ఈ నెల 24న ‘జగనన్న వసతి దీవెన’: మంత్రి బొత్స | Cm Jagan Will Launch Jagananna Vasathi Deevena On February 24 | Sakshi
Sakshi News home page

ఈ నెల 24న ‘జగనన్న వసతి దీవెన’: మంత్రి బొత్స

Published Thu, Feb 20 2020 12:51 PM | Last Updated on Thu, Feb 20 2020 2:56 PM

Cm Jagan Will Launch Jagananna Vasathi Deevena On February 24 - Sakshi

సాక్షి, విజయనగరం : ‘జగనన్న వసతి దీవెన’ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 24న విజయనగం జిల్లాలో ప్రారంభిస్తున్నట్లు మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. రాష్ట్రంలో ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని జిల్లా నుంచి ప్రారంభించడంపై మంత్రి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గురువారం ఆయన మాట్లాడుతూ.. సీఎం జగన్‌ పర్యటనకు భారీ ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. విజయనగరం పర్యటనలో భాగంగా.. నూతనంగా ఏర్పాటు చేస్తున్న దిశా పోలీస్‌ స్టేషన్‌ను సీఎం జగన్‌  ప్రారంభించనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. 

అదే విధంగా కేంద్ర మాజీ మంత్రి అశోక్‌ గజపతి రాజు జిల్లాలో ప్రజా చైతన్య యాత్రను ఎందుకు చేస్తున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. కేంద్ర,రాష్ట్ర మంత్రిగా పని చేసిన అశోక్ గజపతిరాజు జిల్లాకు ఏ పరిశ్రమని తీసుకోచ్చారో చెప్పాలన్నారు. జిల్లాలో ఉన్న పరిశ్రమలనే గత ప్రభుత్వం మూసి వేశారని దుయ్యబట్టారు. పరిశ్రమలను ఏ విదంగా కాపాడుకోవాలో.. ఉపాది ఉద్యోగాలు ఏలా కల్పించాలో తమ ప్రభుత్వానికి తెలుసని హితవు పలికారు. ఏవరిని మభ్య పెట్టడానికి  టీడీపీ నేతలు  యాత్రలు చేస్తున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement