Facebook Traffic
-
ఫేస్బుక్లో హింస ఈ రేంజ్లో ఉందా!?
ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించే అకౌంట్లపై దృష్టిసారించింది. ఇందులో భాగంగా ఈ ఏడాది జూన్ 16 నుంచి జులై 31 మధ్య కాలంలో సుమారు 33.3 మిలియన్ల కంటెంట్ పీస్ (ఇమేజ్)లను అకౌంట్ల నుంచి తొలగించినట్లు ప్రకటించింది. యూజర్లు సేఫ్ అండ్ సెక్యూర్‌గా ఉండేందుకు ఫేస్ బుక్ గత కొంత కాలంగా యూజర్లు టెక్నాలజీ, ఏఐలపై భారీ ఎత్తున పెట్టుబడులు పెడుతోంది. తద్వారా ఫేస్ బుక్ యూజర్లకు ఎలాంటి నష్టం జరగకుండా ఉండేలా ఇమేజెస్, కంటెంట్లపై కన్నేసింది. ఈ రెండింటిలో ఫేస్‌బుక్‌కు చెందిన 10 కంటెంట్ పాలసీ నిబంధనలతో పాటు ఆ సంస్థకు చెందిన మరో సోషల్ నెట్ వర్క్ ఇన్ స్టాగ్రామ్‌లో 8 పాలసీల నిబంధనల్ని ఉల్లంఘించిన అకౌంట్లపై చర్యలు తీసుకుంటుంది. సోషల్ మీడియా వల్ల హింస పెరిగిపోతుందా? కరోనా కారణంగా సోషల్ మీడియా వినియోగం రోజురోజుకి పెరిగిపోయింది. సరైన అవగాహన ఉన్నవారు మనీ ఎర్నింగ్ కోసం ఫేస్‌బుక్‌ను ఓ వేదికగా మార్చుకుంటున్నారు. అదే సమయంలో మరికొందురు రెచ్చగొడుతూ హింసను ప్రేరేపించేలా ఉన్న కంటెంట్లను భారీగా తొలగించామంటూ ఇటీవల ఫేస్బుక్ స్పోక్ పర్సన్ కీలక వ్యాఖ్యలు చేశారు. జులై 16 నుంచి జులై 31 మధ్య కాలంలో 25.6 మిలియన్ల ఇమేజ్ కంటెంట్, హింసను రెచ్చగొట్టేలా ఉన్న 3.5 మిలియన్ల గ్రాఫికల్ ఇమేజెస్‌పై, 2.6 మిలియన్ల అడల్ట్ కంటెంట్ ఉన్న ఇమేజెస్‌లను తొలగించినట్లు తెలిపారు. వీటితో పాటు 1లక్షా 23,400 హరాస్ మెంట్ కంటెంట్ ఉన్న అకౌంట్లపై చర్యలు తీసుకుంటున్నట్లు,1504 రిపోర్ట్‌ల ఫిర్యాదులు అందాయని వెల్లడించింది. ఫేస్బుక్కే కాదు.. ఇన్ స్టాగ్రామ్ లో కూడా.. ఫేస్బుక్కే కాదు..ఇన్ స్టాగ్రామ్ పోస్ట్‌లపై చర్యలు తీసుకుంటున్నట్లు ఫేస్బుక్ యాజమాన్యం వెల్లడించింది. 1.1 మిలియన్ల హింసాత్మక పోస్ట్‌లు, 8,11,000 వేల సూసైడ్, సెల్ఫ్ ఇంజూరీ ఇమేజ్ కంటెంట్ లపై చర్యలకు ఉపక్రమించింది. జూన్ 16 నుంచి జులై 31 వరకు 265 అకౌంట్లపై యూజర్లు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించింది. వాట్సాప్ లో సైతం ఫేస్బుక్ కు చెందిన మెసేజింగ్ ప్లాట్ ఫామ్ వాట్సాప్‌లో జూన్ 16 నుంచి జులై 31 వరకు 3 మిలియన్ కంటే ఎక్కువ అకౌంట్లును తొలగించింది. ఇదే సమయంలో సెర్చ్ ఇంజిన్ గూగుల్ కు 36,934 ఫిర్యాదులు అందగా..95,680 ఇమేజెస్‌ను తొలగించింది. చదవండి: ఇకపై ఈజీగా ఎలక్ట్రిక్ వెహికల్‌ను సొంతం చేసుకోవచ్చు! -
ఫేస్బుక్లో మరో సూపర్ ఫీచర్, వాయిస్,వీడియో కాలింగ్..
మనం ఫోన్ తో చేసే వాయిస్ కాల్, వీడియోకాల్‌ను ఇకపై ఫేస్ బుక్ నుంచి చేసే అవకాశం ఉంది. ఎస్. ఫేస్ బుక్ ను మరింత అందంగా తీర్చిదిద్దేందుకు ఆ సంస్థ సీఈఓ మార్క్ జూకర్ బెర్గ్ ప్రయత్నాలు చేస్తున్నారు.ఇందులో భాగంగా యుజర్లను మరింత అట్రాక్ట్ చేసేందుకు వాయిస్ - వీడియా కాలింగ్ ఆప్షన్ పై వర్క్ చేస్తున్నారని బ్లూమ్ బెర్గ్ తెలిపింది. వాస్తవానికి ఈ ఫీచర్‌ను ఫేస్బుక్..'ఫేస్బుక్ మెసేంజర్'కు అటాచ్ చేసింది. దీంతో యూజర్లు వీడియో కాలింగ్ చేసుకోవాలంటే ఫేస్బుక్ మెయిన్ పేజ్‌ను క్లోజ్ చేసి మెసేంజర్‌లోకి వెళ్లేవారు. అలా వెళ్లడం వల్ల యూజర్లు ఫేస్బుక్ ను వినియోగించడం తగ్గిస్తున్నారని మార్క్ జూకర్ బెర్గ్ గుర్తించారు. అయితే అప్పటి వరకు ఒకటిగా ఉన్న ఫేస్ బుక్ ను - ఫేస్ బుక్ మెసెంజర్ ను 2014లో వేరు చేశారు. వాయిస్ - వీడియో కాలింగ్ ఆప్షన్ ను ఫేస్ బుక్ మెసెంజర్‌కు జోడించారు. ఇప్పుడు మళ్లీ ఇదే ఫీచర్ ను ఫేస్బుక్ డెవలప్ చేసే పనిలో పడిందని బ్లూమ్ బెర్గ్ తన కథనంలో ప్రస్తావించింది.త్వరలో ఈ ఫీచర్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుందని పేర్కొంది. -
Facebook: కొత్త ఫీచర్ గురించి తెలుసా?!
సాక్షి, ముంబై: గతేడాది ఫేస్బుక్ ప్రైవసీ ఫీచర్ ను అందుబాటులోకి తెచ్చింది. ఆఫ్ - ఫేస్బుక్ పేరుతో తెచ్చిన ఈ ఫీచర్ సాయంతో ఫేస్బుక్ లో యాప్స్, వెబ్ సైట్లు, థర్డ్ పార్టీ సైట్లు షేర్ చేసే డేటాను మీరు కంట్రోల్ చేయవచ్చు. ఆ ఆప్షన్ ను మీరు ఆన్ చేస్తే కంటెంట్ మీ ఫేస్ బుక్ లో డిస్ప్లే అవుతుంది. ఆ డేటా ను మీరు క్లియర్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. అదే ఆప్షన్ ఆఫ్ చేస్తే ఆ డేటా ఫేస్బుక్లో కనిపించదు. అంతేకాదు ఏ కంపెనీకి చెందిన యాడ్స్ ఫేస్బుక్లో కనిపించాలన్నా, లేదా బ్లాక్ చేయాలన్నా అంతా మీ చేతిలోనే ఉంటుంది. దీంతో పాటు మీరు ఫేస్బుక్లో ఏ కంటెంట్‌ను ఎక్కువగా చూస్తున్నారో థర్డ్ పార్టీ యాప్స్ సాయంతో తెలుసుకోవడం కష్టం. ఆఫ్-ఫేస్ బుక్ ఫీచర్ తో లాభం ఏంటి? ఫేస్బుక్ లో కొన్ని టూల్స్ ను వినియోగించి బిజినెస్ కు సంబంధించిన యాడ్స్, ప్రమోషన్, లేదంటే ఫేస్బుక్ యూజర్ వ్యక్తిగత డేటా తెలుసుకోవచ్చు. అయితే మీరు ఆఫ్ ఫేస్బుక్ టూల్ తో ఏఏ సంస్థలు మీకు బిజినెస్ రిలేటెడ్ కంటెంట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాయో తెలుసుకోవచ్చు. మరి ఈ టూల్ ను ఎలా వినియోగించుకోవాలో తెలుసుకుందాం. (Facebook smartwatch: ఆ దిగ్గజాలకు గట్టి పోటీ!) ఆఫ్-ఫేస్ బుక్ టూల్ ను ఎలా యాక్టివ్ చేసుకోవాలి? • ముందుగా ఫేస్బుక్ సెట్టింగ్ అండ్ ప్రైవసీ ఆప్షన్ లోకి వెళ్లాలి. • ఆ తరువాత సెట్టింగ్ పై క్లిక్ చేయండి. • సెట్టింగ్ పై క్లిక్ చేసిన వెంటనే “యువర్ ఫేస్ బుక్ ఇన్ఫర్మేషన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. • ఆ తరువాత ఆఫ్ ఫేస్బుక్ యాక్టివిటీ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఇక్కడ నుండి మీరు మీ ఆఫ్ ఫేస్బుక్ టూల్ ని యూజ్ చేసి ఇక పై మీ ఫేస్బుక్లో ఎలాంటి వ్యాపార కార్యకలాపాలు నిర్వహించాలో డిసైడ్ చేయోచ్చు. అంతేకాదు మీరు ఫేస్బుక్ లో చూసిన కంటెంట్ హిస్టరీని డిలీట్ చేయోచ్చు. ఆఫ్ ఫేస్ బుక్ ఫీచర్ ను ఆపేస్తే ఏమవుతుంది? ఆఫ్ ఫేస్బుక్ ఫీచర్ ను ఆఫ్ చేస్తే వెబ్ సైట్లు, యాప్స్, ఇతర థర్డ్ పార్టీ టూల్స్ ఫేస్ బుక్ లో మీరు ఏ కంటెంట్ చూస్తున్నారో కనిపెట్టలేవు. ఫేస్బుక్ సైతం మీరు ఏం కంటెంట్ చూస్తున్నారో గుర్తించలేదు. దీంతో పాటు యాడ్స్ కూడా మీ ఫేస్ బుక్ లో డిస్ ప్లే కావు. (కావాలనుకుంటే శాశ్వతంగా వర్క్ ఫ్రం హోం చేసుకోవచ్చు!) మీరు యాపిల్ సంస్థ డివైజెస్ ను వినియోగిస్తున్నారా? అయితే ఇటీవల యాపిల్ సంస్థ iOS 14.5 అప్ డేట్ ను విడుదల చేసింది. దీని సాయంతో ఫేస్ బుక్ లో మీ వ్యక్తిగత సమాచారాన్ని, లేదంటే డిస్ ప్లే అవుతున్న పలు కంపెనీల యాడ్స్ , మీరు చూసే కంటెంట్‌ను వ్యాపారం నిమిత్తం ఇతర కంపెనీలకు షేర్ చేయడం అసాధ్యం అవుతుంది. (Covaxin: అమెరికాలో భారీ ఎదురుదెబ్బ!) -
వైరల్‌గా మారిన వరదలు
-
వరదలు వచ్చాయి...వైరల్‌గా మారాయి
వానొచ్చెనంటే వరదొస్తది....అని పాట పాడుకుంటే బాగానే ఉంటుంది. కానీ దాని వల్ల కలిగే ఇబ్బంది ఏంటో...ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్‌గా మారి ట్రెండ్ అవుతోంది. మొన్నటి వరకు సేవ్ సిరియా అంటూ ఫేస్బుక్లో హల్చల్. ఇప్పుడు.. ప్రకృతికి కోపం వస్తే అది సృష్టించే విధ్వంసం ఎలా ఉంటుందో తెలిపే ఓ వీడియోను నెటిజన్లు షేర్ల్లు చేసుకుంటున్నారు. నీరు వరదలా రోడ్డుపై పారుతూ ఉంటే...అటువైపు వచ్చిన ఎన్నో వాహనాలు బోర్లా పడ్డాయి. అది ఎప్పుడు జరిగింది?, ఎక్కడ జరిగింది?, అసలు ఏమైంది? వంటి కామెంట్లతో ఫేస్బుక్లో ఈ వీడియో వైరల్‌గా మారింది. -
'పద్మావత్'కు మరోషాక్ :ఎఫ్బీలో ఫుల్ మూవీ
ఎన్నో వివాదాలు, మరెన్నో ఆందోళనల మధ్య సంజయ్ లీలా భన్సాలీ మూవీ 'పద్మావత్' నేడు(గురువారం) ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అటు కర్ణిసేన ఆందోళనలతో తీవ్ర చిక్కుల్లో కూరుకున్న ఈ మూవీకి, ఓ ఫేస్బుక్ పేజీ కూడా తీవ్ర షాకిచ్చింది. పద్మావత్ ఫుల్ మూవీని ఫేస్బుక్లో లీక్ చేసింది. ' జాటోన్ కా అడ్డ' అనే ఫేస్బుక్ పేజీ, థియేటర్లో స్క్రీన్ అవుతున్న ఈ మూవీని లైవ్ స్ట్రీమ్ చేసింది. ఇలా లైవ్ స్ట్రీమ్ అవుతున్న సమయంలోనే ఈ ఫేస్బుక్ పేజీ లింక్‌ను 15వేల మంది షేర్ చేయగా... ఈ వీడియోకు 3.5 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. ఇప్పటికే కర్ణిసేన విధ్వంసనలతో తీవ్రంగా ఆందోళన చెందుతున్న మూవీ యూనిట్ సభ్యులకు ఇది మరింత దిగ్భ్రాంతికి గురి చేసింది. కాగ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గోవా, గుజరాత్ రాష్ట్రాల్లో ఈ సినిమా విడుదల ఆపివేశారు. రాజ్‌పుత్‌ల ప్రభావం బలంగా ఉండడం, ప్రజల సెంటిమెంట్, కర్ణిసేన హెచ్చరికలు తదితర కారణాల వల్ల అవాంఛనీయ పరిణామాలు చోటుచేసుకుంటాయనే భావనతో ఇక్కడ మల్టీప్లెక్స్ యజమానుల సంఘం సినిమాను ప్రదర్శించబోమని ప్రకటించింది. దక్షిణాది రాష్ట్రాల్లో పద్మావత్ ప్రదర్శన సాఫీగా సాగుతోంది. దీపికా పదుకోన్, షాహిద్ కపూర్, రణ్వీర సింగ్‌లు ఈ సినిమాలో ప్రధాన పాత్రదారులుగా నటించారు. దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ ఈ మూవీని తెరకెక్కించారు. ఈ సినిమా చూడ్డానికి బాగుందంటూ మిక్స్డ్ రివ్యూస్ కూడా వచ్చాయి. అయినప్పటికీ కర్ణిసేన ఆందోళనలను మాత్రం తగ్గించడం లేదు. -
మహారాష్ట్రలో చిచ్చు పెట్టిన ‘ఫేస్బుక్ పేజీ’
సాక్షి, న్యూఢిల్లీ : మహారాష్ట్ర దళితుల ఆందోళనతో దద్ధరిల్లిపోవడానికి దారితీసిన భీమా కోరేగావ్ సంఘటనకు బాధ్యలెవరు? కొత్త సంవత్సరం సందర్భంగా ప్రతి ఏటా జనవరి ఒకటవ తేదీన భీమా కోరేగావ్ స్థూపం వద్ద ప్రశాంతంగా జరిగే సైనిక సంస్మరణ కార్యక్రమం ఎందుకు ఉద్రిక్తతలకు దారితీసింది? కాషాయ వస్త్రాలు, జెండాలు ధరించిన మరాఠా మూకలు దాడి చేశారంటూ నీలి రంగు జెండాలతో దేశం నలుమూలల నుంచి వచ్చిన దళితులు చేస్తున్న ఆరోపణల్లో నిజమెంత? ఊరూరు నుంచి తరలి వచ్చింది దళితులేనని, ఒక్క ఊరి వారమైనా తాము పరిమిత సంఖ్యలో ఉండి దాడులకు ఎలా సాహసిస్తామని అంటున్న స్థానిక మరాఠాల మాటల్లో నిజమెంత? మహారాష్ట్రలోని పుణె నగరానికి 30 కిలోమీటర్ల దూరంలో భీమా నది ఒడ్డునున్న కోరేగావ్ గ్రామంలో నాటి నుంచి నేటి వరకు మరాఠాలు, పెషావర్లు, దళితులు ఎక్కువే. 200 సంవత్సరాల క్రితమ అగ్రవర్ణానికి చెందిన పెషావర్ల సైన్యాన్ని బ్రిటీష్ సైన్యంతో కలసి దళితులైన మహర్లు తరిమికొట్టారు. దళితులైనప్పటికీ నాటి బ్రిటీష్ ఇండియా ప్రభుత్వం వారిని తమ సైన్యంలో చేర్చుకొంది. (సాక్షి ప్రత్యేకం) అప్పటికే సామాజిక న్యాయం కోరుతున్న దళితులు తమకు ఉద్యోగం ఇచ్చిందన్న కతజ్ఞతతో, పెషావర్లపై నున్న ఆగ్రహంతో బ్రిటీష్ సైన్యంతో కలిసి యుద్ధం చేశారు. అందులో ప్రాణాలు కోల్పోయిన దళిత హీరోల స్మారకార్థం భీమా కోరేగావ్‌లో 1851లో స్థూపం వెలిసింది. కాషాయ జెండాలు కలిగిన హిందూ సంఘాలు తమపై దాడి చేశాయంటూ ఇటు దళితులు, నీలి జెండాలు కలిగిన దళితులే దాడులు చేశారంటూ మరాఠా, ఇతర హిందూ సంస్థల నాయకులు పరస్పరం ఆరోపిస్తున్నారు. సాక్ష్యాలు ఇవిగో అంటూ ఇరువర్గాల వారు వీడియో రికార్డింగ్‌లను చూపిస్తున్నారు. వాటిల్లో ఇరువర్గాలు రాళ్లు విసురుకోవడం, ఘర్షణ పడడం కనిపిస్తోంది. స్థానికంగా ఇరువర్గాల ఇళ్లు, దుకాణాలు తగులబడుతూ కనిపిస్తున్నాయి. పోలీసులకు ఇరువర్గాల వారు ఘర్షణ పడుతున్నారని చెబుతున్నారుగానీ, అసలు ఉద్రిక్తతలకు ఎవరు బాధ్యులన్న విషయాన్ని స్పష్టం చేయడం లేదు. మొత్తంగా అన్ని అంశాలను క్షుణ్నంగా పరిశీలిస్తే ఈ ఉద్రిక్తలకు వారం రోజుల క్రితమే బీజాలు పడ్డాయని, వ్యూహం ప్రకారం గత వారం రోజులుగా ‘ఫేస్బుక్’లో జరుగుతున్న ప్రచారమే ఈ ఉద్రిక్తతలకు దారితీసిందని స్పష్టం అవుతోంది. కొంత మంది ఔత్సాహిక చరిత్రకారులు ఫేస్బుక్లో నడుపుతున్న ‘ఇతిహాస ఫాల్ఖుదా’ అనే మరాఠా పేజీ నేటి ఉద్రిక్తతలకు కారణమైంది. ‘భీమా కోరేగావ్’ చరిత్రతో దళితులైన మహర్లకు ఎలాంటి సంబంధం లేదని, భీమా కోరేగావ్ యుద్ధం కేవలం పెషావర్లకు, బ్రిటీష్ సైన్యానికి మధ్య జరిగినది మాత్రమేనని ఆ మరాఠా పేజీలో ఔత్సాహిక చరిత్రకారులు వాదించారు. ఆ యుద్ధం గురించి ప్రస్తావించిన బ్రిటిష్ డాక్యుమెంట్లను సాక్షంగా చూపారు. మహర్లు నిజంగా యుద్ధం చేసి ఉంటే బ్రిటిష్ డాక్యుమెంట్లలో వారి ప్రస్తావన ఉండేదని తర్కం తీసుకొచ్చారు. మహర్ రెజిమెంట్ ఏర్పాటు కాకముందే దాదాపు 500 మంది మహర్లు బ్రిటిష్ తరఫున పోరాటం చేశారని, (సాక్షి ప్రత్యేకం) అందుకు భారత చరిత్రలో సాక్ష్యాధారాలు ఉన్నాయని సావిత్రిభాయ్ ఫూలే పుణే యూనివర్శిటీలో చరిత్ర విభాగం ప్రొఫెసర్ శ్రద్ధా కుంభోజ్కర్ తెలిపారు. బ్రిటీష్ డాక్యుమెంట్లు తమ సైన్యం చేసిన యుద్ధాల గురించి చెబుతుందిగానీ, ఆ యుద్ధంలో మహర్లు పాల్గొన్నారా? మరొకరు పాల్గొన్నారా? అన్న విషయాన్ని ఎందుకు పేర్కొంటుందని ఆమె ప్రశ్నించారు. అగ్రవర్ణాలపై యుద్ధం చేయడానికి భీమా కోరేగావ్ దళితులకు ఎంతో స్ఫూర్తినిచ్చిందని, అంతటి స్ఫూర్తినిచ్చిన యుద్ధంతో వారికి సంబంధం లేదంటూ చరిత్రకు మరోరూపం ఇచ్చేందుకు ఈ ఫేస్బుక్ పేజి ప్రయత్నించినట్లు అర్థం అవుతోందని ప్రొఫెసర్ వివరించారు. దేశంలో గత రెండు, మూడేళ్లుగా చరిత్రకు మరో భాష్యం చెప్పే ప్రయత్నాలు ఎక్కువగానే కొనసాగుతున్నాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. చరిత్రో పెషావర్లు చేసిన అన్ని యుద్ధాలతోపాటు భీమా కోరేగావ్‌లో మహర్లతో పెషావర్లకు మధ్య జరిగిన యుద్ధం గురించి కూడా ‘మంత్రవేగ్ల’ పుస్తకంలో రచయిత ఎన్ఎస్ ఇనాంధర్ వివరించారు. (సాక్షి ప్రత్యేకం) ఫేస్బుక్ మరాఠా పేజీలో వారం, పది రోజుల నుంచి జరుగుతున్న చర్చను చదువుకున్న నేటి దళిత యువతలో కొంత మంది తీవ్రంగానే ఖండించారు. ఈసారి పెద్ద ఎత్తున స్మారక దినోత్సవం జరుపుకోవాలని కూడా దళిత సంఘాలు నిర్ణయించాయి. అందులో భాగంగా ఎక్కువ మంది దళితులు కోరేగావ్ తరలి వచ్చారు. -
గౌరీలంకేష్లా చావాలని లేదు
సాక్షి, బెంగళూర్ : గత 8 నెలలుగా, మితవాదులు, హిందూ అతివాద సంస్థలపై వ్యంగ్య పోస్టులతో విరుచుకుపడుతున్న ఫేస్బుక్ పేజీ ఆగిపోయింది. ‘హ్యుమన్స్ ఆఫ్ హిందుత్వ’ ను నిలుపుదల చేసి, డిలేట్ చేస్తున్నట్లు ఆ పేజీ అడ్మిన్ గురువారం ప్రకటించారు. సత్యనాశ్ అనే సైట్లో ఈ మేరకు ఓ సందేశం ఉంచారు. ‘‘నా పేజీ గురించి ఇప్పటిదాకా వ్యతిరేకత, అభ్యంతరాలు రాలేదు. కానీ, గత కొన్ని రోజులుగా నన్ను చంపుతామని కొందరు బెదిరిస్తున్నారు. వాటిని నేను తేలికగా తీసుకోదల్చుకోలేదు. నేనో మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చా. ఎలాంటి రాజకీయ సంబంధాలు లేవ్. బీజేపీ పాలనలో నేను ఉన్నా. గౌరీ లంకేష్, అఫ్రజుల్ ఖాన్(రాజస్థాన్ లవ్ జిహాద్ బాధితుడు)లా చావాలని నాకు లేదు. నా కుటంబమే నాకు ముఖ్యం’’ అని అడ్మిన్ ఆ సందేశంలో పేర్కొన్నాడు. కాగా, అజ్ఞాతంలో ఉంటూనే ఆ పేజీ నిర్వాహకుడు మెసేంజర్ల ద్వారా ఇంటర్వ్యూ ఇచ్చేవాడు. పేజీ ప్రారంభించిన కొద్దిరోజుల్లోనే ప్రభావవంతమైన ఫోటోలు, పోస్టులతో చర్చనీయాంశమైంది. కాగా, ప్రస్తుతం కన్నడనాట మీడియా స్వేచ్ఛ అంశంపై హాట్ హాట్‌గా చర్చ కొనసాగుతోంది. -
facebook tips
ఫేస్బుక్.. ప్రస్తుతం స్కూల్ విద్యార్థుల నుంచి సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరూ వినియోగిస్తున్న సామాజిక మాధ్యమం. ఇక యువతీ, యువకుల సంగతి చెప్పాల్సిన పనిలేదు. ఒక్క పోస్టింగ్ లేదా ఫ్రెండ్ రిక్వెస్ట్‌తో ఎంతో మంది స్నేహితులను సంపాదించుకోవచ్చు. అలాగే వివాదస్పద అంశాలను పోస్ట్ చేసినా, కామెంట్ చేసినా కష్టాలూ తప్పవు. ఇలాంటి పరిస్థితుల్లో ఫేస్‌బుక్‌ను సురక్షితంగా వినియోగించుకోవడానికి సూచనలు.. ♦ మొబైల్ నంబర్, అడ్రస్, ఈ–మెయిల్ ఐడీకి సంబంధించిన వివరాలను ఫేస్బుక్ ప్రొఫైల్‌లో పెట్టకూడదు. ♦ సాధ్యమైనంత వరకు "keep me logged in' ఆప్షన్‌పై క్లిక్ చేయకపోవడం ఉత్తమం. ఈ చర్య అన్ని సందర్భాల్లో మంచిది కాదు. ♦ ఇతరుల లేదా పబ్లిక్ కంప్యూటర్ నుంచి వీలైనంత వరకు లాగిన్ కాకపోవడం మంచిది. ♦ పరిచయం లేని వ్యక్తుల ఫ్రెండ్ రిక్వెస్ట్‌లను యాక్సెప్ట్ చేయకూడదు. ♦ ఇతరులతో చాట్ చేస్తున్నప్పుడు చాట్ బాక్స్‌లో వ్యక్తిగత వివరాలను పోస్ట్ చేయకూడదు. ♦ మీ ప్రయాణ, ఉద్యోగ, కుటుంబ, వ్యక్తిగత వివరాలను ఫేస్బుక్ అకౌంట్లో పోస్ట్ చేయకపోవడం మంచిది. ♦ పటిష్ట పాస్వర్డ్.. అంటే ఎంపిక చేసుకునే పాస్‌వర్డ్‌లో అక్షరాలు, విరామ చిహ్నాలు ఉండే విధంగా చూసుకోవాలి. ♦ ఎలాంటి పరిస్థితుల్లోనూ ఫేస్బుక్ అకౌంట్‌ను లాగ్ అవుట్ చేయడం మరవద్దు. ♦ ఫేస్బుక్ అకౌంట్ వినియోగిస్తున్న పర్సనల్ కంప్యూటర్ లేదా స్మార్ట్‌ఫోన్‌లో యాంటీ వైరస్ సాఫ్ట్వేర్ తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి. ♦ మీరు పంపే పోస్టులు ముఖ్యమైన వ్యక్తులకు మాత్రమే చేరే విధంగా ‘ప్రైవసీ సెట్టింగ్స్’లో మార్పులు చేసుకోవాలి. ♦ వివాదాస్పద, అనవసర పోస్ట్‌లను ఫేస్బుక్ అకౌంట్లో పోస్ట్ చేయడం మంచిది కాదు. ♦ ఫేస్బుక్ అకౌంట్‌కి సెక్యూరిటీ చాలా అవసరం. సెక్యూరిటీ సరిగా లేకుంటే ఇతరులు మీ ఫేస్బుక్ అకౌంట్‌ను హ్యాక్ చేసి అసభ్య సందేశాలు, చిత్రాలు పోస్ట్ చేసే ప్రమాదం ఉంది. ♦ నకిలీ అకౌంట్లతో కేర్‌ఫుల్‌గా ఉండాలి. అలాగే మీరు పోస్ట్ చేసిన అంశానికి లైక్‌లు రాలేదని బెంగ వద్దు. ♦ నచ్చిన వీడియోలను సేవ్ చేసుకోవడం కోసం ఆ వీడియోపై రైట్ క్లిక్ చేసి సేవ్ వీడియో ఆప్షన్‌ను సెలెక్ట్ చేసుకుంటే.. ఖాళీ సమయంలో ఆ వీడియోను చూడొచ్చు. ♦ క్రోమ్ బ్రౌజర్ నుంచి డైరెక్ట్‌గా ఫేస్‌బుక్‌లోకి వెళ్లడం ద్వారా బ్యాటరీని సేవ్ చేసుకోవచ్చు. అలాకాకుండా ప్లేస్టోర్ నుంచి ఫేస్బుక్ యాప్‌ని డౌన్లోడ్ చేసుకుంటే విరామం లేకుండా ఆన్‌లో ఉండటం వల్ల బ్యాటరీ త్వరగా అయిపోతుంది. ♦ చాటింగ్ వద్దనుకుంటే డిజేబుల్ ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు. ♦ మెసేజ్‌లు, నోటిఫికేషన్స్‌ను మ్యూట్ చేయాలనుకుంటే facebook app > messagesలోకి వెళ్లి మ్యూట్ చేయదలచిన వ్యక్తిని ఎంపిక చేసుకోవాలి. తర్వాత మెనూ పైన కనిపించే ఐకాన్‌ను క్లిక్ చేయడం ద్వారా నోటిఫికేషన్లు ఓపెన్ అవుతాయి. వాటిలో మ్యూట్ నోటిఫికేషన్స్‌ను సెలెక్ట్ చేసుకోవాలి. ♦ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ నుంచి ఫ్రెండ్స్‌కి మెసేజ్ పంపిన ప్రతిసారి లొకేషన్ ఆటోమేటిక్‌గా కనిపిస్తుంది. ఈ లొకేషన్‌ను "Turn off"‘ చేయాలంటే ముందుగా ఫేస్బుక్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి.. మెసెంజర్ లొకేషన్ ఆప్షన్‌ను అన్‌టిక్ చేయడం ద్వారా మెసేజ్ లొకేషన్ టర్న్ ఆఫ్ అవుతుంది. ♦ ఫేస్బుక్ యాప్‌లో గ్రూప్ మెసేజ్‌లు క్రియేట్ చేయాలంటే.. ముందుగా మెసేజ్ ఐకాన్‌పై క్లిక్ చేసి గ్రూప్ ఆప్షన్‌ను సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత కావాల్సిన వ్యక్తులను గ్రూప్‌లోకి యాడ్ చేసుకుని మెసేజ్ టైప్‌చేసి సెండ్ చేయాలి. ♦ ఫేస్బుక్లో ఏదైనా కామెంట్‌ను కాపీ చేయాలంటే ఆ కామెంట్‌పై కొద్ది సేపు టాప్ చేసి ఉంచితే మెనూ ఓపెన్ అవుతుంది. మెనూలోని "copy comment'’ ఆప్షన్‌ను సెలెక్ట్ చేసుకుంటే ఆ కామెంట్ కాపీ అవుతుంది. ♦ ఫేస్బుక్ అకౌంట్‌ను పూర్తిగా డిలీట్ చేయాలనుకుంటే మీ ఫేస్బుక్ అకౌంట్లోకి లాగినై ఆ తర్వాత వేరొక ట్యాబ్‌లో www.facebook.com/help/delete_ account సాయంతో దరఖాస్తు చేసుకుంటే 14 రోజుల తర్వాత అకౌంట్ పూర్తిగా డిలీట్ అవుతుంది. -
సోషల్ మీడియా సంచలనం..
బ్రిటన్ః ఆ పాపకు కేవలం ఐదేళ్ళు. కానీ ఇప్పుడామె ఇంటర్నెట్ సంచలనంగా మారింది. వీధుల్లో ఇళ్ళు లేని నిరుపేదలను చూసి చలించిపోయిన ఆ చిన్నారి.. ఏకంగా బ్రిటన్ ప్రధానికే లేఖ రాసింది. అలా రాసిన లేఖను తానే చదువుతూ రికార్డు చేసిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. వీధుల్లో తన కంటపడిన దృశ్యాలను తట్టుకోలేకపోయిన ఐదేళ్ళ చిన్నారి.. బ్రిటన్ ప్రధానికి నేరుగా లేఖ రాసింది. డియర్ ప్రైమ్ మినిస్టర్.. థ్రేసా మే అంటూ మొదలైన ఆ లేఖలో నా పేరు బ్రూక్ బ్లెయిర్ అని, నాకు ఐదేళ్ళని చెప్పింది. తమ ప్రాంతంలోని నిరాశ్రయుల కష్టాలను థ్రెసా మే ఓసారి వచ్చి ప్రత్యక్షంగా చూడాలని కోరింది. వందలుగా ఉన్న అభాగ్యుల కష్టాలను ఎవరు తీరుస్తారు? వారికి మీరే వచ్చి చాక్లెట్లు, బిస్కెట్లు, శాండ్ విచ్ లు ఇచ్చి రక్షించాలి. అలాగే ఇళ్ళు కూడా కట్టివ్వాలి అంటూ ఆదేశించింది. నేనేమో చిన్న పిల్లని, నేనెలాంటి సహాయం చేయలేకపోతున్నాను. నాదగ్గర అంత డబ్బు కూడా లేదు. నేను దాచుకున్న డబ్బుతో వారి అవసరాలు తీరవు. అందుకే మీరు వచ్చి వారి కష్టాన్ని కళ్ళారా చూసి ఆదుకోమంటూ బ్రిటన్ ప్రధానిని కోరింది. ఇలా ఆ చిన్నారి రాసిన లేఖ వీడియో ఒక్క రోజులోనే ఇంటర్నెట్ సంచలనంగా మారింది. ఫేస్ బుక్ లో మిలియన్లకొద్దీ జనం వీక్షించడంతో ఆ చిన్నారి రాత్రికి రాత్రే సెలబ్రిటీ అయిపోయింది. తమ నగరంలోని కోవెంటీ సిరేనియన్ ప్రజలకు మీరే సహాయం అందించాలంటూ బ్రూక్.. ప్రధానిని స్వచ్ఛందంగా ఆహ్వానించింది. నిరాశ్రయలకు అండగా నిలవాలనే ఉద్దేశ్యంతో ఆమె తల్లి మాథ్యూస్ చిన్నారి వీడియోను చిత్రీకరించి ఇంటర్నెట్ లో పోస్ట్ చేసింది. ఫేస్ బుక్ లో సెలబ్రిటీగా మారిపోయిన బ్రూక్.. వీధుల్లోని నిరాశ్రయులను కలసి వారితో సంభాషించింది. కోవెంట్రీ వీధుల్లో ప్రజలను చూసి ఎంతో బాధ కలిగిందని, నేను ఇంట్లో వెచ్చగా కూర్చుని, వారలా రోడ్లపై బతకడం విచారాన్ని కలిగిస్తోందంటూ ఆందోళన వ్యక్తం చేసింది. కోవెంట్రీ జనం కూడ చిన్నారి మాటలకు ఆశ్చర్యపోయారు. ఐదేళ్ళ చిన్నారికి కనిపించిన బాధలు, దేశ ప్రధానికి ఎందుకు కనిపించవంటూ ప్రశ్నించారు. నిజంగా ఐదేళ్ళ వయసులో సమస్యను గుర్తించి ప్రభుత్వాన్ని ప్రశ్నించడం అద్భుతమంటూ కోవెంట్రీ సిరేనియన్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ మైకేల్ అన్నారు. ఈ నేపథ్యంలో బ్రూక్ విషయం తెలుసుకున్న స్థానిక ప్రభుత్వ ప్రతినిథి ఒకరు స్పందించారు. ప్రభుత్వం కేవలం కొందరికోసం కాక, అందరికోసం పనిచేస్తుందని భరోసా ఇచ్చారు. -
సోషల్ మీడియా సంచలనం..
-
హృతిక్‌కు చుక్కలు చూపించిన హ్యాకర్!
హృతిక్ రోషన్‌కు ఈ మధ్య ఏదీ కలిసిరావడం లేదు. ఈ ఏడాది ప్రారంభంలో ఆయనకు భార్య విడాకులు ఇచ్చేసింది. ఆ వెంటనే కంగనా రనౌత్-హృతిక్ గొడవ మీడియాలో రచ్చరచ్చ చేసింది. ఈ ఇద్దరి మధ్య జరిగిన అనేక ఆంతరంగిక విషయాలు వెలుగుచూశాయి. ఇది ఇలా ఉండగానే హృతిక్ రోషన్ ఎన్నో ఆశలు పెట్టుకున్న 'మొహెంజోదారో' సినిమా వచ్చింది. అశుతోష్ గోవరికర్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ చారిత్రక సినిమా బాక్సాఫీస్‌కు నిప్పు పెట్టింది. సినిమా ప్లాప్ అవ్వడం హృతిక్‌ను నిరాశ పరిచింది. ఈ క్రమంలోనే ఓ పిల్ల హ్యాకర్ హృతిక్ ఫేస్బుక్ పేజీతో ఆటలు ఆడుకున్నాడు. హృతిక్ అధికారిక పేజీని హ్యాక్ చేయడమే కాదు.. ప్రొఫైల్ ఫొటోలో తన ఫొటో పెట్టుకొని మురిసిపోయాడు. ఫేస్బుక్ లైవ్ వీడియో ఆన్‌చేసి.. కాసేపు హృతిక్ అభిమానుల్ని పలుకరించాడు. ఒకింత వింతగా, విచిత్రంగా ప్రవర్తిస్తూ కొన్ని నిమిషాలపాటు లైవ్ వీడియోలో కనిపించిన అతను.. ఎట్టకేలకు దానిని క్లోజ్ చేశాడు. ఈ హ్యాకర్ వింత ప్రవర్తన నెటిజన్లను ఒకరకంగా గిలిగింతలు పెట్టింది. తన ఫేస్బుక్ పేజీ హ్యాకింగ్‌కు గురైన విషయాన్ని గుర్తించిన హృతిక్ వెంటనే దానిని డియాక్టివేట్ చేశాడు. ఎవరో ఓ వ్యక్తి తన ఫేస్బుక్ పేజీని హ్యాక్ చేశాడని, దీంతో దానిని సరిచేసేందుకు చర్యలు తీసుకున్నామని హృతిక్ ట్విట్టర్లో తెలిపాడు. -
ఫేస్బుక్ దెబ్బకు టాప్ పబ్లిషర్లు ఔట్
సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ వీక్షణ పడిపోవడంతో టాప్ న్యూస్ పబ్లిషింగ్ కంపెనీలు రెండో త్రైమాసికంలో ఢమాల్ మనిపించాయి. ఈ ఏడాది రెండో త్రైమాసికంలో అమెరికా న్యూస్ సైట్లు డబుల్ డిజిట్ రేట్లలో పడిపోయాయని లీడింగ్ వెబ్ అనాలిటిక్స్ కంపెనీ తన రిపోర్టులో వెల్లడించింది. మీడియా కంపెనీల ఫేస్బుక్లో సందర్శన మొదటి త్రైమాసికంతో పోలిస్తే రెండో త్రైమాసికంలో 50 శాతం క్షీణించినట్టు సిమిలర్‌వెబ్ కనుగొన్నది. సిమిలర్‌వెబ్ అమెరికాలోని మీడియా కంపెనీలకు, పబ్లిషర్లకు నెలవారీ ర్యాంకింగ్‌లను కేటాయిస్తుంది. తాజా ర్యాంకింగ్‌లో 2 మిలియన్ డెస్క్‌టాప్, మొబైల్ పేజ్ వీక్షణలతో ఎంఎస్ఎన్ టాప్‌లో ఉంది. పబ్లిషర్స్ సైట్లకు ఫేస్బుక్ వీక్షణలను కూడా ఈ రిపోర్టు వెల్లడిస్తుంది. ఫేస్బుక్ వీక్షణలు అత్యధికంగా పడిపోయిన కంపెనీ న్యూస్‌వీక్ ఓనర్ ఐబీటీ మీడియా అని, రెండో క్వార్టర్లో ఈ పబ్లిషర్ 47 శాతం క్షీణించిందని రిపోర్టు పేర్కొంది. ఈ రిపోర్టు ప్రకారం ఫేస్బుక్ నుంచి వచ్చే ట్రాఫిక్‌లో గాన్నెట్ న్యూస్ పేపర్ చైన్స్ 26 శాతం పడిపోయింది.. అదేవిధంగా సీఎన్ఎన్ ఫేస్బుక్ విజిట్స్ కూడా 33 శాతం, వాషింగ్టన్ పోస్టు ట్రాఫిక్ 26 శాతం, పోలిటికో 38 శాతం డ్రాప్ అయింది. ఫేస్బుక్ ఈ కంపెనీల ప్రేక్షక పాత్ర పడిపోవడం, కంపెనీలపై తీవ్ర ప్రభావం చూపనుంది. అడ్వర్ టైజింగ్ రెవెన్యూలకు ఇవి గండికొట్టనున్నాయి. అయితే సిమిలర్‌వెబ్ గణాంకాలు కేవలం డెస్క్‌టాప్ వీక్షణను మాత్రమే కొలమానాలుగా తీసుకున్నాయని, ప్రపంచమంతా స్మార్ట్‌ఫోన్ యుగంగా మారుతున్నందున ఆ గణాంకాలు పూర్తి సరియైనవి కావని బజ్‌ఫీడ్ పబ్లిషర్ చెప్పారు. -
కేరళ సీఎం వినూత్న ఆలోచన
తిరువనంతపురం: ప్రజలకు చేరువయేందుకు,పరిపాలనలో ప్రజలను భాగస్వాములను చేసేందుకు కేరళ సీఎం పినరయి విజయన్ వినూత్న ఆలోచన చేశారు. ఇందు కోసం ఆయన అధికారిక ఫేస్ బుక్ ఖాతాను తెరిచారు. ప్రజలకు ఎప్పటి కప్పుడు ప్రభుత్వ నిర్ణయాలు తెలిసేందుకు, వారినుంచి సలహాలు,విమర్శలు స్వీకరించేందుకు ఈ ఖాతాను తెరిచామని సీఎం తెలిపారు.ముఖ్యమంత్రి అధికారిక ఫేస్ బుక్ ఖాతాకి ఇప్పటి వరకు 88 వేలకు పైగా లైకులు లభించాయి. -
ఫేస్బుక్ దుమారంపై జుకర్ వివరణ
శాన్ ఫ్రాన్సిస్కో: సామాజిక మీడియా సంస్థ ఫేస్ బుక్ పై చెలరేగిన ఆరోపణలపై సంస్థ వ్యవస్థాపకుడు, సీఈవో మార్క్ జుకర్ బర్గ్ రంగంలోకి దిగారు. రాజకీయ పక్షపాతం చూపిస్తున్నారంటూ రాజుకున్న వివాదంపై ఆయన ఫేస్ బుక్ లో వివరణ ఇచ్చారు. ట్రెండింగ్ టాపిక్స్ పై గోల్ మాల్ జురుగుతోందన్న ఆరోపణలపై ఆయన స్పందించారు. ఈ మేరకు ఆయన కన్సర్వేటివ్ పార్టీ నేతలతో సమావేశం అయ్యేందుకు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. తమ సంస్థ పని తీరు తదితర అంశాల గురించి కొన్ని ఆలోచనలను షేర్ చెయ్యాలనుకుంటున్నా నంటూ ఫేస్ బుక్ లో తన భావాలను పంచుకున్నారు. తమ సంస్థ ఫేస్బుక్ ప్రపంచంలో ప్రతీ ఒక్కరికీ ఒక స్వరాన్ని అందిస్తుందని పేర్కొన్నారు. వివిధ రకాల నేపథ్యాల ఆలోచనలను, ప్రజల అనుభవాలను పంచుకున్నపుడే ఆ ప్రపంచం బావుంటుందని తాము నమ్ముతామన్నారు. అదే సోషల్ మీడియాను విశ్వవ్యాప్తం చేస్తుందని తెలిపారు. ఈ విషయంలో తాము ఎలాంటి వివక్ష చూపడం లేదన్నారు. ఒక తల్లీ బిడ్డ ఫోటోఅయినా, మేధో విశ్లేషణ అయినా తమకు సమానమే అని స్పష్టం చేశారు. అన్ని ఆలోచనా ధోరణలకు తమ సంస్థ ఫేస్ బుక్ ప్లాట్ ఫాంగా నిలవడానికి తాము కట్టుబడి ఉన్నామన్నారు. ట్రెండింగ్ టాపిక్స్ డిజైన్ కఠినమైన మార్గదర్శకాలతో, విశ్వసనీయతతో కూడుకుందనీ, ఇందులో ఎలాంటి ప్రాముఖ్యతలకు, రాజకీయ భావాల అణచివేత ధోరణికి తావులేదని పేర్కొన్నారు. అలాంటి చర్యలను తాము అనుమతించమని తెలిపారు. కన్సర్వేటివ్ పార్టీ భావాలను తొక్కి పెడుతున్నామన్న ఆరోపణలు తమ దృష్టికి వచ్చాయనీ, దీనిపై పూర్తి స్తాయిలో విచారణ జరుగుతోందన్నారు. తమ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా జరుగుతున్నట్టు తేలితే... సంబంధిత చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ విషయంలో ఇకముందు కన్సర్వేటివ్ నాయులు, ఇతర రాజకీయ నాయకులు తనతో మాట్లాడాలని ఆహ్వానించారు. కాగా టెక్నాలజీ న్యూస్ వెబ్ సైట్ గిజ్ మోడో ఫేస్ బుక్ ఉద్యోగులు ట్రెండింగ్ కథనాలను ప్రభావితం చేస్తున్నారని, కన్సర్వేటివ్ పార్టీకి అనుగుణమైన స్టోరీలను అణచివేస్తున్నారంటూ కథనాన్ని ప్రచురిచింది. దీంతో అమెరికాలోని పలువురు రాజకీయవేత్తలు, జర్నలిస్టులు ఫేస్ బుక్ పై మండిపడ్డారు. విచారణ జరిపి, చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ఆరోపణలపై జుకర్ వివరణ యివ్వాలని కూడా డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో దీనిపై విచారణకు అదేశించిన జుకర్, ఉద్యోగులకు కొన్ని మార్గదర్వకాలను జారీ చేసినట్టు సమాచారం. -
జైల్లోంచి కూడా ఫేస్బుక్ అప్డేట్లు!
పంజాబ్‌కు చెందిన గ్యాంగ్‌స్టర్ జస్వీందర్ సింగ్ రాకీ ఎక్కడో హిమాచల్ ప్రదేశ్‌లో హత్యకు గురైతే.. పంజాబ్ జైళ్లలో ఉన్న ప్రత్యర్థి డాన్లు ఆ వార్తకు ఫేస్బుక్లో తెగ లైకులు కొట్టారు. హిమాచల్‌ప్రదేశ్‌లోని పర్వానూ ప్రాంతంలో రాకీ హత్యకు గురైనట్లు తెలియగానే పలువురు గ్యాంగ్స్టర్ల ఫేస్బుక్ పేజీలు మోతెక్కడం మొదలుపెట్టాయి. షేరా ఖుబాన్ అనే మరో గ్యాంగ్‌స్టర్ హత్యకు ప్రతీకారంగానే రాకీని చంపినట్లు చాలావరకు పేజీలలో కనిపించింది. దాదాపు నాలుగేళ్ల క్రితం భటిండాలో జరిగిన ఎన్కౌంటర్లో షేరా మరణించాడు. పోలీసులకు రాకీ సమాచారం ఇవ్వడం వల్లే షేరా మరణించాడని అతడి గ్యాంగ్ సభ్యులు అప్పట్లో ఆరోపించారు. ఇప్పుడు రాకీ మరణవార్త తెలియగానే నభా జైల్లో ఉన్న వికీ గౌండర్ అనే మరో గ్యాంగ్‌స్టర్ సంబరాలు చేసుకున్నాడు. అతడు తన ఫేస్బుక్ పేజీలో కూడా ఈ విషయం గురించి రాశాడు. ''ఇన్నాళ్లకు మా వీరుడు షేరా ఖుబాన్ హత్యకు ప్రతీకారం తీరింది. రాకీ ఎమ్మెల్యే అవ్వాలనుకున్నాడు. మరో విషయం.. భటిండా ఎస్ఎస్పీ స్వపన్ శర్మ నన్ను చంపాలనుకున్నారు. కానీ ఆయన స్నేహితుడు రాకీ చనిపోయాడని ఆయనకు చెప్పాలనుకుంటున్నా'' అని ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు. నభా జైల్లోనే ఉన్న మరో గ్యాంగ్‌స్టర్ రంజోధ్ జోధా కూడా దీనిపై ఫేస్బుక్ కామెంట్ రాశాడు. ''మీరు మాలో ఒకరిని చంపితే.. మేం చాలామందిని చంపుతాం.. ఈ విషయం చరిత్రలో రుజువైంది'' అన్నాడు. తనను తాను షార్ప్‌షూటర్‌గా చెప్పుకొనే దీప్ సంధూ కూడా షేరా ఎన్‌కౌంటర్‌కు ప్రతీకారంగానే రాకీ నేలకొరిగినట్లు ఫేస్బుక్లో రాశాడు. అయితే జైళ్లోల ఉన్నవాళ్లు కూడా ఫేస్‌బుక్‌లలో అప్డేట్లు చేయడాన్ని బట్టి.. జైళ్లలో సెల్ఫోన్ల వాడకం ఎంత పెరిగిపోయిందో అర్థమవుతుంది. -
అబ్బురపరిచే ఇండో-పాక్ బార్డర్ ఫొటో
భారత్-పాకిస్థాన్ అంతర్జాతీయ సరిహద్దుకు సంబంధించి అబ్బురపరిచే ఫొటోను అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) విడుదల చేసింది. అంతరిక్షం నుంచి చూస్తే ఇండో-పాక్ సరిహద్దు ఎలా వుంటుందో తెలిపే ఫొటోను నాసా ఆదివారం తన ఫేస్బుక్ పేజీలో పోస్టు చేసింది. రోదసిలో ఉన్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోని ఓ వ్యోమగామి గత సెప్టెంబర్ 23న రాత్రి సమయంలో ఈ ఫొటో తీశారు. 28 మిల్లిమీటర్ల లెన్స్ కలిగిన నికన్ డీ4 డిజిటల్ కెమెరాతో ఉత్తర పాక్‌లోని ఇండస్ రివర్ వ్యాలీ మీదుగా భారత్ సరిహద్దు వరకు పానోరమ ఫొటోను క్లిక్ మనిపించారు. రాత్రి సమయంలోనూ భూమి మీదున్న అంతర్జాతీయ సరిహద్దుతోపాటు పలు ప్రాంతాలను ఈ ఫొటోలో స్పష్టంగా చూడవచ్చు. నారింజరంగులో వెలుగుతున్న భద్రత లైట్లు భారత్-పాక్ వేరు చేస్తున్న సరిహద్దును స్పష్టంగా చూపుతున్నాయి. గతంలోనూ 2011లో భారత్-పాక్ సరిహద్దుకు సంబంధించిన ఫొటోను నాసా విడుదల చేసింది. -
ఫేస్బుక్లో ముంబై అమ్మాయి కథ హల్చల్
ఫేస్బుక్లో ముంబై టీనేజ్ అమ్మాయి కథ స్ఫూర్తిదాయకంగా నిలిచింది. ఈ పోస్ట్‌కు 49 వేల లైక్‌లు, 3200 షేర్లు వచ్చాయి. నెటిజన్లను అంతగా ఆకర్షించిన కథనం ఏంటంటే.. ముంబై టీనేజ్ అమ్మాయి వయసు 15 ఏళ్లు. చిన్న వయసులోనే ఈ అమ్మాయికి ఇంట్లోవాళ్లు పెళ్లి సంబంధం చూశారు. పెళ్లి చూపులు కూడా ఏర్పాటు చేశారు. అయితే ఇంత చిన్న వయసులో తాను పెళ్లి చేసుకోనంటూ నిరాకరించింది. పెళ్లి నుంచి తప్పించుకోవడానికి ఏం చేసింది.. తన ఆశయాలు ఏంటి.. తదితర విషయాలను ఫేస్బుక్లో పోస్ట్ చేసింది. 'నేను ఆ అబ్బాయిని కూడా చూశా. పెళ్లి చేసుకోనని ఇంట్లోకి వాళ్లకు స్పష్టంగా చెప్పాను. నన్ను రక్షించుకోవడం కోసం.. ఇంట్లో నుంచి పారిపోయి పోలీసులకు ఈ విషయం చెబుతానని బెదిరించాను. ఇద్దరు పిల్లలున్న, విడాకులు తీసుకున్న వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని ఇంట్లో వాళ్లు చెప్పారు. 15 ఏళ్ల వయసులో ఇద్దరు పిల్లలకు నేనెలా తల్లినికాగలను. నా గురించి ఇంట్లో వాళ్లు ఎందుకు ఆలోచించరు. నేనింకా చదువుకోవాలి. స్వతహాగా సంపాదించాలి. ఇతరులపై ఆధారపడి బతకాల్సిన అవసరం నాకు లేదు. ఐపీఎస్ ఆఫీసర్ కావాలన్నది నా ఆశయం. నా కల సాకారమయ్యేంత వరకు ఆగను' అని ఆ అమ్మాయి పేస్‌బుక్‌లో పోస్ట్ చేసింది. ఈ టీనేజ్ అమ్మాయి కథ చాలామందిని ఆకర్షించింది. ఈ అమ్మాయిని అభినందిస్తూ.. ఆశయ సాధనకు అండగా ఉంటామంటూ వందలాదిమంది నెటిజన్లు కామెంట్లు పోస్ట్ చేశారు. -
రిషితేశ్వరి ఫేస్బుక్ పేజీకి అనూహ్య స్పందన
గుంటూరు: ఆచార్య నాగార్జున యూనివర్సిటీ విద్యార్థిని రిషితేశ్వరి మరణానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని చేస్తున్న పోరాటానికి సోషల్ మీడియాలో అనూహ్య స్పందన వస్తోంది. వేలాది మంది విద్యార్థులు, ప్రజలు మద్దతుగా నిలిచారు. రిషితేశ్వరికి న్యాయం జరగాలంటూ విద్యార్థులు ఆమె పేరుతో ఫేస్ బుక్ పేజీని ప్రారంభించారు. రిషితేశ్వరికి జరిగిన అన్యాయం మరొకరికి జరగకుండా గొంతు విప్పాలని పిలుపునిచ్చారు. ఈ కేసుపై మీడియాలో వచ్చిన కథనాలు, నిందితుల ఫోటోలను పోస్ట్ చేశారు. రిషితేశ్వరి ఫేస్ బుక్ పేజీకి ఇప్పటికే 10 వేల లైక్‌లు వచ్చాయి. (చదవండి: రిషితేశ్వరి పేరుతో ఫేస్ బుక్ పేజీ) -
ఫేస్బుక్ పేజీకి అనూహ్య స్పందన
-
రిషితేశ్వరి పేరుతో ఫేస్ బుక్ పేజీ
-
రిషితేశ్వరి పేరుతో ఫేస్ బుక్ పేజీ
గుంటూరు: ఆచార్య నాగార్జున యూనివర్సిటీ విద్యార్థిని రిషితేశ్వరి మరణానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని పోరాటం ఉధృతమవుతోంది. రిషితేశ్వరికి న్యాయం జరగాలంటూ ఆమె పేరుతో ఫేస్ బుక్ పేజీని ప్రారంభించారు. రిషితేశ్వరికి జరిగిన అన్యాయం మరొకరికి జరగకుండా గొంతు విప్పాలని పిలుపునిచ్చారు. ఈ కేసుపై మీడియాలో వచ్చిన కథనాలు, నిందితుల ఫోటోలను పోస్ట్ చేశారు. రిషితేశ్వరి ఫేస్ బుక్ పేజీకి అనూహ్య స్పందన వస్తోంది. రిషితేశ్వరి మృతికి సంబంధించి పలు ప్రశ్నలను కూడా సంధించారు. రిషితేశ్వరి కేసులో చీకటి కోణాలు... 1. ఉరి వేసుకుని వేలాడుతున్న ఆమెను దించిందెవరు? 2. హాస్టల్ లో ఉన్న తోటి విద్యార్దినుల కంటే ముందు ఆమె మరణ వార్త బాయ్స్ హాస్టల్ కు ఎలా చేరింది? 3. ఉరి తాడు బిగించుకున్నప్పుడు ఆమెను మొదట చూసింది ఎవరు? 4. బాబూరావుకు ఎందుకు ఫోన్ చేశారు? 5. హాస్టల్ వార్డెన్ కు ఎందుకు సమాచారమివ్వలేదు? 6. ఉరి వేసుకుని చనిపోయినట్టు నిరూపితమవ్వటానికి కనీసం ఒక్క ఫోటో కూడా ఆధారం లేదు, ఎందుకని? 7. బాబూరావు సస్పెన్షన్ కు ముందుగానే నాటకీయంగా రాజీనామా ఎందుకిచ్చాడు? హైదరాబాద్ లో ఏం పైరవీలు నడుపుతున్నాడు? 8.బాబూరావును కాపాడే ప్రయత్నం ఎవరు చేస్తున్నారు? 9. కాలేజీలో సుప్రీం ఆదేశాల మేరకు ఏర్పాటు చేయాల్సిన యాంటీ ర్యాగింగ్ కమిటీని ఎందుకు ఏర్పాటు చేయలేదు? 10.ముందు రోజు సినిమా హాల్లో ఏం జరిగింది? 11.ఆమెను వేధిస్తూ తీసిన వీడియో ఏమైంది? 12.రిషితేశ్వరిని వేదిస్తున్నారంటూ ఆమె చనిపోవటానికి పది రోజుల ముందు ఆమె పేరెంట్స్ ప్రిన్సిపాల్ కు కంప్లైంట్ ఇచ్చినా ఎందుకు చర్యలు తీసుకోలేదు? 13.విద్యార్ది సంఘాల ఐక్యకార్యాచరణ కమిటీ నిన్న వినతి పత్రాన్నిచ్చి తాత్కాలికంగా ఆందోళనను విరమించుకున్నాక హడావిడిగా వర్శిటీకి ఇప్పుడెందుకు 10 రోజులు సెలవులిచ్చారు? -
మీ భద్రత నాది
ఇబ్బంది కలిగితే సమాచారం ఇవ్వండి తక్షణం చర్యలు తీసుకుంటా ఫేస్బుక్.. మెదక్ ఎస్పీ పేజీలోనూ ఫిర్యాదు చేయవచ్చు విద్యార్థినులకు ఎస్పీ సుమతి భరోసా సంగారెడ్డి మున్సిపాలిటీ: ‘జిల్లాలోని ప్రతి మహిళకు భద్రత కల్పించే బాధ్యత నాది.. అందుకోసం నేను.. నాతోపాటు నా టీం పనిచేస్తుంది. ఎవరైనా వేధిస్తే.. సమాచారం ఇవ్వండి..మిగతాది మేము చూసుకుంటాం’అని జిల్లా ఎస్పీ బి. సుమతి విద్యార్థినులకు సూచించారు. గురువారం పట్టణంలోని మహిళా డిగ్రీ కళాశాలలో నిర్వహించిన ‘లైంగిక వేధింపులు.. నివారణ చర్యలు’ అంశంపై నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, మారుతున్న సాంకేతిక పరిజ్ఞానం అనుగుణంగా మనలోనూ మార్పు రావాలన్నారు. ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్లు వాడుతున్న యువత సంక్షిప్త సందేశాలతో వేధింపులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని మంచి పనులకు వినియోగించుకోవాలని సూచించారు. అమ్మాయిలకు ఎలాంటి సమస్య వచ్చినా నేరుగా తనకు ఫోన్ చేయవచ్చన్నారు. లేకపోతే ఫేస్బుక్లో మెదక్ పోలీసుశాఖ ఆధ్వర్యంలో నిర్వహించే మెదక్ ఎస్పీ పేజీని లైక్ చేసి సమస్య తెలిపితే పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మహిళా రక్షణకోసం ఏర్పాటు చేసిన 08455-27655 నంబర్‌కు లేదా, 100కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలన్నారు. ఇక్కడ మహిళల సమస్యలను విని కౌన్సిలింగ్ చేసి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకునేందుకు ప్రత్యేకంగా సిబ్బంది ఉంటారన్నారు. పోలీసులతో స్నేహభావం పెంపొందించుకునేందుకు ప్రతి నెలా మహిళ డిగ్రీ కళాశాల నుంచి 4 విద్యార్థులను కౌన్సెలింగ్‌కు పంపించాలన్నారు. దానిద్వారా ఓ సమస్యను పోలీసులు ఎలా పరిష్కరిస్తున్నారో తెలుసుకునే అవకాశం విద్యార్థినులకు కలుగుతుందన్నారు. జిల్లాలో మహిళలకు సంబంధించి 242 ఫిర్యాదులు రాగా, వాటిలో 80 శాతం కేసులను కౌన్సిలింగ్ ద్వారా పరిష్కరించామన్నారు. విద్యార్థులు కళాశాలకు వచ్చి వెళ్లే క్రమంలో వేధింపులకు గురైతే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. బాగా చదవండి.. నాలా పోలీస్ అవ్వండి ఎవరైనా సరే చదువుకుంటేనే అభివృద్ధి చెందుతారని, అందువల్ల ప్రతి ఒక్కరూ కష్టపడి చదువుకోవాలని అప్పుడు ఉజ్వల భవిష్యత్ ఉంటుందని ఎస్పీ సుమతి కళాశాల విద్యార్థినులకు సూచించారు. మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందినప్పుడే సమాజం కూడా అభివృద్ధి చెందుతుందన్నారు. చదువుకు పేదరికం అడ్డుకాదని, తాను కూడా మధ్యతర గతి కుటుంబంలో పుట్టానన్నారు. కష్టపడి చదువుకున్నందు వల్లే తాను ఈ స్థాయికి ఎదిగానన్నారు. మీరు కూడా బాగా చదివి.. నాలా పోలీస్ అవ్వండని ఎస్పీ సూచించారు. అక్షరాస్యత శాతం పెంచాలి అవగాహన సదస్సులో జిల్లా విద్యాశాఖ అధికారి రాజేశ్వర్‌రావు మాట్లాడుతూ, పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యమవుతుందన్నారు. జిల్లాలో అక్ష్యరాస్యత శాతం 50గా ఉందని, అందువల్లే ప్రభుత్వం ఎన్ని సంక్షేమ పథకాలు అమలు చేసినా.. ఆశించిన స్థాయిలో ఫలితాలు ఇవ్వడం లేదన్నారు. అందువల్ల ఇక్కడున్న విద్యార్థినులంతా తమ సమీపంలో ఉన్న వారు కూడా చదువుకునేలా అవగాహన కల్పించాలన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా అవసరమయ్యే పనులకు వాడుకోవాలన్నారు. ఏదైనా ఇబ్బంది తలెత్తితే వెంటనే కుటుంబ సభ్యులకు, లేదా అధ్యాపకులకు చెప్పాలని సూచించారు. అప్పుడే లైంగిక వేధింపుల బారిన పడకుండా ఉంటారన్నారు. కార్యక్రమంలో పట్టణ సీఐ ఆంజనేయులు, కళాశాల ప్రిన్సిపాల్ సమీరా నజ్మీన్, జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ సుధాకర్, యువజన సంఘాల నాయకుడు వేణుగోపాల్, గోపిసింగ్ తదితరులు పాల్గొన్నారు. -
నా చావు కోరుకున్నాడు: జుకెర్బెర్గ్
ఫేస్బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకెర్బెర్గ్ ఒక్కసారిగా సంచలనం రేపాడు. పాకిస్థానీ తీవ్రవాది ఒకరు తనను ఉరితీసి చంపాలని కోరుకున్నాడంటూ తన ఫేస్బుక్ పేజీలో రాసి.. భారత, పాకిస్థానీ అనుకూలుర మధ్య తీవ్ర వివాదం రేకెత్తించాడు. ప్యారిస్ నగరంలోని చార్లీ హెబ్డో పత్రికా కార్యాలయం మీద ఐఎస్ ఉగ్రవాదులు దాడి చేసి చంపడంతో... కొన్నాళ్ల క్రితం నాటి ఈ వివాదాన్ని మళ్లీ తెరమీదకు తెచ్చాడు. మహమ్మద్ ప్రవక్త సమాచారాన్ని ఫేస్బుక్ నుంచి తొలగించడానికి నేను నిరాకరించాను, ఈ కారణంగా పాకిస్థాన్‌కి చెందిన ఓ అతివాది నా మరణాన్ని కోరుకున్నాడని జుకెర్ బెర్గ్ అన్నారు. అయితే, ఎవరో ఒకరు చేసిన తప్పుతో జాతి మొత్తాన్ని నిందించడం సరైంది కాదని పాకిస్థానీయుడొకరు జుకెర్బెర్గ్ పేజీలోనే పోస్ట్ చేశాడు. దానికి జుకెర్బెర్గ్ కూడా దీటుగానే స్పందించాడు. తనకు పాకిస్థానీలలో కూడా మంచి స్నేహితులున్నారని, తాను మొత్తం అందరి మీద వ్యాఖ్యలు చేయడంలేదని.. కేవలం అతివాదులను ఉద్దేశించి మాత్రమే వ్యాఖ్యానించానని అన్నాడు. దీంతో ఒకవైపు భారత అనుకూలరు, మరోవైపు పాకిస్థాన్ అనుకూల వాదుల మధ్య ఫేస్బుక్ వేదికగా తీవ్రస్థాయిలో వాగ్యుద్ధం నడుస్తోంది. దీనంతటికీ మూలం.. జుకెర్బెర్గ్ పెట్టిన వ్యాఖ్యలే!! -
మాటల్లో కాదు... చేతల్లో చూపు
* నాది.. మనదిగా మారాలంటే.. చాలా మారాలి... * ముఖ్యంగా మనసు.. మెదడు. సమస్యపై స్పందించే మనసు, పరిష్కారం * ఆలోచించే మెదడు ఉంటే చాలు... మాకున్నవి ఈ రెండే.. అందుకే ఈ మార్పు.. మీరూ చూడండి అంటున్నారు ‘హైదరాబాద్ రైజింగ్’ (ఫేస్బుక్ పేజ్) బృంద సభ్యులు. యూత్ అంటే ఫేస్బుక్లో సెల్ఫీల అప్డేట్లూ, సొల్లు కామెంట్ల పోస్ట్‌లు మాత్రమే కాదని నిరూపించారు. ‘ద అగ్లీ ఇండియన్’ అనే ఫేస్బుక్ పేజ్ నుంచి స్ఫూర్తి పొందిన నగర యువతీ యువకులు.. ‘హైదరాబాద్ రైజింగ్’ అనే కమ్యూనిటీని ప్రారంభించారు. తమ వంతుగా ఒక మంచి ‘మార్పు’కు దోహదపడదామని ఆలోచించి, దీనికి వేదికగా చందానగర్‌లో అత్యంత దుర్గంధభరితంగా, సిటీలో సగటు రోడ్డుకుండే అవలక్షణాలన్నీ సొంతం చేసుకున్న రోడ్లను ఎంచుకున్నారు. నవ్వుతూ తుళ్లుతూ రిపేర్ చేయడం మొదలెట్టారు. ఒక్క రోజులోనే... ఆ రోడ్లు కళకళలాడుతున్నాయి. చెత్త, కంపు, మాయమై మా సొగసు చూడతరమా అంటున్నాయి. ‘మాటలు చాలు.. చేతల్లో చూపు’ (కామ్ చాల్... మూ బంద్) అని చెప్పకనే చెప్పిన ఈ యువత సమాజానికి ఉపయోగపడే ఒక మంచి పనిని చేశాం అనే ఆనందంతో వెలిగే వదనాలతో మురిసిపోయారు. నలుగురికీ ఉపయోగపడే పనిని చేశామంటూ సగర్వంగా ఫేస్బుక్లో ఫొటోలు అప్లోడ్ చేసుకున్నారు. - చైతన్య.జి -
ఫేస్బుక్ పేజీకి అనూహ్య స్పందన
న్యూఢిల్లీ: ఢిల్లీలో ఉంటున్న ఈశాన్య ప్రజల సౌకర్యార్థం ఢిల్లీ పోలీసులు ప్రారంభించిన ఫేస్బుక్ పేజీకి అనూహ్య స్పందన లభిస్తోంది. మూడు వారాల కిందట ప్రారంభించిన ఈ పేజీలో దేశవ్యాప్తంగా ఉన్న ఈశాన్య ప్రజలనుంచి ఇప్పటికే 5,500 ఫిర్యాదులు, సూచనలు అందాయి. స్పందించినవారిలో ఎక్కువగా యువత ఉండటం విశేషం. ఈశాన్య రాష్ట్రాల ప్రజల కోసం www.dpfne.com (delhipolicefornortheast.com) పేజీని ఢిల్లీ పోలీసులు మే 9న ప్రారంభించారు. అనతి కాలంలోనే ఇది ప్రచారం పొందింది. ప్రారంభమైన నాటినుంచి నేటివరకు దేశంలోని పలు ప్రాంతాల్లోని ఈశాన్య రాష్ట్రాల ప్రజలనుంచి 5,500 ఫిర్యాదులు, సూచనలు అందాయని పోలీసు జాయింట్ కమిషనర్ రాబిన్ హిబూ తెలిపారు. ఈ పేజీకి బాధ్యతలు హిబు చూస్తున్నారు. ఈశాన్య ప్రజలు తమ సమస్యలను పంచుకోవడానికి ఫేస్బుక్ పేజీ సులభమైన మార్గమని హిబూ తెలిపారు. ఈశాన్య రాష్ట్రాల ప్రజలు మోసపోకుండా సరైన డ్రైవింగ్ లెసైన్సులు పొందాలని మే 30న ఢిల్లీ పోలీసులు కోరారు. నాగాలాండ్‌కు చెందిన యువతిని న్యాయవాది టిస్ హజారీ కోర్టు బయట వేధించిన ఘటనపై పోలీసుల చర్యలేంటని మే 27న ఓ యువకుడు పేజీలో పోస్టు చేశాడు. న్యాయం చేయడంలో జాప్యం చేస్తే నిజాన్ని తిరస్కరించడమేనని కూడా ఆ యువకుడు కామెంట్ చేశాడు. దీనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశామని, చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని, డీసీపీ, జాయింట్ కమిషనర్లు ఈ కేసును పర్యవేక్షిస్తున్నారని ఢిల్లీ పోలీసులు సమాధానమిచ్చారు. ఢిల్లీ సీనియర్ పోలీసు అధికారుల పర్యవేక్షణలో తాను ఈ వెబ్‌సైట్‌ను నిర్వహిస్తున్నట్లు హిబూ తెలిపారు. ఫేస్బుక్ పేజీలో ఏదైనా ఫిర్యాదు అందగానే తాము చర్యలు తీసుకుంటామని, స్థానిక పోలీసులకు సమాచారమందించి సాధ్యమైనంత తొందరగా సమస్యను పరిష్కరించమని కోరతామని ఆయన చెప్పారు. అంతేకాదు ఈ విషయంపై సంబంధిత పోలీస్ స్టేషన్ ఉన్నతాధికారి వివరణ కూడా తీసుకుంటామన్నారు. ఫేస్బుక్ పేజీ ప్రారంభించిన నాటినుంచి ఈశాన్య రాష్ట్రాల ప్రజల మీద వేధింపులకు సంబంధించి అందిన ఫిర్యాదుల మేరకు 250 కేసులు నమోదు చేశారు. 150 మందిని అరెస్టు చేశారు. అరెస్టు అయిన వారంతా అత్యాచారం, వేధింపులు, ఈవ్‌టీజింగ్, ఇతర ఆరోపణలు ఎదుర్కొంటున్నవారేనని హిబూ చెప్పారు. ప్రజల నుంచి వచ్చిన సూచనలపై స్పందించిన హిబూ సీనియర్ పోలీసు అధికారులతో చర్చిస్తామని సమాధానమిచ్చారు. అంతేకాదు తమకు అందిన సూచనల మేరకు సరైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈశాన్య ప్రజల సంక్షేమం కోసం ఫేస్బుక్ పేజీతోపాటు 1093 నంబర్‌పై నార్త్ఈస్ట్ హెల్ప్‌లైన్, 9810083486 నంబర్‌పై వాట్పప్‌ను కూడా నిర్వహిస్తున్నారు ఢిల్లీ పోలీసులు. దక్షిణ ఢిల్లీ లజ్‌పత్‌నగర్‌లో కొందరు దుకాణదారులు అరుణాచల్ ప్రదేశ్ విద్యార్థి 19 ఏళ్ల నిడోతానియాపై దాడి చేయడంతో అతను మరణించడం, ఈ ఘటనపై ఢిల్లీలోనే కాకుండా, ఈశాన్య రాష్ట్రాలనుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమయిన విషయం విదితమే. రాజధానిలో ఈశాన్య ప్రజలపై నేరాలు పెరిగిపోతున్న నేపథ్యంలో ఈ ఫేస్బుక్పేజ్, హెల్ప్‌లైన్ నంబర్, వాట్సప్ వంటి సోషల్ నెట్‌వర్క్‌లను వారికి అందుబాటులోకి తెచ్చారు ఢిల్లీ పోలీసులు. -
3,10,000+ లైక్స్.. సోషల్ మీడియాలో వైఎస్ఆర్సీపీ టాప్
సోషల్ మీడియాలో వైఎస్ఆర్సీపీ టాప్ సాక్షి, హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారిక ఫేస్బుక్ పేజీ రికార్డు స్థాయిలో 3 లక్షల లైక్స్‌ను దాటింది. పార్టీ ఫేస్బుక్ లైక్స్(ఇష్టపడే వారి సంఖ్య) విషయంలో దేశంలోనే ప్రాంతీయ పార్టీలన్నిటిలోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ అగ్రగామిగా నిలిచింది. ఈ నేపథ్యంలో ఫేస్బుక్, వైఎస్ఆర్సీపీ ఆన్లైన్ కమ్యూనిటీ పోర్టల్‌లకు సంబంధించిన బృందం సభ్యులు పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మను గురువారం ఉదయం ఆమె నివాసంలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. సోషల్ మీడియాలో మంచి కృషిని సాగిస్తున్నారంటూ బృందం సభ్యులను విజయమ్మ అభినందించారు. పార్టీ అధికారిక ఫేస్బుక్ పేజీ ప్రారంభించిన 10 నెలల్లోనే 3 లక్షల లైక్స్ (ఇష్టపడే వారి సంఖ్య) దాటడం నెటిజన్లలో జగన్‌పైన ఉన్న అపారమైన అభిమానానికి నిదర్శనమన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి పథకాల గురించి మరింత విస్తృతంగా ప్రజలకు వివరించాలని ఈ సందర్భంగా విజయమ్మ వారికి సూచించారు. వైఎస్ మరణానంతరం సంక్షేమ పథకాలు సరిగా అమలు కాకపోవడాన్ని నెటిజన్లకు అర్థమయ్యేలా సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేయాలన్నారు. ప్రత్యర్థులను విమర్శించడం కంటే వైఎస్ఆర్ చేసిన మంచి పనులు, పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి అమలు చేయాలనుకుంటున్న సంక్షేమ పథకాలపై మరింత ఎక్కువ దృష్టి కేంద్రీకరించాలని ఆమె సూచించారు. పార్టీ 3 సంవత్సరాలు పూర్తి చేసుకున్న రోజునే అంటే మార్చి 12వ తేదీనే పార్టీ అధికారిక ఫేస్బుక్ పేజీ (www.facebook.com/ ysrcpofficial) 3 లక్షల లైక్స్‌ను పూర్తి చేసుకుంది. గురువారం ఉదయానికి ఈ సంఖ్య 3,10,000 వద్ద ఉంది. నెటిజన్లు విశేషంగా ఆదరిస్తుండడంతో ఇది క్రమక్రమంగా పెరిగే అవకాశం ఉందని వారు పేర్కొన్నారు. -
‘మామ్’ పర్యవేక్షణలో స్వల్ప అంతరాయం!
చెన్నై: చంద్రుడి క క్ష్యను దాటి అరుణగ్రహం దారిలో నిరంతరాయంగా దూసుకుపోతున్న మార్స్ ఆర్బిటర్ మిషన్ (మామ్-మంగళ్యాన్) ఉపగ్రహంపై పర్యవేక్షణలో గత ఆదివారం ఐదు నిమిషాలపాటు అంతరాయం కలిగిందట. గత ఆదివారం తెల్లవారుజామున మామ్‌లోని ద్రవ ఇంధన ఇంజన్‌ను మండించి దానిని భూకక్ష్య నుంచి అంగారక గ్రహం దారిలోకి పంపిన సంగతి తెలిసిందే. అయితే అందుకు కొన్ని సెకన్లకు ముందుగానే.. మామ్‌ను పర్యవేక్షించేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)దక్షిణాఫ్రికాలో ఏర్పాటుచేసుకున్న హార్ట్బీస్తోక్(హెచ్‌బీకే) గ్రౌండ్ స్టేషన్ ప్రాంతంలో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం ముంచెత్తింది. దీంతో ఉపగ్రహాన్ని అరుణగ్రహం దారిలోకి మళ్లిస్తున్నా.. ఈ గ్రౌండ్ స్టేషన్‌కు ఐదు నిమిషాలపాటు సమాచారమేదీ అందలేదట. ఇస్రో ఈ మేరకు సోమవారం తన ఫేస్బుక్ పేజీలో వెల్లడించింది.