ఫేస్బుక్ దెబ్బకు టాప్ పబ్లిషర్లు ఔట్ | Facebook Traffic to U.S. News Sites Has Fallen by Double Digits, Report Says | Sakshi

ఫేస్బుక్ దెబ్బకు టాప్ పబ్లిషర్లు ఔట్

Aug 17 2016 11:33 AM | Updated on Jul 11 2019 8:56 PM

ఫేస్బుక్ దెబ్బకు టాప్ పబ్లిషర్లు ఔట్ - Sakshi

ఫేస్బుక్ దెబ్బకు టాప్ పబ్లిషర్లు ఔట్

సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ వీక్షణ పడిపోవడంతో టాప్ న్యూస్ పబ్లిషింగ్ కంపెనీలు రెండో త్రైమాసికంలో ఢమాల్ మనిపించాయి.

సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ వీక్షణ పడిపోవడంతో టాప్ న్యూస్ పబ్లిషింగ్ కంపెనీలు రెండో త్రైమాసికంలో ఢమాల్ మనిపించాయి. ఈ ఏడాది రెండో త్రైమాసికంలో అమెరికా న్యూస్ సైట్లు డబుల్ డిజిట్ రేట్లలో పడిపోయాయని లీడింగ్ వెబ్ అనాలిటిక్స్ కంపెనీ తన రిపోర్టులో వెల్లడించింది. మీడియా కంపెనీల ఫేస్బుక్లో సందర్శన  మొదటి త్రైమాసికంతో పోలిస్తే రెండో త్రైమాసికంలో 50 శాతం క్షీణించినట్టు సిమిలర్వెబ్ కనుగొన్నది.  సిమిలర్వెబ్ అమెరికాలోని మీడియా కంపెనీలకు, పబ్లిషర్లకు నెలవారీ ర్యాంకింగ్లను కేటాయిస్తుంది. తాజా ర్యాంకింగ్లో 2 మిలియన్ డెస్క్టాప్, మొబైల్ పేజ్ వీక్షణలతో ఎంఎస్ఎన్ టాప్లో ఉంది. పబ్లిషర్స్ సైట్లకు ఫేస్బుక్ వీక్షణలను కూడా ఈ రిపోర్టు వెల్లడిస్తుంది.

ఫేస్బుక్ వీక్షణలు అత్యధికంగా పడిపోయిన కంపెనీ న్యూస్వీక్ ఓనర్ ఐబీటీ మీడియా అని, రెండో క్వార్టర్లో ఈ పబ్లిషర్ 47 శాతం క్షీణించిందని రిపోర్టు పేర్కొంది. ఈ రిపోర్టు ప్రకారం ఫేస్బుక్ నుంచి వచ్చే ట్రాఫిక్లో గాన్నెట్ న్యూస్ పేపర్ చైన్స్ 26 శాతం పడిపోయింది.. అదేవిధంగా సీఎన్ఎన్ ఫేస్బుక్ విజిట్స్ కూడా 33 శాతం, వాషింగ్టన్ పోస్టు ట్రాఫిక్ 26 శాతం, పోలిటికో 38 శాతం డ్రాప్ అయింది. ఫేస్బుక్ ఈ కంపెనీల ప్రేక్షక పాత్ర పడిపోవడం, కంపెనీలపై తీవ్ర ప్రభావం చూపనుంది. అడ్వర్ టైజింగ్ రెవెన్యూలకు ఇవి గండికొట్టనున్నాయి. అయితే సిమిలర్వెబ్ గణాంకాలు కేవలం డెస్క్టాప్ వీక్షణను మాత్రమే కొలమానాలుగా తీసుకున్నాయని, ప్రపంచమంతా స్మార్ట్ఫోన్ యుగంగా మారుతున్నందున ఆ గణాంకాలు పూర్తి సరియైనవి కావని బజ్ఫీడ్ పబ్లిషర్ చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement