ఆచార్య నాగార్జున యూనివర్సిటీ విద్యార్థిని రిషితేశ్వరి మరణానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని చేస్తున్న పోరాటానికి సోషల్ మీడియాలో అనూహ్య స్పందన వస్తోంది. వేలాది మంది విద్యార్థులు, ప్రజలు మద్దతుగా నిలిచారు. రిషితేశ్వరికి న్యాయం జరగాలంటూ విద్యార్థులు ఆమె పేరుతో ఫేస్ బుక్ పేజీని ప్రారంభించారు. రిషితేశ్వరికి జరిగిన అన్యాయం మరొకరికి జరగకుండా గొంతు విప్పాలని పిలుపునిచ్చారు. ఈ కేసుపై మీడియాలో వచ్చిన కథనాలు, నిందితుల ఫోటోలను పోస్ట్ చేశారు. రిషితేశ్వరి ఫేస్ బుక్ పేజీకి ఇప్పటికే 10 వేల లైక్లు వచ్చాయి.