సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో రెండు శాసనసభ, మూడు లోక్‌సభ స్థానాలకు శనివారం ఉప ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. బళ్లారి, మాండ్య, శివమొగ్గ లోక్‌సభ స్థానాలు, రామనగర, జమఖండి అసెంబ్లీ సీట్లకు ఎన్నికలు జరిగాయి. ఐదు చోట్లా ప్రతిపక్ష బీజేపీ ఒంటరిగా, అధికార కాంగ్రెస్–జేడీఎస్‌లు ఉమ్మడిగా పోటీకి దిగాయి. మొత్తం 66.8 శాతం పోలింగ్ నమోదైంది. ఉదయం మందకొడిగా సాగిన పోలింగ్ మధ్యాహ్నం సమయానికి పుంజుకుంది. ఈ నెల 6వ తేదీన ఓట్ల లెక్కింపు చేపడతారు. మొత్తం 31 మంది అభ్యర్థులు బరిలో నిలవగా ప్రధాన పోటీ బీజేపీ, కాంగ్రెస్–జేడీఎస్‌ల మధ్యే ఉంది. విజయంపై అన్ని పార్టీలూ ధీమా వ్యక్తం చేస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment