
బెంగళూరు: కర్ణాటకలోని రామనగర అసెంబ్లీ స్థానానికి ఈనెల 3న ఉప ఎన్నిక జరగనుండగా బీజేపీకి ఆ పార్టీ అభ్యర్థి ఎల్.చంద్రశేఖర్ గట్టి షాకిచ్చారు. బీజేపీ నేతలు తనను పట్టించుకోవడం లేదంటూ తిరిగి కాంగ్రెస్‌లో చేరిపోయారు. కాగా, ఈ స్థానం నుంచి జేడీఎస్– కాంగ్రెస్ సంకీర్ణ అభ్యర్థిగా సీఎం కుమారస్వామి భార్య అనిత పోటీ చేస్తున్నారు. చంద్రశేఖర్ తప్పుకోవడంతో ఆమె గెలుపు మరింత తేలిక కానుంది. గురువారం చంద్రశేఖర్ మీడియాతో మాట్లాడుతూ..‘బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు యడ్యూరప్ప నేను ఫోన్ చేసినా మాట్లాడటం లేదు. ప్రచారంలో నేతలెవరూ నన్ను కలుపుకుని పోవడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో తిరిగి కాంగ్రెస్‌కు వెళుతున్నా. జేడీఎస్ అభ్యర్థికే మద్దతిస్తా’ అని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment