join Congress
-
జగిత్యాల ప్రగతికే కాంగ్రెస్‌లో చేరా
జగిత్యాల: సీఎం రేవంత్‌రెడ్డి రైతు పక్షపాతి అని, జగిత్యాల ప్రాంతాభివృద్ధికి ఆయనతో కలిసి పనిచేసేందుకే కాంగ్రెస్‌లో చేరానని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఆయన జగిత్యాలలో విలేకరులతో మాట్లాడారు. ఎమ్మెల్సీ కవిత ప్రోత్సాహంతోనే రాజకీయాల్లోకి వచ్చానని స్పష్టం చేశారు.తనను విమర్శించిన ప్రతి ఒక్కరూ ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు. ప్రజాస్వామ్యంలో హుందాతనంతో రాజకీయాలు చేయాలని, తనపై తప్పుడు ఆరోపణలను ఖండించారు. తన ఆర్థిక పరిస్థితి ప్రజలందరికీ తెలుసన్నారు. గతంలో బీఆర్ఎస్ కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలను పార్టీలోకి తీసుకున్నారని సంజయ్ కుమార్ గుర్తు చేశారు. -
కీలక పరిణామం.. కాంగ్రెస్ గూటికి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే
సాక్షి, మేడ్చల్: ఎన్నికల వేళ రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. బీఆర్ఎస్కు మరో నేత గుడ్ బై చెప్పేందుకు సిద్ధమవుతున్నారు. మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే మల్లిపెద్ది సుధీర్‌రెడ్డి హస్తం గూటికి చేరనున్నారు. టీపీసీసీ ఛీప్ రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లోకి చేరనున్నారు. రేవంత్‌రెడ్డి ఇవాళ సుధీర్‌రెడ్డి నివాసానికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానించనున్నారు. మలిపెద్ది సుధీర్ రెడ్డి 2014లో బీఆర్ఎస్ తరఫున మేడ్చల్ ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే 2018లో జరిగిన ఎన్నికల్లో మాత్రం ఆయనకు మళ్లీ సీటు దక్కలేదు. పార్టీ అధిష్టానం అప్పట్లో పార్లమెంటు సభ్యుడిగా ఉన్న మల్లారెడ్డిని మేడ్చల్ నుంచి బరిలోకి దింపింది. ఎన్నికల్లో విజయం సాధించిన తరువాత మల్లారెడ్డిని ఏకంగా మంత్రి వర్గంలోకి చేర్చుకుంది. తరువాతి కాలంలో మల్లారెడ్డి సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవితలకు దగ్గరయ్యారు. బీఆర్ఎస్లో తిరుగులేని నాయకుడిగా ఎదిగారు. ఈ నేపథ్యంలోనే ఐదేళ్ల నుంచి మల్లారెడ్డికి, సుధీర్‌రెడ్డికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఇరువురు నేతలూ బహిరంగంగానే విమర్శలకు దిగిన సందర్భాలూ ఉన్నాయి. సుధీర్ రెడ్డి అసంతృప్తిని చల్లార్చేందుకు అప్పట్లో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి చర్చలు జరిపి బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవి, కుమారుడు శరత్‌చంద్రారెడ్డికి జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవి దక్కే ప్రయత్నం చేశారు. సమయం కోసం ఎదురుచూస్తున్న ఆయనకు.. 2023 ఎన్నికల ప్రకటన వెలువడిన నేపథ్యంలో సుధీర్ రెడ్డి బీఆర్ఎస్లో కొనసాగే విషయంలో మల్లగుల్లాలు పడుతుండగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ రంగంలోకి దిగింది. బీఆర్ఎస్లో తాను ఎంతకాలమున్నా తాను మళ్లీ ఎమ్మెల్యే కాలేని, నియోజకవర్గంలోనూ పట్టు సాధించలేనని సుధీర్‌రెడ్డి చాలా కాలంగా భావిస్తున్నట్లు తెలుస్తోంది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో సుధీర్‌రెడ్డికి బంధుత్వం కూడా ఉంది. అయితే, తనకు అసెంబ్లీ టికెట్ ఇస్తేనే కాంగ్రెస్ పార్టీలోకి వస్తానని సుధీర్ రెడ్డి తేల్చి చెప్పినట్లు సమాచారం. కానీ మేడ్చల్ నియోజకవర్గంలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తరఫున హరివర్ధన్‌రెడ్డి, జంగయ్య యాదవ్, నక్క ప్రభాకర్ గౌడ్ వంటి నేతలు టికెట్ కోసం పోటీ పడుతున్నారు. మరోవైపు సుధీర్‌రెడ్డి మాత్రం తనకు టికెట్ ఇస్తే విజయం సాధించి తీరతానని కాంగ్రెస్ నేతల వద్ద ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఉన్న సంప్రదాయ ఓట్లతోపాటు రెడ్డి సామాజిక వర్గం ఓట్లు, బీఆర్ఎస్ ఓట్లూ తాను పొందగలనని, టికెట్ ఆశిస్తున్న మిగిలిన నేతలకు ఈ అవకాశం లేదన్నది ఆయన విశ్లేషణగా ఉంది. ఇద్దరు కౌన్సిలర్లు బీఆర్ఎస్కు రాజీనామా.. నల్లగొండ మున్సిపాలిటీలో మరో ఇద్దరు కౌన్సిలర్లు బీఆర్ఎస్కు రాజీనామా చేశారు. కోమటిరెడ్డి సమక్షంలో వారు కాంగ్రెస్‌లోకి చేరారు. ఇప్పటి వరకు ఎనిమిది మంది కౌన్సిలర్లు బీఆర్ఎస్కు రాజీనామా చేసి కాంగ్రెస్‌లోకి చేరారు. మరో నలుగురు కౌన్సిలర్లు కూడా కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉంది. చదవండి: మన పార్టీలో కూడా ఫ్యామిలీ ప్యాకేజీలుంటాయా? -
కాంగ్రెస్‌లో చేరిన ఊర్మిళ
ముంబై : లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీల్లోకి వలసలు వెల్లువ కొనసాగుతోంది. తాజాగా బాలీవుడ్ నటి ఊర్మిళా మటోండ్కర్ బుధవారం కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ సమక్షంలో ఆ పార్టీలో చేరారు. ఉత్తర ముంబై నుంచి ఆమె కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తారని భావిస్తున్నారు. ముంబై కాంగ్రెస్ చీఫ్ మురళి దియోరా, పార్టీ ప్రతినిధి ప్రియాంక చతుర్వేది, రణ్‌దీప్ సుర్జీవాలా సమక్షంలో రాహుల్ ఊర్మిళను పార్టీలోకి ఆహ్వానించారు. కాగా తనను పార్టీలోకి సాదరంగా స్వాగతించిన రాహుల్‌తో పాటు కాంగ్రెస్ నేతలకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. క్రియాశీల రాజకీయాల్లో తాను తొలి అడుగు వేస్తున్నానని, మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, వల్లభాయ్ పటేల్‌ల ఆలోచనా ధోరణి, స్ఫూర్తితో తాను రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నానని ఊర్మిళ చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీ ద్వారా దేశానికి తనవంతు సేవలను అందిస్తానని చెప్పారు. -
కర్ణాటకలో బీజేపీ అభ్యర్థి జంప్
బెంగళూరు: కర్ణాటకలోని రామనగర అసెంబ్లీ స్థానానికి ఈనెల 3న ఉప ఎన్నిక జరగనుండగా బీజేపీకి ఆ పార్టీ అభ్యర్థి ఎల్.చంద్రశేఖర్ గట్టి షాకిచ్చారు. బీజేపీ నేతలు తనను పట్టించుకోవడం లేదంటూ తిరిగి కాంగ్రెస్‌లో చేరిపోయారు. కాగా, ఈ స్థానం నుంచి జేడీఎస్– కాంగ్రెస్ సంకీర్ణ అభ్యర్థిగా సీఎం కుమారస్వామి భార్య అనిత పోటీ చేస్తున్నారు. చంద్రశేఖర్ తప్పుకోవడంతో ఆమె గెలుపు మరింత తేలిక కానుంది. గురువారం చంద్రశేఖర్ మీడియాతో మాట్లాడుతూ..‘బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు యడ్యూరప్ప నేను ఫోన్ చేసినా మాట్లాడటం లేదు. ప్రచారంలో నేతలెవరూ నన్ను కలుపుకుని పోవడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో తిరిగి కాంగ్రెస్‌కు వెళుతున్నా. జేడీఎస్ అభ్యర్థికే మద్దతిస్తా’ అని తెలిపారు. -
‘హస్తం’ చెంతకు కొండా..
సాక్షి ప్రతినిధి, వరంగల్: ఎట్టకేలకు కొండా దంపతులు సొంత గూటికి వెళ్లిపోయారు. ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ సమక్షంలో బుధవారం ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌రావు, తాజా మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ దంపతులు ‘హస్తం’లో చేరారు. ఈ సందర్భంగా రాహల్ వారికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. దీంతో 20 రోజులుగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఏర్పడిన రాజకీయ ఉత్కంఠకు తెరపడింది. టీఆర్ఎస్ పార్టీ మొదటి జాబితాలో 105 మంది ఎమ్మెల్యే అభ్యర్థుల పేర్లను ప్రకటించి కొండా సురేఖకు పెండింగ్‌లో పెట్టడంతో వివాదం మొదలైంది. మూడు రోజుల అంతర్మథనం అనంతరం కొండా దంపతులు మీడియా ముందుకు వచ్చి కేసీఆర్‌పై తిరుగుబావుటా ఎగురవేశారు. తన టికెట్‌ను పెండింగ్‌లో పెట్టడానికి కారణం ఏమిటని కొండా సురేఖ నిలదీశారు. తనకు టికెట్ రాకపోవ ఛ్ఛినికి కేటీఆరే కారణం అని ఆరోపించారు. తన ప్రశ్నలకు రెండు రోజుల్లో సమాధానం చెప్పకపోతే, బహిరంగ లేఖ రాసి పార్టీ నుంచి వైదొలుగుతామని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ పార్టీ అధినాయకత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో వారు మరోసారి మీడియా ముందుకు వచ్చారు. తెలంగాణ లో నిరంకుశ పాలన కొనసాగుతోందన్నారు. బడుగు, బలహీన వర్గాలకు కేసీఆర్ చేసిందేమీ లేదని ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌రావు విమర్శించారు. కేసీఆర్ తన సామాజిక వర్గానికి ప్రాధాన్యం ఇచ్చి.. బీసీ నేతలను అణగదొక్కుతున్నారని ఆరోపించారు. కొద్దిగా కష్టపడితే సోనియాగాంధి అపాయింట్మెంట్ నాలుగు రోజుల్లో దొరుకుతుంది గాని, కేసీఆర్ అపాయింట్మెంటు నాలుగేళ్లు నిరీక్షించినా దొరకలేదని విమర్శించారు. వారు ఈ విమర్శలు చేసిన మరుసటి రోజే కాంగ్రెస్ పార్టీలో చేరడం గమనార్హం. కాంగ్రెస్ పార్టీలో చేరిన అనంతరం కొండా సురేఖ మీడియాతో మాట్లాడారు. తాము బేషరతుగానే కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు చెప్పారు. వరంగల్ జిల్లాలో కనీసం ఐదారు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తామన్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొచ్చిన తర్వాత రాహుల్ గాంధీని మళ్లీ కలుస్తామని శపథం చేశారు. కొండా సురేఖకు కండువా కప్పుతున్న ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, చిత్రంలో కొండా మురళీధర్‌రావు -
ముహూర్తం 12న?: కొండా దంపతులు
సాక్షి, వరంగల్ రూరల్: ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో తమకంటూ ప్రత్యేకతను కలిగి ఉన్న కొండా సురేఖ దంపతులు తిరిగి సొంత గూటికి వెళ్లనున్నట్లు తెలిసింది. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో వరంగల్ తూర్పు టీఆర్ఎస్ అభ్యర్థిని పెండింగ్‌లో పెట్టిన విషయం తెలిసిందే. ఈ స్థానం నుంచి మరోసారి టికెట్ ఆశిం చిన తాజా మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖకు టికెట్ రాకపోవడంతో ఆత్మరక్షణలో పడిపోయారు. టీఆర్ఎస్ నుంచి తమకు టికెట్ వచ్చే పరిస్థితి లేకపోవడంతో శనివారం హైదరాబాద్‌లో కొండా దంపతులు విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసి సర్వే రిపోర్ట్‌ను, ప్రకటించిన 105 మందికి బీఫామ్‌లు ఇవ్వాలని కేసీఆర్‌ను డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వ మంత్రివర్గంలో తమకు కావాలనే చోటు కల్పించలేదని ఆరోపించారు. ఇలాంటి ఆరోపణలు బట్టిచూస్తే పార్టీ మార డం ఖాయంగా కనిపిస్తోంది. హైదరాబాద్‌లో జరిగిన విలేకర్ల సమావేశంలో విలేకరులు ఏ పార్టీలో చేరబోతున్నారు అని అడిగిన ప్రశ్నకు సైతం వారు సమాధానమివ్వలేదు. రెండు రోజుల్లో కేసీఆర్ సమాధానం చెప్పకపోతే బహిరంగ లేఖ రాసి ఏ పార్టీలో చేరతామో మళ్లీ విలేకర్ల సమావేశంలో ప్రకటిస్తామని చెప్పారు. కాంగ్రెస్ అధిష్టానంతో.. టీఆర్ఎస్తో తాడోపేడో తేల్చుకునేందుకు హైదరాబాద్‌లో విలేకరుల సమావేశం నిర్వహించిన కొండా దంపతులు అంతకు ముందే కాంగ్రెస్ అధిష్టానంతో టచ్‌లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. పార్టీ అధిష్టానం ఇచ్చిన హామీ మేరకు ఈ నెల 12న రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరుతారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధినాయకత్వంతో కూడా వారు చర్చలు జరిపినట్లు సమాచారం. వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి కొండా సురేఖకు , పరకాల నుంచి సుస్మిత పటేల్‌కు పార్టీ టికెట్ ఇచ్చేందుకు సముఖత వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఇందుకు పీసీసీ నేతలు కూడా ఓకే చెప్పినట్లు సమాచారం. కొండా దంపతుల అనుచరులు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో సైతం ఉండడంతో ఆయా నియోజకవర్గాల్లో సైతం కాంగ్రెస్‌కు బలం చేకూరుతుందని కాంగ్రెస్ రాష్ట్ర నేతలు భావిస్తున్నట్లు తెలిసింది. -
రెండు రోజుల్లో సమాధానం చెప్పాలి : కొండా
సాక్షి ప్రతినిధి, వరంగల్/సాక్షి, జనగామ: ముందస్తు అభ్యర్థుల ఖరారుతో జోరుమీద ఉన్న టీఆర్ఎస్ పార్టీలో ఇప్పుడిప్పుడే అసమ్మతి సెగలు రాజుకుంటున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా.. తూర్పు మినహా మిగిలిన అన్ని స్థానాలను సిట్టింగ్‌లకే కేటాయించారు. ‘గులాబీ’ బాస్ కేసీఆర్ ప్రత్యక్షంగా అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మూడు రోజుల అంతర్మథనం అనంతరం కొండా దంపతులు మీడియా ముందుకు వచ్చారు. కేసీఆర్‌పై తిరుగుబావుటా ఎగురవేశారు. దీంతోపాటు స్టేషన్ ఘన్పూర్, భూపాలపల్లి, డోర్నకల్ నియోజకవర్గాలకు సంబంధించి టీఆర్ఎస్లో ముసలం మొదలైంది. రెండు రోజుల్లో సమాధానం చెప్పాలి : కొండా 105 మంది ఎమ్మెల్యే అభ్యర్థుల పేర్లను ప్రకటించి.. తన టికెట్‌ను పెండింగ్‌లో పెట్టడానికి కారణం ఏమిటని హైదరాబాద్‌లో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో తూర్పు నియోజకవర్గ తాజా మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ నిలదీశారు. తనకు టికెట్ రాకపోవడానికి కేటీఆరే కారణమని మండిపడ్డారు. తన ప్రశ్నలకు రెండు రోజుల్లో సమాధానం చెప్పకపోతే, బహిరంగ లేఖ రాసి పార్టీ నుంచి వైదొలుగుతానని స్పష్టం చేశారు. టీఆర్ఎస్లో తాము రెండు సీట్లు అడిగినట్లు అసత్య ఆరోపణలు చేశారని పేర్కొన్నారు. మూడు సీట్లలో ఇండిపెండెంట్‌గా గెలిచే సత్తా తమకు ఉందన్నారు. మరో వైపు కొండా సురేఖ భర్త ఎమ్మెల్సీ మురళీధర్‌రావు కూడా టీఆర్ఎస్ పార్టీపై నిప్పులు చెరిగారు. పార్టీ నుంచి ఒక్క రూపాయి తీసుకోకుండా పనిచేశామన్నారు. వాళ్ల స్వరం తీవ్రతను బట్టి చూస్తే టీఆర్ఎస్ పార్టీని వదిలిపెట్టే ప్రయత్నంలో ఉన్నట్లు రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి. ‘స్టేషన్’లో తాజాగా కడియం వర్గీయులు టీఆర్ఎస్ స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గ అభ్యర్థిగా తాటికొండ రాజయ్యను ప్రకటించిన కొద్ది గంటల్లోనే ఆ నియోజకవర్గానికి, అదే పార్టీకి చెందిన టీఆర్ఎస్ నేత రాజారపు ప్రతాప్ తిరుగుబావుటా ఎగురవేశారు. తాను పోటీలో ఉంటాన ని ప్రకటించడంతోపాటు బరిలోకి దిగడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. తాజాగా కడియం శ్రీహరి వర్గీయులు ప్రత్యేకంగా సమావేశమయ్యా రు. చిల్పూర్ మండలంలోని దేశాయితండా, జఫర్‌గఢ్‌లో కడియం వర్గీయులు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. స్టేషన్ ఘన్‌పూర్‌కు ప్రకటించిన పార్టీ అభ్యర్థి రాజయ్యను మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. రాజయ్య స్థానంలో కడియం శ్రీహరికి లేదా ఆయన కుమార్తె కావ్యకు అవకాశం కల్పించాలని ఆయా సమావేశాల్లో చర్చించారు. జఫర్‌గఢ్ మండల కేంద్రంలోని ఓ రైస్‌మిల్‌లో సుమారు 200 మంది సమావేశానికి హాజరయ్యారు. రాజయ్య అభ్యర్థిత్వాన్ని రద్దు చేయకపోతే ఆయనకు వ్యతిరేకంగా పనిచేస్తామని తీర్మానించారు. నియోజకవర్గంలోని అన్నీ మండలాల్లోని ముఖ్య నాయకులు నియోజకవర్గ స్థాయిలో సమావేశం నిర్వహించుకోవడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఒకటి, రెండు రోజుల్లో హైదరాబాద్‌కు వెళ్లి కేసీఆర్, కేటీఆర్‌ను కలిసి స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గ పరిస్థితులను వివరించాలని భావిస్తున్నారు. అభ్యర్థిని మార్చాలనే డిమాండ్‌ను బలంగా వినిపించడానికి కడియం వర్గీయులు సన్నాహాలు సిద్ధం చేసుకుంటున్నారు. ఆది నుంచీ పోరే.. స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో కడియం శ్రీహరి, తాటికొండ రాజయ్య వర్గీయుల మధ్య ఆది నుంచీ ఆధిపత్యపోరు కొనసాగుతోంది. గతంలో మూడు సార్లు కడియం శ్రీహరి టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. రెండు సార్లు కేబినెట్ హోదాలో పనిచేశారు. కాంగ్రెస్ పార్టీ నుంచి తాటికొండ రాజయ్య 2009 ఎన్నికల్లో కడియం శ్రీహరిపై విజయం సాధించారు. ఆ తర్వాత రాజయ్య 2012లో తెలంగాణ ఉద్యమ సమయంలో కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి టీఆర్ఎస్ పార్టీలో చేశారు. అదే ఏడాదిలో జరిగిన ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ నుంచి రాజయ్య పోటీ చేయగా.. టీడీపీ నుంచి కడియం శ్రీహరి బరిలో నిలిచారు. ఉప ఎన్నికల్లో రాజయ్య విజయం సాధించారు. అనంతరం మారిన రాజకీయ పరిస్థితుల కారణంగా కడియం శ్రీహరి ‘గులాబీ’ పార్టీలో చేరారు. 2014 ఎన్నికల్లో రాజయ్య స్టేషన్ ఘన్పూర్ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించగా.. కడియం శ్రీహరి మాత్రం వరంగల్ ఎంపీగా గెలుపొందారు. తెలంగాణ రాష్ట్ర తొలి ఉప ముఖ్యమంత్రిగా రాజయ్యకు కేసీఆర్ అవకాశం కల్పించారు. ఆరు నెలల్లో రాజయ్యను బర్త్‌రఫ్ చేసి ఎంపీగా ఉన్న కడియం శ్రీహరికి డిప్యూటీ సీఎం బాధ్యతలను అప్పగించారు. ఇద్దరు నేతల నియోజకవర్గం ఒకటే కావడంతో ఇరువురికి ప్రత్యేక అనుచరగణం ఉంది. ఇద్దరు నేతలు బలమైన కేడర్‌ను కలిగి ఉన్నారు. ఒకే పార్టీ అయినప్పటికీ కార్యకర్తల్లో మాత్రం ఆధిపత్యం కొనసాగుతూ వస్తుంది. డోర్నకల్, భూపాలపల్లిలో.. భూపాలపల్లి నియోజకవర్గంలో స్పీకర్ మధుసుదనాచారి చేతిలో ఓటమి పాలైన గండ్ర సత్యనారాయణ రెండేళ్ల కిందటే టీడీపీ నుంచి టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చి చేరారు. రేవంత్‌రెడ్డి టీడీపీ నుంచి కాంగ్రెస్‌లోకి వెళ్లిన సమాయంలో ఆయనతో పాటు కాంగ్రెస్‌లోకి వెళ్లటానికి సత్యనారాయణ సిద్ధమయ్యారు. అయితే అనూహ్యంగా జరిగిన పరిణామాల నేపథ్యంలో ఆయన కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. గ్రామీణ ప్రాంతాల్లో మంచి పట్టున్న సత్యనారాయణ మొదటి నుంచీ టికెట్ ఆశిస్తున్నారు. టికెట్ సిట్టింగ్ ఎమ్మెల్యే మధుసూదనాచారికి ఖరారు కావడంతో అయన తిరుగుబాటు అభ్యర్థిగా బరిలో నిలబడేందుకు నిర్ణయించుకున్నారు. ప్రజల్లో తిరుగుతూ తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నారు. అదేవిధంగా డోర్నకల్‌లో డీఎస్.రెడ్యానాయక్‌పై తిరుగుబావుటా ఎగురవేసేందుకు సత్యవతి రాథోడ్ వర్గాలు సన్నద్ధమైనట్లు తెలుస్తోంది. మరిపెడ మండలం ఎడ్జర్లలో సత్యవతి రాథోడ్ శనివారం తన అనుచరులతో అంతర్గత సమావేశం నిర్వహించారు. -
పార్టీ చీఫ్ సహా ఎమ్మెల్యేందరూ జంప్
ఇంఫాల్: తృణమాల్ కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. ఆదివారం మణిపూర్ టీఎంసీ చీఫ్ శ్యాంకుమార్ సహా ఆ రాష్ట్రంలో పార్టీకి చెందిన మొత్తం నలుగురు ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారు. టీఎంసీ జాతీయ నేతలు తమను నిర్లక్ష్యంగా చూస్తున్నరని, పార్టీని వీడాలని తాము నిర్ణయం తీసుకున్నట్టు శ్యాంకుమార్ చెప్పారు. మణిపూర్ సమస్యలను తృణమాల్ కాంగ్రెస్ ఎంపీలు పట్టించుకోవడం లేదని, ఈ అంశాలను పార్లమెంట్లో ప్రస్తావించాలని కోరితే నిరాకరించారని ఆరోపించారు. 2012 మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ నుంచి ఆరుగురు ఎమ్మెల్యేలు గెలిచారు. కాగా గతేడాది మణిపూర్ అసెంబ్లీ స్పీకర్ ముగ్గురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేశారు. ఆ తర్వాత ఒక ఎమ్మెల్యేను సభకు అనుమతించారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే యుంఖమ్ ఎరబొట్ ఇటీవల బీజేపీలో చేరారు. తాజాగా నలుగురు ఎమ్మెల్యేలు చేరడంతో కాంగ్రెస్ నేతలు ఉత్సాహంతో ఉన్నారు.