జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్
జగిత్యాల: సీఎం రేవంత్‌రెడ్డి రైతు పక్షపాతి అని, జగిత్యాల ప్రాంతాభివృద్ధికి ఆయనతో కలిసి పనిచేసేందుకే కాంగ్రెస్‌లో చేరానని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ అన్నారు. బీఆర్‌ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఆయన జగిత్యాలలో విలేకరులతో మాట్లాడారు. ఎమ్మెల్సీ కవిత ప్రోత్సాహంతోనే రాజకీయాల్లోకి వచ్చానని స్పష్టం చేశారు.
తనను విమర్శించిన ప్రతి ఒక్కరూ ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు. ప్రజాస్వామ్యంలో హుందాతనంతో రాజకీయాలు చేయాలని, తనపై తప్పుడు ఆరోపణలను ఖండించారు. తన ఆర్థిక పరిస్థితి ప్రజలందరికీ తెలుసన్నారు. గతంలో బీఆర్‌ఎస్ కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలను పార్టీలోకి తీసుకున్నారని సంజయ్ కుమార్ గుర్తు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment