సాక్షి, విజయనగరం: సీఎం జగన్ విజయనగరం, విశాఖపట్నం పర్యటనకు ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించింది. సీఎం సభకు భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. ఆయన రాకతో సభా ప్రాంగణం కిక్కిరిసింది. రోడ్లన్నీ కిటకిటలాడాయి. సీఎం జగన్ కోసం వర్షంలో కూడా తడుస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు.
ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల వాంఛను నెరవేరుస్తూ.. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు పనులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం శ్రీకారం చుట్టారు. పలు కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయడంతో పాటు భోగాపురం మండలం సవరవిల్లి వద్ద నిర్వహించే బహిరంగ సభలో సీఎం ప్రసంగించారు.
రూ.4,592 కోట్ల వ్యయంతో నిర్మించనున్న విమానాశ్రయ నిర్మాణ పనులకు శంకుస్ధాపన చేశారు. రూ.194.40 కోట్ల వ్యయంతో చేపట్టనున్న తారకరామతీర్దసాగరం ప్రాజెక్టు పనులతో పాటు చింతపల్లి వద్ద రూ.23.73 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఫిష్ ల్యాండింగ్ సెంటర్ పనులకు సీఎం శంకుస్ధాపన చేశారు.
భగవంతుడి నిర్ణయమో తెలీదు కానీ.. సీఎం జగన్‌పై జీఎంఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు
చదవండి: ‘మార్గదర్శి’ జూమ్ మీటింగ్‌లో ఏం జరిగింది?.. బ్లాక్ మనీ వైట్‌గా ఎలా మారుతోంది?
అన్ని ప్రాంతాలు బాగుపడాలన్నదే ఈ ప్రభుత్వ లక్ష్యమని వెనుకబడిన ఉత్తరాంధ్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని సీఎం జగన్ అన్నారు. ఇటీవలే మూలపేటలో పోర్టుకు శంకుస్థాపన చేశాం. ఎయిర్‌పోర్టు ఉత్తరాంధ్రకు కేంద్ర బిందువుగా మారనుంది. తారకరామ తీర్థ సాగర ప్రాజెక్ట్ పనులకు శంకుస్థాపన చేయనున్నాం. ఉత్తరాంధ్ర యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరగనున్నాయి. రాబోయే రోజుల్లో ఉత్తరాంధ్ర జాబ్ హబ్‌గా మారనుందని ఆయన అన్నారు.
చదవండి: భగవంతుడి నిర్ణయమో తెలీదు కానీ.. సీఎం జగన్‌పై జీఎంఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు
Comments
Please login to add a commentAdd a comment