Gauri Lankesh
-
భారత్ జోడో యాత్రలో పాల్గొన్న గౌరి లంకేశ్ తల్లి!
బెంగుళూరు: ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ గౌరి లంకేశ్ 2017లో హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ మేరకు గౌరి లంకేశ్ తల్లి ఇందిరా, చెల్లి కవిత కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో పాల్గొన్నారు. రాహుల్ శుక్రవారం జోడోయాత్రలో భాగంగా శుక్రవారం కర్ణాటక పర్యటిస్తున్నప్పుడూ దివగంత జర్నలిస్ట్ తల్లి, చెల్లి ఇద్దరు పాల్గొన్నారు. భారతదేశ నిజమైన స్ఫూర్తికి ప్రాతినిధ్యం వహిస్తున్న గౌరి లంకేశ్ లాంటి వాళ్ల కోసం నిలబడతానని రాహుల్ గాంధీ అన్నారు. వాస్తవానికి గౌరి లంకేశ్ సెప్టెంబర్ 5, 2017న రాజరాజేశ్వరి నగర్‌లోని తన ఇంటికి వస్తున్న సమయంలో మోటరు సైకిల్‌పై వచ్చిన కొందరు అగంతకులు ఆమెపై కాల్పులు జరపడంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలి చనిపోయారు. ఈ మేరకు రాహుల్‌గాంధీ ట్విట్టర్లో.... "గౌరి లంకేశ్ సత్యం, ధైర్యం, స్వాతంత్య్రం కోసం నిలబడింది. గౌరి లంకేశ్ లాగా భారతదేశ నిజమైన స్ఫూర్తికోసం ప్రాతినిథ్యం వహిస్తున్న లెక్కలేనంతమంది వ్యక్తుల కోసం నిలబడతాను. ఈ భారత జోడో యాత్ర వారి స్వరం. దీన్ని ఎప్పటికి నిశబ్దంగా ఉంచలేరు" అని రాహుల్ ట్విట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ చేపట్టిన 3,750 కి.మీ భారత జోడో యాత్ర సెప్టంబర్ 8న కన్యాకుమారి నుంచి ప్రారంభమైంది. ఈ యాత్రలో కాంగ్రెస్ పార్టీ బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చేస్తున్న విభజన రాజకీయాలను ఎదుర్కోవాలని కోరింది. గురువారం కర్ణాటకలో సాగుతున్న జోడోయాత్రలో సోనియా గాంధీ పాల్గొనడంతో పార్టీ శ్రేణుల్లో కొండంత నూతన ఉత్సాహం వచ్చింది. Gauri stood for Truth Gauri stood for Courage Gauri stood for Freedom I stand for Gauri Lankesh and countless others like her, who represent the true spirit of India. Bharat Jodo Yatra is their voice. It can never be silenced. pic.twitter.com/TIpMIu36nY — Rahul Gandhi (@RahulGandhi) October 7, 2022 (చదవండి: శివసేన మాదే.. ఎన్నికల గుర్తు వాళ్లదెలా అవుతుంది?) -
ఆమె జీవితం కాంతి పుంజం
యాభై ఐదేళ్ల ఏళ్ల గౌరీ లంకేష్, సీనియర్ జర్నలిస్టు, హక్కుల ఉద్యమ కార్య కర్త. ఐదేళ్ల కిందట బెంగళూరులోని రాజరాజేశ్వరి నగర్లో 2017, సెప్టెంబర్ 5న హత్యకు గురైనారు. అంధత్వాన్ని, మూఢత్వాన్ని నింపు కున్న ముష్కరులు గౌరీ లంకేష్ నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నారు. ఆమె హత్య వెనుక హిందుత్వ శక్తులూ, ఆధిపత్య రాజకీయాలూ ఉన్నాయి. సమానత్వాన్ని కోరుకుంటూ, లౌకిక వాదానికి కట్టుబడిన ఆమెను భౌతికంగా నిర్మూ లించడం ద్వారా లంకేష్‌లాంటి వారిని హెచ్చ రించాలనుకున్నారు, భయపెట్టాలనుకున్నారు. కానీ ఆమె హత్య తర్వాత దేశ వ్యాప్తంగా తలెత్తిన తీవ్ర ఆందోళనలు సంప్రదాయ మతతత్వ శక్తు లకు సరైన సంకేతాలనే పంపాయి. ప్రగతివాదు లను అణిచివేయడం సంఘ్ పరివార్ శక్తులు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కువైంది. ఆ శక్తుల పాశవిక ధోరణికి గౌరీ లంకేశ్ హత్య మరో ఉదాహరణ మాత్రమే. మూడున్నర దశాబ్దాలపాటు ప్రజాజీవితంలో కొనసాగారు గౌరీ లంకేష్. ఇంగ్లిష్, కన్నడంలో అనేక స్ఫూర్తివంతమైన రచనలను చేశారు. తండ్రి పేరుతో ‘లంకేష్’ పత్రికను కూడా నడిపి మతవాద శక్తులను దును మాడారు. అందుకే మానవ హక్కుల హననానికి పాల్పడే మనువాదులు కుట్ర చేసి గౌరీ లంకేశ్ ప్రాణాలను హరించారు. గౌరీ లంకేశ్ హత్యకు ముందు ఆగస్టు 20, 2013న నరేంద్ర దబోల్కర్, 2015 ఫిబ్రవరి 20న గోవింద్ పన్సారే, అదే సంవత్సరం ఆగస్టు 30న ఎంఎం కల్బుర్గితో పాటు పదుల సంఖ్యలో దేశవ్యాప్తంగా కవులు, జర్నలిస్టులు హిందుత్వ శక్తుల చేతుల్లో హత్యకు గురయ్యారు. వెలుగులోకి వచ్చినవి కొన్నే, బయటకు తెలియనివి ఎన్నో! – మామిండ్ల రమేష్ రాజా, సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ రాష్ట్ర కమిటీ సభ్యులు, పాలకుర్తి (నేడు గౌరీ లంకేష్ జయంతి) -
ఆపరేషన్ అమ్మ.. సుదర్శన చక్ర..
బెంగళూరు: సీనియర్ పాత్రికేయురాలు, సామాజికవేత్త గౌరీలంకేశ్ హత్య కేసు విచారణలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ‘ఆపరేషన్ అమ్మ’ పేరుతో నిందితులు హత్యోదంతాన్ని సాగించినట్లు నిర్ధారణయింది. జార్ఖండ్‌కు చెందిన రిషికేశ్ దేవాడికర్ను సిట్ అధికారులు అరెస్ట్తోఈ విషయాలు తెలిసినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ వ్యక్తి గౌరీలంకేశ్, సాహితీవేత్త ఎం.ఎం.కలబురిగిల హత్యకేసులో ప్రధాన నిందితుడని తేలింది. తమ సంభాషణలు ఇతరులకు అర్థం కాకుండా దోషులు కోడ్ భాషను వినియోగించారు. గౌరీలంకేశ్‌ను టార్గెట్ చేసి ఆమెను అంతం చేసేవరకూ ‘అమ్మ’ అనే పదాన్ని రహస్య భాషగా వినియోగించినట్లు సమాచారం. హత్యకు వినియోగించిన పిస్టల్‌కు ‘సుదర్శన చక్ర’ అనే గుప్తనామం వాడారు. గౌరీలంకేశ్‌ను హత్య తర్వాత నిందితులు ‘సుదర్శన చక్ర కృష్ణుడి చేతికి చేరింది’ అని పరస్పరం సమాచారం అందజేసుకున్నట్లు సిట్ అధికారుల విచారణలో తేలింది. -
రావీష్ కుమార్‌కు గౌరీ లంకేశ్ అవార్డు
సాక్షి, బెంగళూరు: ఇటీవల రామన్ మెగసెసే అవార్డు అందుకున్న ప్రముఖ జర్నలిస్టు, ఎన్డీటీవీ ఇండియా సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ రావీష్ కుమార్.. గౌరీ లంకేశ్ మెమోరియల్ మొదటి అవార్డును అందుకొన్నారు. ఆదివారం (సెప్టెంబర్ 22) బెంగళూరులో జరిగిన ఒక కార్యక్రమంలో 'పదునైన వార్తల విశ్లేషణ, రాజీలేని లౌకిక వైఖరి' అవలంభించింనందుకు గాను ఆయనను ఈ అవార్డుతో సత్కరించారు. ప్రముఖ జర్నలిస్ట్ హెచ్ఎస్ దొరస్వామి చేతుల మీదుగా ఈ అవార్డును రావీష్‌కు అందజేశారు. ప్రముఖ జర్నలిస్ట్ గౌరీ లంకేశ్ రెండవ వర్ధంతిని పురస్కరించుకొని గౌరీ లంకేష్ మెమోరియల్ ట్రస్ట్ ఈ అవార్డును ప్రకటించింది. సీనియర్ జర్నలిస్ట్ సిద్ధార్థ్ వరదరాజన్, విద్యావేత్త రహమత్ తారికెరే, ఉద్యమకారుడు తీస్తా సెతల్వాద్‌లతో కూడిన కమిటీ ఈ అవార్డుకు రావీష్ కుమార్‌ను ఎంపిక చేసింది. ఈ సందర్భంగా రావీష్ కుమార్ మాట్లాడుతూ.. జర్నలిస్టులపై దాడులు అందరినీ ప్రభావితం చేస్తాయని అభిప్రాయ పడ్డారు. 'నాథూరం గాడ్సేను దేశభక్తుడిగా, గాంధీజీని ఉగ్రవాదిగా చూసే కాలంలో మనం జీవిస్తున్నాం. అంతేకాక దేశంలో అసమ్మతివాదులను.. దేశ వ్యతిరేకులు, అర్బన్ నక్సల్స్, పాకిస్తాన్‌కు అనుకూరులుగా చిత్రీకరిస్తున్నారు. మన దేశ ప్రజాస్వామ్యం నెమ్మదిగా మరణ దిశగా వెళుతోంది' అని ఆయన పేర్కొన్నారు. కాగా గౌరీ లంకేశ్‌ను బెంగళూరులోని ఆమె ఇంటి ముందు సెప్టెంబర్ 5, 2017న దుండగుడు అతి దారుణంగా కాల్చి చంపాడు. -
స్త్రీలోక సంచారం
హైదరాబాద్‌లో ప్రతి నెలా కనీసం 10 గృహహింస కేసులు నమోదు అవుతుండగా వాటిల్లో ఎక్కువ భాగం.. భర్త మద్యపాన వ్యసనం కారణంగా జరుగుతున్నవేనని, 2006 నుంచి ఇప్పటి వరకు 3,000 గృహ హింస కేసులు నమోదు కాగా అనధికారిక లెక్కల ప్రకారం ఇటువంటి ఘటనలు ఇంతకు రెట్టింపుగా ఉండే అవకాశం ఉన్నట్లు ఎన్జీవోలకు అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోందని ‘భరోసా’ కేంద్రాల అధికారులు వెల్లడించారు. స్త్రీలపై జరుగుతున్న ఈ గృహహింసకు మద్యపాన వ్యసనం తర్వాత వివాహేతర సంబంధాలు, అదనపు కట్నం ఆశించడం వంటివి ప్రధాన కారణాలుగా ఉన్నాయని అధికారులు తెలిపారు. హరియాణలో బాగా వెనుకబడిన జిల్లాల్లో ఒకటై, అత్యధికంగా ముస్లింలు ఉండే మేవాత్‌లో బడి మానేస్తున్న బాలికల సంఖ్యను గణనీయంగా తగ్గించడమే కాక, ఆడపిల్లలను బడిలో చేర్పించేందుకు తల్లిదండ్రులను ఒప్పించడం కోసం శాయశక్తులా ప్రయత్నిస్తున్న బషీరుద్దీన్ ఖాన్ అనే 54 ఏళ్ల ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని టీచర్స్ డే సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్లో ప్రశంసించారు. మేవాత్ జిల్లాలోని పాఠశాలల్లో ఏటా కనీసం 20 శాతం వరకైనా ఉంటున్న బాలికల ‘డ్రాపవుట్స్’ని బషీరుద్దీన్ తగ్గించడంపై ప్రధాని సంతోషం వ్యక్తం చేస్తూ, ఆయనను ప్రత్యేకంగా అభినందించారు. రియో డి జెనీరో లోని నేషనల్ మ్యూజియంలో ఇటీవల సంభవించిన అగ్ని ప్రమాదంలో 12 వేల ఏళ్ల నాటి బ్రెజిల్ మహిళ ‘లూజీయా’ పుర్రెను కోల్పోవడం అత్యంత విషాదకరమైన ఘటన అంటూ బ్రెజిల్ ప్రభుత్వం విచారం వ్యక్తం చేసింది. రెండు కోట్లకు పైగా విలువైన పురావస్తు విశేషాలు భద్రపరిచి ఉన్న ఈ మ్యూజియంలో అన్నిటికన్నా అమూల్యమైనదిగా పరిగణన పొందుతున్న ‘తొలి బ్రెజిల్ మనిషి’.. ‘లూజియా’ 1970లో బ్రెజిల్ పురావస్తు తవ్వకాల్లో బయటపడింది. యు.ఎస్. సార్వత్రిక ఎన్నికల్లో ఒక మహిళ తొలిసారిగా వోటు వేసిన రోజు ఇది! వయోమింగ్ రాష్ట్రంలోని లరామీలో ఉంటున్న లుయీజా స్వెయిన్ (1801–1880) అనే మహిళ తన 69 ఏళ్ల వయసులో 1870 సెప్టెంబర్ 6న ఎప్పటిలా ఉదయాన్నే నిద్ర లేచి, ఏప్రాన్ కట్టుకుని, తలకు బానెట్ (టోపీ), ఒంటిపై షాల్ ధరించి, పెరుగు కొనేందుకు చేత్తో చిన్న సత్తు బకెట్‌లాంటి పాత్రను పట్టుకుని బజారులోకి వచ్చినప్పుడు.. అప్పటికింకా పోలింగ్ సెంటర్‌ను అధికారికంగా తెరవనప్పటికీ, అక్కడ ఉన్న పోలింగ్ ఏజెంట్లు ఆమెను సాదరంగా ఆహ్వానించి ఆమెతో ఓటు వేయించగా, ఆ మర్నాడు స్థానిక వార్తా పత్రిక ఒకటి.. ‘క్రైస్తవ విశ్వాసిగా కనిపిస్తున్న వియనశీలత గల ఓ తెల్ల జుట్టు గృహిణి’.. అమెరికన్ చరిత్రలోనే తొలిసారి ఓటు హక్కు వినియోగించుకున్న మహిళగా నేడు నిలిచారు’ అని ఆమెను కీర్తించింది. ప్రపంచంలోనే అత్యధిక వయసు గల దంపతులుగా మసావో మత్సుమోటో (108), ఆయన భార్య మియాకో (100) తాజాగా ‘గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’లో చోటు సంపాదించారు. 1935 అక్టోబర్‌లో పెళ్లి చేసుకున్న ఈ జంటను.. మీ 80 ఏళ్ల అన్యోన్య దాంపత్యం వెనుక ఉన్న అసలు రహస్యం ఏమిటని అడిగినప్పుడు.. ‘అది నా సహనమే’ అని సంతోషంతో ఉబికిన కళ్లతో సమాధానం చెప్పిన మియాకో వైపు ఆమె భర్త ‘అవును’ అన్నట్లుగా కృతజ్ఞతతో చూసినట్లు గిన్నిస్ బుక్ ప్రతినిధి ఒక ప్రకటన కూడా విడుదల చేశారు! అమెరికన్ రొమాటిక్ కామెడీ డ్రామా టెలీ సీరియల్ ‘సెక్స్ అండ్ ది సిటీ’ (1998–2008) తో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుని, ప్రస్తుతం న్యూయార్క్ గవర్నర్ అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్న హాలీవుడ్ నటి సింథియా నిక్సన్ (52).. తను లెస్బియన్ (ఆడ–ఆడ) అని చెప్పుకోడానికి కన్నా, హోమోసెక్సువల్ (మగ–మగ) అని చెప్పుకోడానికే ఇష్టపడతానని అన్నారు. ఆరేళ్ల క్రితం తనను ౖ»ñ సెక్సువల్(ఆడ–మగ)æగా ప్రకటించుకున్న సింథియా ఇప్పుడిలా మనసు మార్చుకోడానికి ప్రత్యేక కారణాలేవీ కనిపించని మాట అటుంచితే, మొదట డ్యానీ మోజెస్ అనే ఉపాధ్యాయుడితో దీర్ఘకాలం కలిసి ఉండి, అతడితో ఇద్దరు పిల్లల్ని కన్న తర్వాత 2012లో క్రిస్టీన్ మారినోని అనే అతడిని ప్రేమించి, డ్యానీ నుంచి వేరుపడ్డారు. అతివాద జర్నలిస్టుగా పేరుమోసిన గౌరీ లంకేశ్ గత ఏడాది సెప్టెంబర్ 5న తన ఇంట్లో ఉండగా జరిగిన దుండగుల కాల్పుల్లో ఒంట్లోకి నాలుగు బులెట్లు దూసుకుపోయి మరణించిన ఏడాది కాలానికి.. కర్ణాటక, మహారాష్ట్ర పోలీసులు, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) అధికారులు కలిసి నేరస్తుడిని పట్టుకోగలిగారు. పరశురామ్ వాగ్మారే అనే వ్యక్తి ఆమెను అతి సమీపంలోంచి కాల్చిచంపాడని నిర్థారించిన ‘సిట్’.. ఇప్పటి వరకు ఈ కేసులో 12 మందిని అరెస్టు చేసింది. ఇటీవలే నిశ్చితార్థం అయిన బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా, అమెరికన్ నటుడు నిక్ జోనాస్.. యు.ఎస్.ఓపెన్ క్వార్టర్ ఫైనల్స్‌లో సెరెనా విలియమ్స్ ఆట చూసేందు వెళ్లడం, వారి వెంట నిక్ సోదరుడు, ఆ సోదరుడి గర్ల్ ఫ్రెండ్, వారితో పాటు ప్రియాంక తల్లి మధూ చోప్రా ఉండటం ఆహ్లాదకరమైన ఓ విశేష వార్తాంశం అయింది. ప్రియాంక, నిక్‌ల పెళ్లి ఇప్పుడా అప్పుడా, ఇక్కడా అక్కడా.. అని మీడియా అంచనాలు వేస్తుండగా.. ‘ఎక్కడైనా, ఏ క్షణమైనా’ అని ప్రియాంక తల్లి ఇచ్చిన స్టేట్మెంట్ ప్రాధాన్యం సంతరించుకుంది -
గౌరీలంకేశ్ హత్యకు ప్రత్యేక శిక్షణ అక్కడే!
బనశంకరి: గౌరీలంకేశ్ హంతకులు కర్ణాటకలో ఫైరింగ్ శిక్షణ తీసుకున్నట్లు ఎస్ఐటీ విచారణలో తేలింది. ఈ హత్య కేసులో 12వ ముద్దాయిగా ఉన్న భరత్ కుర్నే బెళగావి జిల్లా అటవీ ప్రాంతంలోని జామ్బోటి గ్రామంలోని తన సొంత పొలంలో ప్రత్యేకంగా ఫైరింగ్ రేంజి ఏర్పాటు చేసుకొని ముఖం, తలను గురిపెట్టి కాల్పులు జరపడం, నడుస్తున్న వాహనంపై కాల్పులు జరపడం, బుల్లెట్లు లోడ్ చేసిన పిస్తోల్‌ను ఎలా పట్టుకోవాలనే అంశాల్లో శిక్షణ తీసుకున్నాడు. పుణెలో సామాజికవేత్త నరేంద్ర దాబోల్కర్ను హత్య చేయడానికి నెలక్రితం ముందే ఫైరింగ్ శిక్షణ ప్రారంభించినట్లు విచారణలో వెలుగుచూసింది. -
‘వీడియోలే హత్యకు పురిగొల్పాయి’
సాక్షి, బెంగళూరు : ప్రముఖ జర్నలిస్టు గౌరీ లంకేశ్ హత్యలో సుదీర్ఘ దర్యాప్తు అనంతరం ప్రత్యేక విచారణ బృందం(సిట్) అధికారులు ముగ్గురు కీలక నిందితులను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. కాగా హత్యకు ముందు నిందితులు నిర్వహించిన కార్యకలాపాలకు సంబంధించి సిట్ అధికారుల పలు సంచలన విషయాలు వెల్లడించారు. జాతీయ మీడియా వివరాల ప్రకారం... అనుమానితుడు అమోల్ కాలే నుంచి స్వాధీనం చేసుకున్న హార్డ్ డిస్క్‌లో హిందుత్వకు వ్యతిరేకంగా మంగళూరులో గౌరీ లంకేశ్ మాట్లాడిన వీడియోలను గుర్తించామని సిట్ అధికారులు తెలిపారు. ఈ వీడియోలను నిందితుడు వాగ్మారే డౌన్లోడ్ చేశాడని సిట్ అధికారులు పేర్కొన్నారు. గౌరీ లంకేశ్ ప్రసంగాలకు సంబంధించిన వీడియోలను పదే పదే చూస్తూ.. తుపాకీ, పెట్రోల్ బాంబ్ పేల్చడం వంటి విషయాల్లో వాగ్మారే శిక్షణ పొందాడని తెలిపారు. ఈ వీడియోలే గౌరీ హత్యకు పురిగొల్పాయని అధికారులు వెల్లడించారు. అంతేకాకుండా అమోల్ కాలే డైరీలో గౌరీ లంకేశ్‌తో పాటు మరో 36 మంది ప్రముఖులను హత్య చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు అతడు డైరీలో రాసుకున్నాడని పేర్కొన్నారు. ఈ ఆపరేషన్ కోసం 50 మంది కరుడుగట్టిన హిందుత్వవాద షూటర్లను కూడా రిక్రూట్మెంట్ చేసుకున్నట్లు వెల్లడించారు. ఈ విషయాలను కోడ్ భాషలో రాసుకున్నటు సిట్ అధికారులు తెలిపారు. హిందుత్వకు వ్యతిరేకంగా మాట్లాడిన గౌరీ లంకేశ్‌ను ఎలాగైనా హత్య చేయాలని నిర్ణయించుకున్నట్లు కేసులో ప్రధాన నిందితుడు నవీన్ కుమార్ అంగీకరించినట్లు వారు పేర్కొన్నారు. గౌరీ లంకేశ్ హత్యకోసం వాగ్మారే 3 వేల రూపాయలు అడ్వాన్స్‌గా తీసుకున్నట్లు, హత్యకు ముందు రోజు 10 వేల రూపాయలు తీసుకున్నారని విచారణలో వాగ్మారే చెప్పినట్లు సమాచారం. కాగా గౌరీ లంకేశ్ హత్య కేసును వాదించడానికి స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా శ్రీశైల వదావదాగిని కర్ణాటక ప్రభుత్వం నియమించింది. -
హంతకుడి డైరీలో సంచలన విషయాలు..
బెంగళూరు : ప్రముఖ జర్నలిస్టు గౌరీ లంకేశ్ హత్య కేసులో అనుమానితుడు అమోల్ కలే నుంచి స్వాధీనం చేసుకున్న డైరీలో నుంచి పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూశాయి. గౌరీ లంకేశే కాకుండా మరో 36 మంది ప్రముఖులను కూడా లక్ష్యంగా చేసుకున్నట్లు డైరీలో రాసుకున్నారు. ఈ ఆపరేషన్ కోసం 50 మంది కరుడుగట్టిన హిందుత్వవాద షూటర్లను కూడా రిక్రూట్మెంట్ చేసుకున్నారు. ఈ విషయాలను డైరీలో కోడ్ భాషలో రాసుకున్నటు సిట్ అధికారులు వెల్లడించారు. హిందూత్వ వాదానికి వ్యతిరేకంగా మాట్లాడిన వారే వీరి టార్గెట్. వీరి టార్గెట్‌లోమహారాష్ట్ర, కర్ణాటకలకు చెందిన ప్రముఖులే ఎక్కువగా ఉన్నారు. కర్ణాటకు చెందిన 10 మంది ప్రముఖులను హత్య చేయాలని డైరీలో రాసుకున్నారు. హత్యల కోసం 50 మందిని రిక్రూట్ చేసుకొని వారికి గన్స్, తుపాకీ, పెట్రోల్ బాంబ్ పేల్చడం టాంటి వాటిలో శిక్షణ కూడా ఇచ్చారని డైరీలో కోడ్ భాషలో రాసుకున్నారని ఓ అధికారి తెలిపారు. గతేడాది సెప్టెంబర్ 5న తన నివాసం వద్ద ఉన్న గౌరీలంకేశ్‌పై బైకుపై వచ్చిన దుండగులు విచక్షణా రహితంగా కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఆమె అక్కడికక్కడే చనిపోయారు. సుదీర్ఘ దర్యాప్తు తరువాత సిట్ అధికారులు కేసును ఛేదించి కీలక నిందితులను పట్టుకోగలిగారు. బీజాపుర జిల్లా సిందగి తాలూకాకు చెందిన పరశురామ్ వాగ్మారే ఈ హత్య కేసులో కీలక నిందితుడిగా తేల్చారు. మిగిలిన ముగ్గురు వ్యక్తులు గౌరి హత్యకు పథకం రూపొందించారు. గౌరీ లంకేశ్ హత్యకోసం వాగ్మారే రూ.3000 అడ్వాన్స్‌గా తీసుకున్నారు. హత్యకు ముందు రోజు రూ. 10,000 తీసుకున్నారని విచారణలో వాగ్మారే తెలిపారు. -
భగవంతుని కొడుకువంటూ రెచ్చగొట్టారు!
యశవంతపుర: కొందరు వ్యక్తులు యూ ట్యూబ్‌లో పాత్రికేయురాలు గౌరి లంకేశ్ ప్రసంగాలను చూపి తనను బ్రెయిన్ వాష్ చేయటం వల్లనే ఆమెను హత్య చేసినట్లు ఈ కేసులో కీలక నిందితుడు, షార్ప్ షూటర్ పరశురాం వాగ్మోరె సిట్ విచారణలో వెల్లడించాడు. గౌరిలంకేశ్ హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడిన ప్రసంగాలను యూ ట్యూబ్‌లో చూపించి ఆమెను హత్య చేయాలని రెచ్చగొట్టిన్నట్లు అతడు చెప్పినట్లు సమాచారం. ఇదే కాకుండా నీవు శ్రీకృష్ణుని పుత్రుడవు, భగవంతుని కొడుకువు అని రెచ్చగొట్టడంతో ఆమెను అంతమొందించడానికి అంగీకరించినట్లు తెలిపారు. గౌరి ఇంటి చుట్టూ అనేకసార్లు రెక్కీ నిర్వహించినట్లు తెలిపాడు. ఆమెను మొదట తలకు గురిపెట్టి పిస్టల్‌తో కాల్చానని, గురి తప్పడంతో, విచ్చలవిడిగా కాల్పులు జరిపి హత్య చేసినట్లు పరశురాం హత్యాక్రమాన్ని వివరించాడు. -
ఏ కుక్క చచ్చిపోయినా.. ఆయనే బాధ్యుడా?
సాక్షి, బెంగళూరు : హిందూత్వ సంస్థ శ్రీరామ సేన అధ్యక్షుడు ప్రమోద్ ముథాలిక్ ప్రముఖ పాత్రికేయురాలు గౌరీలంకేశ్ హత్యకేసును ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గౌరీలంకేశ్‌ను ఆయన కుక్కతో పోల్చారు. గౌరీలంకేశ్ హత్యపై ప్రధాని మోదీ ఎందుకు స్పందించడం లేదని కొందరు తప్పుపడుతున్నారని, కర్ణాటకలో ఏ కుక్క చనిపోయినా ఆయన బాధ్యత వహించాలా? అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘గౌరీలంకేశ్ హత్య విషయంలో శ్రీరామసేనకు ఎలాంటి సంబంధం లేదు. గౌరీలంకేశ్‌ను చంపేందుకు హిందూ సంస్థలు కుట్ర చేశాయని ప్రతి ఒక్కరూ అంటున్నారు. కానీ, కాంగ్రెస్ పాలనలో ఉన్న సమయంలో మహారాష్ట్రలో రెండు హత్యలు, కర్ణాటకలో రెండు హత్యలు జరిగాయి. ఈ ఘటనల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎవరూ ప్రశ్నించడం లేదు. అందుకు బదులుగా ప్రధాని మోదీ ఎందుకు మౌనంగా ఉన్నారు? ఆయన ఎందుకు మాట్లాడటం లేదు? అని అంటున్నారు. కర్ణాటకలో ఏ కుక్క చనిపోయినా.. మోదీ బాధ్యత వహించాలా’ అని ఆయన పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగడంతో తాను నేరుగా గౌరీలంకేశ్‌ను కుక్కతో పోల్చలేదని ప్రమోద్ ముథాలిక్ వివరణ ఇచ్చారు. -
జర్నలిస్టు హత్య కేసులో పురోగతి
-
గౌరీలంకేష్లా చావాలని లేదు
సాక్షి, బెంగళూర్ : గత 8 నెలలుగా, మితవాదులు, హిందూ అతివాద సంస్థలపై వ్యంగ్య పోస్టులతో విరుచుకుపడుతున్న ఫేస్బుక్ పేజీ ఆగిపోయింది. ‘హ్యుమన్స్ ఆఫ్ హిందుత్వ’ ను నిలుపుదల చేసి, డిలేట్ చేస్తున్నట్లు ఆ పేజీ అడ్మిన్ గురువారం ప్రకటించారు. సత్యనాశ్ అనే సైట్లో ఈ మేరకు ఓ సందేశం ఉంచారు. ‘‘నా పేజీ గురించి ఇప్పటిదాకా వ్యతిరేకత, అభ్యంతరాలు రాలేదు. కానీ, గత కొన్ని రోజులుగా నన్ను చంపుతామని కొందరు బెదిరిస్తున్నారు. వాటిని నేను తేలికగా తీసుకోదల్చుకోలేదు. నేనో మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చా. ఎలాంటి రాజకీయ సంబంధాలు లేవ్. బీజేపీ పాలనలో నేను ఉన్నా. గౌరీ లంకేష్, అఫ్రజుల్ ఖాన్(రాజస్థాన్ లవ్ జిహాద్ బాధితుడు)లా చావాలని నాకు లేదు. నా కుటంబమే నాకు ముఖ్యం’’ అని అడ్మిన్ ఆ సందేశంలో పేర్కొన్నాడు. కాగా, అజ్ఞాతంలో ఉంటూనే ఆ పేజీ నిర్వాహకుడు మెసేంజర్ల ద్వారా ఇంటర్వ్యూ ఇచ్చేవాడు. పేజీ ప్రారంభించిన కొద్దిరోజుల్లోనే ప్రభావవంతమైన ఫోటోలు, పోస్టులతో చర్చనీయాంశమైంది. కాగా, ప్రస్తుతం కన్నడనాట మీడియా స్వేచ్ఛ అంశంపై హాట్ హాట్‌గా చర్చ కొనసాగుతోంది. -
గౌరీ లంకేష్ ఎఫ్బీ ఖాతా తెరిచారు!
బెంగళూరు: ప్రముఖ పాత్రికేయురాలు గౌరీ లంకేష్ హత్యకు గురైన తర్వాత వాడుకలో లేని ఆమె ఫేస్బుక్ అకౌంట్ మంగళవారం తెరుచుకుంది. ఎవరో లాగిన్ అయి గంటలకొద్దీ ఆన్లైన్లోనే ఉన్న ఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. సెప్టెంబరు 5న బెంగళూరులో గౌరీ లంకేష్‌ను కొందరు దుండగుల కాల్చిచంపిన విషయం తెలిసిందే. ఆ రోజు నుంచి ఆమె ఫేస్బుక్ ఖాతా ఆగిపోయింది. అయితే మంగళవారం ఉదయం పది గంటలకు ఆ ఫేస్బుక్ ఖాతాను ఎవరో లాగిన్ అయ్యారు. ఆ రోజు రాత్రి ఎనిమిది గంటల వరకూ ఓపెన్‌లో ఉన్నట్లు తెలిసింది. ఎవరు చేసి ఈ పని ఉంటారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. హత్య కేసును దర్యాప్తు చేస్తున్న ‘సిట్’ అధికారి డీసీపీ అనుచేతన్ దీనిపై స్పందిస్తూ..‘ గౌరీ లంకేష్ ఫేస్బుక్ అకౌంట్ లాగిన్ అయిన విషయం తెలిసింది. ఒకవేళ మాకు ఫేస్బుక్లో సమాచారం కావాలని భావిస్తే ఆ సంస్థను సంప్రదించి పాస్‌వర్డ్‌ను కనుగొంటాం. ఇప్పటివరకూ మేం కూడా ఈ ఖాతాను ఓపెన్ చేయలేదు. తాజా ఘటనపై విచారణ జరుపుతాం. ఫేస్బుక్ లాగిన్ అయినంత మాత్రాన దర్యాప్తునకు ఎలాంటి ఆటంకం కలగద’ ని పేర్కొన్నారు. గౌరీ లంకేష్ సోదరి కవితా లంకేష్ స్పందిస్తూ.. ఆమె సన్నిహితులు ముగ్గురు నలుగురికి పాస్వర్డ్ తెలుసన్నారు. అయితే ఎవరు లాగ్ఇన్ అయ్యారో తెలియదన్నారు. ఎవరైనా ఆమె ఫేస్బుక్ ఖాతాను హ్యాక్ చేసి ఉంటారనే అనుమానం కూడా వ్యక్తం చేశారు. సమాచారాన్ని తస్కరించడానికి, లేదా చెరిపివేయడానికి ఎవరైనా దుండగులు హ్యాక్ చేసి ఉంటారన్న వ్యాఖ్యలూ వినిపిస్తున్నాయి. -
ఊహాచిత్రం.. గందరగోళం
సాక్షి, బెంగళూరు, తుమకూరు: జర్నలిస్ట్ గౌరి లంకేష్ హత్య కేసులో గీసిన ఓ స్కెచ్ బీజేపీ నాయకుడికి ఇబ్బందికరంగా మారింది. గత నెల 5న గౌరి లంకేష్ హత్య కు గురి కావడం, పోలీసులు ఇద్దరు అనుమానితుల ఊహాచిత్రాలను విడుదల చేయడం తెలిసిందే. ఆ ఊహాచిత్రాల్లో ఒకటి తుమకూరు గ్రామీణ నియోజకవర్గ ఎమ్మెల్యే సురేష్ గౌడ ఆప్తుడైన బీజేపీ నాయకుడు ప్రభాకర్‌ను పోలి ఉంది. ముఖ్యంగా ముక్కు, మీసకట్టు, నుదురు, ఆ నుదురు పైన బొట్టు ఉండటం వల్ల ఆ ఊహా చిత్రాల్లో ఉన్నది అతడేనని పరిచయస్తులు చెబుతున్నారు. విషయం కనుక్కుందామని చాలామంది ఆయనకు ఫోన్ చేస్తున్నారు. దీంతో విసుగు చెందిన ప్రభాకర్ తనకు గౌరి హత్యకు సంబంధం లేదని తన ఫేస్బుక్లో పోస్ట్‌చేశారు. బొట్టుపై హిందూసంఘాల రగడ ఇదిలా ఉండగా విడుదల చేసిన స్కెచ్‌లో ఓ నిందితుడి మొహంపై బొట్టు ఉండటం పట్ల సంఘ్ పరివార్ కార్యకర్తలతో పా టు మరికొన్ని హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్త చేస్తున్నారు. వీహెచ్‌పీ కార్యదర్శి గోపాల్ మాట్లాడుతూ పరోక్షంగా హిం దూ ధర్మానికి చెందిన వారే గౌరి హత్య చేశారన్న భ్రమ కలిగించడానికే పోలీసులు ఇలాంటి చిత్రం విడుదల చేశారని ఆరోపించారు. ఆ చిత్రాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌చేశారు. దీనిపై సిట్ వివరణ ఇస్తూ.. ఘటనకు ఐదురోజుల ముందు బొట్టు పెట్టుకున్న ఒక వ్యక్తి గౌరి తల్లి ఇందిర లంకేష్‌తో మాట్లాడినట్లు తెలిపారు. కాల్పులు జరిపింది మరొకరని చెప్పారు. పనిచేయని నంబర్ హంతకుల ఆచూకి తెలిస్తే తెలియజేయాల్సిందిగా ఊహా చిత్రాల సమయంలో వెల్లడించిన ఫోన్ నంబర్ 94808 00202కు ఫోన్ చేస్తే నాట్ రీచబుల్ అన్న సమాధానం వస్తోంది. సాక్షి ప్రతినిధి బుధవారం సాయంత్రం 5:39 గంటల నుంచి 5:43 గంటల మధ్య మూడు సార్లు ఫోన్ చేసినా అదే సమాధానం వచ్చింది. ఇక సాయంత్రం 6:31 నుంచి 6:34 మధ్య మూడు సార్లు ఫోన్ చేస్తే ‘మీరు ఫోన్ చేసిన వ్యక్తి నెట్ వర్క్ పరిధిలో లేరు’ అన్న సమాధానం వచ్చింది. ఇలాంటి అనుభవమే ఎంతమందికి ఎదురై ఉంటుందో మరి. తుపాకీ ఆరా కోసం మధ్యప్రదేశ్‌కు గౌరి హత్యకు ఉపయోగించినది కం ట్రీమేడ్ 7.65 ఎం.ఎం. పిస్టల్. ఈ ఆయుధాన్ని ఎక్కువగా బిజాపుర జిల్లాలో వినియోగించే వారు. దీంతో సిట్ అధికారులు అక్కడకు వెళ్లి కూపీ లాగారు. ఈ ఒక్క ఏడాదిలో నే ఈ పిస్టల్‌ను అక్రమంగా కలిగిన విషయ మై 13 మంది అరెస్టు కాగా 8 పిస్టల్స్, 36 లైవ్ తూటాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ పిస్టల్స్ అన్నీ మధ్య ప్రదేశ్‌కు చెందిన గుర్ముఖ్ సింగ్, సర్దార్ రాజ్ సింగ్‌లు అమ్మినట్లు తెలిసింది. ఈ పిస్టల్స్ కా కుండా మరికొన్ని విజపురతో పాటు బెంగళూరు, బళ్లారి, దావణగెరె తదితర జిల్లాల్లో వీరు అమ్మారని దర్యాప్తులో తేలింది. దీంతో సిట్ మధ్యప్రదేశ్‌కు వెళ్లినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. -
సిరా చుక్కలో ఉషోదయం
కొత్త కోణం గౌరీ లంకేశ్ జీవితం, ఆలోచన, ఆచరణ ఒక విశాల ప్రజాస్వామ్య తాత్వికతకు అద్దం పడుతున్నాయి. ఏదో ఒక సిద్ధాంత చట్రంలో ఒదిగిపోయే తత్వం కాదు ఆమెది. ఆమె గత ముప్ఫై ఏళ్లుగా సాగించిన రచనలతో హిందుత్వ వాదాన్ని తీవ్రంగా వ్యతిరేకించడంతో పాటు అనేక సామాజిక సమస్యలపై విరుచుకుపడ్డారామె. హిందుత్వ వ్యతిరేక పోరాటం ఆమె ఎజెండానే. ఆమె హత్యకు ఇదే కారణం. వందల సంవత్సరాలుగా కులతత్వ వ్యతిరేక ఉద్యమంలో భాగస్వాములైన ఎన్నో వందల మంది ప్రాణత్యాగం చేయాల్సి వచ్చింది కూడా అందుకే. ‘మతవాదాన్ని రెచ్చగొట్టడమో, ప్రచారం చేయడమో నా ఉద్దేశం కాదు. ఫాసిస్టు శక్తులకు వ్యతిరేకంగా చాలామంది ఐక్యమవుతున్నారని మాత్రమే చెప్పదలచుకున్నాను. అబద్ధపు వార్తలను అసత్యాలుగానే బట్టబయలు చేస్తున్నందుకు అందరికీ సెల్యూట్ చేస్తున్నాను. ఇంకా చాలామంది ఇటువంటి మంచి ప్రయత్నంలో కలసి వస్తారని ఆశిస్తున్నాను’ అంటూ గౌరీ లంకేశ్ తన ‘గౌరీ లంకేశ్ పత్రిక’ చివరి సంపాదకీయంలో ప్రజాస్వామ్య, లౌకిక శక్తులకు, జర్నలిస్టులకు ఇచ్చిన సందేశమిది. 54 ఏళ్ల గౌరీ లంకేశ్ గత నెల 5వ తేదీన బెంగళూరులోని తన ఇంటి గుమ్మంలోనే హంతకులు జరిపిన కాల్పుల్లో మరణించారు. ఆమె రచనలు ఎక్కువగా కన్నడలోనే ఉన్నాయి. అందుకే బాహ్య ప్రపంచానికి ఆమె రచనలు, తాత్విక దృక్పథాల గురించి తక్కువ తెలుసు. మరణానంతరం కొన్నింటిని ఇంగ్లిష్లోనికి అనువదించారు. ఆ చివరి సంపాదకీయం అలా లభించిందే. ఈ రచనను ప్రత్యేకమైనదిగా భావించాలి. తప్పుడు వార్తలను ప్రచారం చేయడానికి కొన్ని శక్తులు, ప్రధానంగా హిందుత్వవాదులు చేస్తున్న ప్రయత్నాన్ని ఆధారాలతో సహా అందులో బయటపెట్టారు. ఉదాహరణకు గణేశ్ చతుర్థి సందర్భంగా ప్రచారమైన ఒక అసత్యపు వార్త – సోషల్ మీడియాలో చాలా దుమారాన్ని లేపిన వార్త – గురించి ఆ సంపాదకీయంలో వివరించారు. ‘గణేశ్ ఉత్సవాల సందర్భంగా విగ్రహాలను ప్రభుత్వం సూచించిన స్థలంలోనే ప్రతిష్టించాలని, అందుకు పది లక్షల రూపాయలను డిపాజిట్ చేయాలని, విగ్రహం ఎత్తుకు సంబంధించి కూడా ప్రభుత్వం అనుమతి తీసుకోవాలని, ఇతర మతస్తులు నివాసాలున్న చోట నుంచి నిమజ్జనం ఊరేగింపు వెళ్లకూడదని, టపాకాయలు కాల్చకూడదని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది’ అన్నదే ఆ వార్త. ఇది నిజం కాదని, కావాలనే ‘మోదీ భక్తులు’ ఈ వార్తను ప్రచారం చేశారని ఆ సంపాదకీయంలో ఆరోపించారు. కర్ణాటక పోలీసు ఉన్నతాధికారి ఆర్.కె. దత్తా విలేకరుల సమావేశం నిర్వహించి, ఈ వార్తలో నిజం లేదని తేల్చి చెప్పిన విషయాన్ని కూడా ఆమె వివరించారు. ఈ వార్తతో పాటు, బాబా గుర్మీత్ రామ్ రహీంతో ప్రధాని మోదీ సహా పలువురు హరియాణా మంత్రులు తీయించుకున్న ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయనీ, వాటిని పక్కదోవ పట్టించడానికి కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ రామ్ రహీంతో దిగినట్టు ఉన్న ఫొటోను సోషల్ మీడియాలో ఉంచారనీ, నిజానికి అది కేరళ మాజీ ముఖ్యమంత్రి ఊమన్ చాందీతో దిగిన ఫొటో అని తెలిసిందని కూడా ఆమె రాశారు. ఇంకొన్ని అంశాలను కూడా ప్రస్తావించారు. ఇది గౌరి సత్యశోధనకు నిదర్శనం. ఇటువంటి అసత్యాలు ఎలాంటి దుష్ప్రభావాన్ని కలుగజేస్తుంటాయో కూడా వివరించారు. కాదనుకుంటూనే తండ్రి వారసత్వం జర్నలిజం వ్యాసంగంలో ప్రవేశించాలని అనుకోలేదని ఆమె ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. వైద్యవృత్తిని చేపట్టాలని భావించానని, సాధ్యం కాక జర్నలిజం చదివానని చెప్పారు. తన తండ్రి పి. లంకేశ్ నడుపుతున్న పత్రికలో పనిచేయడం కష్టమని భావించానని, అలాగే ఆయన సాహసాన్ని అందుకోలేనని భావించినందువల్లే టైమ్స్ ఆఫ్ ఇండియాలో మొదట చేరానని తెలిపారు. తండ్రి మరణం తర్వాత కూడా ఆ పత్రికను నడపాలని ఆమె అనుకోలేదు. కానీ పి. లంకేశ్ స్నేహితులు పత్రికను మూసివేయవద్దని గౌరి కుటుంబాన్ని కోరారు. తన తదనంతరం ఏం చేయాలో తండ్రి ఏనాడూ చెప్పకపోయినా, పరిస్థితులను గమనించి పత్రికను కొనసాగించాలని గౌరి కుటుంబం నిర్ణయించుకున్నది. అయితే 2001 సంవత్సరం మొదట్లో గౌరికీ, ఆమె సోదరుడు ఇంద్రజిత్కూ పత్రిక విషయంలో విభేదాలు పొడసూపాయి. తన సోదరి మావోయిస్టు రాజకీయాలను పత్రిక మీద రుద్దుతున్నదని ఇంద్రజిత్ ఆరోపించారు. ఆ విమర్శకు సమాధానంగా తాను కూడా పత్రికాముఖంగా సోదరుడి వైఖరిని దుయ్యబట్టారు. చివరికి ‘గౌరీ లంకేశ్ పత్రిక’ పేరుతో ఆమె వేరే పత్రికను స్థాపించారు. గౌరి తన పత్రికను విలక్షణంగా నిర్వహించారు. ఏ పత్రిక నడపాలన్న ఆర్థికంగా నిలదొక్కుకోవాలి. దానికి ప్రభుత్వాల నుంచి, కార్పొరేట్ సంస్థల నుంచి వచ్చే ప్రకటనలే ఆధారం. కానీ ఆమె ఈ రెండు రకాల ప్రకటనలను తిరస్కరించారు. ప్రధానంగా చందాదారుల సహాయంతో పాటు, ఇతర రచనల ముద్రణల నుంచి వచ్చిన ఆదాయంతోనే పత్రికను వెలువరించేవారు. ఇదో కొత్త పద్ధతి. ప్రజల కోసం నడిచే పత్రికలు మనగలగడం కష్టమనే అభిప్రాయాన్ని గౌరీ లంకేశ్ పూర్వపక్షం చేశారు. మావోయిస్టుగా, హిందూమత వ్యతిరేకిగా, తీవ్రవాద భావాలను ప్రచారం చేస్తున్నదంటూ విమర్శలు వెల్లువెత్తాయి. కానీ ఆమె రచనలను, జీవిత గమనాన్ని, రాజకీయ, సామాజిక సంబంధాలను పరిశీలిస్తే ఒక నిజమైన ప్రజాస్వామ్యవాదిగా, మానవ హక్కుల గొంతుకగా, అసమానతలను నిరసించి, సామాజిక సమత్వాన్ని ప్రబోధించిన ఒక నిండైన శక్తిగా కనిపిస్తారు. కర్ణాటకలో చాలా ఏళ్లుగా పత్రికాస్వేచ్ఛ మీద దాడులు జరుగుతున్న సంగతినీ, మావోయిస్టు నాయకునితో ఇంటర్వ్యూ చేసినందుకు ఒక జర్నలిస్టు మీద కేసు బనాయించడానికి పోలీ సులు చేసిన ప్రయత్నాన్ని తాను అడ్డుకున్న విషయాన్నీ ఆమె ఒక వ్యాసంలో వివరించారు. లౌకికత్వాన్ని భగ్నం చేయవద్దన్నందుకు... ‘మతం, రాజకీయాలు, నగ్నసత్యం’ అనే పేరుతో ప్రచురితమైన ఒక వ్యాసంలో హరియాణా అసెంబ్లీలో నగ్నంగా దర్శనమిచ్చిన జైన ముని తరుణ్‌సాగర్ ఉదంతాన్ని ఉటంకించారు. ‘మన లౌకిక రాజ్యాంగం రాజకీయాల నుంచి మతాన్ని వేరుగా చూడాలని ప్రబోధించింది. కానీ మన దేశ రాజకీయాల్లో మతం ప్రధాన పాత్రను పోషిస్తున్నది’ అంటూ రాజ్యాంగ విలువలను గుర్తు చేశారామె. దేశభక్తి గురించి రాసిన మరొక వ్యాసంలో ‘ఈ రోజు దేశభక్తి గురించి జబ్బలు చరచుకొంటున్న హిందుత్వ శక్తులేవీ దేశ స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొనలేదు. పైగా వారంతా బ్రిటిష్ వారికి సానుభూతిపరులుగా ఉన్నారు’అంటూ చారిత్రక సత్యాన్ని కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. ఆ రాష్ట్రంలో ఒక్కళిగ సామాజిక వర్గం యువతి, ముస్లిం యువకుడు వివాహం చేసుకున్నప్పుడు వివాదం చెలరేగింది. అప్పుడు ఆమె కుల సమస్యను తూర్పారబట్టారు. ‘కులం అసమానతలను పెంచి పోషిస్తున్నది. ఎన్నో ఉద్యమాలు కొనసాగుతున్నప్పటికీ ఇంకా కుల వ్యవస్థ పునాదులు బలంగానే ఉన్నాయి. వీటిని పట్టి పల్లార్చటమెట్లా’ అని ప్రశ్నిస్తూనే, కుల నిర్మూలన కోసం కులాంతర, మతాంతర వివాహాలు అవసరమని చెప్పే అంబేడ్కర్ ఆలోచన దీనికి పరిష్కారమంటూ ఆ వ్యాసాన్ని ముగించారు. బెంగళూరులో సఫాయి కార్మికులు మ్యాన్‌హోల్‌లో దిగి ప్రాణాలు కోల్పోయినప్పుడు ఆమె ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తరతరాలుగా అంటరాని కులాలు ఎన్నో అవమానాలకు, అత్యాచారాలకు బలవుతున్నాయనీ, ఇలాంటి చావులు అందులో భాగమేనంటూ సమాజం ప్రదర్శిస్తున్న వివక్షను ఎత్తిచూపారు. బెంగళూరులో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను ఉదహరిస్తూ, నూతన సంవత్సర వేడుకల సందర్భంగా, వారిపై జరిగిన వేధింపులను నిరసించారు. వీటితో పాటు, ఇటీవల గోరఖ్‌పూర్ హాస్పిటల్లో జరిగిన పసిపిల్లల మరణాలను బీజేపీ నరమేధంగా అభివర్ణించారు. హిందువులం కాదన్నందుకు... తన సామాజిక నేపథ్యాన్ని గౌరి ప్రగతిశీలమైనదిగా ప్రకటించుకున్నారు. గౌరి తండ్రి లింగాయత్ సామాజిక వర్గం. వీరు బసవేశ్వరుని అనుచరులు. బసవేశ్వరుడు నడిపిన వీరశైవ ఉద్యమాన్ని క్రమంగా హిందూ మతం మింగేసింది. బసవేశ్వరుడి ఉద్యమం కుల రహిత, కుల నిర్మూలన ఉద్యమంగా ఆమె అభివర్ణించారు. లింగాయత్‌లు హిందువులు కారని, తాము కుల వ్యవస్థకు వ్యతి రేకమని తన సామాజికవర్గం భావించే హిందూత్వ వ్యతిరేకతలోని ప్రత్యేకతను గౌరి వెల్లడించారు. ఇది హిందుత్వ వాదులను, కుల సమాజ రక్షకులను భయపెట్టింది. అందుకే హిందూ మత వ్యతిరేకిగా, కమ్యూనిస్టుగా, నక్సలైటుగా ముద్ర వేశారు. కానీ ఆమె రచనలు చదివిన వారెవ్వరికైనా ఆమె ఏదో ఒక రాజకీయాలకు పరిమితమైన వ్యక్తికాదని అనిపిస్తుంది. జీవితాన్ని సంపూర్ణంగా ప్రజలను ప్రేమించడానికి, ప్రజాఉద్యమాలకు అండగా నిలబడటానికే ఆమె వెచ్చించింది. పెళ్లి చేసుకున్నా, కొద్దికాలానికే విడాకులు తీసుకున్నారు. ఇటీవలి కాలంలో వెల్లువెత్తిన విద్యార్థి యువజనోద్యమాలను ఆమె హత్తుకున్న తీరు ఆశ్చర్యపరుస్తుంది. ఢిల్లీ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఉద్యమ నాయకులైన కన్హయ్య కుమార్, గుజరాత్ దళిత యువకిశోరం జిగ్నేష్ మేవాని, షీలా రషీద్, ఉమర్ ఖలీద్‌లను తాను దత్తత తీసుకున్నానని, తాను వారి పెంపుడు తల్లినని ప్రకటించుకుని తన ఉద్యమ వాత్సల్యాన్ని చెప్పకనే చెప్పారు. అయితే ఈ నలుగురి రాజకీయ నేపథ్యం ఒకటి కాదు. ఈ వ్యవస్థకు వ్యతిరేకంగా ఎక్కడ, ఎవరు ఉద్యమాలు చేసినా అందులో తాను మమేకమైపోవడం ఆమె సొంతం. మావోయిస్టు ముద్ర కూడా ఆమెకు సరైంది కాదు. అలాగని ఆమె మావోయిస్టులకు వ్యతిరేకంగా పని చేయలేదు. విప్లవ రచయిత వరవరరావుతో కలసి ఆమె అధ్యయనం చేశారు. కర్ణాటక – తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌వేలో నిర్వాసితులవుతున్న ప్రజల గురించి వీరిద్దరూ ఒక నివేదిక తయారు చేసినట్టు వరవరరావు చెప్పారు. లొంగిపోయిన నక్సలైట్ల పునరావాసం కోసం ఏర్పాటు చేసిన కమిటీలో గౌరి సభ్యురాలు. ఆమెను మావోయిస్టుగా అభివర్ణించి, ఆ కమిటీ నుంచి తొలగించాలని ఒత్తిడి వచ్చినప్పటికీ ప్రభుత్వం అంగీకరించలేదు. గౌరీ లంకేశ్ జీవితం, ఆలోచన, ఆచరణ ఒక విశాల ప్రజాస్వామ్య తాత్వికతకు అద్దం పడుతున్నాయి. ఏదో ఒక సిద్ధాంత చట్రంలో ఒదిగిపోయే తత్వం కాదు ఆమెది. ఆమె గత ముప్ఫై సంవత్సరాలుగా సాగించిన రచనలతో హిందుత్వ వాదాన్ని తీవ్రంగా వ్యతిరేకించడంతో పాటు అనేక సామాజిక సమస్యలపై విరుచుకుపడ్డారామె. హిందుత్వ వ్యతిరేక పోరాటం ఆమెకు ప్రధాన ఎజెండానే. ఆమె హత్యకు ఇదే అసలు కారణం. వందల సంవత్సరాలుగా కులతత్వ వ్యతిరేక ఉద్యమంలో భాగస్వాములైన ఎన్నో వందల మంది ప్రాణ త్యాగం చేయాల్సి వచ్చింది కూడా అందుకే. కానీ అటువంటి త్యాగాలెప్పుడూ ఓడిపోలేదు. పోవు. మల్లెపల్లి లక్ష్మయ్య వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు ‘ 97055 66213 -
గౌరీ లంకేశ్ హంతకుల గుర్తింపు?
-
లంకేష్ హత్యకు ఆ ఒక్కరోజే రెండుసార్లు రెక్కీ
సాక్షి, బెంగళూరు : దేశంలో సంచలనం సృష్టించిన ప్రముఖ సీనియర్ జర్నలిస్టు గౌరీ లంకేష్ కేసులో పురోగతి మొదలైంది. ఈ కేసును చేదించే దిశగా వెళుతున్న పోలీసులకు ఒక కీలక ఆధారం లభించినట్లు తెలుస్తోంది. సీసీటీవీ ఫుటేజీ పరిశీలించిన పోలీసులు హత్య జరిగిన రోజున హంతకుడు రెండుసార్లు ఆమె ఇంటి వద్ద రెక్కీ నిర్వహించినట్లు గుర్తించారు. లంకేష్ ఇంటి బయట మధ్యాహ్నం 3గంటల ప్రాంతంలో ఒకసారి అలాగే 7గంటలకు మరోసారి అతడు రెక్కీ నిర్వహించినట్లు తెలిపారు. ఆ వ్యక్తి తెల్ల చొక్క, బ్లాక్ హెల్మెట్ పెట్టుకొని స్కూటర్‌పై ఇంటిముందు నుంచి కొంచెం దూరం వెళ్లి తిరిగి స్కూటర్ మలుపుకొని మరోసారి ఆమె ఇంటివైపు చూస్తూ వెళ్లాడు. ఆ తర్వాత రాత్రి 8.05గంటలకు ఆమె ఇంటి వద్దకు మరోసారి చేరుకొని సిద్ధంగా ఉన్నాడు. గౌరీ లంకేష్ వచ్చి చిన్నగేటు ద్వారా లోపలికి వెళ్లి కారు లోపల పెట్టేందుకు పెద్ద గేటు తీస్తుండగానే నేరుగా కాల్పులు జరిపి మరో వ్యక్తితో కలిసి పరారయ్యాడు. ప్రస్తుతం సీసీటీవీ ఫుటేజీలో లభ్యమైన ఆధారాలతో కేసును చేదించే దిశగా ముందుకెళుతున్నామని, మరో పదిరోజుల్లో ఈ కేసులో పూర్తి స్థాయిలో దర్యాప్తు కొలిక్కి వస్తుందని వారు భావిస్తున్నారు. ఎలాంటి ఆయుధాన్ని నిందితులు ఉపయోగించారనే విషయంపై ప్రశ్నించగా ప్రస్తుతం ఎలాంటి వివరాలు చెప్పబోమని పోలీసులు చెప్పారు. -
కపట మేధావుల విన్యాసాలు
సందర్భం పార్లమెంటు మీద, మన ఆర్థిక రాజధానిగా పేరొందిన ముంబై నగరం మీద దాడికి దిగిన ముష్కరులను తెగటార్చాలని, పట్టి దండించాలని భారతీయుడై పుట్టిన ప్రతి పౌరుడూ కోరాలి. దాడికి పాల్పడిన దోషులను పట్టి సుదీర్ఘ విచారణ అనంతరం ఉరితీస్తే కడవల కొద్దీ కన్నీరు కార్చిన వారిని ఏమనాలి? ముష్కరుల వర్థంతులు నిర్వహించడాన్ని ఏమనాలి? ఇలాంటి దేశద్రోహ పూరిత చర్యలను ఖండించకపోవడం, వాటికి మద్దతు తెల్పడం భూమండలం మీది ఏ దేశంలోనూ ఆమోదనీయం కాదు. సామాన్య ప్రజలకు రాజకీయ నేతల పట్ల విశ్వాసం సన్నగిల్లడం మొదలై చాలా కాలమైంది. మేధావుల పట్ల మాత్రం సమాజానికి కొంత నమ్మకం మిగిలి ఉంది. స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం వంటి ప్రజాస్వామిక భావనలకు ప్రపంచమంతటా ఆదరణ లభిస్తున్న తరుణంలో హింస పట్ల సర్వత్రా ఖండన మండనలు వెలువడడం హర్షణీయం. భిన్నాభిప్రాయాలు ప్రజాస్వామిక రాజకీయ సంస్కృతిలో భాగం. హింసా రాజకీయాలు దాని వికృతి. సర్వే సర్వత్రా సర్వులూ ఖండించదగిన హింస విషయంలో కొందరు మేధావుల వైఖరి నిజాయితీగా లేకపోవడం వారి ప్రతిష్టకే కాదు, సమాజ హితానికి కూడా చెరుపు చేస్తుంది. మొదలంటా వ్యతిరేకించవలసిన హింసను హింస, ప్రతిహింస, రాజ్యహింస అంటూ వర్గీకరించి, కొందరి రాజకీయ ప్రయోజనాల కోసం దాన్ని ఆమోదించడం లేదా కొన్ని సందర్భాలలో మౌనం దాల్చడం మేధావులకు శోభనివ్వదు. గౌరీ హత్య మీద కపట విలాపాలు ఈ సెప్టెంబరు 5, మంగళవారం రాత్రి బెంగళూరులో జరిగిన సీనియర్ జర్నలిస్ట్ గౌరీ లంకేశ్ హత్య విషయంలో అదే జరుగుతోంది. సిద్ధాంతం, భావజాలం వేరైనా సరే సమాజ సేవకు ముందుకు వచ్చిన వారిని వ్యతిరేకించడం, విమర్శించడం తగునేమో కానీ, వ్యక్తులను అంతమొందించి, వారి భావజాలాన్నీ, సిద్ధాంత వ్యాప్తినీ అడ్డుకోగలమని భావిస్తే అది వారి అజ్ఞానం. తమకు నచ్చిన సిద్ధాంతం, భావజాలం మాత్రమే పురోగామిగా, ప్రోత్సహించదగినవిగాను; మిగిలినవి తిరోగామిగా, హింసామార్గంలోనైనా సరే అడ్డుకుని నిర్మూలించదగినవని భావించడం మూర్ఖత్వం. హతురాలు గౌరి లోగడ విభిన్న భావజాలానికి మద్దతుదారు కావచ్చు. తరువాత తన వైఖరిని మార్చుకునే హక్కు ఆమెకుంది. స్వేచ్ఛగా, నిర్భయంగా తను నమ్మిన భావజాల వ్యాప్తికి పనిచేసే వ్యక్తిని కాల్చి చంపడం కిరాతక చర్య. దాన్ని నిర్ద్వంద్వంగా ఖండించి తీరాలి. త్వరితగతిన విచారణ జరిపి దోషులను దండించాలని పట్టుబట్టాల్సిందే. సరైన విచారణ జరిపించాలని కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాల్సిందిపోయి నిందితుల గురించి అస్పష్ట, ఊహాత్మక ఆరోపణలతో కపట విలాపాలు వినిపిస్తున్నారు. ప్రశ్నిస్తే చంపుతారా? వ్యతిరేక భావజాలాన్ని బ్రతకనివ్వరా? అంటూ గౌరి హత్యానంతరం వెలువడిన విలాపానికి స్పందనగా ‘ఔను, 33 ఏళ్ళుగా హిందువులను దూషిస్తూ, హిందుత్వను వ్యతిరేకిస్తూ, చైనా, పాకిస్తాన్లను సమర్థిస్తూ కశ్మీర్ పోరాటాలకు, నక్సల్స్‌కు మద్దతు పలికినా గౌరీ కలానికీ, గళానికీ ముప్పు రాలేదు. ఇటీవల ఆరునెలలుగా కాంగ్రెస్ వ్యతిరేకి కావడం, ఇద్దరు ముగ్గురు నక్సలైట్లను జనజీవన స్రవంతిలోకి తీసుకురావడం జరిగాకే ఆమెను తూటాలు బలిగొన్నాయి. ఆ తూటాలెవరివో నిగ్గుతేలాలి!’ అని సోషల్ మీడియాలో పోస్టింగ్స్ వచ్చే సరికి సద్దుమణిగిన విలాపం తర్క రాహిత్యాన్ని పట్టిస్తోంది. రోహిత్ ఉదంతంతో పబ్బం గడపదలిచారు గౌరీ హత్య జరగ్గానే కల్బుర్గీ, పన్సారే, దబోల్కర్‌ల హత్యోదంతాలను ప్రస్తావించడం, కొన్ని సంస్థల పేర్లను ప్రస్తావించి వారిని దోషులుగా చిత్రీకరించాలని ప్రయత్నించడం వెనుక మతలబేమిటి! ఇక్కడ ప్రస్తావించిన హత్యలన్నీ ఆయా రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నప్పుడే జరిగాయి. మరి సరైన విచారణ జరిపి దోషులను దండించకుండా అడ్డుపడినదెవరు! ఇప్పుడు కూడా అసలు దోషులను తప్పించే ప్రయత్నాల్లో భాగమే ఈ అసందర్భ ప్రస్తావనలని అనుమానించడంలో తప్పేముంది? హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో వేముల రోహిత్ ఆత్మహత్య విషయంలో త్వరితగతిన సక్రమ విచారణ జరగాలని కోరాల్సిందిపోయి, తెరాస, కేసీఆర్‌లపై ఒత్తిడి పెంచాల్సింది పోయి అస్పష్ట, నిరాధార ఆరోపణలతో ఆందోళనకు తెర తీసి రాజకీయ పబ్బం గడుపుకోజూసిన వారికి పలువురు మేధావులు వత్తాసు పలికారు. రోహిత్ ఆత్మహత్య లేఖను, దానిలో పేర్కొన్న విషయాలను సమగ్రంగా విచారిస్తే వామపక్ష రాజకీయాల్లో ఇమడలేక, వాస్తవాలతో రాజీపడలేక అతను ఆత్మహత్యకు పాల్పడినట్లు స్పష్టమౌతుంది. సమగ్ర విచారణ జరక్కూడదని, విచారణను తప్పుదారి పట్టించాలనే కుట్రతోనే ఎవరెవరినో దోషులుగా చిత్రిస్తూ ఆందోళనకు తెరతీశారు. మేధావులని చెప్పే పలువురు విద్యావంతులు వారిని గుడ్డిగా అనుసరించారు. ఆ సందర్భంగా హైదరాబాద్ వచ్చి ఆక్రోశించి వెళ్లిన నేతలకు నిజంగా దళితుల పట్ల నిబద్ధత ఉంటే హుటాహుటిన వెళ్లి ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన సంఘటన కేరళలో జరిగింది. నిరపరాధి, దళిత యువకుడైన రాజేశ్‌ను కేరళలోని హింసోన్మాదులు తిరువనంతపురంలో నడిరోడ్డు మీద జూలై 29న చేతులు నరికి, కర్కశంగా పొడిచి చంపారు. అతడు మరణిస్తూ నిందితుల పేర్లు వెల్లడించాడు. అయినా కేరళ కమ్యూనిస్టు ప్రభుత్వం చలించలేదు. అలా కేరళలో హత్యా రాజకీయాలకు బలైపోయిన వారి పేర్లు, చిరునామాలు ఏకరువు పెడితే కొండవీటి చేంతాడంత అవుతుంది. దేశంలో ఏ మూల ఎవరి హత్య జరిగినా మోకాలికీ బోడిగుండుకీ ముడి పెట్టినట్టు హిందుత్వంతో ముడిపెట్టి వ్యాఖ్యానించే మేధావులు కేరళలో ఆరెస్సెస్, బీజేపీ కార్యకర్తలపై జరిగిన హత్యాకాండ పట్ల మౌనం వహిస్తూనే వస్తున్నారు. నోరు మెదపని సందర్భాలు ఎన్నో! రాజకీయాలతో, సిద్ధాంతాలతో సంబంధం లేకుండా కేవలం గిరిజన సంక్షేమం కోసం ఒరిస్సాలోని కంథమూల్ జిల్లాలో ఆశ్రమం నెలకొల్పుకుని పనిచేస్తున్న స్వామి లక్ష్మణానంద సరస్వతి హత్య మరీ దారుణం. వామపక్ష తీవ్రవాద రాజకీయాలకు, క్రైస్తవ మిషనరీల మతమార్పిడి కార్యకలాపాలకు కావాల్సిన ముడి సరుకు లాంటివారు గిరిజనులు. వారికీ, తమకూ మధ్య స్వామి లక్ష్మణానంద అవరోధమని భావించి, ఉభయులు కుమ్మక్కై మిషనరీల ఆర్థిక సాయంతో నక్సలైట్లు హత్య చేసినట్లు తరువాత పోలీసు విచారణలో వెల్లడైంది. మార్క్సిస్టు సిద్ధాంతవేత్తలెవ్వరూ ఈ లంచగొండి మతవాద హత్య పట్ల ఆక్షేపణ, ఆగ్రహం ప్రకటించలేదు. లక్ష్మణానంద హత్యను ఖండించడానికి మేధావులెవ్వరికీ నోరురాలేదు. రాజ్యాంగధర్మాన్ని అనుసరించి తమ విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తిస్తున్న ప్రభుత్వ ఉద్యోగులను హింసోన్మాదులు హతమార్చినప్పుడు కూడా ఈ మేధావులు నోరు మెదపడం లేదు. ప్రజా ప్రభుత్వాన్ని, రాజ్యాంగాన్ని, రాజ్యాంగ వ్యవస్థలను సవాలు చేసిన హింసోన్మాదులు విదేశీయులు అయినప్పటికీ ఈ మేధావులు పట్టించుకోవడం లేదు. పైగా, అలాంటి వారిని కూడా సమర్థిస్తున్న వారికి మేధావులు మద్దతు పలకడానికి బారులు తీరడం నిస్సం దేహంగా ఆక్షేపించవలసిన విషయమే. మన దేశ పార్లమెంటు మీద, మన ఆర్థిక రాజధానిగా పేరొందిన ముంబై నగరం మీద దాడికి దిగిన ముష్కరులను తెగటార్చాలని, పట్టి దండించాలని భారతీయుడై పుట్టిన ప్రతి పౌరుడూ కోరాలి. దాడికి పాల్పడిన దోషులను పట్టి సుదీర్ఘ విచారణ అనంతరం ఉరితీస్తే కడవల కొద్దీ కన్నీరు కార్చిన వారిని ఏమనాలి? ముష్కరుల వర్థంతులు నిర్వహించడాన్ని ఏమనాలి? ఇలాంటి దేశద్రోహ పూరిత చర్యలను ఖండించకపోవడం, వాటికి మద్దతు తెల్పడం భూమండలం మీది ఏ దేశంలోనూ ఆమోదనీయం కాదు. సత్తెయ్య, వ్యాస్, ఉమేశ్‌చంద్ర వంటి పోలీసు అధికారులు బలైన సందర్భాల్లో కనీసం మానవతా దృక్పథంతోనైనా హింసను ఖండించలేదీ మేధావులు. ‘మూడు దశాబ్దాల గమనం గమ్యం’ పేరిట పౌరహక్కుల ఉద్యమనేత స్వర్గీయ బాలగోపాల్ లేవనెత్తిన ప్రశ్నలకు మేధావుల నుంచి జవాబే లేదు. జాతి వ్యతిరేక శక్తులకు వత్తాసు పలికినా, జాతీయతను అవమానించినా మేధావులు నోరు మెదపక పోవడం విచారకరం. వరంగల్ కాకతీయ విశ్వవిద్యాలయంలో మన జాతీయ పతాకాన్ని అవమానించడం తగదని అడ్డుపడిన సామా జగన్మోహనరెడ్డి హత్యతో మొదలు పెట్టి, తెలంగాణ ప్రాంతంలో జాతీయ భావజాల వ్యాప్తికి కృషి చేస్తున్న రామన్న, గోపన్నల దాకా జరిగిన అనేక హత్యల్లో ఒక్కదాన్నీ ఖండించడానికి కూడా ఈ మేధావులకు నోరు రాలేదు. హైదరాబాద్‌లో 1997మార్చి 3న విద్యార్థి పరిషత్ నేత చంద్రారెడ్డిని హతమార్చినప్పుడు కూడా జార్జిరెడ్డి హత్యతో ముడిపెట్టి ప్రత్యేక కథనాలు వండివార్చి, నేర తీవ్రతను తగ్గించాలని ప్రయత్నించారు పత్రికా రచయితలుగా స్థానం పొందిన మేథావులు. లేడిని పులి చంపకపోతే.... ‘పులి చంపిన లేడి నెత్తురు కావాలోయ్ నవకవనానికి’అన్న శ్రీశ్రీ కవితా స్ఫూర్తితో ఈ మేధావులు తమ రాజకీయ లబ్ధికి లేడి నెత్తురు కోసం అన్వేషిస్తూనే ఉన్నారు. అమాయక లేడి ఆడదో, దళిత, బడుగు బలహీన వర్గాలదో అయితే మరింత మేలు. లేడిని పులి చంపకపోతే తామే చంపించి, వేరెవరినో పులులుగా చిత్రించి పబ్బం గడుపుకోవడం వారికి ఆనవాయితీ. దానిలో ఇటీవల చిన్న మార్పు వచ్చింది. మోదీ అధికారంలోకి వచ్చాక ‘హిందుత్వ మోదిత్వ’ అనే పదబంధాన్ని ప్రచారంలోకి తెచ్చారు. మోదీ పుట్టక ముందునుంచీ∙ఈ దేశంలో హిందుత్వం ఉంది, మోదీ తరువాతా ఉంటుంది. ఈ కనీస చారిత్రక జ్ఞానం కూడా లేని వారు మేధావుల గ్రూపులో జొరబడడం నికార్సయిన శ్రేష్టతను దిగజార్చగలదు! దుష్టుల రాజకీయ గుణదోషాలను ఎంచి ఆమోదించడం, తిరస్కరించడం ప్రజల పని. రాజకీయాల పట్ల తటస్థ వైఖరిని అవలంబిస్తూ, సమాజానికి యోగ్యమైన దిశా నిర్దేశనం చేయగల మేధావులైన విద్యావంతులు హింసా రాజకీయవాదుల మాయాజాలంలో పడి కొట్టుకు పోరాదు. తమ ప్రతిష్టను విశుద్ధంగా నిలుపుకోవడం కోసం, సమాజ హితం కోసం మేధావులు నిష్పక్షపాత ధోరణితోను, చిత్తశుద్ధితోను వ్యవహరించాలి! వ్యాసకర్త ఏకలవ్య ఫౌండేషన్, హైదరాబాద్, అధ్యక్షులు పి. వేణుగోపాల్‌రెడ్డి మొబైల్ : 94904 70064 -
గౌరీలంకేశ్ కేసులో మరో సంచలన విషయం
► గౌరీ లంకేశ్, ఎం.ఎం కాల్బుర్గీ హత్యలకు ఒకే ఆయుధం సాక్షి, బెంగుళూరు: ప్రముఖ జర్నలిస్ట్, సామాజికవేత్త గౌరీలంకేశ్ హత్యకేసులో మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. 2015 ఆగస్టులో హత్యకు గురైన ప్రముఖ రచయిత, హేతువాది డాక్టర్ ఎం.ఎం కాల్బుర్గి, గౌరీ లంకేశ్ హత్యలు ఒకే ఆయుధంతో చేసినట్లు ఫోరెన్సిక్ సైన్స్ లాబోరేటరీ ప్రాధమిక నిర్ధారణలో వెల్లడైంది. 7.65 ఎం.ఎం తో దేశంలో తయారైన తుపాకీతో చంపినట్లు ప్రాథమిక పరిశోధనలు సూచించాయి. ఈరెండు హత్యల్లో సుమారు 80శాతం పోలికలు సరిపోలాయని, ఈ ఘోరాలను ఒకే తుపాకిని ఉపయోగించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. లంకేశ్ హత్యపై కుటుంబ సభ్యులు సీబీఐ విచారణను డిమాండ్ చేయగా, కర్ణాటక ప్రభుత్తం ఐజీపీ ఇంటలిజెన్స్ అధికారి బీకే సింగ్ నేతృత్వంలో 19 మంది అధికారులతో కూడిన సిట్ బృందాన్ని ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా ఇప్పటి వరకు బెంగుళూరు, ఇతర మావోయిస్టు ప్రభావిత జిల్లాలో సిట్ సుమారు 80మందిపైగా విచారించింది. గౌరీలంకేష్ హత్య గావించబడిన రోజు ఆమె ఇంటిముందు మూడు సార్లు అనుమానాస్పదంగా తిరిగిన గుర్తు తెలియని వ్యక్తి గురించి ముమ్మరంగా గాలింపు చేపట్టింది. -
గౌరి హత్య వెనుక సంఘ్ హస్తం
♦ మావోయిస్టుల ప్రమేయం లేదు ♦ మాజీ మావోయిస్టులు సిరిమనె నాగరాజు, నూర్ శ్రీధర్ శివాజీనగర : సీనియర్ పాత్రికేయురాలు, సామాజికకర్త గౌరీ లంకేశ్‌ను మావోయిస్టులు ఎట్టి పరిస్థితిలోను హత్య చేయటానికి అవకాశమే లేదని మాజీ మావోయిస్టులు సిరిమనె నాగరాజు, నూర్ శ్రీధర్ స్పష్టం చేశారు. సోమవారం వారు ఇక్కడ విలేకరులతో మాట్లాడు తూ...మావోయిష్టులు ఏనాడు పోరాటదారులు, సాహితీవేత్తలను, సమాజ సేవకులను అంతం చేసే సాహసానికి ఒడిగట్టిన నిదర్శనాలు లేవని, ఉద్యమకారులకు అండగా నిలిచే మావోయిస్టులు ఓ పాత్రికేయురాలైన గౌరి లంకేశ్‌ను హత్య చేయరని సిరిమనె నాగరాజు స్పష్టం చేశారు. నక్సలైట్లతో గౌరి లంకేశ్‌కు ఎలాంటి విభేదాలు లేవని, ఈ హత్య వెనుక సంఘ్ పరివార్ హస్తం ఉందని ఆయన ఆరోపించారు. మావోయిష్టులు మాఫియా గ్యాంగ్ కాదని, అదొక క్రమశిక్షణతో కూడిన రాజకీయ పార్టీ అని, దానికి ఒక ప్రణాళిక ఉందని తెలిపారు. నియమాలకు అనుగుణంగా ఆ పార్టీ పని చేస్తుందని, ఏ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిన ప్రతి ఒక్కరి అభిప్రాయం మేరకే నిర్ణయాలు ఉంటాయన్నారు. దేశంలో మావోయిస్టులు పాత్రికేయులను హత్య చేసిన సంఘటనలు లేవని, అదే విధంగా అధికారులను కిడ్నాప్ చేసి హత్య చేసిన నిదర్శనాలు లేవని స్పష్టం చేశారు. ఈ విధమైన విధానాలను అనుసరిస్తున్న మావోయిస్టులు గౌరి లంకేశ్‌ను హత్య చేయటానికి ఒడిగట్టరన్నారు. దర్యాప్తు తప్పుదారి పట్టించేందుకు కుట్ర జరుగుతోందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. సిట్ నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ నెల 12న నగరంలో సాహితీవేత్తలు, ప్రజా సంఘాల నాయకులు, పోరాట నాయకులు సమావేశం జరుపనున్నట్లు ఆయన తెలిపారు. -
బెర్లిన్ టు బెంగళూరు
రెండో మాట గౌరీ హత్య తరువాత కర్ణాటక లింగాయతులు తాము ‘హిందువులం కాద’ని ప్రకటించి, ప్రత్యేక గుర్తింపు కావాలని అన్నందుకు వారిపైన వేధింపులు ప్రారంభమయ్యాయి. దీనితో పాటు ఆ రాష్ట్రానికి చెందిన ప్రసిద్ధులు, ప్రగతిశీల భావకులైన గిరీశ్ కర్నాడ్, పుట్టప్ప, బరాగర్ రామచంద్రప్ప తదితర 18 మంది ప్రముఖులకు ప్రభుత్వ ఆదేశాలపైన వ్యక్తిగత భద్రతను ఏర్పాటు చేయవలసి వచ్చిందంటే బీజేపీ కేంద్ర, స్థానిక వర్గాల, పాలకుల ‘హిందూత్వ’ విభజన రాజకీయాలు ఏ స్థాయిలో సాగుతున్నాయో అర్థమవుతోంది. ‘దేశంలోని సకల జాతుల; విభిన్న వర్గ, మత, భాషా, దళిత, మైనారిటీల సంక్షేమం, భద్రతలే లక్ష్యంగా కలిగిన సెక్యులరిజమే నిజమైన జాతీయవాదం. దానిని వ్యతిరేకించడమంటే విభిన్న భావాలను గుర్తించకపోవడమే. అంటే జాతీయవాదాన్ని కుంచింపచేయడమే. జర్మనీలో హిట్లర్ నాజీయిజం, ఫాసిజం ఈ సంకుచిత జాతీయతకు పుట్టిన వికారపు లక్షణాలే. ఈ వికార బుద్ధి అసంబద్ధమైనదీ, హేతు విరుద్ధమైనదీ, వెర్రిబాగులతనం కలిగినది. ఇందుకు విరుద్ధమైనవే∙గాంధీ, నెహ్రూల జాతీయవాదం, జాతీయత. ఇది వలస పాలనా వ్యతిరేక పోరాటాల నుంచి జనించింది. దేశంలోని విభిన్న జాతుల, మతాల సమ్మేళనమే వారి జాతీయత. గాంధీ–నెహ్రూల జాతీయవాదం మత ప్రాతిపదికపై ఏర్పడినది కాదు. కానీ నేడు మనం చూస్తున్నది మతం పేరిట బలవంతంగా సాగుతున్న సాంస్కృతిక విద్వేష వ్యాప్తి. గోరక్ష పేరుతో సాగుతున్న గుంపు వేధింపులు.’ – జస్టిస్ అజిత్ ప్రకాశ్ షా, 9–8–17 (ఢిల్లీ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి, భారత లా కమిషన్ సభ్యుడు) ‘హేతుబద్ధమైన వాదనాపటిమతో అభిప్రాయాలను చాటే గొంతులను హతమార్చడం పిరికి పందల లక్షణం. మా వాదనలను పూర్వపక్షం చేయగల సత్తా లేని పిరికిపందల లక్షణమది.’ – నరేంద్ర నాయక్ (ప్రసిద్ధ హేతువాద ఉద్యమ నాయకుడు) సుప్రసిద్ధ కన్నడ వారపత్రిక ‘గౌరీ లంకేశ్’ సంపాదకురాలు, సీనియర్ జర్నలిస్ట్ గౌరీ హత్య వార్త విన్న సమయంలో జస్టిస్ అజిత్ ప్రకాశ్‌షా వ్యాఖ్య గుర్తుకు వచ్చింది. వామపక్షాల వ్యాప్తిలోను, నిశితమైన వ్యాఖ్యాతగానూ ప్రసిద్ధి చెందారు. జస్టిస్ ప్రకాశ్ షా∙ప్రస్తావించిన నాజీ జర్మనీకీ, ఫాసిజానికీ బెర్లిన్ టు బెంగళూరు వాతావరణానికీ మధ్య ఎంతో సంబంధం ఉందని అనిపిస్తుంది. ఈ సారూప్యత పైకి మోకాలికీ, బోడు గుండుకీ ముడిపెట్టినట్టుగా భావింప చేస్తుంది. డెబ్బయ్ రెండేళ్ల క్రితం జరిగిన రెండో ప్రపంచ యుద్ధ కాలంలో ఆర్యజాతి సిద్ధాంతానికి నారు పోసి నీరు పెట్టి లక్షలాది మంది యూదు జాతీయులను ఊచకోతకు గురి చేసిన సంగతి మరపునకు రాదు. ఈ ఊచకోతకు చిహ్నంగా మిగిలినది స్వస్తిక్ గుర్తు. ఆ గుర్తు ఇప్పటికీ గోడల మీద, క్రీడా మైదానాలు, భవన నిర్మాణాల దగ్గర దర్శనమిస్తూ ఏహ్యభావం కలిగిస్తూనే ఉన్నది. ఆ ఏహ్యతతోనే నేటి తరం ఆ గుర్తును చెరిపివేసే ‘శుద్ధి’ ఉద్యమాన్ని మహోధృతంగా ఆరంభించింది. వీరికి బాసటగా నిలిచిన వారు అక్కడి గ్రాఫిటీ కళాకారులు. స్వస్తిక్ గుర్తులను తుడిచివేసి, ఆ స్థానంలో అందమైన పుష్పాలు, వాహనాలు, జంతువుల బొమ్మలు, దృశ్యాలు చిత్రిస్తున్నారు. దీనికి ప్రేరకుడు ఆ కళలో దిట్ట – ఇబో ఓమర్. సకల జాతులు నివసించే రాజధాని నగరం బెర్లిన్‌లో జాత్యహంకారానికి చోటు లేదు. నగరానికి వచ్చే పర్యాటకులు స్వస్తిక్ గుర్తును చూసి ఇక్కడ ఏం జరుగుతోంది అని, ఇంకా నాజీలు ఉన్నారా అని విస్తుపోతారని ఓమర్ వ్యాఖ్యానించారు. అది యువతరం ఉద్యమం స్థాయి దాటి, ప్రజా ఉద్యమం స్థాయికి చేరుకుంది. ఈ పరిస్థితిని బద్దలు కొట్టాలి రాడికల్ ఉద్యమాల అవసరం ప్రతి దేశానికి ఏదో ఒక దశలో అనివార్యమైనట్టు చరిత్రను బట్టి అర్థమవుతుంది. ప్రగతిశీల శక్తులనూ, హేతువాద ఉద్యమాలనూ దెబ్బ తీయడానికి ప్రగతి నిరోధకశక్తులు సిద్ధమైన ప్రతి సందర్భంలోను సంస్కరణల కోసం రాడికల్ ఉద్యమాలు తలెత్తుతాయి. గౌరీ లంకేశ్ హత్యకు కొద్దిరోజుల ముందే హైదరాబాద్‌లోని ‘లమకాన్’ (బంజారాహిల్స్)లో అలాంటి ఓ ఉద్యమానికి అంకురార్పణ జరిగింది. ఆ సందర్భంగా, అంటే హసన్ తృతీయ సంస్మరణ కార్యక్రమం కోసం జరిగిన ఈ సభ పెద్దలతో పాటు, యువకులతోనూ కిటకిటలాడింది. షీలా రషీద్, జిగ్నేశ్ మేవాని, ప్రతీక్ సిన్హా ప్రసంగించారు. నేటి పరిస్థితులలో సమూల (రాడికల్) సంస్కరణల కోసం యువత ఉద్యమించవలసిన అవసరం ఉందని ఢిల్లీ విద్యార్థి సంఘ నాయకురాలు షీలా అన్నారు. అంతేకాదు, ఈ దేశంలో ఎన్నికల తంతు ముగిసిపోగానే నాయకులు మళ్లీ కనపడరు, ఇటువైపు చూడరని మరొక కీలకమైన అంశాన్ని ప్రస్తావించడం గమనార్హం: ‘ఎన్నికలు అయిపోగానే కనుమరుగయ్యేవారు పాలకపక్ష నాయకులే కాదు, ఈ జాడ్యం ప్రతిపక్ష నాయకులకూ ఉంది. వారందరి ఆస్తులూ ‘హనుమంతుడి వాలం’లా పెరి గిపోయాయి. ఈ యథాస్థితిని మన యువత బద్దలు చేయవలసిన అవసరం ఉంద’నీ ఆమె చెప్పింది. అందుకని గోవు పరిధినీ, మతతత్వం, కులగొడవలకు అతీతంగా, వాటిని అధిగమించి యువత ఆలోచనలు సమూల సంస్కరణలపైన కేంద్రీకరించాలన్నది ఆమె ఉద్బోధ. ఆ మార్పు కోసం నడుం కట్టగలిగేది యువతేనన్నది సందేశం. పెరుగుతున్న జాబితా గుజరాత్లో దళితులపైన జరుగుతున్న వేధింపులకు, దాడులకు నిరసనగా ఉద్యమం నిర్వహించిన వ్యక్తి జిగ్నేశ్ మేవాని. మేవాని ఉద్యమ నినాదం– ‘ఆవు తోకను మీరే అట్టిపెట్టుకోండి. కానీ రెండు కోట్ల ఉద్యోగాలు మాకివ్వండి’. ఈ ధోరణి వ్యంగ్యంగా ఉన్నా ఒక జీవన వాస్తవమే. బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత ‘పరివార్’ సంస్థలు తలపెట్టిన ‘ప్రత్యర్థుల’ హరికిరిలో ‘గుర్తు తెలియని’ హంతకుల జాబితాలు అనేక సందర్భాల్లో పెరిగాయేగానీ తరగలేదు. గౌరీ హత్యానంతరం కర్ణాటకలోను ఇతరచోట్లా ఎన్ని గందరగోళాలకు, వేధింపులకు పరివార్ వర్గీయులు కారకులయ్యారో పత్రికా వార్తలు చెప్పకనే చెప్పాయి. అంతకుముందు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన హేతవాద నాయకుల హత్య (నరేంద్ర దభోల్కర్ 2013, గోవిందపన్సారే 2014, ఎం.ఎం. కల్బుర్గీ 2015) కేసు ‘విచారణ’లో బీజేపీ ప్రభుత్వం గత నాలుగేళ్లలోనూ హంతకులను పట్టుకోలేకపోయింది. కానీ ఈలోగా 2002లో గుజరాత్లో రెండువేల మంది మైనారిటీల ఊచకోతలకు కారకులైన కొందరు పాలకవర్గ నాయకులు లేదా కొందరు పోలీసు అధికారులు మోదీ దేశ ప్రధానిగా అధికారంలోకి రాగానే కేసుల నుంచి, జైళ్ల నుంచి వరుసగా విడుదలవుతూ రావడాన్ని ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. గౌరీ హత్య తరువాత కర్ణాటక లింగాయతులు తాము ‘హిందువులం కాద’ని ప్రకటించి, తమకు ప్రత్యేక గుర్తింపు కావాలని అన్నందుకు వారిపైన వేధింపులు ప్రారంభమయ్యాయి. దీనితో పాటు ఆ రాష్ట్రానికి చెందిన ప్రసిద్ధులు, హేతువాదులు, ప్రసిద్ధ నాటక కర్తలు, ప్రగతిశీల భావకులైన గిరీశ్ కర్నాడ్, పుట్టప్ప, బరాగర్ రామచంద్రప్ప తదితర 18 మంది ప్రముఖులకు ప్రభుత్వ ఆదేశాలపైన వ్యక్తిగత భద్రతను ఏర్పాటు చేయవలసి వచ్చిందంటే (8.9.17) బీజేపీ కేంద్ర, స్థానిక వర్గాల, పాలకుల ‘హిందూత్వ’ విభజన రాజకీయాలు ఏ స్థాయిలో సాగుతున్నాయో అర్థమవుతోంది. నిన్నగాక మొన్న కన్హయ్య కుమార్, రోహిత్ వేముల లాంటి ప్రగతిశీల దళిత విద్యార్థి నాయకులపట్ల బీజేపీ నాయకత్వం వేధింపు రాజకీయాలకు పాల్పడి, వాస్తవాల్ని మసిపూసి మారేడుకాయ చేసింది. గౌరీ హత్య కర్ణాటక సరిహద్దులనేగాదు, దేశ సరిహద్దులు దాటి అమెరికా, బ్రిటన్లతో పాటు యూరోపియన్ సీమాంతరాలకు వ్యాపించి, ప్రజలు నిరసనలకు దిగేటట్టు చేసింది. ప్రపంచ స్థాయిలో అంతర్జాతీయ పాత్రికేయ సమాఖ్యలు భారతదేశంలో వేగంగా అలముకుంటున్న పాలనాపరమైన అవాంఛనీయ పరిణామాలను ముక్తకంఠంతో ఖండిస్తున్నాయి. హరియాణాలో జూనాద్, రాజస్తాన్‌లో పెహ్లూఖాన్, దాద్రీలో అఖ్లిక్, ‘లవ్ జీహాద్’ పేరిట జరుగుతున్న హత్యలూ సాధారణ ప్రజా బాహుళ్యాన్నీ, పత్రికా స్వేచ్ఛను, భావ ప్రకటనా స్వేచ్ఛను ప్రేమించే మేధావులను కలచివేస్తున్న వాస్తవాన్ని పాలకులు గుర్తించడానికి నిరాకరిస్తున్నారు. అది నిజం కాకపోతే దేశ అత్యున్నత న్యాయస్థానం (సుప్రీంకోర్టు) శాసిం చినట్టు ‘గోరక్ష’ముసుగులో సాగుతున్న అరాచక చర్యల్ని అణచే బాధ్యత ‘రాష్ట్రాలదేన’ని చెప్పి కేంద్రం నిర్వహించాల్సిన రాజ్యాంగపరమైన భద్రతా చర్యల నుంచి తప్పించుకోరాదు. సమాచారహక్కంటే జాతీయ ప్రయోజనమే యూరోపియన్ జర్నలిస్టుల సమాఖ్య అంచనా ప్రకారం గత 39 నెలల్లోనే 11 మంది జర్నలిస్టుల్ని హతమార్చారు. 2016లో హిందీ దినపత్రిక ‘హిందూస్తాన్’కు చెందిన రాజీవ్ రంజన్‌ను ఒక రాజకీయ ప్రముఖుడు కాల్చి చంపాడు. పత్రికా విలేకరులు, ఎడిటర్లను హతమార్చిన వారిలో కొందరు ఎంపీలూ, ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. బొంబాయి మున్సిపల్ కార్పొరేషన్ ‘శివసేన’ (బీజేపీ జ్ఞాతి) నాయకుడు కూడా తక్కువ తినలేదు. నగర రోడ్లన్నీ గుంతలు పడి జనం ఇబ్బందుల పాలవడం చూసిన మలిష్కా మెండోన్సా రాసిన వ్యంగ్య కవిత ఎఫ్.ఎం. రేడియోలో పదే పదే ప్రసారం కావడాన్ని ఆ పార్టీ సహించలేకపోయింది. ఇంతకీ ఆ పార్టీ వ్యవస్థాపకుడు బాల్ ఠాక్రే తన కార్టూన్లతో ఎందరినో ఏడిపించినవాడేనన్న ఇంగిత జ్ఞానం ఆ పార్టీ నాయకుడికి లేకపోయింది. ఇంతకన్నా మించిన ఘోర పరిణామం– ప్రతిష్టాత్మక ‘ఎకనమిక్ అండ్ పొలిటికల్ వీక్లీ’ ఎడిటర్ పరంజయ్ గుహ ఠాకూర్తాను కార్పొరేట్ దిగ్గజాలలో ఒకటైన ఆదానీ గ్రూపు జోక్యంవల్ల సంపాదకునిగా తప్పించడం. దానిపైన ఐదుగురు ఉద్దండులు (అభిజిత్ బెనర్జీ, రామచంద్ర గుహ, జోయాహసన్ వగైరా) ఆ పత్రిక ధర్మకర్తలకు దశాబ్దాలుగా ‘వీక్లీ’ సంతరించుకున్న ప్రతిష్టను పాడు చేయవద్దని విజ్ఞప్తి చేస్తూ సంతకాలు చేసి ఒక లేఖను పంపారు. అందులో వీరు చేసిన హెచ్చరిక ప్రగతిశీల, సమరశీల శక్తులంతా గమనించదగింది: ‘నేడు మన దేశం అంధకార దశలో బతుకుతోంది. ఈ దశలో భావ ప్రకటనా స్వేచ్ఛ, మేధావుల ఆలోచనా స్వాతంత్య్రాల పట్ల విద్వత్ రంగానికి చెందినవారూ, జర్నలిస్టులూ ఆందోళన పడటం సహజం. అందులోను బడా కార్పొరేట్ సంస్థల అధీనంలోకి పత్రికా సంస్థలు జారుకున్న తరువాత, స్వతంత్రమైన ఆలోచనలను, చర్చలనూ బాహాటంగా, రహస్య పద్ధతులలో అదిరించి బెదిరించే ధోరణులు ప్రబలిపోతున్నాయి. ‘ఈ దేశంలో ఒక వ్యక్తి లేదా ఒక నాయకుడి వ్యక్తిగత ప్రతిష్ట కన్నా సమాచార హక్కు, ఫలానా విషయాన్ని నిగ్గు తేల్చుకునే హక్కు, జాతీయ ప్రయోజనం ముఖ్యం’ అని జస్టిస్ దీపక్ మిశ్రా ధర్మాసనం స్పష్టం చేసింది గదా. అందుకని ‘ఆశయాలు సంఘర్షించే వేళ ఆయుధం అలీనం కాద’న్నది మహాకవి కవితాపరంగా చెప్పిన బ్రహ్మవాక్కు! - ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
గౌరీ లంకేష్‌ను ఎవరు చంపారు?
న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని జల్పాయిగురి జిల్లా, ధూప్‌గిరి గ్రామంలోని ధర్మాస్పత్రి అది. దాని ఆవరణలోని దిక్కులేని రెండు మృతదేహాలను చూస్తుంటే ఎవరికైనా మనసు వికలం అవుతుంది. అందుకనే పత్రికలుగానీ, టీవీలుగానీ యథాతధంగా వాటిని చూపించేందుకు ఇష్టపడవు. ఆ మృతదేహాలు బక్కచిక్కిన ఇద్దరు 19 ఏళ్ల యువకులవి. వారి మరణం అంతకన్నా దారుణంగా ఉన్నప్పుడు వారి మృతదేహాలను చూపించడంలో తప్పేమిటీ? అన్వర్ హుస్సేన్, నజ్రుల్ షేక్‌లు ఆగస్టు 27వ తేదీన ధూప్‌గిరి గ్రామం నుంచి పశువులను తోలుకుంటూ వెళుతుండగా గోరక్షకుల పేరిట కొంత మంది యువకులు వారిని అడ్డగించారు. సురక్షితంగా పశువులను తీసుకెళ్లేందుకు 50 వేల రూపాయలను చెల్లించాల్సిందిగా డిమాండ్ చేశారు. తాము కడు పేదవాళ్లమని, తమ వద్ద ఏ మాత్రం డబ్బుల్లేవని చెప్పడంతో వారిని చెట్టకు కట్టేసి రాళ్లతో కొట్టి గోరక్షకులు హత్య చేశారు. అనంతరం పోలీసులు రంగప్రవేశం చేసి కేసు నమోదు చేసుకున్నారు. అనుమానితులను అదుపులోకి తీసుకొని దర్యాప్తు ప్రారంభించారు. మృత దేహాలను తీసుకొచ్చి ఆస్పత్రి ఆవరణలో పడేశారు. ఆ మరుసటి రోజు ఈ వార్త యథాతధంగా జాతీయ మీడియాలో వచ్చింది. దీన్ని సీనియర్ జర్నలిస్ట్ గౌరీ లంకేష్ తీవ్రంగా ఖండించారు. గో సంరక్షణ పేరిట దేశంలో పెరిగిపోతున్న హత్యలను తీవ్రంగా విమర్శించారు. హుస్సేన్, నజ్రుల్ హత్య జరిగిన పది రోజుల్లోనే అంటే, సెప్టెంబర్ ఐదవ తేదీన గౌరీ లంకేష్‌ను గుర్తుతెలియని వ్యక్తి ఎవరో కాల్చి చంపారు. ఆమెను గోరక్షకులు లేదా హిందూత్వ వాదులు హత్య చేసి ఉంటారని తొలుత వార్తలొచ్చాయి. ఆ తర్వాత, ఆమె అడవిదారి పట్టిన నక్సలైట్లను జన జీవన స్రవంతిలోకి తీసుకొచ్చేందుకు తీవ్రంగా కృషి చేసినందున ఆమెను నక్సలైట్లు హత్యచేసి ఉంటారని ప్రచారం మొదలయింది. ఈ విషయంలో కుటుంబ సభ్యులు కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా సంచలనం సష్టించిన గౌరీ లంకేష్ హత్యపై ప్రత్యేక దర్యాప్తు బృందంను నియమించిన కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే అసలైన దోషులను పట్టుకుంటామని ప్రకటించింది. ప్రత్యేక దర్యాప్తు బృందం కొన్ని క్లూలను సేకరించిందని, త్వరలోనే కేసును ఛేదిస్తుందని కర్ణాటక హోం మంత్రి రామలింగారెడ్డి తెలిపారు. ఇంతకు గౌరీని ఎవరు చంపారన్న విషయమై ప్రజల్లో తీవ్ర ఉత్కంఠ కొనసాగుతోంది. -
'ఐయామ్ ఆల్సో గౌరి'..
-
గౌరీ లంకేశ్ వారసులు ఎవరు?
సాక్షి, బెంగళూర్: ప్రముఖ పాత్రికేయురాలు గౌరీ లంకేశ్ హత్యానంతరం మొదలైన రాజకీయ దుమారం ఓవైపు కొనసాగుతూనే ఉంది. మరోవైపు టాబ్లాయిడ్ ఈ వారం ఎడిషన్ ఆగిపోయింది. ఈ నేపథ్యంలో పేపర్ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. ప్రముఖ టాబ్లాయిడ్ 'గౌరీ లంకేశ్ పత్రికె' కొనసాగుతుందా? లేక మూతపడుతుందా?.. కొనసాగిస్తే తర్వాతి పగ్గాలు(ఎడిటర్‌గా బాధ్యతలు) చేపట్టేది ఎవరు? అన్న ప్రశ్నలు మొదలయ్యాయి. శుక్రవారం బసనవగుడిలోని పత్రిక ప్రధాన కార్యాలయంలో టాబ్లాయిడ్ ఎడిటోరియల్ సభ్యులు సమావేశమై ఈ అంశం పైనే చర్చించినట్లు సమాచారం. అయితే తాము కేవలం సెప్టెంబర్ 12న మేడమ్(గౌరీ లంకేశ్) కోసం ‘నాను గౌరీ(నేను గౌరీ)’ పేరిట నిర్వహించబోయే స్మారక సభ ఏర్పాట్ల గురించి చర్చించామని సభ్యులు పైకి చెబుతున్నారు. ‘ప్రస్తుతం ఏడుగురు ఉద్యోగులు ఈ వీక్లీ పేపర్లో పని చేస్తున్నారని, వీరిలో ఇద్దరు పార్ట్ టైమ్ ఉద్యోగులు. మేడమ్ కుటుంబ సభ్యులతో కూర్చుని సంప్రదింపులు చేశాకే పేపర్ భవిష్యత్తుపై ఓ నిర్ణయం తీసుకుంటామని.. కానీ, అది ఇప్పుడే జరగకపోవచ్చు‘ అని గిరీశ్ తలికట్టే వెల్లడించారు. గౌరీ నిర్వహించిన ఉద్యోగ అనే సంచికకు గిరీశ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ‘గౌరీ కటుంబ సభ్యులు షాక్‌లో ఉన్నారు. వారు తేరుకోవటానికి మరికొంత సమయం పడుతుంది. పత్రిక కొనసాగాలని సన్నిహితులు కోరుకుంటున్నారు. కానీ, అందుకు మరికొంత సమయం పట్టవచ్చు’ అని సతీష్ అనే మరో ఉద్యోగి తెలిపారు. 2005లో గౌరీ కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్థలు వచ్చాక సతీశ్ గౌరీ వెంట నిలిచారు. ఇక పబ్లికేషన్ కాలమ్నిస్ట్, 1980 నుంచి గౌరీ ఫ్యామిలీతో మంచి సంబంధాలున్న చంద్రే గౌడ మాత్రం టాబ్లాయిడ్ భవితవ్యంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆమె మరణానికి పత్రికె కారణమని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. కాబట్టి వారు ఇక దాన్ని కొనసాగించే అవకాశాలు చాలా తక్కువ అని ఆయన చెబుతున్నారు. గతంలో కూడా చాలాసార్లు టాబ్లాయిడ్ వల్ల ఇబ్బందులు ఎదురయ్యాయని, ఆ సమయంలోనే పత్రికె కొనసాగుతుందా? అని తనకు అనిపించేదని గౌడ తెలిపారు. అయితే ఏది ఏమైనా హిందుత్వ సంఘాలకు సింహ స్వప్నంగా మారిన లంకేశ్ పత్రికె కొనసాగితీరుతుందని గౌరీ లంకేశ్ సన్నిహితులు శివ సుందర్ చెబుతున్నారు. వారి (హిందుత్వ సంఘాలు) ఆగడాలకు వ్యతిరేకంగా కథనాలు రాసినందుకే ఆమెకు హెచ్చరికలు పంపారు. ఈ క్రమంలోనే గౌరీని హత్య కూడా చేశారంటూ సుందర్ ఆరోపించారు. -
విభేదిస్తే మరణ శిక్ష తప్పదా?
జాతిహితం గౌరి హత్య, రాజకీయ నేరాల దర్యాప్తు, విచారణ రాజకీయ జోక్యానికి అతీతంగా ఉండా లని, సోషల్ మీడియాను బాధ్యతాయుతంగా వాడుకోవడానికి హామీని కల్పించాలని చెబు తోంది. మన మధ్య విభజన రేఖ ఎక్కడ ఉన్నది ఆనే దానితో నిమిత్తం లేకుండా వాక్, భావ స్వాతంత్య్రం అందరికీ ఉన్నదని గుర్తించాలి. ఉదారవాదం అంటే ‘ఎదుటి పక్షం’ చెప్పేది విని చర్చించడమే తప్ప, దాన్ని కొట్టిపారేయడం కాదు. అలాంటప్పుడే, ప్రస్తుత చర్చను హింస, దూషణలపై నుంచి తిరిగి నాగరికత సరిహద్దుల్లోకి తీసుకొచ్చే అవకాశం లభిస్తుంది. గౌరీ లంకేశ్ గురించి, ఆమె హత్య లేదా మరింత సరిగ్గా చెప్పాలంటే ఆమెను తుదముట్టించడం గురించి మనకు కచ్చితంగా తెలిసిన సంగతులు చాలానే ఉన్నాయి. ఒకటి, ఆమె సుస్పష్టమైన కొన్ని అభిప్రాయాలకు శక్తివం తమైన నాయకురాలు, సునిశితమైన వామపక్ష ఉదారవాద పక్షంలోని భయ మెరుగని హేతువాది. రెండు, ఆమె తన ఆలోచనలను బహిరంగంగా మాట్లాడే, అలవాటుగా వచ్చే బెదిరింపులకు వెరవని ధైర్యశాలి. మూడు, రెండుగా బాగా చీలిపోయి ఉన్న చర్చలో నిర్దిష్టంగా ఒక వైఖరిని తీసుకున్న వారి విషయంలో అనివార్యంగా జరిగేట్టే... ఆమెతో ఏకీభవించేవారు ఆమెను మహోద్వేగంతో సమర్థించేవారు. ప్రత్యర్థి పక్షాన నిలిచేవారు లేదా భావ జాలపరమైన గోదాలో అటువైపున ఉండేవారు కూడా అంతే ఉద్వేగభరి తంగా ప్రతిస్పందించేవారు. వీరిలో కొందరు విమర్శకులు... గత దశాబ్ద కాలంగా రివాజుగా మారినట్టు... ఆమె చర్యలకు ఉద్దేశాలను ఆపాదించే వారు. కొందరు నీచమైన, బెదిరించే వ్యాఖ్యలు చేసేవారు. భావాల కారణంగా హింస సహించరానిది ఇక ఆ తర్వాత మనం సహేతుకంగా కచ్చితంగా చెప్పగలిగినది, ఇది రాజ కీయ హత్యని. దీనికి బా«ధ్యతను మనకు ఇష్టమైన అనుమానితులపైకి నెట్టేసి సరిపెట్టుకోవడానికి మనం సోషల్ మీడియా విదూషక యోధులమో లేదా రాజకీయ దురభిమానులమో కాము. అలా చేయడం వల్ల పలు ప్రమాదాలు న్నాయి. రాజకీయ హత్యల విషయంలో తరచుగా జరిగేట్టు కేసు రాజకీ యాలు పులుముకున్న పోలీసు–కోర్టు ‘‘కక్ష్య’’లో పరిభ్రమిస్తూ, ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఎటంటే అటు వంగుతుంటుంది. సంఝోతా ఎక్స్‌ప్రెస్, మాలెగావ్, అసీమానంద, సాధ్వీ ప్రజ్ఞా సింగ్ కేసులు పథకం ప్రకారం ఎలాంటి మలుపులు తిరిగాయో చూశాం. ఈ చర్చకు కేంద్ర బిందువు చాలా సరళమైనదే. అభిప్రాయాలను కలిగి ఉండటానికి, వాటిని ప్రచారం చేసుకోవడానికి, ప్రజాస్వామ్యం అనుమతించే రూపాలలో కార్యాచరణకు దిగడానికి, ఒప్పించడానికి, నిరసన తెలుపడానికి ఎవరికైనా హక్కు ఉంది. వారు హింసాత్మక చర్యల్లో పాల్గొనడం లేదా ప్రేరే పించడం చేయనంత కాలం ఆ హక్కు ఉంటుంది. అలాగే, విభేదించేవారు సైతం ఎంతగట్టిగానైనా ఆ పనులను శాంతియుతంగా చేయవచ్చు. అభిప్రా యాలు లేదా విశ్వాసాల కారణంగా ఆమెపై హింసకు పాల్పడే హక్కు ఎవరికీ లేదు. దేశ పౌరులలో ఒకరైన ఆమె అభిప్రాయాల కారణంగా చావడానికి ‘‘అర్హురాలు’’ అనడాన్ని ఏ పౌర సమాజమూ ఆమోదించలేదు. ఒకరి అభి ప్రాయాల కారణంగా వారి ప్రాణాలను హరించడం... మన నాగరిక, రాజ్యాంగయుత జాతీయ దేశాన్ని ఒక విధమైన భయానక స్థలిగా మారు స్తుంది. కాబట్టి, అభిప్రాయాల కారణంగా ఎవరిని హతమార్చడానికీ వీల్లేద నేదే చర్చకు ఉత్తమమైన కేంద్ర బిందువు అవుతుంది. దశాబ్దం క్రితం సామాజిక మాధ్యమాలు అప్పుడే మన జీవితాల్లోకి ప్రవేశించనప్పుడు మాలాంటి పాత సజ్జు బాపతు వాళ్లం దాన్ని హేళన చేశాం, ఇలా వచ్చి అలా పోయే వెర్రి అని తీసిపారేశాం. కానీ నేడు ప్రపంచంలోని అతి పెద్ద ప్రజాస్వామ్యాలు కోట్లాది మంది ఫాలోయర్స్‌తో... వాటిని ప్రజ లతో ప్రత్యక్ష సంబంధాలను నెరిపే సాధనాలుగా వాడుతున్నాయి. ఇక, క్రమంగా అది ప్రజాభిప్రాయాన్ని ‘‘హైజాక్’’ చేసే, హింసను ప్రేరేపించే మీడి యాగా మారడమూ జరుగుతుంది. ఆ హింస సాంప్రదాయకమైనదైనా లేక సోషల్ మీడియా పరమైనదైనా నేరమే. మహాత్మాగాంధీతో ప్రారంభించి మన దేశం అప్రతిష్టాకరమైన రాజ కీయ హత్యల చరిత్రను పోగుచేసుకుంది. ఆ హత్యలకు కారణం రాజకీయ వైరాలు లేదా ప్రతీకారం తీర్చుకోడం (ప్రతాప్ సింగ్ కైరాన్, లలిత్ నారా యణ్ మిశ్రా, ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ), భావాలూ కావచ్చు. భావ జాలపరంగా బాగా చీలిపోయి ఉన్న ప్రాంతాల్లో, ప్రత్యేకించి పశ్చిమ బెంగాల్, బిహార్‌లో వామపక్షం, మితవాద పక్షం కూడా ఇతరుల నోళ్లను మూయించడానికి హత్యలకు పాల్పడ్డాయి. ఏపీలో నక్సల్స్ జరిపిన దాడి నుంచి చంద్రబాబు నాయుడు ప్రాణాలతో బయటపడ్డారు. దివంగత ముఖ్య మంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తండ్రిని రాజకీయ ప్రత్యర్థులు ఆయన కారుపై బాంబు దాడి చేసి హతమార్చారు. 1974–94 మధ్య పంజాబ్‌లో వేలాది మందిని హతమార్చారు, వారిలో పలువురిని కేవలం వారి భావాల కారణం గానే చంపారు. పంజాబ్ కేసరి మీడియా సంస్థల వ్యవస్థాపకుడు లాలా జగత్ నారాయణ్‌ను, ఆయన కుమారుడినే కాదు, ఆ సంస్థల్లో పనిచేసేవారని, పత్రి కలు అమ్మేవారిని సైతం హతమార్చారు. జర్నైల్ సింగ్ బింద్ర¯Œ వాలా పద్ధతి చాలా సరళమైనది. స్వర్ణ దేవాలయంలో ఆయన కోర్టును నిర్వహించే వారు. ఎవరైనా లేచి ఏ రాజకీయవేత్తనో లేదా మేధావినో వంచకుడని లేక దైవ దూషకుడని ఆరోపించేవారు. ఆయనే వారికి ఏం శిక్ష విధించాలో అడిగే వాడు. ఇక ఆ తర్వాతి పనిని తుపాకీ ముగించేసేది. ముద్రలు వేసేయడం హత్యలకు లైసెన్సా? ఇప్పటిలాగే అప్పుడు కూడా ఎవరినైనా లక్ష్యం చేసుకుని తుదముట్టిం చేయ డానికి దాన్ని సమర్థించుకోడానికి ‘‘మాట’’ చాలు. గతంలో ఇలా మాట్లాడిన వ్యక్తి, తన మతానికి సంబంధించిన అత్యున్నత ఆధ్యాత్మికతకు ఇహలోక పీఠంపై ఉన్నవారు. నేడు, ఆ గురు పీఠంపై ఉన్నది సామాజిక మాధ్యమాలు. వాటిని ఉపయోగించుకోవడానికి మీరు ఒక సాధువు లేదా బాబా, సంత్, లేదా మౌలానా కావాల్సిన అవసరం సైతం లేదు. వ్యక్తులకు జాతి వ్యతి రేకులు, దేశద్రోహులు, మతాన్ని ధిక్కరించేవారు, విదేశీ ఏజెంట్లు అని పేర్లు పెట్టేసి తిట్టిపోస్తూ మీరొక ట్వీట్ల దుమారాన్ని రేకెత్తించేస్తే సరి పోతుంది. ఎవరైనా ఒకరిని తుపాకీతో కాల్చి చంపేయడానికి, లేదా మూకు మ్మడిగా చావబాది హతమార్చడానికి అదే సమర్థనను కల్పిస్తుంది. ఒక వ్యక్తి లేదా ఒక బృందం ఒక ప్రాణాన్ని హరించడానికి నైతిక సమం జసత్వంతో సాయుధమైతే చాలు, వారి చేతికి ఎలాగోలా తుపాకీ వచ్చేస్తుంది. ఆ తర్వాత ఎలాగూ రాజకీయాలు ఆ కేసును హస్తగతం చేసుకుని, న్యాయ క్రమాన్ని ఇష్టానుసారం మెలి తిప్పగలుగుతుందని సైతం వారు ఆశిస్తారు. ప్రత్యర్థులు అప్పుడిక నేర రాజకీయాలపై కొట్లాడుకుంటారు. మీ మట్టుకు మీరు ఆ హత్య కేసు నుంచి తప్పించుకు పోవచ్చు. పోల్చడానికి వీల్లేనిదే అయినా ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి... 1978లో ఇందిరాగాంధీని జనతా ప్రభుత్వం అరెస్టు చేసినందుకు నిరసనగా లక్నో నుంచి ఢిల్లీ వెళు తున్న విమానాన్ని పాండే, అతని మిత్రులు హైజాక్ చేయడం గుర్తుకు తెచ్చు కోవాలి. 1980లో ఇందిర తిరిగి అధికారంలోకి రావడంతోనే ప్రాసిక్యూషన్ కేసు గాల్లో కొట్టుకుపోయింది. రాజకీయ నేరాలకు పాల్పడేవారు వెంటనే తమ చర్యలను రాజకీయం చేస్తారు. గౌరి హత్య నేర్పే గుణపాఠాలు గౌరీ లంకేశ్ హత్య నుంచి సరళమైన, విజ్ఞతాయుతమైన గుణపాఠాలను తీయవచ్చు. ఒకటి, నేర దర్యాప్తులు, న్యాయ క్రమాలు రాజకీయాలకు అతీతంగా ఉండాలి. ఈ కేసును వెంటనే సీబీఐ లేదా ఎన్ఐఏ లేదా మరేదైనా పొట్టి పేరు సంస్థకు అప్పగించాలని హడావుడిగా చేసే డిమాండ్లను తోసి పుచ్చాలి. ఏదైనా ఒక కోర్టు ఆ కేసు పర్యవేక్షణ బాధ్యతలను స్వీకరించడం ఉత్తమం. మన కోర్టులు ఇప్పడు అలాంటి బాధ్యతలను నిర్వరిస్తున్నాయన డానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఈ రాజకీయ హత్యకు అలాంటి జోక్యాన్ని కోరడానికి తగినంత ప్రాధాన్యం ఉన్నది. లేకపోతే ఇది కమాం డో–కామిక్ చానళ్లకూ, గౌరీ లంకేశ్‌తో వైరం ఉన్న ఆమె సోదరుడు ముందు నిలవగా నూతనోత్తేజంతో సోషల్ మీడియా హ్యండిల్స్ (ఖాతాలు) సృష్టించే కొత్త పౌరాణిక కథలకూ లేదా గౌరీ లంకేశ్ జీవించి ఉండి వుంటే హేళన చేసేలా ఆమె మరణాన్ని సొమ్ముచేసుకుంటూ ఆమెకు వలసవాద సంకేతమైన 21 తుపాకుల వందనాన్ని సమర్పించిన కర్ణాటక ముఖ్యమంత్రికీ మధ్యా ఇరుక్కుపోతుంది. కర్ణాటక హేతువాదులను ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు కాపాడలేకపోయిందో లేక వారి హంతకులను ఎందుకు పట్టుకోలేక పోయిందో సమాధానం చెప్పాల్సి ఉంది. గౌరీ లంకేశ్ తన మరణంతో, సోషల్ మీడియాను బాధ్యతాయుతంగా వాడుకోవడంపై చర్చను ముగించి ఉండవచ్చు. ఇటు నుంచి వీళ్లు, అటు నుంచి వాళ్లు సందర్భశుద్ధి లేకుండా అలవాటుగా ఇష్టానుసారం చర్చలు సాగించడానికి వీల్లేదు. సామాజిక మాధ్యమాల్లోని విద్వేషపూరితమైన వ్యాఖ్యల విషయంలో చట్టం అందరికీ సమానంగానే వర్తించాలి. సాంప్రదా యకమైన రీతిలోనే అది సామాజిక మాధ్యమాల ద్వారా హింసను ప్రేరేపిం చడంతో కూడా వ్యవహరించాలి. సామాజిక మాధ్యమాలను రాజకీయ వర్గం చావబాదే గుంపులను ప్రయోగించడానికి వాడుకోవాలనే ఉబలాటాన్ని విడ నాడాలి. అవతలి పక్షం కూడా ఇదే చేస్తున్నదనేది ఇందుకు సమర్థన కాజా లదు. వారి లక్ష్యం దుమ్మెత్తిపోసే విభ్రాంతికరమైన దాడితో తమ విమర్శకుల నోళ్లను మూయించాలనేదే. దాన్ని అనుసరించి భౌతిక హింస కూడా వస్తుంది. ప్రధాని ఈ కీలక విషయాన్ని గ్రహించాలి. ఎవరినో ఒకరిని సామా జిక మాధ్యమాల్లో అనుసరిస్తున్నంత (ఫాలో) మాత్రాన వారి అభి ప్రాయా లకు ఆమోదం తెలపడం కాదనే వాదన... ఆ వ్యక్తి ప్రజా జీవితంలో ఉన్న వారైనా, వారి ప్రత్యర్థి అయినా వారి తప్పును తుడిచేయలేదు. మీ పేరిట ఇత రులను తిట్టిపోసేవారిని మీరు అనుసరించడం అంటే మీరు వారి అభిప్రా యాలకు అంగీకరిస్తున్నట్టే. ఇక చివరిగా, మీడియాకు చెందిన మనమూ, ఉదారవాదులుగా చెప్పు కునేవారూ నేర్చుకోవాల్సిన గుణపాఠం: మన మధ్య ఉండే విభజన రేఖ ఎక్కడ ఉన్నదనే దానితో నిమిత్తం లేకుండా వాక్, భావ స్వాతంత్య్రం అంద రికీ ఉన్నదే. ఆగ్రహంతో రెండు శిబిరాలుగా చీలిపోయి ఉన్న స్థితిలో ఈ స్వేచ్ఛల పరిరక్షణ నిర్ద్వంద్వమైనది. ఉదారవాదం అంటే ‘‘ఎదుటి పక్షం’’ చెప్పేది విని చర్చించడమే తప్ప, దాన్ని మూర్ఖమైనదిగానో లేక అనైతికమనో కొట్టిపారేయడం కాదు. అలాంటప్పుడే, ప్రస్తుత చర్చను హింస, దూషణల నుంచి తిరిగి నాగరికత సరిహద్దులోకి తీసుకువచ్చే అవకాశం లభిస్తుంది. శేఖర్ గుప్తా వ్యాసకర్త దప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్ twitter@shekargupta