సాక్షి, బెంగళూర్ : గత 8 నెలలుగా, మితవాదులు, హిందూ అతివాద సంస్థలపై వ్యంగ్య పోస్టులతో విరుచుకుపడుతున్న ఫేస్‌బుక్ పేజీ ఆగిపోయింది. ‘హ్యుమన్స్ ఆఫ్ హిందుత్వ’ ను నిలుపుదల చేసి, డిలేట్ చేస్తున్నట్లు ఆ పేజీ అడ్మిన్ గురువారం ప్రకటించారు. సత్యనాశ్ అనే సైట్‌లో ఈ మేరకు ఓ సందేశం ఉంచారు.
‘‘నా పేజీ గురించి ఇప్పటిదాకా వ్యతిరేకత, అభ్యంతరాలు రాలేదు. కానీ, గత కొన్ని రోజులుగా నన్ను చంపుతామని కొందరు బెదిరిస్తున్నారు. వాటిని నేను తేలికగా తీసుకోదల్చుకోలేదు. నేనో మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చా. ఎలాంటి రాజకీయ సంబంధాలు లేవ్. బీజేపీ పాలనలో నేను ఉన్నా. గౌరీ లంకేష్, అఫ్రజుల్ ఖాన్(రాజస్థాన్ లవ్ జిహాద్ బాధితుడు)లా చావాలని నాకు లేదు. నా కుటంబమే నాకు ముఖ్యం’’ అని అడ్మిన్ ఆ సందేశంలో పేర్కొన్నాడు.
కాగా, అజ్ఞాతంలో ఉంటూనే ఆ పేజీ నిర్వాహకుడు మెసేంజర్‌ల ద్వారా ఇంటర్వ్యూ ఇచ్చేవాడు. పేజీ ప్రారంభించిన కొద్దిరోజుల్లోనే ప్రభావవంతమైన ఫోటోలు, పోస్టులతో చర్చనీయాంశమైంది. కాగా, ప్రస్తుతం కన్నడనాట మీడియా స్వేచ్ఛ అంశంపై హాట్ హాట్‌గా చర్చ కొనసాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment