Huge Response
-
సాక్షి మీడియా చేపట్టిన Say No To Drugs క్యాంపెయినకి విశేష స్పందన
-
పరవశించిన మంగళగిరి..పులకించిన నగరి..గర్జించిన కడప
-
టీఎస్ఆర్టీసీ మెగా రక్తదాన శిబిరాలకు అన్యూహ స్పందన
సాక్షి, హైదరాబాద్: 'ఒకరి రక్తదానం-ముగ్గురికి ప్రాణదానం’ అనే నినాదంతో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) రాష్టవ్యాప్తంగా మంగళవారం నిర్వహించిన 101 మెగా రక్తదాన శిబిరాలకు అనూహ్య స్పందన వచ్చింది. మంగళవారం ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 3 వరకు నిర్వహించిన రక్తదాన శిబిరాల్లో 3315 మంది స్వచ్ఛందంగా ముందుకువచ్చి రక్తదానం చేశారు. రాష్ట్రంలోని 11 రీజియన్లలోని అన్ని డిపోలు, యూనిట్లలోని సిబ్బంది, ఔట్సోర్సింగ్ వారితో పాటు స్వచ్ఛందంగా తరలివచ్చిన యువత, మహిళల నుంచి ఒక్కో యూనిట్ 350 ఎంఎల్ చొప్పున మొత్తం 3315 యూనిట్ల రక్తాన్ని సేకరించారు. ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన, సురక్షిత సేవలను అందించడంతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలల్లోనూ సంస్థ భాగం కావడం తమకెంతో సంతోషంగా ఉందని టీఎస్ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్, ఎండీ వీసీ సజ్జనర్ అన్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారితో పాటు తలసేమియా వ్యాధితో బాధపడుతున్న రోగులను ఆదుకునేందుకు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ఆర్టీసీ డిపోల్లో మంగళవారం రక్తదాన శిబిరాలను సంస్థ నిర్వహించిందని గుర్తు చేశారు. టీఎస్ఆర్టీసీ పిలుపు మేరకు స్వచ్ఛందంగా శిబిరాలకు తరలివచ్చి రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికీ ప్రత్యేక కృతజ్ఞతలను తెలియజేశారు. అన్ని దానాల్లోకెల్లా రక్తదానం ఎంతో గొప్పదని, రక్తదానం చేసిన వారి సేవను వెలకట్టలేమని కొనియాడారు. సామాజిక బాధ్యతగా సంస్థ సిబ్బంది, యువత ముందుకు వచ్చి రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవడం మంచి పరిణామమని, టీఎస్ఆర్టీసీపై ప్రజల విశ్వాసాన్ని మరింతగా పెంచేందుకు ఈ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. “ప్రమాదాల్లో క్షతగాత్రులకు రక్తం అత్యవసరం. రక్తం అందుబాటులో లేక అనేక మంది ప్రాణాలు కొల్పోతున్నారు. 3315 మంది అందించిన రక్తం ఎంతో మంది ప్రాణాలు కాపాడుతుంది. ఎన్నో కుటుంబాలను నిలబెడుతుంది. రక్తదానం సేవ మాత్రమే కాదు.. ప్రతి ఒక్కరి బాధ్యత అని గుర్తుంచుకోవాలి” అని బాజిరెడ్డి గోవర్దన్, వీసీ సజ్జనర్ సూచించారు. -
సీఎం జగన్ పర్యటనకు అపూర్వ స్పందన.. కిక్కిరిసిన సభా ప్రాంగణం
సాక్షి, విజయనగరం: సీఎం జగన్ విజయనగరం, విశాఖపట్నం పర్యటనకు ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించింది. సీఎం సభకు భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. ఆయన రాకతో సభా ప్రాంగణం కిక్కిరిసింది. రోడ్లన్నీ కిటకిటలాడాయి. సీఎం జగన్ కోసం వర్షంలో కూడా తడుస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల వాంఛను నెరవేరుస్తూ.. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు పనులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం శ్రీకారం చుట్టారు. పలు కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయడంతో పాటు భోగాపురం మండలం సవరవిల్లి వద్ద నిర్వహించే బహిరంగ సభలో సీఎం ప్రసంగించారు. రూ.4,592 కోట్ల వ్యయంతో నిర్మించనున్న విమానాశ్రయ నిర్మాణ పనులకు శంకుస్ధాపన చేశారు. రూ.194.40 కోట్ల వ్యయంతో చేపట్టనున్న తారకరామతీర్దసాగరం ప్రాజెక్టు పనులతో పాటు చింతపల్లి వద్ద రూ.23.73 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఫిష్ ల్యాండింగ్ సెంటర్ పనులకు సీఎం శంకుస్ధాపన చేశారు. భగవంతుడి నిర్ణయమో తెలీదు కానీ.. సీఎం జగన్‌పై జీఎంఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చదవండి: ‘మార్గదర్శి’ జూమ్ మీటింగ్‌లో ఏం జరిగింది?.. బ్లాక్ మనీ వైట్‌గా ఎలా మారుతోంది? అన్ని ప్రాంతాలు బాగుపడాలన్నదే ఈ ప్రభుత్వ లక్ష్యమని వెనుకబడిన ఉత్తరాంధ్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని సీఎం జగన్ అన్నారు. ఇటీవలే మూలపేటలో పోర్టుకు శంకుస్థాపన చేశాం. ఎయిర్‌పోర్టు ఉత్తరాంధ్రకు కేంద్ర బిందువుగా మారనుంది. తారకరామ తీర్థ సాగర ప్రాజెక్ట్ పనులకు శంకుస్థాపన చేయనున్నాం. ఉత్తరాంధ్ర యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరగనున్నాయి. రాబోయే రోజుల్లో ఉత్తరాంధ్ర జాబ్ హబ్‌గా మారనుందని ఆయన అన్నారు. చదవండి: భగవంతుడి నిర్ణయమో తెలీదు కానీ.. సీఎం జగన్‌పై జీఎంఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు -
విశాఖ స్టీల్ ప్లాంట్ ఈవోఐకు అనూహ్య స్పందన
-
ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ కు అనూహ్య స్పందన
-
అక్కడ ఓడినా ఇక్కడ రికార్డులు తిరగరాస్తున్న వైల్డ్ డాగ్
అక్కినేని నాగార్జున ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘వైల్డ్ డాగ్’. ఎన్నో అంచనాల నడుమ మార్చి 2న విడుదలైన ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేదనే చెప్పాలి. దీంతో థియేటర్లో విడుదలైన 19 రోజులకే ఇది ఓటీటీ బాట పట్టింది. కంటెంట్ పరంగా బాగున్నా కలెక్షన్ల పరంగా నిరాశపరచిన ‘వైల్డ్ డాగ్’ ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో దుమ్మ దులుపుతోంది. వ్యూస్ పరంగా రికార్డులు క్రియేట్ చేస్తూ దూసుకుపోతోంది. నివేదికల ప్రకారం.. ‘వైల్డ్ డాగ్’ కొద్ది రోజుల్లోనే మిలియన్ల వ్యూ కౌంట్ అందుకోవడం ద్వారా అన్ని దక్షిణ భారత చిత్రాల రికార్డును బద్దలు కొట్టింది. అతి తక్కువ సమయంలోనే ఈ ఘనతను సాధించడం విశేషం. పాన్ ఇండియా రేంజ్ నిర్మాణ విలువలు, కథను నడిపిన తీరు, నాగార్జున నటన ఈ చిత్రానికి హైలెట్‌గా నిలువడంతో ఇతర భాషలలో కూడా ఓటీటీ ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. తెలుగు వర్షన్లో ఈ చిత్రం వ్యూస్ పరంగా 2 స్థానంలో ఉండగా, తమిళ వెర్షన్కుగానూ 5వ స్థానం దక్కింది. విడుదలై వారం కూడా కాలేదు కాబట్టి ఇంకా వ్యూస్ వచ్చే అవకాశం ఉందని విశ్లేషకుల అంచనా. చెప్పాలంటే నాగార్జునకు తమిళనాట పెద్దగా మార్కెట్ లేదు. కానీ, అక్కడి లోకల్ హీరోల సినిమాలను వెనక్కు నెట్టి మరీ ఓ రేంజ్లో వ్యూస్ సొంతం చేసుకుందంటే అర్థం చేసుకోవచ్చు ఈ చిత్రానికి ఒటీటీలో ఎంతటి రెస్పాన్స్ వస్తోందో. ఇక ఇతర భాషల్లో కూడా మంచి స్పందనతో రికార్డు వ్యూస్ సొంతం చేసుకుంటోంది. టాలీవుడ్లో కొత్తదనాన్ని ఎంకరేజ్ చేయడంలో నాగార్జున ఎప్పుడు ముందు వరుసలో ఉంటాడు. అలాగే తన కెరీర్లో ఒకే రకం జోనర్ సినిమాలను కాక భిన్నమైన కథాంశాలతో ప్రేక్షకుల ముందుకు వస్తుంటాడు. ఈ క్రమంలోనే రొమాంటిక్, ఫ్యామిలీ కథల నుంచి ప్రస్తుతం యాక్షన్ నేఫథ్యంలోని కథలను ఎంచుకుంటున్నాడు. అలా చేసిన సినిమానే ‘వైల్డ్ డాగ్’. టెర్రరిజం బ్యాక్‌డ్రాప్‌లో కొత్త దర్శకుడు అషిషోర్ సాల్మన్ తెరకెక్కించిన ఈ చిత్రం మంచి టాక్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ సినిమా నెట్ ఫ్లిక్స్‌లో నాలుగు భాషల్లో అంటే తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమ్ అవుతోంది. ( చదవండి: ఆ కారణంతో క్రేజీ ఆఫర్లు వదులుకున్న ‘జాతిరత్నాలు’ హీరోయిన్ ) -
ఏపీలో గ్రామస్వరాజ్యానికి రంగం సిద్ధం
-
వలంటీర్ పోస్టులకు.. 71,098 దరఖాస్తులు
సాక్షి, మహారాణిపేట (విశాఖ దక్షిణం): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకరంగా చేపటిన గ్రామ వలంటీర్ల పోస్టులకు దరఖాస్తుల పర్వం ముగిసింది. ఈ పోస్టులకు విశేషస్పందన లభించింది. ప్రతి 50 ఇళ్లకు ఒక వలంటీరు చొప్పున నియమిస్తామని ప్రభుత్వం నిర్ణయించడం తెలిసిందే. దీనిని బట్టి జిల్లాకు గ్రామీణ ప్రాంతాల నుంచి 12,272 మంది వలంటీర్లు అవసరం ఉంటుందని అధికారులు అంచనా వేశారు. వీటికి శుక్రవారం నాటికి జిల్లాలో 71,098 మంది దరఖాస్తు చేసుకున్నారు. 56,026 మంది దరఖాస్తులు పరిశీలన చేయగా, 53,503 మంది దరఖాస్తులు ఆమోదం పొందాయి. 2,523 మంది దరఖాస్తులు వివిధ కారణాలతో తిరస్కరించారు. 15,072 దరఖాస్తులు వివిధ కారణాలతో పెండింగ్‌లో పెట్టారు. తిరస్కరించిన దరఖాస్తులను ఈ నెల 8లోగా తిరిగి దరఖాస్తు చేసుకునేందుకు అనుమతి ఇచ్చారు. భర్తీకి జెడ్పీ సీఈవో సమన్వయకర్తగా.. అర్హత లేకపోవడం, కులధ్రువీకరణ పత్రాలు లేకపోవడం, ఇతర కారణాల వల్ల పలు దరఖాస్తులను తిరస్కరించామని అధికారులు చెబుతున్నారు. ఈ పోస్టుల భర్తీకి జెడ్పీ సీఈవో రమణమూర్తి సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నారు. మండల పరిధిలో నియామకాలను ఎంపీడీవోలు పర్యవేక్షిస్తున్నారు. పోస్టుల్లో 50 శాతం మహిళలకు కేటాయించడమే కాకుండా స్థానికులకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. వలంటీర్లకు 11 నుంచి 25 వరకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ఆగస్టు ఒకటో తేదీ నాటికి ఎంపిక విషయాలను తెలియజేస్తూ లేఖలు పంపే అవకాశం ఉంది. ఎంపికైన వలంటీర్లకు వచ్చే నెల 5 నుంచి పదో తేదీ వరకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఆగస్టు 15 నాటికి నియామక ఉత్తర్వులు ఇస్తామని అధికారులు చెబుతున్నారు. 50 ఇళ్లు ఒక గ్రూపుగా.. సర్వే అధారంగా 50 ఇళ్లకు ఒక గ్రూపు ఏర్పాటు చేస్తున్నారు. మండల స్థాయిలో ఎంపీడీవో, తహసీల్దార్, ఈవోపీఆర్డీతో కూడిన కమిటీ ఇళ్ల గ్రూపులను వర్గీకరిస్తుంది. గ్రూపుల వర్గీకరణ తర్వాత గ్రామ, వార్డు స్థాయిలో 50 ఇళ్ల కన్నా తక్కువ సంఖ్యలో కుటుంబాలు మిగిలిపోతే వారిని ఆ గ్రామం, వార్డులోని గ్రూపుల్లో సర్దుబాటు చేస్తామని అధికారులు చెబుతున్నారు. దరఖాస్తుల వెల్లువ ► గ్రామ వలంటీర్ల పోస్టులకు జిల్లాలో 39 మండలాల నుంచి 71,098 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో 56,026 దరఖాస్తులు పరిశీలించారు. 53,503 దరఖాస్తులను ఆమోదించారు. 2,523 దరఖాస్తులు తిరస్కరించారు. 15, 072 దరఖాస్తులు పెండింగ్‌లో పెట్టారు. ► హుకుంపేట మండలం నుంచి అత్యధికంగా 2804 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో 1751 దరఖాస్తులను పరిశీలించగా,1701 ఆమోదించారు. వివిధ కారణాలతో 50 దరఖాస్తులు తిరస్కరించారు. ► చోడవరం మండలంలో 2713 దరఖాస్తులు రాగా,2671 దరఖాస్తులు పరిశీలించగా, 2525 దరఖాస్తులు ఆమోదించారు. 146 దరఖాస్తులు తిరస్కరించారు. ► అనకాపల్లి మండలంలో 2447 మంది దరఖాస్తు చేసుకోగా,1323 మంది దరఖాస్తులు పరిశీలించారు. 1200 దరఖాస్తులు ఆమోదించారు. 251 దరఖాస్తులు తిరస్కరించారు. ► అరకు మండలం నుంచి 2344 మంది దరఖాస్తు చేసుకోగా,1255 మంది దరఖాస్తులను పరిశీలించారు. 1204 దరఖాస్తులు ఆమోదించగా, 51 దరఖాస్తులు తిరస్కరించారు. ► యలమంచలి మండలం నుంచి అతితక్కువ దరఖాస్తులు వచ్చాయి. 660 మంది దరఖాస్తు చేయగా, 463 దరఖాస్తులను పరిశీలించారు. 442 దరఖాస్తులను ఆమోదించారు. 21 తిరస్కరించారు. ► నర్సీపట్నం మండలంలో 901 మంది దరఖాస్తు చేసుకున్నారు. 865 దరఖాస్తులను పరిశీలన చేయగా, 621 ఆమోదించారు. 244 దరఖాస్తులు తిరస్కరించారు. ► కోటవురట్ల మండలంలో 1222 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 882 పరిశీలించగా, 881 ఆమోదించారు. ఒక దరఖాస్తును తిరస్కరించారు. ► రోలుగుంట మండలంలో 1366 మంది దరఖాస్తు చేయగా, వీటిలో 1221 దరఖాస్తులను పరిశీలించారు.1212 ఆమోదించారు. 9 దరఖాస్తులను తిరస్కరించారు. -
’సాక్షి’ గ్రూప్స్ అవగాహన సదస్సుకు విశేష స్పందన
-
పోలీస్ పోస్టుల భర్తీకి భారీ స్పందన
-
ఆత్మీయ స్వాగతాల మధ్య వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్ర
-
ప్రజలంతా వైఎస్ జగన్ వెంటే ఉన్నారు
-
ప్రజాసంకల్పయాత్ర పండుగలా సాగుతోంది
-
బ్రహ్మోత్సవాలపై సాక్షి 'ఫన్ డే'కు విశేష స్పందన
-
వైఎస్ జగన్‌కు నంద్యాల ప్రజలు బ్రహ్మరథం
-
సాక్షి మాక్ నీట్‌కు విశేష స్పందన
-
సాక్షి ఎరీనా స్కూల్ ఫెస్ట్‌లో హ్యాండ్ రైటింగ్ పోటీలు
-
సాక్షి ఎరీనా స్కూల్ ఫెస్ట్‌కు భారీ రెస్పాన్స్
-
గడప గడపకు YSRCPకి విశేష స్పందన
-
’హైదరాబాద్ ట్రాఫిక్ సీన్స్’ కు మంచి స్పందన
-
హరితహారంకు విశేష స్పందన
-
సాక్షి ఎరీనా వన్ యూత్ ఫెస్ట్‌కు విశేష స్పందన
-
ఘనంగా ఓటరు దినోత్సవ ర్యాలీ
-
కరీంనగర్లో సాక్షి స్పెల్‌బీకి విశేష స్పందన
-
విజయవాడ సాక్షి స్పెల్‌బీ క్వార్టర్ ఫైనల్
-
’సాక్షి’ ఇండియా స్పెల్‌బీ 2015 ప్రిలిమ్స్ ఎగ్జామ్
-
రాజమండ్రిలో ఉత్సాహంగా అందాల పోటీలు
-
సాక్షి ‘లివ్ వెల్ ఎక్స్పో’కు భారీ స్పందన
ముగిసిన రెండు రోజుల ప్రదర్శన ఉత్సాహంగా పాల్గొన్న జంటనగరాల వాసులు సాక్షి, హైదరాబాద్: ప్రజలు ఆరోగ్యపరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలియజేసి.. వారిలో ఆరోగ్య స్పృహ పెంచే ఉద్దేశంతో భాగ్యనగరంలో నిర్వహించిన సాక్షి లివ్ వెల్ ఎక్స్పో కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించింది. ‘సాక్షి’ మీడియా, డీఎస్ రీసెర్చ్ సెంటర్ సంయుక్త ఆధ్వర్యంలో హైటెక్స్‌లో ఏర్పాటు చేసిన రెండు రోజుల ‘లివ్ వెల్ ఎక్స్పో’ ఆదివారం సాయంత్రం ముగిసింది. జంట నగరాల్లోని వివిధ మల్టీస్పెషాలిటీ ఆస్పత్రులు, దంత, నేత్ర, హెయిర్, ఆయుర్వేద, హోమియో, యునానీ ఆస్పత్రులు ఈ ఎక్స్‌పోలో తమ స్టాల్స్‌ను ఏర్పాటు చేశాయి. ఇక్కడ ప్రదర్శించిన ఉత్పత్తులను, అందిస్తున్న ఉచిత సేవలను వినియోగించుకునేందుకు ప్రజలు బారులు తీరారు. రెండో రోజైన ఆదివారం టెన్‌కె రన్ వ్యవస్థాపకురాలు ఉమా చిగురుపాటి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేచురోథెరపీ నిపుణులు అజింక్యా పవార్, యోగా నిపుణురాలు జర్నామోహన్, ప్రముఖ వక్త నీలిమాభట్, జుంబా ట్రైనర్ విజయ తదితరులు ఎక్స్‌పోలో పాల్గొన్నారు. ప్రజలు రోగాల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటిం చాల్సిన చిట్కాలను వారు వివరించారు. జుంబా డ్యాన్స్ బాగుంది వివిధ పనులతో ఒత్తిడికి లోనవుతున్న వారికి జుంబా డ్యాన్స్ చాలా ఉపయోగకరంగా ఉంది. చిన్న చిట్కాలు, వ్యాయామాలతో ఒత్తిడిని తొలగించుకోవచ్చు. ‘స్ట్రెస్ టు స్వస్థ్’పై నీలిమా భట్ ఇచ్చిన సందేశం చాలా బాగుంది. ప్రతి ఒక్కరికీ అవసరమైన ఆహార పదార్థాలను, వ్యాయామాలను చేసే విధానాలను వివరంగా తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలు అందరికీ ఉపయోగకరంగా ఉంటాయి. - మురళి, చందానగర్ స్టీవియా మొక్క ఉపయోగం స్టీవియా మొక్కను కొనుగోలు చేశాను. ఈ మొక్క పెరిగిన తర్వాత వాటి ఆకులను చూర్ణంగా చేసుకుని వాడటం వల్ల రోగాలను నివారించవచ్చు. స్థూలకాయం, అజీర్ణం, నోటి వ్యాధులు, వాతరోగాలు, కీళ్ల నొప్పులు, ఆస్తమా, రక్తపోటు, జుట్టు రాలడం లాంటి సమస్యల నుంచి రక్షించుకోవచ్చు. ఈ మొక్క ఆకులు తియ్యగా ఉంటాయి. దీని విలువ 30 రూపాయలు మాత్రమే. - రజిని, బీహెచ్ఈఎల్ సైంధవ లవణం మంచిది ప్రపంచంలోనే అత్యంత నాణ్యమైన.. అత్యధిక పరిమాణంలో ఉండే సైంధవ లవణం(ఉప్పు) గనులు హిమాలయాల్లో ఉన్నాయి. సైంధవ లవణం ప్రకృతి ప్రసాదితం. దీనిని వాడటం వల్ల పక్షవాతం, థైరాయిడ్, బీపీ, చక్కెర వ్యాధి, కీళ్ల సమస్యలు వంటివి తలెత్తవు. సైంధవ లవణం రాయిని ఇంట్లో, ఆఫీస్‌లో, టేబుల్‌పై పెట్టుకుంటే పాజిటివ్ శక్తిని ఇస్తుంది. వాస్తుదోష నివారిణి. ఇంట్లోని గాలిని శుద్ధి చేస్తుంది. - ప్రవీణ్ కుమార్ ఆరోగ్య చిట్కాలు బాగున్నాయి ప్రదర్శనలో ఏర్పాటు చేసిన స్టాల్స్ నిర్వాహకులు చెపుతున్న ఆరోగ్య సూత్రాలు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. పెరటి మొక్కల ఉపయోగం చాలా ఉంది. అమ్మమ్మలు, నానమ్మలు చేసే సున్నుండలు, బెల్లంపట్టీలు లాంటి సంప్రదాయ వంటకాల్లో ఎన్నో పోషకాలుండేవి. అవి వదిలేసి పోషకాల కోసం ఖరీదైన పదార్థాల కోసం వెతుకుతున్నారు. మట్టికుండల్లో వంటలు, పెరట్లో పెరిగే పంటలు ఆరోగ్యానికి ఎంతో శ్రేయస్కరం. - లలిత, హబ్సిగూడ -
రిషితేశ్వరి ఫేస్బుక్ పేజీకి అనూహ్య స్పందన
గుంటూరు: ఆచార్య నాగార్జున యూనివర్సిటీ విద్యార్థిని రిషితేశ్వరి మరణానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని చేస్తున్న పోరాటానికి సోషల్ మీడియాలో అనూహ్య స్పందన వస్తోంది. వేలాది మంది విద్యార్థులు, ప్రజలు మద్దతుగా నిలిచారు. రిషితేశ్వరికి న్యాయం జరగాలంటూ విద్యార్థులు ఆమె పేరుతో ఫేస్ బుక్ పేజీని ప్రారంభించారు. రిషితేశ్వరికి జరిగిన అన్యాయం మరొకరికి జరగకుండా గొంతు విప్పాలని పిలుపునిచ్చారు. ఈ కేసుపై మీడియాలో వచ్చిన కథనాలు, నిందితుల ఫోటోలను పోస్ట్ చేశారు. రిషితేశ్వరి ఫేస్ బుక్ పేజీకి ఇప్పటికే 10 వేల లైక్‌లు వచ్చాయి. (చదవండి: రిషితేశ్వరి పేరుతో ఫేస్ బుక్ పేజీ) -
ఫేస్బుక్ పేజీకి అనూహ్య స్పందన
-
‘సాక్షి’ స్పెల్‌బీకి విశేష స్పందన
సాక్షి,నెట్వర్క్: ఆంగ్ల భాషపై విద్యార్థులు పట్టు సాధించేందుకు సాక్షి మీడియా ఆధ్వర్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ఆదివారం నిర్వహించిన సాక్షి ఇండియా స్పెల్ బీ- 2014 పోటీలకు విశేష స్పందన లభించింది. రెండు రాష్ట్రాల్లోని అన్ని జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేసిన స్పెల్ బీ జిల్లా స్థాయి సెకండ్ రౌండ్లో విద్యార్థులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. పరీక్ష రాసేందుకు వచ్చిన బాలబాలికలతో పరీక్ష కేంద్రాలన్నీ సందడిగా కనిపించాయి. చదివే తరగతి, వయసుల వారీగా నాలుగు విభాగాలుగా విభజించి పరీక్షలు నిర్వహించారు. సాక్షి టీవీ లైవ్ ద్వారా హైదరాబాద్ నుంచి వక్తలు ప్రశ్నలు వేయగా, పరీక్షా కేంద్రంలో ఉన్న విద్యార్థులు ఆంగ్లంలో తర్జుమా చేసి సమాధానాలు రాశారు. శాస్త్ర విజ్ఞానంతో నిర్వహిస్తున్న ఇలాంటి పరీక్షలు మెట్రోపాలిటన్ సిటీలకే పరిమితమయ్యాయని, ఈ పరిస్థితిలో జిల్లాల్లోనూ నిర్వహించడం సంతోషకరమని విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అన్నారు. అక్షర దోషాలు లేకుండా పదాలు రాయడం.. వాటిని పలికే విధానం.. కొత్త కొత్త ఇంగ్లిష్ పదాలు విద్యార్థులకు తెలియజేయడానికి ఇదెంతగానో ఉపకరిస్తుందన్నారు. తెలుగులో సైతం ఇలాంటి స్పెల్ బీ పరీక్ష నిర్వహించాలని పలువురు సూచించారు. -
'సాక్షి స్పెల్ బీ'కి విశేష స్పందన
-
సాక్షి స్పెల్‌బీకి విశేషస్పందన
-
ఇళయ రాజా ఫ్యాన్ క్లబ్‌కు విశేష స్పందన
-
అమ్మఒడి పథకానికి విశేష స్పందన
-
మోనో రైలుకు భారీ స్పందన
సాక్షి, ముంబై: కొత్త ఒక వింత.. అనే నానుడిని ముంబైకర్లు నిజం చేస్తున్నారు. ఏ నిమిషాన మోనో రైలు ప్రారంభమైందో.. అప్పటినుంచి దానిలో ప్రయాణించడానికే ఉవ్విళ్లూరుతున్నారు. ఈ నేపథ్యంలో తెల్లవారకముందే మోనో రైల్వే స్టేషన్ చేరుకుంటున్నారు. మధ్యాహ్నం సేవలు నిలిపివేసిన తర్వాత కూడా అక్కడి నుంచి జనం కదలడం లేదు. స్థానికుల నుంచి ఈ స్పందన చూసి అధికారులే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే టికెట్ ధర కేవలం ఐదురూపాయలు మాత్రమే ఉండడంతో వారు కేవలం జాయ్ రైడ్ కోసమే మోనో రైలులో ప్రయాణిస్తున్నారా..? అనే అనుమానాలు వస్తున్నాయి. నియమ, నిబంధనల ప్రకారం ఉదయం నుంచి మధ్యాహ్నం 3.15 గంటల వరకు మాత్రమే మోనో రైలు నడపాలి. కానీ సోమవారం విపరీతమైన రద్దీ కావడంతో సాయంత్రం 4.30 గంటల వరకు నడపాల్సి వచ్చింది. ఇందులో మొత్తం 64 ట్రిప్పులు నడవగా సుమారు 19,600 మంది ప్రయాణికులు రాకపోకలు సాగించినట్లు జారీ అయిన టికెట్లను బట్టి తెలుస్తోందని ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (ఎమ్మెమ్మార్డీయే) డెరైక్టర్ దిలీప్ కవట్కర్ చెప్పారు. వీరివల్ల ఎమ్మెమ్మార్డీయేకు రూ.రెండు లక్షల ఆదాయం వచ్చిందని ఆయన అన్నారు. ఇదిలా ఉండగా సుమారు తొమ్మిది కి.మీ. పొడవున్న చెంబూర్-వడాల మధ్య ఏడు ప్రముఖ స్టేషన్లు ఉన్నాయి. ఇక్కడ ఉదయం నుంచి క్యూలు కట్టారు. రద్దీని దృష్టిలో ఉంచుకుని అదనంగా భద్రత దళాలను మోహరించాల్సి వచ్చింది. కాని ఈ మార్గంలోని ఏ స్టేషన్లోనూ ప్రయాణికులకు తాగునీరు, టాయిలెట్లు, టీ, అల్పాహార స్టాళ్లు లాంటి కనీస సదుపాయాలు కల్పించకపోవడంతో ఇబ్బం దులు పడుతున్నారు. టాయిలెట్లు లేకపోవడంతో ముఖ్యంగా మహిళలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఇప్పటికే అక్కడ ఏర్పాటుచేసిన టికెట్ వెండింగ్ మెషిన్ (టీవీఎం)లు పాత రూపాయి నాణాలను స్వీకరించకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. దీనికి తోడు కొన్ని స్టేషన్లలో రైలు దిగిన ప్రయాణికులు స్టేషన్ నుంచి బయట పడేందుకు డోర్లు తెరుచుకోవడం లేదు. దీంతో ఒక్కసారిగా తోపులాటలు జరుగుతున్నాయి. కొద్ది రోజులు పరిస్థితులు ఇలాగే ఉంటాయని, అయిదే ఏ ఉద్దేశంతో మోనో రైలు సేవలు ప్రారంభించామో ఆ లక్ష్యాన్ని చేరుకునేందుకు కొంత సమయం పడుతుందని దిలీప్ కవట్కర్ వివరించారు. -
సాక్షి స్కూల్ ఆఫ్ జర్నలిజం ప్రవేశ పరీక్షకు విశేష స్పందన
-
వరంగల్‌లో సాక్షి స్పెల్‌బీ కి భారీ స్పందన
-
సమైక్య శంఖారావానికి జన నీరాజనం
-
రాజమండ్రిలో భారీసంఖ్యలో సమైక్యగళం