ఆచార్య నాగార్జున యూనివర్సిటీ విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్య కేసులో రెండో డైరీపై ఫోరెన్సిక్ నివేదిక వెల్లడైంది. సూసైడ్ నోట్ తో పాటు, రెండో డైరీలోని చేతిరాత రిషితేశ్వరిదేనని నివేదికలో తేలింది. మొత్తం రెండు డైరీలతో పాటు రిషితేశ్వరికి చెందిన మరో నాలుగు నోట్ బుక్స్ను ఫోరెన్సిక్ అధికారులు పరీక్షించారు.