నాగార్జున యూనివర్సిటీలో ఓ కులం వారి ఆగడాలకు అడ్డులేకుండా పోతోందని ఆర్కిటెక్చర్ కాలేజీ ప్రొఫెసర్ డేవిడ్ రాజు అన్నారు.ప్రశ్నించిన వారిని, నిజాలు మాట్లాడేవారి నోరు నొక్కేస్తూ కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆయన మంగళవారమిక్కడ తెలిపారు. ప్రిన్సిపాల్ బాబూరావు మద్యం తాగి క్లాసుకు వస్తారని, ప్రతిరోజు మధ్యాహ్నం రెండు గంటల పాటు స్టాప్ రూమ్లోనే నిద్రపోతారని, అమ్మాయిలతో బాబూరావు అసభ్యకరంగా వ్యవహిరించే మాట వాస్తవమని డేవిడ్ రాజు అన్నారు