సాక్షి, బెంగళూరు, తుమకూరు: జర్నలిస్ట్ గౌరి లంకేష్ హత్య కేసులో గీసిన ఓ స్కెచ్ బీజేపీ నాయకుడికి ఇబ్బందికరంగా మారింది. గత నెల 5న గౌరి లంకేష్ హత్య కు గురి కావడం, పోలీసులు ఇద్దరు అనుమానితుల ఊహాచిత్రాలను విడుదల చేయడం తెలిసిందే. ఆ ఊహాచిత్రాల్లో ఒకటి తుమకూరు గ్రామీణ నియోజకవర్గ ఎమ్మెల్యే సురేష్ గౌడ ఆప్తుడైన బీజేపీ నాయకుడు ప్రభాకర్‌ను పోలి ఉంది. ముఖ్యంగా ముక్కు, మీసకట్టు, నుదురు, ఆ నుదురు పైన బొట్టు ఉండటం వల్ల ఆ ఊహా చిత్రాల్లో ఉన్నది అతడేనని పరిచయస్తులు చెబుతున్నారు. విషయం కనుక్కుందామని చాలామంది ఆయనకు ఫోన్ చేస్తున్నారు. దీంతో విసుగు చెందిన ప్రభాకర్ తనకు గౌరి హత్యకు సంబంధం లేదని తన ఫేస్‌బుక్‌లో పోస్ట్‌చేశారు.
బొట్టుపై హిందూసంఘాల రగడ
ఇదిలా ఉండగా విడుదల చేసిన స్కెచ్‌లో ఓ నిందితుడి మొహంపై బొట్టు ఉండటం పట్ల సంఘ్ పరివార్ కార్యకర్తలతో పా టు మరికొన్ని హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్త చేస్తున్నారు. వీహెచ్‌పీ కార్యదర్శి గోపాల్ మాట్లాడుతూ పరోక్షంగా హిం దూ ధర్మానికి చెందిన వారే గౌరి హత్య చేశారన్న భ్రమ కలిగించడానికే పోలీసులు ఇలాంటి చిత్రం విడుదల చేశారని ఆరోపించారు. ఆ చిత్రాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌చేశారు.
దీనిపై సిట్ వివరణ ఇస్తూ.. ఘటనకు ఐదురోజుల ముందు బొట్టు పెట్టుకున్న ఒక వ్యక్తి గౌరి తల్లి ఇందిర లంకేష్‌తో మాట్లాడినట్లు తెలిపారు. కాల్పులు జరిపింది మరొకరని చెప్పారు.
పనిచేయని నంబర్
హంతకుల ఆచూకి తెలిస్తే తెలియజేయాల్సిందిగా ఊహా చిత్రాల సమయంలో వెల్లడించిన ఫోన్ నంబర్ 94808 00202కు ఫోన్ చేస్తే నాట్ రీచబుల్ అన్న సమాధానం వస్తోంది. సాక్షి ప్రతినిధి బుధవారం సాయంత్రం 5:39 గంటల నుంచి 5:43 గంటల మధ్య మూడు సార్లు ఫోన్ చేసినా అదే సమాధానం వచ్చింది. ఇక సాయంత్రం 6:31 నుంచి 6:34 మధ్య మూడు సార్లు ఫోన్ చేస్తే ‘మీరు ఫోన్ చేసిన వ్యక్తి నెట్ వర్క్ పరిధిలో లేరు’ అన్న సమాధానం వచ్చింది. ఇలాంటి అనుభవమే ఎంతమందికి ఎదురై ఉంటుందో మరి.
తుపాకీ ఆరా కోసం మధ్యప్రదేశ్‌కు
గౌరి హత్యకు ఉపయోగించినది కం ట్రీమేడ్ 7.65 ఎం.ఎం. పిస్టల్. ఈ ఆయుధాన్ని ఎక్కువగా బిజాపుర జిల్లాలో వినియోగించే వారు. దీంతో సిట్ అధికారులు అక్కడకు వెళ్లి కూపీ లాగారు. ఈ ఒక్క ఏడాదిలో నే ఈ పిస్టల్‌ను అక్రమంగా కలిగిన విషయ మై 13 మంది అరెస్టు కాగా 8 పిస్టల్స్, 36 లైవ్ తూటాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ పిస్టల్స్ అన్నీ మధ్య ప్రదేశ్‌కు చెందిన గుర్‌ముఖ్ సింగ్, సర్దార్ రాజ్ సింగ్‌లు అమ్మినట్లు తెలిసింది. ఈ పిస్టల్స్ కా కుండా మరికొన్ని విజపురతో పాటు బెంగళూరు, బళ్లారి, దావణగెరె తదితర జిల్లాల్లో వీరు అమ్మారని దర్యాప్తులో తేలింది. దీంతో సిట్ మధ్యప్రదేశ్‌కు వెళ్లినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
ఊహాచిత్రం.. గందరగోళం
Published Tue, Oct 17 2017 7:58 AM | Last Updated on Thu, Mar 28 2019 8:41 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment