందన్నారు. ఐఎస్బీ భాగస్వామ్యంతో ప్రభుత్వ పాలనలో కీలక సమస్యలకూ వెంటనే పరిష్కారం లభించనుందని తెలిపారు. విశాఖ, రాయలసీమ కేంద్రంగా పెట్టుబడుల ఆకర్షణ, భారీ పరిశ్రమలను తీసుకురావడం, ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దడంలో ఐఎస్బీ కీలకపాత్ర పోషించనుందని పేర్కొన్నారు. ఎంఎన్ సీ కంపెనీలను ఏపీకి తీసుకువచ్చి నిరుద్యోగ సమస్యను తీర్చడంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లు వెల్లడించారు. మహిళా సాధికారత, గ్రామీణ యువతకు స్థానికంగా ఉద్యోగాలందించేందుకు ఐఎస్బీ తోడ్పాటు అందించనుందని తెలిపారు. మూడేళ్ల ఒప్పందంలో రాష్ట్రాభివృద్ధికి సహకరించేందుకు ఐఎస్బీ సిద్ధంగా ఉందన్నారు. అక్టోబర్ కల్లా నైపుణ్య కాలేజీల ఏర్పాటు అంతకముందు నైపుణ్య కాలేజీల ఏర్పాటుపై మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అక్టోబర్‌లో నైపుణ్య కాలేజీలను ప్రారంభించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఆర్థిక వనరులను సమకూర్చుకోవడంలో ఏ అవకాశాన్ని వదలకూడదన్నారు. ఈ సందర్భంగా నైపుణ్య శిక్షణా కేంద్రాల ఏర్పాటుకు రుణాలందించడానికి ఏయే బ్యాంకులు సిద్ధంగా ఉన్నాయని ఆరా తీశారు. దీనికి సంబంధించి బ్యాంకులు ఎంత మొత్తంలో రుణాలందించేందుకు సుముఖంగా ఉన్నాయో ఎండీ అర్జా శ్రీకాంత్ మంత్రికి వివరించారు. ప్రభుత్వ పూచికత్తుతోనే మరిన్ని నిధులు సాధ్యమని నైపుణ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.అనంతరాము మంత్రికి వివరించారు. పార్లమెంట్ నియోజకవర్గాల్లో స్కిల్ కాలేజీ ఏర్పాటు అవుతున్నందున స్థానిక ఎంపీల నిధుల నుంచి కొంత సాయం పొందవచ్చని ఏపీఎస్ఎస్డీసీ ఛైర్మన్ మధుసూదన్ రెడ్డి తెలిపారు. యువత భవిష్యత్ ను మార్చే స్కిల్ కాలేజీల ఏర్పాటులో ప్రతీ రూపాయి అవసరమేనని, ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని లక్ష్యాలను చేరాలని గౌతమ్‌రెడ్డి తెలిపారు ఈ విషయాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దృష్టికి తీసుకువెళ్లి మరింత లోతుగా చర్చిద్దామని మంత్రి మేకపాటి అధికారులతో పేర్కొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ కు నైపుణ్యాభివృద్ధి శాఖ ప్రత్యేక కార్యదర్శి జి.అనంతరాము, ఏపీఎస్ఎస్డీసీ ఛైర్మన్ చల్లా మధుసూదన్ రెడ్డి, ఏపీఎస్ఎస్డీసీ ఎండీ, సీఈవో అర్జా శ్రీకాంత్ హాజరయ్యారు. -
‘గుజరాత్ నుంచి బ్యూటాయిల్ ఆల్కహాల్ తెప్పిస్తున్నాం’
సాక్షి, అమరావతి : విశాఖపట్నం జిల్లాలోని ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమలో చోటుచేసుకున్న గ్యాస్ లీకేజీ ప్రస్తుతం అదుపులో ఉందని పరిశ్రమల శాఖ స్పెషల్ సీఎస్ కరికాల వలవన్ తెలిపారు. గురువారం సచివాలయంలో ఆయన మాట్లాడుతూ.. అందరూ నిద్రపోతుండగా ఈ దుర్ఘటన జరిగిందని చెప్పారు. విషవాయువుతో సమీప గ్రామ ప్రజలు అస్వస్థతకు గురయ్యారని.. సమాచారం అందిన వెంటనే చర్యలు చేపట్టినట్టు వెల్లడించారు. ఇళ్లల్లో ఉన్నవారిని డోర్లు పగలగొట్టి బయటకు తీసుకువచ్చామని వివరించారు. గతంలో ఇలాంటి ఘటన ఎప్పుడూ జరగలేదని గుర్తుచేశారు. బాధితులకు మెరుగైన వైద్యం అందిస్తున్నట్టు చెప్పారు. (చదవండి : విశాఖ ఎల్జీ పాలిమర్స్‌లో భారీ ప్రమాదం) గుజరాత్ నుంచి విమానంలో బ్యూటాయిల్ ఆల్కహాల్ తెప్పిస్తున్నామని ఆయన చెప్పారు. ఇందుకోసం గుజరాత్ పరిశ్రమల శాఖ అధికారులతో సంప్రదిస్తున్నామని తెలిపారు. ఈ ప్రమాదానికి పరిశ్రమ యాజమాన్యం బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. రక్షణ చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత పరిశ్రమ యాజమాన్యంపైనే ఉంటుందని స్పషం చేశారు. (చదవండి : గ్యాస్ లీక్ బాధితులను పరామర్శించిన సీఎం జగన్) -
ఆహారధాన్యాల ఈ - పోస్ నమోదులో ఏపీ అగ్రస్థానం
హనుమాన్‌జంక్షన్ : పౌరసరఫరాల శాఖ సేకరిస్తున్న మరియు పంపిణీ చేస్తున్న ఆహారధాన్యాల వివరాలను ఈ- పోస్ నమోదులో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొదటిస్థానంలో ఉందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ ఆర్ కరికల్ వలవెన్ తెలిపారు. హనుమాన్‌జంక్షన్ ఎఫ్‌సీఐలో ఈ-పోస్ విధానాన్ని ఆయన బుధవారం పరిశీలించారు. అనంతరం కరికల్ వలవన్ విలేకర్లతో మాట్లాడారు. ఆహారధాన్యాలకు సంబంధించి మొదటి నుంచి చివర వరకు సేకరణ, పంపిణీలను కంప్యూటరైజేషన్ చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించడంతో ఎఫ్‌సీఐ గిడ్డంగుల్లో ఈ-పోస్ విధానాన్ని పరిశీలించడానికి జిల్లా పర్యటనకు వచ్చినట్లు ఆయన వెల్లడించారు. పౌరసరఫరాల శాఖ ధాన్యం మిల్లింగ్ చేసి ఎఫ్‌సీఐకి తరలించిన వివరాలు ఎఫ్‌సీఐ నుండి ఎంఎస్ఎల్ పాయింట్లకు పంపిణీ చేస్తున్న వివరాలతో పాటు నిల్వల వివరాలు ఈ-పోస్ నమోదు విధానం ఎలా జరుగుతోంది.. అన్న విషయాలు క్షేత్ర స్థాయి సిబ్బంది నుండి వివరాలు సేకరించడం జరిగిందన్నారు. అనంతరం గిడ్డంగుల్లో ఆహారధాన్యాల నిల్వల విధానాన్ని, వాటి సంరక్షణ తీరుతెన్నులు కరికల్ వలవన్ పరిశీలించారు.